ట్వంటీ20 ఇంటర్నేషనల్
ఓవల్లో జరిగిన ఒక ట్వంటీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ | |
| అత్యున్నత పాలక సంస్థ | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ |
|---|---|
| ఇతర పేర్లు | టీ20ఐ |
| మొదటిసారి ఆడినది | 2005 ఫిబ్రవరి 17 |
| లక్షణాలు | |
| జట్టు సభ్యులు | ఐసిసి సభ్య దేశాలు |
| Mixed gender | No |
| రకం | బయట |
| ఉపకరణాలు | బంతి, బ్యాటు, స్టంపులు, గ్లోవ్, ప్యాడ్, హెల్మెట్ |
ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (టీ20ఐ) అనేది ట్వంటీ 20 క్రికెట్ ఆటకు ఒక రూపం. దీనిలో ప్రతి జట్టు గరిష్టంగా ఇరవై ఓవర్లతో ఒకే ఇన్నింగ్స్ ఆడుతుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) గుర్తించిన అంతర్జాతీయ జట్ల మధ్య ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. టీ20ఐ ఫార్మాట్‌లో, ప్రతి బౌలరు గరిష్టంగా నాలుగు ఓవర్లు మాత్రమే వేసేందుకు అనుమతి ఉంటుంది. ఇన్నింగ్స్‌లోని మొదటి ఆరు ఓవర్లలో తప్పనిసరిగా పవర్‌ప్లే తీసుకోవాలి.
మొదటి టీ20ఐ మ్యాచ్ 2005 ఫిబ్రవరి 17న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య జరిగింది. మొదటి ఐసిసి T20 ప్రపంచ కప్ 2007 లో జరిగింది. ఈ మ్యాచ్‌లు మొదట్లో ఐసిసి పూర్తి సభ్యులు, ఎంపిక చేసిన అసోసియేట్ సభ్య జట్ల మధ్య జరిగేవి. 2018 ఏప్రిల్‌లో ఐసిసి తన 105 సభ్య దేశాలలో ఏదైనా ఆడే మ్యాచ్‌లన్నిటికీ 2019 జనవరి 1 నుండి టీ20ఐ హోదాను ఇస్తున్నట్లు ప్రకటించింది. 2025 మార్చి నాటికి, 100 దేశాలు ఐసిసి టీ20ఐ జట్టు ర్యాంకింగ్స్‌లో ఉన్నాయి. [1] 2010లలో ఈ ఫార్మాట్ మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది. 2016 లో మొదటిసారిగా ODI మ్యాచ్‌ల కంటే (99) టీ20ఐ మ్యాచ్‌లే (100) ఎక్కువ జరిగాయి.[2]
2024 నవంబరు నాటికి, భారత్ అత్యధిక విజయాలు (160) సాధించగా, పాకిస్తాన్ అత్యధిక మ్యాచ్‌లు (247) ఆడింది. అత్యధిక పరుగుల రికార్డు బాబర్ ఆజమ్ పేరిట ఉండగా, న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సౌథీకి, కెరీర్‌లో అత్యధిక వికెట్లు (164) సాధించిన రికార్డు ఉంది. 2018లో జింబాబ్వేపై ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ చేసిన 172, అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, మలేషియాకు చెందిన సయాజ్రుల్ ఇద్రస్ 2023 జూలైలో చైనాపై 7/8తో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు.
ఉద్భవం
[మార్చు]క్రికెట్ మొదట ఇంగ్లాండ్‌లో మధ్య యుగాల చివరిలో ఆడి ఉండవచ్చు. కానీ అది పద్దెనిమిదవ శతాబ్దం వరకు ప్రాముఖ్యతను సంతరించుకోలేదు. 1744లో కొన్ని నియమ నిబంధనలను రూపొందించారు. పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి ఆట సాపేక్షంగా ప్రామాణిక స్థాయికి చేరుకుంది. [3] 1962లో వన్డే క్రికెట్‌ను పరీక్షించారు. ఆ తర్వాతి సంవత్సరం మొదటి దేశీయ టోర్నమెంటు ఆడారు.[4] 1971 లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు మొదటి వన్డే ఇంటర్నేషనల్‌లో పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఒక్కో జట్టు ఒక ఇన్నింగ్స్ ఆడుతుంది. ఒక్కో ఇన్నింగ్సు లోనూ ఎనిమిది బంతుల ఓవర్లు 40 ఉన్నాయి.[5]
1990లలో, అనేక దేశాలు ఇంకా చిన్న ఆట ఆడే అవకాశం కోసం అన్వేషిస్తున్నాయి: న్యూజిలాండ్‌లో, మార్టిన్ క్రో క్రికెట్ మాక్స్‌ను అభివృద్ధి చేశాడు, దీనిలో ప్రతి జట్టు 10 ఎనిమిది బంతుల ఓవర్లు బ్యాటింగ్ చేస్తుంది.[6] ఆస్ట్రేలియాలో వారు ఎనిమిది ఓవర్ల ఆట ఆడుతూ, దాన్ని "సూపర్ 8లు" అని పిలిచారు. అదే సమయంలో. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) వినియోగదారుల సర్వేను నిర్వహించి, 20 ఓవర్ల పోటీ ఆలోచనను ప్రతిపాదించింది. ఇది దాదాపు మూడు గంటల పాటు కొనసాగుతుంది. [7] మొదటి మ్యాచ్ 2003లో హాంప్‌షైర్, ససెక్స్ మధ్య జరిగింది.
చరిత్ర
[మార్చు]రెండు పురుషుల జట్ల మధ్య మొదటి ట్వంటీ 20 అంతర్జాతీయ మ్యాచ్ 2005 ఫిబ్రవరి 17 న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. విస్డెన్ క్రికెటర్స్ అల్మానాక్ "ఇరు జట్లూ ఈ ఆటను పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు" అని నివేదించింది.[8] రికీ పాంటింగ్ పెద్ద స్కోరు చేయకపోయి ఉంటే, "ఈ భావన అంటేనే దడ పుట్టేది" అని ESPNcricinfo గుర్తించింది. [9] అయితే, పాంటింగ్ స్వయంగా "ఇది అంతర్జాతీయ ఆటగా మారితే, ఎప్పుడూ ఆ కొత్తదనం ఉండదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని అన్నాడు.[10]
ఆ సంవత్సరం మరో రెండు మ్యాచ్‌లు జరిగాయి; జూన్‌లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాను ఓడించింది. అక్టోబరులో దక్షిణాఫ్రికాను న్యూజిలాండ్ ఓడించింది. [11] తరువాతి సంవత్సరం ప్రారంభంలో, న్యూజిలాండ్, వెస్టిండీస్ ల మధ్య జరిగిన పోటీ మొదటి టై మ్యాచ్‌గా ముగిసింది. పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటిసారి టైబ్రేక్ జరిగింది: విజేతను నిర్ణయించడానికి రెండు జట్లు బౌల్-అవుట్‌లో పాల్గొన్నాయి; న్యూజిలాండ్ 3–0తో గెలిచింది.[12]
ఈ ఆటను మొదట్లో దేశీయ క్రికెట్‌పై ఆసక్తిని పెంచడానికి అభివృద్ధి చేశారు. దీనికి తోడు, అంతర్జాతీయ జట్లు ప్రతి సంవత్సరం మూడు టీ20ఐలను మాత్రమే నిర్వహించడానికి అనుమతించారు. ఐసిసి క్రికెట్ మేనేజర్ డేవిడ్ రిచర్డ్‌సన్ కూడా "ట్వంటీ20 క్రికెట్ విజయానికి ఒక కారణం, అది టెస్ట్ క్రికెట్, వన్డేలతో కలసిమెలసి మనుగడలో ఉండేలా చూసుకోవడం" అని వ్యాఖ్యానించాడు.[13] అయినప్పటికీ, మొదటి అంతర్జాతీయ టోర్నమెంటు 2007లో దక్షిణాఫ్రికాలో జరిగింది; 2007 ఐసిసి వరల్డ్ ట్వంటీ20 . [13] ఫైనల్‌లో భారతదేశం తమ సన్నిహిత ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి, టోర్నమెంటును గెలుచుకుంది. ది గార్డియన్ కోసం రాస్తూ దిలీప్ ప్రేమచంద్రన్, ఈ పోటీ జయప్రదంగా జరిగిందంటే దానర్థం "ఈ ఫార్మాట్ ఇక నిలబడినట్లే" అని రాసాడు.[14] తదుపరి టోర్నమెంటు 2009 లో జరపాలని నిర్ణయించారు. దాన్ని రెండు సంవత్సరాలకు ఒకసారి (ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే 50 ఓవర్ల క్రికెట్ ప్రపంచ కప్ కంటే తరచుగా) జరపాలని కూడా నిర్ణయించారు. [15] 2007 ప్రపంచ ట్వంటీ 20 ప్రారంభ మ్యాచ్‌లో, క్రిస్ గేల్ టీ20ఐలో మొదటి సెంచరీ సాధించాడు. ఈ ఫార్మాట్‌లో ఇరవయ్యవ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించబడింది.[16]
500వ టీ20ఐ మ్యాచ్ ఐర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య 2016 ఫిబ్రవరి 16 న అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగింది. [17]
2017 సెప్టెంబరు చివరి నుండి ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (DRS)ను ఉపయోగించాలని ఐసిసి నిర్ణయించింది, [18] [19] 2017 అక్టోబరులో జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా టీ20ఐ సిరీస్‌లో దీనిని మొదటిసారి ఉపయోగించారు.[20]
ప్రస్తుత అంతర్జాతీయ ర్యాంకింగ్‌లు
[మార్చు]
పూర్తి సభ్యులు (12)
వన్డే హోదా కలిగిన అసోసియేట్ సభ్యులు (8)
అసోసియేట్ సభ్యులు (85)
మాజీ సభ్యులు (4)
సభ్యులు కానివారు
ఐసిసి పురుషుల టీ20ఐ జట్ల ర్యాంకులు
| జట్టు | మ్యాచ్‌లు | పాయింట్లు | రేటింగు |
|---|---|---|---|
| 76 | 20,715 | 273 | |
| 45 | 11,757 | 261 | |
| 47 | 12,165 | 259 | |
| 58 | 14,530 | 251 | |
| 56 | 13,492 | 241 | |
| 78 | 18,549 | 238 | |
| 67 | 15,711 | 234 | |
| 52 | 11,838 | 228 | |
| 67 | 14,925 | 223 | |
| 48 | 10,650 | 222 | |
| 42 | 8,424 | 201 | |
| 66 | 13,190 | 200 | |
| 35 | 6,366 | 182 | |
| 23 | 4,178 | 182 | |
| 35 | 6,344 | 181 | |
| 62 | 10,883 | 176 | |
| 42 | 7,384 | 176 | |
| 33 | 5,769 | 175 | |
| 35 | 5,374 | 154 | |
| 47 | 7,140 | 152 | |
| 20 | 2,718 | 136 | |
| 42 | 5,441 | 130 | |
| 52 | 6,602 | 127 | |
| 59 | 7,386 | 125 | |
| 72 | 8,595 | 119 | |
| 18 | 2,138 | 119 | |
| 24 | 2,819 | 117 | |
| 41 | 4,666 | 114 | |
| 22 | 2,478 | 113 | |
| 27 | 3,040 | 113 | |
| 39 | 4,245 | 109 | |
| 48 | 5,074 | 106 | |
| 41 | 4,082 | 100 | |
| 22 | 1,924 | 87 | |
| 53 | 4,166 | 79 | |
| 27 | 2,071 | 77 | |
| 41 | 3,075 | 75 | |
| 26 | 1,921 | 74 | |
| 57 | 4,054 | 71 | |
| 18 | 1,262 | 70 | |
| 30 | 2,095 | 70 | |
| 20 | 1,333 | 67 | |
| 38 | 2,518 | 66 | |
| 36 | 2,059 | 57 | |
| 15 | 745 | 50 | |
| 22 | 1,086 | 49 | |
| 23 | 1,130 | 49 | |
| 22 | 1,048 | 48 | |
| 43 | 2,019 | 47 | |
| 33 | 1,547 | 47 | |
| 13 | 604 | 46 | |
| 24 | 1,109 | 46 | |
| 34 | 1,544 | 45 | |
| 26 | 1,158 | 45 | |
| 23 | 972 | 42 | |
| 41 | 1,724 | 42 | |
| 22 | 911 | 41 | |
| 14 | 552 | 39 | |
| 32 | 1,246 | 39 | |
| 74 | 2,874 | 39 | |
| 79 | 3,044 | 39 | |
| 11 | 387 | 35 | |
| 16 | 561 | 35 | |
| 24 | 789 | 33 | |
| 19 | 570 | 30 | |
| 33 | 971 | 29 | |
| 23 | 672 | 29 | |
| 10 | 290 | 29 | |
| 24 | 665 | 28 | |
| 41 | 1,085 | 26 | |
| 20 | 518 | 26 | |
| 19 | 491 | 26 | |
| 7 | 178 | 25 | |
| 15 | 318 | 21 | |
| 8 | 164 | 21 | |
| 31 | 626 | 20 | |
| 26 | 494 | 19 | |
| 24 | 432 | 18 | |
| 27 | 477 | 18 | |
| 13 | 218 | 17 | |
| 18 | 287 | 16 | |
| 8 | 119 | 15 | |
| 30 | 315 | 11 | |
| 21 | 214 | 10 | |
| 11 | 86 | 8 | |
| 12 | 90 | 8 | |
| 29 | 191 | 7 | |
| 16 | 94 | 6 | |
| 8 | 44 | 6 | |
| 6 | 29 | 5 | |
| 11 | 24 | 2 | |
| 12 | 26 | 2 | |
| 8 | 6 | 1 | |
| 29 | 0 | 0 | |
| 18 | 0 | 0 | |
| 7 | 0 | 0 | |
| 9 | 0 | 0 | |
| 6 | 0 | 0 | |
| 26 | 0 | 0 | |
| 13 | 0 | 0 | |
| మూస:Country data TLS | 8 | 0 | 0 |
టీ20ఐ హోదా కలిగిన జట్లు
[మార్చు]శాశ్వత టీ20ఐ స్థితి
[మార్చు]2019 కి ముందు, శాశ్వత టీ20ఐ హోదా టెస్ట్ ఆడే దేశాలకు (ఐసిసి లో పూర్తి సభ్యులు) మాత్రమే ఉండేది. 2017 లో పూర్తి సభ్య హోదా పొందిన ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ లతో కూడా కలుపుకుని ఇందులో 12 జట్లు ఉండేవి. 2018 ఏప్రిల్‌లో ఐసిసి, తన సభ్యులందరికీ 2019 జనవరి 1 నుండి టీ20ఐ హోదాను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది [21] [22] [23] టీ20ఐ క్రికెట్ ఆడే దేశాల జాబితాను క్రింద చూడవచ్చు. శాశ్వత టీ20ఐ హోదా పొందిన తర్వాత వారి మొదటి టీ20ఐ తేదీని బ్రాకెట్లలో చూపించారు (ఇటాలిక్స్‌లో జట్లు గతంలో తాత్కాలిక హోదాతో టీ20ఐలు ఆడాయి):
Australia (2005 ఫిబ్రవరి 17)
New Zealand (2005 ఫిబ్రవరి 17)
ఇంగ్లాండు (2005 జూన్ 13)
South Africa (2005 అక్టోబరు 21)
వెస్ట్ ఇండీస్ (2006 ఫిబ్రవరి 16)
శ్రీలంక (2006 జూన్ 15)
Pakistan (2006 ఆగస్టు 28)
బంగ్లాదేశ్ (2006 నవంబరు 28)
జింబాబ్వే (2006 నవంబరు 28)
భారతదేశం 2006 డిసెంబరు 1
ఆఫ్ఘనిస్తాన్ 2018 ఫిబ్రవరి 5
Ireland (2018 జూన్ 12)
బహ్రెయిన్ (2019 జనవరి 20)
కువైట్ (2019 జనవరి 20)
మాల్దీవులు (2019 జనవరి 20)
సౌదీ అరేబియా (2019 జనవరి 20)
ఖతార్ (2019 జనవరి 21)
నేపాల్ (2019 జనవరి 31)
United Arab Emirates (2019 జనవరి 31)
Netherlands (2019 ఫిబ్రవరి 13)
ఒమన్ (2019 ఫిబ్రవరి 13)
Scotland (2019 ఫిబ్రవరి 13)
అమెరికా సంయుక్త రాష్ట్రాలు (2019 మార్చి 15)
పపువా న్యూగినియా (2019 మార్చి 22)
ఫిలిప్పీన్స్ (2019 మార్చి 22)
Vanuatu (2019 మార్చి 22)
మాల్టా (2019 మార్చి 29)
స్పెయిన్ (2019 మార్చి 29)
బెలిజ్ (2019 ఏప్రిల్ 25)
కోస్టారికా (2019 ఏప్రిల్ 25)
మెక్సికో (2019 ఏప్రిల్ 25)
పనామా (2019 ఏప్రిల్ 25)
Belgium (2019 మే 11)
జర్మనీ (2019 మే 11)
Botswana (2019 మే 20)
ఘనా (2019 మే 20)
కెన్యా (2019 మే 20)
నమీబియా (2019 మే 20)
నైజీరియా (2019 మే 20)
Uganda (2019 మే 20)
Italy (2019 మే 25)
గ్వెర్న్సీ (2019 మే 31)
జెర్సీ (2019 మే 31)
నార్వే (2019 జూన్ 15)
డెన్మార్క్ (2019 జూన్ 16)
మలేషియా (2019 జూన్ 24)
థాయిలాండ్ (2019 జూన్ 24)
సమోవా 2019 జూలై 8
ఫిన్లాండ్ (2019 జూలై 13)
సింగపూర్ (2019 జూలై 22)
బెర్ముడా (2019 ఆగస్టు 18)
Canada (2019 ఆగస్టు 18)
కేమన్ ఐలాండ్స్ (2019 ఆగస్టు 18)
ఆస్ట్రియా (2019 ఆగస్టు 29)
లక్సెంబర్గ్ (2019 ఆగస్టు 29)
రొమేనియా (2019 ఆగస్టు 29)
టర్కీ (2019 ఆగస్టు 29)
చెక్ రిపబ్లిక్ (2019 ఆగస్టు 30)
అర్జెంటీనా 2019 అక్టోబరు 3
Brazil 2019 అక్టోబరు 3
చిలీ 2019 అక్టోబరు 3
Peru 2019 అక్టోబరు 3
హాంగ్‌కాంగ్ 2019 అక్టోబరు 5
బల్గేరియా (2019 అక్టోబరు 14)
సెర్బియా (2019 అక్టోబరు 14)
గ్రీస్ (2019 అక్టోబరు 15)
పోర్చుగల్ (2019 అక్టోబరు 25)
జిబ్రాల్టర్ (2019 అక్టోబరు 26)
మలావి 2019 నవంబరు 6
మొజాంబిక్ 2019 నవంబరు 6
భూటాన్ 2019 డిసెంబరు 5
Iran (2020 ఫిబ్రవరి 23)
ఐల్ ఆఫ్ మ్యాన్ (2020 ఆగస్టు 21)
ఫ్రాన్స్ 2021 ఆగస్టు 5
Sweden (2021 ఆగస్టు 14)
రువాండా (2021 ఆగస్టు 18)
హంగరీ 2021 సెప్టెంబరు 2
సైప్రస్ 2021 అక్టోబరు 5
ఎస్టోనియా 2021 అక్టోబరు 5
ఈశ్వతిని (2021 అక్టోబరు 16)
లెసోతో (2021 అక్టోబరు 16)
Seychelles (2021 అక్టోబరు 16)
సియెర్రా లియోన్ (2021 అక్టోబరు 19)
Switzerland (2021 అక్టోబరు 22)
Tanzania 2021 నవంబరు 2
కామెరూన్ 2021 నవంబరు 3
బహామాస్ 2021 నవంబరు 7
ఇజ్రాయిల్ (2022 జూన్ 28)
క్రొయేషియా (2022 జూలై 13)
స్లోవేనియా (2022 జూలై 25)
కుక్ ఐలాండ్స్ 2022 సెప్టెంబరు 9
ఫిజీ 2022 సెప్టెంబరు 9
Indonesia 2022 అక్టోబరు 9
Japan 2022 అక్టోబరు 9
దక్షిణ కొరియా (2022 అక్టోబరు 15)
మాలి (దేశం) (2022 నవంబరు 17)
సెయొంట్ హెలినా (2022 నవంబరు 17)
గాంబియా 2022 డిసెంబరు 1
కంబోడియా 2023 మే 4
China (2023 జూలై 26)
Myanmar (2023 జూలై 26)
మంగోలియా (2023 సెప్టెంబరు 27)
కోటె డి ఐవొరి (2024 నవంబరు 23)
Suriname 2024 డిసెంబరు 6
ఫాక్లాండ్ ద్వీపాలు (2025 మార్చి 10)- మూస:Country data TCA (2025 ఏప్రిల్ 17)
- మూస:Country data TLS 2025 నవంబరు 6
జాంబియా 2025 డిసెంబరు 4
తాత్కాలిక టీ20ఐ స్థితి
[మార్చు]2005, 2018 మధ్య ఐసిసి, తాత్కాలిక ODI, టీ20ఐ హోదాను కొన్ని ఇతర జట్లకు (అసోసియేట్ సభ్యులు అని పిలుస్తారు) మంజూరు చేసింది. ఐసిసి వరల్డ్ క్రికెట్ లీగ్‌లో వారి ప్రదర్శన ఆధారంగా జట్లు నాలుగు సంవత్సరాల కాలానికి ఈ తాత్కాలిక హోదాను పొందాయి - లేదా, మరింత ప్రత్యేకంగా, ప్రపంచ క్రికెట్ లీగ్ చివరి ఈవెంట్ అయిన ఐసిసి వరల్డ్ కప్ క్వాలిఫైయర్‌లో మొదటి ఆరు ఫినిషింగ్ స్థానాల ఆధారంగా. [24] ఐసిసి T20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించడం ద్వారా జట్లు కూడా ఈ హోదాను పొందవచ్చు.
ప్రపంచ కప్ క్వాలిఫైయర్ లేదా ప్రపంచ ట్వంటీ20 క్వాలిఫైయర్‌లో పేలవ ప్రదర్శన తర్వాత శాశ్వత టీ20ఐ హోదాను పొందే ముందు లేదా ఆ హోదాను కోల్పోయే ముందు, పన్నెండు దేశాలకు ఈ తాత్కాలిక టీ20ఐ హోదా ఉండేది (తాత్కాలిక టీ20ఐ హోదా ఉండగా ఆడిన మొదటి, చివరి మ్యాచ్‌ల తేదీలు బ్రాకెట్లో ఉన్నాయి. ఈ హోదాను పొందినప్పుడు, కోల్పోయినప్పుడు లేదా శాశ్వతంగా మారినప్పటి తేదీలు కాదు):
- (2007 సెప్టెంబరు 1 నుండి 2014 జనవరి 30 వరకు)
కెన్యా - (12 సెప్టెంబరు 2007 నుండి, 20 జూన్ 2018 వరకు)
Scotland - (2008 ఆగస్టు 2 నుండి 2017 మార్చి 12 వరకు)
Ireland - (2008 ఆగస్టు 2 నుండి 2018 జూలై 29 వరకు)
Netherlands - (2008 ఆగస్టు 2 నుండి 2014 జనవరి 28 వరకు)
Canada - (2008 ఆగస్టు 3 నుండి 2009 ఏప్రిల్ 8 వరకు)
బెర్ముడా - (2010 ఫిబ్రవరి 1 నుండి 2017 జూన్ 5 వరకు)
ఆఫ్ఘనిస్తాన్ - (2014 మార్చి 16 నుండి 2018 జూలై 29 వరకు)
నేపాల్ - (2014 మార్చి 16 నుండి 2017 జనవరి 18 వరకు)
హాంగ్‌కాంగ్ - (2014 మార్చి 17 నుండి 2018 అక్టోబరు 22 వరకు)
United Arab Emirates - (2015 జూలై 13 నుండి 2018 మార్చి 17 వరకు)
పపువా న్యూగినియా - (25 జూలై 2015 నుండి 19 జనవరి 2017 వరకు)
ఒమన్
ఐసిసి వరల్డ్ ఎలెవన్ జట్టుకు ఐసిసి ప్రత్యేక టి 20 ఐ హోదాను కూడా ఇచ్చింది. దానికి కారణాలు:
- పాకిస్తాన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ను పునరుద్ధరించడంలో తోడ్పడేందుకు గాను, 2017 ఇండిపెండెన్స్ కప్ అనే పాకిస్తాన్ జాతీయ జట్టుతో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్.[25]
- 2017 సెప్టెంబర్‌లో హరికేన్ ఇర్మా, హరికేన్ మరియా వల్ల దెబ్బతిన్న స్టేడియాలకు నిధులు సేకరించడానికి, 2018 మే 31 న వెస్టిండీస్‌తో జరిగే ఏకైక మ్యాచ్, హరికేన్ రిలీఫ్ T20 ఛాలెంజ్. [26]
అంతర్జాతీయ బహుళ-క్రీడా కార్యక్రమాలలో క్రికెట్
[మార్చు]1900 వేసవి ఒలింపిక్స్‌లో భాగంగా క్రికెట్ ఆడారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ జట్లు రెండు రోజుల మ్యాచ్‌లో పోటీ పడ్డాయి.[27] 1998లో, కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా క్రికెట్ ఆడారు. అపుడు 50 ఓవర్ల మ్యాచ్‌లు ఆడారు. ఢిల్లీలో జరిగిన 2010 కామన్వెల్త్ క్రీడల్లో ట్వంటీ20 క్రికెట్ భాగం కావడం గురించి కొంత చర్చ జరిగింది. కానీ ఆ సమయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), దానికి అనుకూలంగా లేనందున, దానిని చేర్చలేదు.[28]
2010లో చైనాలోని గ్వాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల లోను,[29] 2014లో దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరిగిన ఆసియా క్రీడల లోనూ క్రికెట్ ఆడారు. [30] ఈ రెండు సార్లూ భారతదేశం ఆడలేదు.[31] తదుపరి కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్ క్రీడలకు మరిన్ని పిలుపులు వచ్చాయి. 2014, 2018 కామన్వెల్త్ క్రీడలలో పాల్గొనమని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య ఐసిసిని కోరింది, కానీ ఐసిసి ఆ ఆహ్వానాన్ని తిరస్కరించింది. [32] 2010లో, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ను ఒలింపిక్ చార్టర్ అవసరాలకు అనుగుణంగా ఉండే పాలక సంస్థగా గుర్తించింది. దీని అర్థం క్రికెట్‌ను ఒలింపిక్ క్రీడలలో చేర్చడానికి దరఖాస్తు చేసుకోవచ్చు,[33] కానీ 2013లో ఐసిసి అటువంటి దరఖాస్తు చేసుకునే ఉద్దేశ్యం లేదని ప్రకటించింది. ప్రధానంగా BCCI వ్యతిరేకత దానికి కారణం. ఆ వ్యతిరేకతకు కారణం, ఆదాయ నష్టం అయి ఉండవచ్చని ESPNcricinfo సూచించింది. 2016 ఏప్రిల్‌లో ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ మాట్లాడుతూ, ట్వంటీ20 క్రికెట్ 2024 వేసవి క్రీడలలో పాల్గొనేందుకు అర్హత సాధించే అవకాశం ఉందనీ, అయితే చేర్చుకునే అవకాశం ఉండాలంటే ఐసిసి సభ్యుల - ముఖ్యంగా BCCI - సమ్మతి, ఉండాలి. [34]
గణాంకాలు
[మార్చు]రోహిత్ శర్మ, గ్లెన్ మాక్స్వెల్ అత్యధిక సంఖ్యలో, చెరి 5 టీ20ఐ సెంచరీలు చేసారు.
టీ20ఐలో అత్యధిక జట్టు స్కోరు 344/4 - జింబాబ్వే గాంబియాపై చేసింది.[35] అత్యల్ప స్కోరు 2024లో నమోదైంది - నైజీరియా ఐవరీ కోస్ట్‌ను కేవలం 7 పరుగులకే ఆలౌట్ చేసింది.[36] 2023 మార్చిలో దక్షిణాఫ్రికా 259 పరుగులు చేసి వెస్టిండీస్ లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌ను గెలిచినప్పుడు అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ జరిగింది. [37]
2025 నవంబరు నాటికి, బాబరు ఆజం టీ20ఐ ల్లో అత్యధిక పరుగులు చేసాడు.[38] ఒక మ్యాచ్‌లో చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఆరోన్ ఫించ్ పేరిట ఉంది. 2018 లో జింబాబ్వేపై అతను 172 పరుగులిఉ చేసాడు.[39] ఆఫ్ఘనిస్తాన్ బౌలరు రషీద్ ఖాన్ అత్యధిక వికెట్లు తీసుకున్నాడు.[40]
ఇవి కూడా చూడండి
[మార్చు]- అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సభ్యుల జాబితా
- మహిళల ట్వంటీ20 అంతర్జాతీయ
- ట్వంటీ20 అంతర్జాతీయ రికార్డుల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ "Men's T20I Team Rankings". International Cricket Council. Retrieved 16 September 2022.
- ↑ "More results, more Rohit Sharma 2452 runs, and more T20Is than ODIs". ESPNcricinfo. 3 January 2017.
- ↑ "Men's T20I Team Rankings". International Cricket Council. Retrieved 16 September 2022.
- ↑ "More results, more Rohit Sharma 2452 runs, and more T20Is than ODIs". ESPNcricinfo. 3 January 2017.
- ↑ Williamson, Martin (22 June 2010). "The birth of the one-day international". ESPNcricinfo. Retrieved 3 February 2015.
- ↑ "Men's T20I Team Rankings". International Cricket Council. Retrieved 16 September 2022.
- ↑ "More results, more Rohit Sharma 2452 runs, and more T20Is than ODIs". ESPNcricinfo. 3 January 2017.
- ↑ "Men's T20I Team Rankings". International Cricket Council. Retrieved 16 September 2022.
- ↑ "More results, more Rohit Sharma 2452 runs, and more T20Is than ODIs". ESPNcricinfo. 3 January 2017.
- ↑ "South Africa's Superman". ESPNcricinfo. 17 May 2006. Retrieved 17 February 2017.
- ↑ "Men's T20I Team Rankings". International Cricket Council. Retrieved 16 September 2022.
- ↑ "WI beat NZ in historical tiebreaker". International Cricket Council. 26 December 2008. Retrieved 30 January 2015.
- ↑ 13.0 13.1 "Is twenty plenty?". ESPNcricinfo. 24 March 2007. Retrieved 30 January 2015.
- ↑ "Men's T20I Team Rankings". International Cricket Council. Retrieved 16 September 2022.
- ↑ "More results, more Rohit Sharma 2452 runs, and more T20Is than ODIs". ESPNcricinfo. 3 January 2017.
- ↑ "Men's T20I Team Rankings". International Cricket Council. Retrieved 16 September 2022.
- ↑ "(500) games of T20I cricket". cricket.com.au. Retrieved 18 February 2016.
- ↑ "Men's T20I Team Rankings". International Cricket Council. Retrieved 16 September 2022.
- ↑ "More results, more Rohit Sharma 2452 runs, and more T20Is than ODIs". ESPNcricinfo. 3 January 2017.
- ↑ "Men's T20I Team Rankings". International Cricket Council. Retrieved 16 September 2022.
- ↑ "All T20 matches between ICC members to get international status". International Cricket Council. Retrieved 26 ఏప్రిల్ 2018.
- ↑ "T20s between all ICC members to have international status". ESPNcricinfo. 26 ఏప్రిల్ 2018.
- ↑ "Men's T20I Team Rankings". International Cricket Council. Retrieved 16 సెప్టెంబరు 2022.
- ↑ "Men's T20I Team Rankings". International Cricket Council. Retrieved 16 September 2022.
- ↑ "Men's T20I Team Rankings". International Cricket Council. Retrieved 16 September 2022.
- ↑ "More results, more Rohit Sharma 2452 runs, and more T20Is than ODIs". ESPNcricinfo. 3 January 2017.
- ↑ Buchanan, Ian. "Cricket at the 1900 Games". Archived 2012-06-14 at the Wayback Machine
- ↑ "Men's T20I Team Rankings". International Cricket Council. Retrieved 16 September 2022.
- ↑ "Men's T20I Team Rankings". International Cricket Council. Retrieved 16 September 2022.
- ↑ "More results, more Rohit Sharma 2452 runs, and more T20Is than ODIs". ESPNcricinfo. 3 January 2017.
- ↑ "Men's T20I Team Rankings". International Cricket Council. Retrieved 16 September 2022.
- ↑ "More results, more Rohit Sharma 2452 runs, and more T20Is than ODIs". ESPNcricinfo. 3 January 2017.
- ↑ Williamson, Martin (22 June 2010). "The birth of the one-day international". ESPNcricinfo. Retrieved 3 February 2015.
- ↑ "Men's T20I Team Rankings". International Cricket Council. Retrieved 16 September 2022.
- ↑ "Men's T20I Team Rankings". International Cricket Council. Retrieved 16 September 2022.
- ↑ "More results, more Rohit Sharma 2452 runs, and more T20Is than ODIs". ESPNcricinfo. 3 January 2017.
- ↑ "Men's T20I Team Rankings". International Cricket Council. Retrieved 16 September 2022.
- ↑ "Men's T20I Team Rankings". International Cricket Council. Retrieved 16 September 2022.
- ↑ "More results, more Rohit Sharma 2452 runs, and more T20Is than ODIs". ESPNcricinfo. 3 January 2017.
- ↑ "Men's T20I Team Rankings". International Cricket Council. Retrieved 16 September 2022.