డబుల్ బెడ్రూమ్ పథకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డబుల్ బెడ్రూమ్ పథకం
పథకం రకం5.72 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
వ్యవస్థాపకులుతెలంగాణ ప్రభుత్వం
ముఖ్యమంత్రికల్వకుంట్ల చంద్రశేఖరరావు
స్థాపన2016, మార్చి 5
బడ్జెట్₹22,000 కోట్లు
(2018 మార్చి నాటికి)
వెబ్ సైటుఅధికారిక వెబ్సైటు

డబుల్ బెడ్రూమ్ పథకం, తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన హౌసింగ్ ప్రాజెక్ట్.[1] గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని గృహాలకు ప్రభుత్వ నుండి నిధులు సమకూర్చి హైదరాబాదు నగరాన్ని మురికివాడలు లేని నగరంగా మార్చాలని ఈ పథక లక్ష్యం. ఈ పథకం ద్వారా 2019, మార్చి 2.72 లక్షల ఇళ్ళు, 2024 నాటికి అదనంగా మరో 3 లక్షల ఇళ్ళను నిర్మించబోతున్నారు.[2]

చరిత్ర[మార్చు]

2014, మే నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మానిఫెస్టోలో ఈ పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకోసం 5.72 లక్షల ఇల్లు (హైదరాబాదులోని 2 లక్షల ఇళ్ళతో సహా) కేటాయించబడ్డాయి.[3] 2016, మార్చి 5న ఎర్రవల్లి వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టును నిర్మించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ఈ గ్రామం సిద్ధిపేట జిల్లా లోని మర్కూక్ మండలంలో ఉంది.[4]

పథకం[మార్చు]

మీ సేవలో లేదా దాని కేంద్రాలలో ఆన్‌లైన్‌లో డబుల్ బెడ్రూమ్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. హైదరాబాదు నగరంలో శుభ్రపరచాల్సిన మురికివాడలను గుర్తించి, నివాసానికి అనువుగా నిర్మాణం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో, ప్రభుత్వ యాజమాన్యంలోని భూమిని గుర్తించి, అక్కడ ఇల్లు నిర్మిస్తారు. ఇల్లు నిర్మాణం పూర్తయిన తరువాత, లబ్ధిదారుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు.

డబుల్ బెడ్రూమ్ ఇల్లు[మార్చు]

గ్రామీణ ప్రాంతాల్లో 200 చదరపు గజాల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తారు. 560 చదరపు అడుగులు నిర్మాణంలో రెండు బెడ్రూమ్ లు, ఒక కిచెన్, హాల్, రెండు బాత్రూమ్ లు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో, ప్రాజెక్టులు గ్రౌండ్ +3 అంతస్తు అపార్టుమెంట్లుగా ఉన్నాయి. హైదరాబాదు మహానగరపాలక సంస్థ పరిధిలోని ప్రాంతాల్లో గ్రౌండ్ +9 అంతస్తుల అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు.[5][6]

టన్నెల్ రూపం సాంకేతికత[మార్చు]

రాంపల్లి గ్రామంలోని 6,240 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, కొల్లూరు గ్రామంలోని 15,660 ఇళ్ళను తొందరగా నిర్మించడానికి, హైదరాబాదు మహానగరపాలక సంస్థ మొదటిసారిగా అధునాతన సొరంగం రూప సాంకేతికతను ఉపయోగించింది.

ఖర్చు పెరుగుదల[మార్చు]

2014లో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఒక్కో ఇంటికి ₹ 3.5 లక్షలు ఖర్చుగా అంచనా వేయబడింది. అయితే, ఇళ్ళ డిజైన్ లో మార్పు, ముడి వస్తువుల ధరలు పెరగడం వల్ల 2017 నాటికి ఒక్కో ఇంటికి ₹ 7.5 లక్షలకు పెరిగింది. ఇతర సౌకర్యాలు, రోడ్లు మొదలైన వాటి కోసం ఒక్కో ఇంటికి అదనంగా ₹1.25 లక్షలు అవుతున్నాయి. మార్కెట్ రేటు కంటే తక్కువ రేటుకు ఇచ్చేలా సిమెంట్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని, ఆన్‌లైన్‌లో బిల్లులను చెల్లించింది. గత రెండేళ్ళలో ఉక్కు ధరలు మూడు రెట్లు పెరిగాయి. ప్రభుత్వం కాంక్రీటుకు ఉచిత ఇసుకను సరఫరా చేస్తుంది.

ఇతర వివరాలు[మార్చు]

2018 మార్చి నాటికి, 2.72 లక్షల టార్గెట్ చేసిన ఇళ్ళలో, 9500 ఇళ్ళు పూర్తయ్యాయి. 18,000 కోట్లకు పైగా బడ్జెట్ వ్యయంతో 1,69,000 ఇళ్ళు పూర్తి దశలో ఉన్నాయి.[7]

అవార్డు[మార్చు]

  • హడ్కో డిజైన్ అవార్డు - 2017

మూలాలు[మార్చు]

  1. Double bedroom Housing scheme facing hurdles in Hyderabad
  2. "Puri says Telangana's double bedroom housing scheme for poor". www.outlookindia.com. Retrieved 2020-03-02.
  3. AuthorTelanganaToday. "Telangana Govt to construct 3 lakh 2BHKs in next five years". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2020-03-02.
  4. "GHMC's Rs. 13.15 crore budget 'divided'". The Hindu. 27 February 2018. Retrieved 20 February 2020.
  5. Telangana proposes Rs 5 L insurance cover, Rs 12K cr support scheme for farmers - Moneycontrol.com
  6. KCR dares opposition to prove graft charges
  7. "Hadko award to double bedrrom scheme". Retrieved 30 April 2018.

బయటి లింకులు[మార్చు]