డక్కలి బాలమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డక్కలి బాలమ్మ తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు మెట్ల కిన్నెర గాయనిగా ప్రసిద్ది చెందిన గాయకురాలు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మంబాపూర్ గ్రామంలో నివసించేది.[2] ఆమె అట్టడుగు దళిత సామాజికవర్గంలో జన్మించింది. ఆమె తన 15 ఏళ్ల వయసులోనే కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ జీవనాన్ని సాగించింది. ఆమె తన తండ్రి వద్ద ఈ విద్యను అభ్యసించింది. ఆ కాలంలో వారు గాడిదలపై ప్రయాణిస్తూ తమ కళను వివిధ గ్రామాలలో ప్రదర్శించేవారు[2]. ఆమె భర్త మరణించినా ఆమె కిన్నెర వాయిద్యాన్ని విడిచిపెట్టలేదు. ఒంటరి మహిళ అయినా ఊరూరా తిరిగి కిన్నెర వాయిద్యం ద్వారా కుటుంబాన్ని పోషించేది. ఒకప్పుడు గుర్రంపై కూచుని గ్రామాల్లో తిరుగుతూ కిన్నెర వాయిద్యాన్ని వాయించేది. కిన్నెర వాయిద్యాన్ని నైపుణ్యంగా వాయించడంలో ఆమె దిట్ట. పది వీరగాథలు అలవోకగా పాడుతూ ఆమె అందించే పన్నెండు కిన్నెర మెట్ల సంగీతాన్ని తెలంగాణలోని ప్రజలు బాగా ఆదరించారు.[3]

మరణం[మార్చు]

ఆమె తన 90వ యేట వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మంబాపూర్ గ్రామంలో డిసెంబరు 8, 2018న మరణించింది.[4]

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]