ఠాగూర్ పురస్కారం
ఠాగూర్ పురస్కారం (Tagore Award) అనేది నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ (1861–1941) 150వ జయంతి సందర్భంగా సాంస్కృతిక సామరస్యాన్ని గౌరవిస్తూ ప్రదానం చేసే అవార్డు. దీనిని 2011లో భారత ప్రభుత్వం స్థాపించింది. సాంస్కృతిక సామరస్యాన్ని, విశ్వమానవతా విలువలను ప్రోత్సహించడంలో విశిష్ట కృషి చేసిన వారికి, ముఖ్యంగా ఘర్షణ లేదా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సృజనాత్మక విధానాల ద్వారా దీర్ఘకాలిక మార్పును తీసుకువచ్చిన వారికి ఈ పురస్కారం అందజేస్తారు.[1]
ఈ అవార్డులో ఒక కోటి రూపాయల నగదు (పది మిలియన్ రూపాయలు, విదేశీ కరెన్సీగా మార్పిడి చేయగలిగేది), ఒక ప్రశంసాపత్రం (Citation), ఒక ఫలకం (Plaque), ఒక సంప్రదాయ హస్తకళ/చేనేత వస్తువు ఇవ్వబడుతుంది.[1]
మొదటి అవార్డు 2012లో పండిట్ రవి శంకర్ గారికి అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేత ప్రదానం చేయబడింది.[2] అయితే రవి శంకర్ గారు అవార్డు స్వీకరించేలోపు మరణించడంతో, ఆయన భార్య సుకన్యా శంకర్ ఈ అవార్డును స్వీకరించారు.[3]
సంగీత వాద్యవృంద నిర్వాహకుడు జుబిన్ మెహ్తా 2013 సంవత్సరానికి టాగోర్ సాంస్కృతిక సామరస్య పురస్కారాన్ని అందుకున్నారు.[4] 2013 సెప్టెంబర్ 6న న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ గారు ఈ అవార్డును జుబిన్ మెహ్తాకు అందజేశారు.[5]
గ్రహీతలు
[మార్చు]| ఆ సంవత్సరానికి మరణానంతరం ప్రదానం చేసిన అవార్డు సూచిస్తుంది |
2019 సంవత్సరానికి టాగోర్ అవార్డు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుడ్‌విల్ అంబాసిడర్ యోహే ససకావా గారికి ప్రదానం చేయబడింది.
| క్రమ సంఖ్య | సంవత్సరం | గ్రహీత | చిత్రం | జననం / మరణం | దేశం | వివరణ |
|---|---|---|---|---|---|---|
| 1 | 2012 | పండిట్ రవి శంకర్[3] | 1920–2012 | హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కర్త | ||
| 2 | 2013 | జుబిన్ మెహతా[4] | 1936– | పాశ్చాత్య శాస్త్రీయ సంగీత నిర్వాహకుడు | ||
| 3 | 2014 | రాజ్‌కుమార్ సింహజిత్ సింగ్[6] | 1931– | మణిపూరి నృత్య కళలో ప్రముఖుడు | ||
| 4 | 2015 | ఛాయనౌట్ | 1961– | బంగ్లాదేశ్‌కు చెందిన సాంస్కృతిక సంస్థ | ||
| 5 | 2016 | రామ్ వి. సుతార్[7] | 1925– | స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రధాన శిల్పి | ||
| 6 | 2020 | రాజ్ కమల్ ఝా | 1966– | "ది సిటీ అండ్ ది సీ" పుస్తక రచయిత[8] |
మూలాలు
[మార్చు]- 1 2 Code of Procedure for the Tagore Award
- ↑ Sitar maestro Pandit Ravi Shankar to get Tagore award Zee News, 6 March 2013.
- 1 2 Tagore award for Ravi Shankar
- 1 2 "Zubin Mehta to get Tagore Award". The Hindu. 11 July 2013.
- ↑ "Zubin Mehta awarded with Tagore Award 2013 for Cultural Harmony". Archived from the original on 8 సెప్టెంబర్ 2013. Retrieved 6 September 2013.
{{cite web}}: Check date values in:|archive-date=(help) - ↑ "Tagore Awards for Cultural Harmony". 26 అక్టోబరు 2018. Retrieved 21 డిసెంబరు 2018.
- ↑ "Statue of Unity sculptor Ram Sutar to be conferred presitigous [sic] Tagore Award for Cultural Harmony". 26 అక్టోబరు 2018. Retrieved 21 డిసెంబరు 2018.
- ↑ "Raj Kamal Jha wins Rabindranath Tagore Literary Prize 2020 for The City and the Sea". The Indian Express (in ఇంగ్లీష్). 7 డిసెంబరు 2020. Retrieved 28 జనవరి 2021.