ట్వైలైట్ (నవల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్వైలైట్ (Twilight)
250px
ట్వైలైట్ యొక్క ముఖచిత్రం
కృతికర్త: స్టెఫెనీ మేయర్
ముఖచిత్ర కళాకారుడు: గెయిల్ డూబినిన్ (రూపకర్త)
రాజర్ హాగడన్ (ఛాయాచిత్రం)
దేశం: అమెరికా
భాష: ఇంగ్లీషు
సీరీస్: ట్వైలైట్ శృంఖల
విభాగం(కళా ప్రక్రియ): Young adult, Fantasy, Romance
ప్రచురణ: Little, Brown
విడుదల: అక్టోబర్ 5, 2005
ప్రచురణ మాధ్యమం: అచ్చు (Hardcover, Paperback)
ఈ-పుస్తకం (Kindle)
ఆడియో పుస్తకం (CD)
పేజీలు: 512[1] (Hardcover)
544[2] (Paperback)
దీని తరువాత: New Moon
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): ISBN 0-316-16017-2

ట్వైలైట్ , స్టెఫనీ మేయర్ రచించిన మొదటి, యూత్ వాంపైర్ రక్తపిపాసి-ప్రేమ గురించిన నవల[3][4]. ట్వైలైట్ ని మొదట్లో 14 మంది ప్రచురణకర్తలు తిరస్కరించారు[5] అయితే 2005లో అట్టబైండులో ప్రచురించబడినప్పుడు, వెంటనే గొప్ప విజయాన్ని సాధించింది. విడుదలైన ఒక నెలలోనే న్యూ యార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ జాబితాలో తొలుత ఐదవ స్థానం సంపాదించి,[6] తరువాత మొదటి స్థానానికి ఎదిగింది.[7] అదే సంవత్సరంలో, ట్వైలైట్ 2005 సంవత్సరానికి పబ్లిషర్స్ వీక్లీ యొక్క అత్యుత్తమ బాలల పుస్తకముగా ఎన్నుకోబడింది.[8]'''''ఈ నవల 2008 సంవత్సరములో అత్యధికంగా అమ్మబడిన పుస్తకం.[9] ఈ నాటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1.7 కోట్ల ప్రతులు అమ్మబడ్డాయి. న్యూ యార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ జాబితాలో[10] 91 వారాలు పాటు ఉంది. ఈ నవల 37 భాషలలోకి అనువదించబడింది. [11]

ఇది ట్వైలైట్ శృంఖలలో మొదటి పుస్తకము. ఫీనిక్స్, ఆరిజోనా నుండి ఫోర్క్స్, వాషింగ్టన్కు వెళ్లి, ఎడ్వర్డ్ కల్లెన్ అనే ఒక రక్తపిపాసిని ప్రేమించి ప్రాణాపాయంలో పడిన పదిహేడేళ్ల ఇసబెల్లా "బెల్లా" స్వాన్ని ఈ నవల పరిచయం చేస్తుంది. ఈ నవల తరువాత న్యూ మూన్, ఎక్లిప్స్, మరియు బ్రేకింగ్ డాఁన్ అనే నవలలు విడుదలయ్యాయి. ట్వైలైట్ యొక్క చలనచిత్ర సమర్పణ 2008లో విడుదలయింది. అది వ్యాపార రీత్యా విజయవంతమై, ప్రపంచవ్యాప్తంగా $382 మిలియన్ల వసూళ్లు నమోదు చేసుకొని,[12] 2009 జూలై నాటికి ఉత్తర అమెరికాలో డీవీడీ అమ్మకాల ద్వారా అదనంగా $157 మిలియను వసూళ్లు నమోదు చేసుకున్నది.[13]

కథా సారాంశం[మార్చు]

ఇసబెల్లా "బెల్లా" స్వాన్ ఎడారి మయమైన ఫీనిక్స్, ఆరిజోనా నుండి వర్షాభావ ప్రాంతమైన ఫోర్క్స్, వాషింగ్టన్ కు, తన తండ్రి చార్లీతో కలిసి ఉండటానికి వెళ్తుంది. ఆమె తల్లి రెనీ, తన కొత్త భర్త అయిన ఒక మైనర్ లీగ్ కు చెందిన బేస్బాల్ క్రీడాకారుడు ఫిల్ డ్వయర్ తో ప్రయాణిస్తుంది. బెల్లా తన కొత్త పాఠశాలలో అందరినీ ఆకట్టుకుంటుంది. అనేకమంది విద్యార్థులు ఆమెతో స్నేహం చేస్తారు. ఆమెకు ఆందోళన కలిగించే విధంగా, అనేక మంది అబ్బాయిలు బెల్లా యొక్క చూపులకై పోటీపడతారు.

పాఠశాలలో మొదటి రోజు, తన ప్రక్కన బెల్లా కూర్చున్నప్పుడు, ఎడ్వర్డ్ కల్లెన్ ఆమెని చూసి పూర్తిగా వికర్షణకు గురి అవుతాడు. అతను కొన్ని రోజులు కనిపించకుండపోతాడు. అయితే తిరిగి వచ్చాక, ఆమెతో నెమ్మదిగా స్నేహంగా మారుతాడు. ఒక రోజు బెల్లా, పాఠశాలలోని వాహనాలు నిలిపే స్థలంలో ఒక సహవిద్యార్థికి చెందిన వ్యాన్ క్రింద దాదాపు పడబోయిన రోజున, వాళ్ల మధ్య కొత్తగా ఏర్పడిన సంబంధం పరాకాష్ఠకు చేరుకుంటుంది. ఆమె ప్రాణాన్ని కాపాడటానికి, ఎడ్వర్డ్ భౌతిక నిబంధనలకు విరుద్ధంగా, క్షణంలో ఆమె ప్రక్కన ప్రత్యక్షమై ఆ వ్యాన్ను తన ఒట్టి చేతులతో ఆపుతాడు.

తన ప్రాణాన్ని ఎడ్వర్డ్ ఎలా కాపాడాడో తెలుసుకోవడానికి బెల్లా తరచూ అతన్ని, ఆ సంఘటన గురించిన ప్రశ్నలతో విసిగిస్తుంది. జేకబ్ బ్లాక్ అనే ఒక కుటుంబ స్నేహితుడి నుండి స్థానిక తెగల గురించిన కథలని విన్న తర్వాత, ఎడ్వర్డ్ మరియు అతని కుటుంబము మనుషుల రక్తం కాకుండా జంతువుల రక్తం తాగే రక్తపిపాసులు అని బెల్లా ఒక నిర్ణయానికి వస్తుంది. తాను మొదట్లో బెల్లా నుండి తప్పించకుని తిరగడానికి కారణము ఆమె రక్తం యొక్క వాసన తనకు విపరీతంగా నచ్చటమేనని ఎడ్వర్డ్ ఒప్పుకుంటాడు. కాలక్రమేణా, ఎడ్వర్డ్, బెల్లా ప్రేమలో పడతారు.

మరొక రక్తపిపాసుల గణం ఫోర్క్స్ లో ప్రవేశించినప్పుడు, వాళ్ల ఇరువురి మధ్య సంబంధానికి ఆటంకం ఏర్పడుతుంది. కల్లెన్ కుటుంబానికి ఒక సాధారణ మనిషితో ఉన్న సంబంధం చూసి ఆశ్చర్యపోయిన జేమ్స్ అనే ఒక ట్రాకర్ రక్తపిపాసి, బెల్లాని వినోదం కోసం వేటాడాలని ఆశ పడతాడు. కల్లెన్ కుటుంబీకులు ట్రాకర్ దృష్టిని మళ్ళించే ప్రయత్నంలో భాగంగా బెల్లా, ఎడ్వర్డ్ ఇద్దరిని విడతీసి, ఫీనిక్స్ లోని ఒక హోటల్ లో బెల్లాని దాచుతాడు. అక్కడ ఉండగా బెల్లాకు జేమ్స్ నుండి ఒక ఫోన్ వస్తుంది. జేమ్స్ బెల్లా తల్లిని బంధించినట్లుగా చెపుతాడు. బెల్లా లొంగిపోయినప్పుడు, జేమ్స్ ఆమె మీద దాడి చేస్తాడు. ఆమె చంపబడే ముందు, ఇతర కల్లెన్ కుటుంబీకులతో కలిసి ఎడ్వర్డ్, ఆమెను రక్షించి జేమ్స్ ని ఓడిస్తాడు. జేమ్స్ బెల్లా చేతిని కరిచేశాడని తెలియగానే, ఎడ్వర్డ్ ఆమె రక్తప్రవాహం నుండి విషాన్ని విజయవంతంగా పీల్చి, ఆమె ఒక రక్తపిపాసిగా మారడాన్ని ఆపి వేస్తాడు. ఆ తరువాత ఆమెను ఒక ఆసుపత్రిలో చేరుస్తారు. ఫోర్క్స్ కు తిరిగి వచ్చిన తర్వాత, బెల్లా, ఎడ్వర్డ్ ఇద్దరూ పాఠశాల ప్రామ్‌ (సంవత్సరాంతంలో జరిగే వీడ్కోలు పార్టీ) లో పాల్గొంటారు. అక్కడ బెల్లా తానూ రక్తపిపాసిగా మారాలనే తన కోరికని వ్యక్త పరుస్తుంది. కానీ ఎడ్వర్డ్ తిరస్కరిస్తాడు.

పుస్తకం యొక్క ముఖచిత్రం[మార్చు]

స్టెఫనీ మేయర్ పుస్తకం అట్ట మీద ఉన్న ఆపిల్ ను బుక్ ఆఫ్ జెనెసిస్ నుండి సంగ్రహించిన నిషిద్ధ ఫలంగా భావించవలెనని చెప్పింది. అది బెల్లా మరియు ఎడ్వర్డుల యొక్క ప్రేమను ప్రతిబింభిస్తుంది. వారి ప్రేమ బైబిల్లోని జ్ఞాన వృక్షం యొక్క ఫలము వలె నిషిద్ధమై, జెనిసిస్ 2:17 లో చెప్పబడిన విషయము పుస్తకము మొదట్లో చెప్పబడింది. అది బెల్లాకు మంచి చెడుల గురించి ఉన్న జ్ఞానమును విశదీకరించి, ఆమె నిషేధింపబడిన ఫలము వంటి ఎడ్వర్డ్ తో కలసి ఉండటమా లేక అతనిని చూడకుండా ఉండటమా అనే నిర్ణయం తీసుకునే స్థితి కలిగి ఉందని చెపుతుంది.[14] ఒక ప్రత్యమ్నాయ కవరు మీద బెల్లా, ఏడ్వర్డ్ పాత్రలని చలనచిత్రంలో పోషించిన నటులు స్టెన్ స్టీవర్ట్ మరియు రాబర్ట్ పాట్టిసన్ ల చిత్రాలు ఉంటాయి.

అవార్డులు మరియు గౌరవాలు[మార్చు]

అభివృద్ది, ప్రచురణ మరియు స్వీకరణ[మార్చు]

అభివృద్ధి[మార్చు]

ట్వైలైట్ గురించిన ఆలోచన 2003 జూన్ 2న తనకు ఒక కలలో వచ్చిందని మేయర్ చెప్పారు.[17] ఒక మానవజాతికి చెందిన అమ్మాయి మరియు ఆమెని ప్రేమిస్తున్న ఒక రక్తపిపాసి గురించిన కల అది. అయితే ఆ రక్తపిసాసికి ఆమె రక్తాన్ని త్రాగాలనే కోరిక ఉంటుంది.[17] ఈ కల ఆధారంగా, మేయర్ వ్రాసిందే ప్రస్తుతం పుస్తకంలోని 13వ అధ్యాయమైంది.[18] కేవలం మూడు నెలల్లో, ఆమె తన కలని ఒక పూర్తి నవలగా మార్చివేశారు.[19] అయితే, తాను ఎప్పటికీ ట్వైలైట్ని ప్రచురించాలని అనుకోలేదని, కేవలం తన సంతోషం కోసమే వ్రాసుకున్నాని పేర్కొన్నది.[20] ఆమె సోదరికి ఆ పుస్తకము నచ్చి, మేయర్ ను తన రచనా ప్రతిని సాహిత్య సంస్థలకు పంపించమని ప్రోత్సాహించారు.[21] ఆమె వ్రాసిన 15 ఉత్తరాలలో, ఐదింటికి సమాధానమే రాలేదు. తొమ్మిది ఉత్తరాలు నిరాకరణతో తిరిగి వచ్చాయి. చివరిగా రైటర్స్ హౌస్ కు చెందిన జోడి రీమర్ నుండి సానుకూల స్పందన వచ్చింది.[22]

ప్రచురణ[మార్చు]

2003 లో వేలంలో, ట్వైలైట్ ప్రచురణ హక్కుకు ఎనిమిది మంది ప్రచురణకర్తలు పోటి పడ్డారు.[22] లిటిల్, బ్రౌన్ అండ్ కంపెనీ తొలుత $300,000 కు వేలంపాట పాడింది; అయితే మెయెర్ యొక్క ప్రతినిధి $1 మిలియను అడిగారు; చివరగా మూడు పుస్తకాలకు $750,000 కు ప్రచురణకర్తలు ఒప్పుకున్నారు.[23] 2005లో ట్వైలైట్ 75,000 ప్రతులతో ప్రచురించబడింది.[22] ఇది, విడుదలైన ఒక నెలలోనే న్యూ యార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ జాబితాలో తొలుత #5 స్థానం సంపాదించి,[6] తరువాత #1 స్థానానికి ఎదిగింది.[7] ఈ నవల యొక్క విదేశీ హక్కులు 26 దేశాలకు పైగా అమ్మబడ్డాయి.[24]

అక్టోబర్ 2008న, ట్వైలైట్ USA టుడే యొక్క "గత 15 సంవత్సరాలలో అత్యదికంగా అమ్మబడిన పుస్తకాల" జాబితాలో #26 స్థానంలో నమోదు చేయబడింది.[25] తరువాత ఈ పుస్తకము 2008 సంవత్సరములో అత్యధికంగా అమ్మబడిన పుస్తకంగా ఎదిగింది.[26]

విమర్శకుల స్వీకరణ[మార్చు]

తొలి ప్రచురణ మొదలుకొని, విమర్శకుల నుండి ట్వైలైట్కు ఎక్కువగా సానుకూల సమీక్షలే లభించాయి.[ఉల్లేఖన అవసరం] మేయర్ ని "2005లో మంచి భవిష్యత్తు ఉన్న నూతన రచయితలలో" ఒకరిగా పబ్లిషర్స్ వీక్లీ పేర్కొంది.[27] "యువతలకు ఏర్పడే శృంగార భావానికి సంబంధించిన ఉద్రేకం మరియు పరాధీనం గురించి సరిగ్గా అద్దం పట్టిన పుస్తకం"[28] అని ది టైమ్స్ మెచ్చుకుంది. "గాఢమైన ప్రేమ కథ మరియు అసాధారణమైన ఉత్కంఠత కలిగించే కథ" అని అమెజాన్.కాం మెచ్చుకుంది.[29] "సహజంగా, సూక్ష్మంగా మరియు సులభంగా అర్ధమయ్యే విధంగా ఉండి, ఎప్పుడు ఈ పుస్తకాన్ని చదివేద్దామా అని పాఠకులు అనుకునే విధంగా ట్వైలైట్ ఉంటుంది"[30] అని స్కూల్ లైబ్రరీ జర్నల్ కు చెందిన హిల్లియస్ జే. మార్టిన్ వ్యాఖ్యానించారు. "ప్రేమ మరియు భయానకం యొక్క అద్భుత కలయికే ట్వైలైట్ " అని టీన్ రీడ్స్ కు చెందిన నోరా పయెల్ వ్రాసారు.[31] "బైటవాడైన ఎడ్వర్డ్ మీద బెల్లాకు ఏర్పడే వ్యామోహం, వారి ప్రమాదకర సంబంధం, ఎడ్వర్డ్ యొక్క అంతర్గత పోరాటం వీటిని కౌమారంలో తలెత్తే శృంగార విషయంలో ఏర్పడే ఆశాభంగానికి రూపకాలంకారం అని" పబ్లిషర్స్ వీక్లీ యొక్క నక్షత్ర సమీక్ష వ్యవరించింది.[32] "ఇక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి - కథని ఇంకా బిగించి ఉండొచ్చు, సంభాషణని బలపరచడానికి అతిగా విశ్లేషణాలు, క్రియావిశ్లేషణాలు వాడటం-అయితే ఈ చీకటి ప్రేమ ఆత్మలో ఇంకుపోతుంది" అని బుక్‌లిస్ట్ వ్రాసింది.[33] ఈ పుస్తకము "ఒక గోర మెలిక కలిగి ఉండి ఉన్నత పాఠశాలలో జరిగే ఒక నాటకము ... అయితే ఈ పుస్తకము ఎవరికి ఉద్దేశించిబడినదన్న విషయంలో రహస్యమేమీ లేదు. అదే సమయంలో ఇది తన లక్ష్యాన్ని ఛేధించిందన్న విషయములోనూ ఏ సందేహం లేదు" అని ది డైలీ టెలిగ్రాఫ్కు చెందిన క్రిస్టఫర్ మిడ్డిల్‌టన్ చెప్పారు.[34] "స్టెఫనీ మేయర్ యొక్క పుస్తక శృంఖలలో మొదటిదైన ట్వైలైట్ నన్ను ఎంత తీవ్రంగా ఆకట్టుకుందంటే, నా పుస్తక ప్రతిని నేను పోగొట్టుకున్నప్పుడు, ప్రక్కన ఉన్న నాకు పరిచయమున్న ఒక యువతిని పిలిచి తన ప్రతిని నాకు ఇవ్వమని బ్రతిమాలాను" అని ది పోస్ట్ అండ్ కొరియర్కు చెందిన జెన్నిఫర్ హాస్ చెప్పారు.[35]

"ట్వైలైట్ ఎంత మాత్రం సమగ్రంగా లేదు: ఎడ్వర్డ్ ని ఒక వికృతమైన విషాద హీరో గా చూపించడం ఎక్కువ బైరోనిక్ గా ఉంది. బెల్లా యొక్క ఆకర్షణకు కారణం ఆమె పాత్ర కంటే కూడా మాయే కారణం" అని కిర్కస్ మిశ్రమ విశ్లేషణ ఇచ్చారు. అయినప్పటికీ, ఆ ప్రమాదకరమైన ప్రేమికులు చిత్రీకరణ కచ్చితంగా సరిపోతుంది; చీకటి ప్రేమని అభిమానించేవారు ఈ పుస్తకాన్ని చదవకుండా ఉండలేరు."[36] డైలీ టెలిగ్రాఫ్ తరువాత ట్వైలైట్ ని "2000 దశాబ్దాన్ని నిర్వచించే 100 పుస్తకాల" వరుసలో 32వ స్థానంలో పెట్టినప్పటికీ, ఈ నవల "ఆశ్చర్యకరంగా మెయెర్ యొక్క పేలవమైన రచనను ఎత్తిచూపుతుంది" అని కూడా చెప్పింది.[37]

అనుసరణలు[మార్చు]

చలన చిత్రం[మార్చు]

ట్వైలైట్, సమ్మిట్ ఎంటర్టైన్‌మెంట్ ద్వారా చలనచిత్రముగా రూపొందించబడింది. అ చలనచిత్రము కాథరిన్ హార్డ్విక్ యొక్క దర్శకత్వంలో నటీనటులు క్రిస్టిన్ స్టీవర్ట్, రాబర్ట్ పాట్టిసన్ ప్రధాన పాత్రలైన ఇసబెల్లా స్వాన్, ఎడ్వర్డ్ కల్లెన్ పాత్రలను పోషించారు. కథా వ్యాఖ్యానం మెలిస్సా రోజెన్‌బర్గ్ చే రూపొందించబడింది. ఆ చిత్రము అమెరికా అంతటా థియేటర్లలో 2008 నవంబరు 21 న [38], డీవీడీ రూపంలో మార్చి 2009 21 న[39] విడుదలచేశారు. ఆ డీవీడీని ఆస్ట్రేలియాలో 2009 ఏప్రిల్ 22న విడుదల చేశారు.[40]

గ్రాఫిక్ నవల[మార్చు]

గ్రాఫిక్ నవలగా ట్వైలైట్ అనుసరణం చేయబడుతున్నది అనే పుకారుని ఎంటర్టైన్మెంట్ వీక్లీ జూలై 15, 2009న ధృవపరించింది. కొరియన్ చిత్రకారుడు యంగ్ కిం పుస్తకాన్నిగీయగా, యెన్ ప్రెస్ ప్రచురిస్తుంది. ప్రతి పేనల్ ని స్టెఫనీ మేయర్ స్వయంగా విశ్లేషిస్తారు. ఎంటర్టైన్మెంట్ వీక్లీ ప్రకారం, "అది కేవలం క్రిస్టెన్ స్టీవర్ట్ మరియు రాబ్ పాట్టిన్సన్ ల చిత్రకారులు గీచిన చిత్రం లాగ అనిపించడం లేదు. నిజానికి పాత్రలు మెయెర్ యొక్క సాహిత్య కల్పన మరియు నటుల నిజ రూపము రెండిటి కలయిక లాగ ఉన్నాయి." ఎడ్వర్డ్, బెల్లా మరియు జేకబ్ ల తుది చిత్రాలని ఎంటర్టైన్మెంట్ వీక్లీ పత్రిక జూలై 21, 2009 నాటి సంచికలో ప్రచురించింది.[41]

సూచనలు[మార్చు]

 1. "Twilight (Hardcover)". Amazon.ca. Retrieved 2008-07-23.
 2. "Twilight (Paperback)". Amazon.ca. Retrieved 2008-07-23.
 3. Gregory Kirschling (2007-08-02). "Stephenie Meyer's 'Twilight' Zone". Entertainment Weekly. Retrieved 2009-04-12. Cite web requires |website= (help)
 4. Mike Russell (2008-05-11). "'Twilight' taps teen-vampire romance". Los Angeles Times. Retrieved 2009-04-12. Cite web requires |website= (help)
 5. Rebecca Murray. "Interview with 'Twilight' Author Stephenie Meyer". About.com. Retrieved 2009-07-23. Cite web requires |website= (help)
 6. 6.0 6.1 ఆమె సాహిత్య వృత్తి - స్టెఫనీ మేయర్
 7. 7.0 7.1 "Children's Books - New York Times". New York Times. 2007-06-17. Retrieved 2009-07-23. Cite web requires |website= (help)
 8. 8.0 8.1 Jennifer M. Brown and Diane Roback (2005-11-03). "Best Children's Books of 2005". Publishers Weekly. Retrieved 2009-06-01. Cite web requires |website= (help)CS1 maint: uses authors parameter (link)
 9. "The top 100 titles of 2008". USA Today. 2009-01-14. Text " accessdate-2009-01-15 " ignored (help); Cite web requires |website= (help)
 10. Gerri Miller. "Inside "Twilight"". HowStuffWorks. Retrieved 2009-07-23. Cite web requires |website= (help)
 11. Kenneth Turan (2002-11-21). "Movie Review: 'Twilight'". LA Times. Retrieved 2008-11-21. Cite web requires |website= (help)
 12. "Twilight (2008)". Box Office Mojo. 2008-11-21. Retrieved 2009-07-23. Cite web requires |website= (help)
 13. "Twilight - DVD Sales". The Numbers. 2009-03-22. Retrieved 2009-07-23. Cite web requires |website= (help)
 14. "What's with the apple?". StephenieMeyer.com. Retrieved 2008-02-08. External link in |work= (help)
 15. 15.0 15.1 15.2 15.3 Larry Carroll (2008-05-09). "Official 'Twilight' Synopsis Sadly Lacking In 'OME!' Exclamations". MTV. Retrieved 2009-06-11. Cite web requires |website= (help)
 16. Trevelyn Jones (2005-12-01). "Best Books 2005". School Library Journal. Retrieved 2009-08-26. Cite web requires |website= (help)
 17. 17.0 17.1 స్టెఫనీమేయర్.కాం |ట్వైలైట్ వెనుక కథ
 18. Walker, Michael R. (Winter 2007). "A Teenage Tale With Bite". Brigham Young University Magazine. Retrieved 2008-08-01. Cite web requires |website= (help)
 19. Lev Grossman (2008-04-24). "Stephenie Meyer: A New J.K. Rowling?". Time. Retrieved 2009-06-30. Cite web requires |website= (help)
 20. "BookStories Interview with Stephenie Meyer". BookStories. Changing Hands Bookstore. August 2006. Retrieved 2009-08-15.
 21. Damian Whitworth (2008-05-13). "Harry who? Meet the new J.K. Rowling". The Times. Retrieved 2009-08-15. Cite web requires |website= (help)
 22. 22.0 22.1 22.2 "Stephenie Meyer By the Numbers". Publishers Weekly. 2008-12-05. Retrieved 2009-08b-15. Cite web requires |website= (help); Check date values in: |accessdate= (help)
 23. Cecelia Goodnow (2005-10-08). "Debut writer shines with 'Twilight'". Seattle Post-Intelligencer. Retrieved 2009-08-16. Cite web requires |website= (help)
 24. "Stephenie Meyer". Waterstone's. Retrieved 2009-08-16. Cite web requires |website= (help)
 25. "USA Today's best-selling books of last 15 years". USA Today. 2008-10-30. Retrieved 2009-08-22. Cite web requires |website= (help)
 26. Mary Cadden (2009-01-15). "New star authors made, old ones rediscovered in 2008". USA Today. Retrieved 2009-08-22. Cite web requires |website= (help)
 27. స్టెఫెనీమేయర్.కాం |అధికారిక బయో
 28. Amanda Craig (2006-01-14). "New-Age vampires stake their claim". The Times. Retrieved 2009-04-14. Cite web requires |website= (help)
 29. "Editorial Reviews". Amazon.com. Retrieved 2009-04-14. Cite web requires |website= (help)
 30. Hillias J. Martin (2005-10-01). "Grades 5 and Up Reviews: October, 2005". School Library Journal. Retrieved 2008-11-16. Cite web requires |website= (help)
 31. Norah Piehl. "Review: Twilight". Teenreads.com. Retrieved 2009-04-14. Cite web requires |website= (help)
 32. "Stephenie Meyer's official website — Twilight reviews". Retrieved 2008-05-29. Cite web requires |website= (help)
 33. "Booklist Review at Amazon.com". Amazon.com. Retrieved 2008-07-23.
 34. Christopher Middleton (2009-08-07). "Twilight: high school drama with a bloody twist". The Daily Telegraph. Retrieved 2009-08-15. Cite web requires |website= (help)
 35. Jennifer Hawes (2009-07-13). "Living a real-life romance". The Post and Courier. Retrieved 2009-08-16. Cite web requires |website= (help)
 36. "Kirkus Review at B&N.com". B&N.com. Retrieved 2008-07-23.
 37. Brian MacArthur (2009-11-13). "100 books that defined the noughties". telegraph.co.uk. Telegraph Media Group. Retrieved 2009-11-17.
 38. "Stephenie Meyer's official website — Twilight news archive". Retrieved 2008-10-20. Cite web requires |website= (help)
 39. "Summit Home Entertainment's Saturday Release of Twilight Unleashes With Over 3 Million Units Sold" (Press release). Summit Entertainment. 2009-03-22. Retrieved 2009-03-22.
 40. Gillian Cumming (2009-04-19). "Stephanie Meyer reflects on bright Twilight as DVD looms". The Courier Mail. మూలం నుండి 2009-04-22 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-04-21. Cite web requires |website= (help)
 41. Tina Jordan (2009-07-15). "'Twilight' exclusive: Graphic novel version on the way!". Entertainment Weekly. Retrieved 2009-07-16. Cite web requires |website= (help)

బయటి లింకులు[మార్చు]