డయాన్ లేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డయాన్ లేన్
జననం {{{birthdate}}}
భార్య/భర్త Christopher Lambert (1988–1994) (divorced) 1 child
Josh Brolin (2004–present)

డయాన్ లేన్ (జననం: 1965 జనవరి 22), న్యూ యార్క్ సిటిలో పుట్టి పెరిగిన అమెరికాకు చెందిన చిత్ర నటి. జార్జ్ రాయ్ హిల్ యొక్క 1979 నాటి ఎ లిటిల్ రోమాన్స్ అనే చిత్రములో సర్ లారన్స్ ఆలివర్ కు జంటగా లేన్ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. తోరలోనే, టైం పత్రిక ఆమెను కవర్ పేజీలో వేసింది.

లేన్ యొక్క నటనా జీవితం మూడు దశాబ్దాల పాటు కొనసాగింది. ఆమె పలు ప్రసిద్ధ చిత్రాలలో నటించింది. వాటిలో ముఖ్యమైనది: ఆమెకు అకాడెమి అవార్డు, గోల్డెన్ గ్లోబ్స్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు నామినేషన్లు అందించిన అన్ఫెయిత్ఫుల్ . 2003 చిత్రమైన అండర్ ది టస్కన్ సన్కు కూడా ఆమె ప్రసిద్ధి.

ఆమె క్రిస్టోఫర్ లాంబెర్ట్ ను వివాహం చేసుకుంది. వారికి ఎలినార్ జాస్మిన్ లాంబెర్ట్ అనే కూతురు ఉంది. చాలా కాలం వేరువేరుగా ఉన్న ఇద్దరు, 1994లో విడాకులు తీసుకున్నారు. తరువాత ఆమె 2004 ఆగస్టు 15 నాడు నటుడు జోష్ బ్రోలిన్ ను వివాహం చేసుకుంది.

బాల్య జీవితం[మార్చు]

లేన్ న్యూ యార్క్ సిటీలో జన్మించింది. ఆమె తల్లి, కొలీన్ ఫారింగ్టన్ ఒక నైట్ క్లబ్ గాయని. ప్లెబాయ్ పత్రికలో మధ్య పేజిలో (మిస్ అక్టోబరు 1957) ఆమె బొమ్మ వచ్చింది. ఈమె "కాలెన్ ప్రైస్" అని కూడా పిలవబడింది. ఆమె తండ్రి బర్టన్ యూజేన్ మన్హాటన్ లో నాటకాలు శిక్షకుడుగా పనిచేస్తూ, జాన్ కసవేట్స్ తో పాటు ఒక నటనా శిక్షణా కేంద్రాన్ని నడిపేవారు. తరువాత ఆతను ఒక టాక్సీ డ్రైవర్ గాను, ఆ తరువాత సిటి కాలేజిలో హ్యుమానిటీస్ బోధించే అద్యాపకుడుగా పనిచేసారు.[1] లేన్ కు 13 నెలలు వయస్సు ఉన్నప్పుడు, తల్లితండ్రులు విడిపోయారు. తల్లి మెక్సికోకు వెళ్ళిపోయి విడాకులు తీసుకుంది. పాపకు ఆరు సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు తన దగ్గిరే పాపను అట్టిపెట్టుకుంది.[1] ఫారింగ్టన్ జార్జియాకు వెళ్ళిన తరువాత తండ్రి దగ్గరకు లేన్ వచ్చింది. లేన్, తండ్రితో పాటు న్యూ యార్క్ సిటి లోని పలు హోటల్ లలో నివసించింది. తండ్రితో పాటు అతని టాక్సీలో ప్రయాణించేది.[2]

లేన్ కు 15 సంవత్సరాలు వయస్సు వచ్చినప్పుడు, తన స్వతంత్రాన్ని ప్రకటించి, నటుడు మరియు మిత్రుడు అయిన క్రిస్టోఫర్ అట్కిన్స్ తో లాస్ ఏంజిలిస్ కు పారి పోయింది. "అది ఒక బాధ్యతలేని పని. యువకులకు ఎక్కువ స్వేచ్చ ఇచ్చినప్పుడు, అలాగ జారుతుంది" అని లేన్ తరువాత చెప్పింది.[2] తరువాత తిరిగి వచ్చి, ఒక స్నేహితుల కుటుంబముతో కలిసి, వారికి అద్దె కట్టుతూ, నివసించింది. దూరవిద్యా కోర్సులలో చేరిన తరువాత 1981లో, హై స్కూల్ లో చేరింది. అయితే, లేన్ ను ఆమె తల్లి బలవంతంగా ఎత్తుకెళ్ళి, తనతో జార్జియాకు తీసుకు వెళ్ళింది. లేన్, ఆమె తండ్రి కలిసి న్యాయస్థానంలో పోరాడి, ఆరు వారాల తరువాత ఆమె తిరిగి న్యూ యార్క్ కు వచ్చేసింది. లేన్, తల్లితో మూడు సంవత్సరాలు మాట్లాడలేదు. అయితే, ప్రస్తుతుం వారు రాజి పడ్డారు.[2]

వృత్తి[మార్చు]

41వ ఎమ్మి అవార్డ్స్ లో 1989 సెప్టెంబరు 17 నాడు లేన్.

లేన్ కు అమ్మమ్మ అయిన ఎలినార్ స్కాట్, మూడు మార్లు పెళ్ళి చేసుకున్న అపోస్టోలిక్ వర్గానికి చెందిన పెంటెకోస్టల్ మతప్రచారకురాలు. అమ్మమ్మ చేస్తున్న నాటకీయమైన బోధనలు లేన్ ను ఆకర్షించింది.[3][4] లేన్, ఆరవ వయస్సులోనే తన నటనా వృత్తిని ప్రారంబించింది. న్యూ యార్క్ లోని ల మామా ఎక్స్పెరిమెంటల్ ధియేటర్ క్లబ్ లో మీడియా వారి నిర్మాణంలో నటించింది. 12వ వయస్సులో ఆమకు జోసెఫ్ పాప్ నిర్మించిన ది చెర్రి ఆర్చర్డ్లో మెరిల్ స్ట్రీప్ తో పాటు ఒక పాత్రలో నటించింది.[1] అదే సమయములో, లేన్ హంటర్ కాలేజీ హై స్కూల్ లో వేగవంతమైన ప్రోగ్రాంలో చేరింది. నటనా వృత్తిలో బిజీగా ఉండడంతో ఆమెకు మార్కులు తగ్గినప్పుడు, స్కూల్ ఆమెను హెచ్చరించింది.[1] తన 13వ వయస్సులో, బ్రాడ్వేలో రన్అవెస్లో ఒక పాత్రను తిరస్కరించి, లారన్స్ ఆలివియర్ కు జంటగా ఎ లిటిల్ రోమాన్స్లో చలనచిత్ర రంగప్రవేశం చేసింది.[2] లేన్ కు ఆలివియర్ నుంచి గొప్ప ప్రశంసలు లభించింది. అతను లేన్ ను "న్యూ యార్క్ గ్రేస్ కెల్లీ' అని మెచ్చుకున్నాడు.[5]" అదే సమయములో, లేన్ ను టైం పత్రిక తమ కవరు పేజిలో వేసి, హాలివుడ్ వారి "విజ్ కిడ్స్"లో ఒకరిగా ఆమెను అబివర్ణించింది.[6][7]

1980ల ప్రారంబములో, బాలనటి పాత్రల నుంచి పెద్ద వారి పాత్రలకు విజయవంతంగా మారింది. ఎస్.ఈ. హింటన్ రచించిన యువకుల నవలలను ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల చిత్ర అనుకరణ చేసిన రెండు చిత్రాలలో ఆమె అద్భత నటన ప్రదర్శించింది. ఆ చిత్రాలు: 1982లో వచ్చిన ది అవుట్సైడర్స్ మరియు 1983లో వచ్చిన రమ్బిల్ ఫిష్ . ఈ రెండు చిత్రాలలో పలు యువ నటులు అద్భుతమైన ప్రదర్శనలు చూపించారు. వారు మరుసటి దశాబ్దములో పెద్ద నటులయ్యారు. (అంతే కాక, వీరిని ""బ్రాట్ ప్యాక్"" యొక్క సబ్యులుగా పిలిచేవారు) వారిలో కొందరు: టామ్ క్రూయిస్, రాబ్ లొవె, సి. థామస్ హొవెల్, ఏమిలియో ఎస్టేవేజ్, దివంగత పాట్రిక్ స్వయిజ్, మికీ రూర్కే, నికోలస్ కేజ్, మరియు మాట్ డిల్లాన్.[1] మొత్తం పురుషులు ఉన్న ఇంత గొప్ప బృందములో లేన్ కూడా చేరడం, ఆమె నటనా వృత్తిని వేగవంతమైన బాటలో పెట్టింది. "హాలీవుడ్ యొక్క క్రొత్త నటుల బృందములో లేన్ తిరుగులేని నేటి" అని అండి వార్హోల్ ప్రకటించింది.[8]

అయితే, ఆమెను గొప్ప తారా స్థాయికి తీసుకువెళ్ళవలసిన రెండు చిత్రాలు స్ట్రీట్స్ అఫ్ ఫయర్ (ఈ చిత్రం కొరకు ఆమె స్ప్లాష్ మరియు రిస్కీ బిజనస్ చిత్రాలను తిరస్కరించింది) మరియు ది కాటన్ క్లబ్ వ్యాపార రీత్యా మరియు విమర్శనల రీత్యా పరాజయం పొందింది. అందు మూలాన ఆమె నటనా వృత్తి దెబ్బ తిన్నది.[1] ది కాటన్ క్లబ్ తరువాత లేన్ చిత్ర పరిశ్రమనుంచి వైతోలిగి, తన తల్లితో జార్జియాలో నివసించింది.[9] "చాలా కాలంగా నేను నా తల్లికి దగ్గరలో లేను. అందువలన నాకు చక్క దిద్దుగోవలసిన పనులు చాల ఉన్నాయి" అని ఆమె చెప్పింది. "నాకు తల్లి తిరిగి కావాలి కనుక మేము మా సంబంధాలను చక్క పెట్టుకోవాలి."[10]

లేన్ నటనా వృత్తిలో మరల ప్రవేశించి, ది బిగ్ టౌన్ మరియు లేడీ బివేర్ అనే చిత్రాలలో నటించింది. కాని 1989లో ఆమె చేసిన లోన్సం డోవ్ అనే TV మినీ-సీరీస్ ప్రసిద్ధి చెంది మంచి ఆదరణ లభించింది.[9] ఆ పాత్రకు ఆమె ఎమ్మి అవార్డ్ కు ప్రతిపాదించబడింది. కేనస్ చిత్రోత్సవంలో ప్రశంసలు అందుకున్న మై న్యూ గన్ అనే ఒక స్వతంత్ర చలనచిత్రములో ఆమె ప్రదర్శన మంచి ప్రశంసలు అందుకుంది. సర్ రిచర్డ్ అట్టేన్బరో తీసిన చాప్లిన్ అనే భారి బడ్జట్ తో తీయబడిన చార్లెస్ చాప్లిన్ జీవితచరిత చిత్రములో ఆమె నటి పాలెట్ గొడ్దార్డ్ పాత్ర వేసింది.[8]

విగ్గో మోర్టెన్సేన్ తో జంటగా ఎ వాక్ ఆన్ ది మూన్ అనే 1999 నాటి చిత్రములో ఆమె వేసిన పాత్ర లేన్ కు ప్రశంసలు తెచ్చిపెట్టింది. "యౌవనం తరువాత చాలా కాలం నిశబ్దంగా ఉన్న లేన్ ఈ చిత్రములో మంచి ప్రదర్శన చూపించింది" అని ఒక విమర్శకుడు వ్రాశాడు.[11] చిత్ర దర్శకుడు టోని గోల్డ్ విన్ మరియు నిర్మాత డస్టిన్ హాఫ్మాన్, పేర్ల్ అనే ఆ గృహిణి పాత్రకు లేన్ చూడడానికి జూయిష్ లాగా లేక పోయినా, జూయిష్ లాగా మాట్లాడకపోయినా, ఆమె కావాలని అనుకున్నారు. లేన్ గురించి చెపుతూ, "ఆమెలో ఉన్న మరొక విశేష గుణం, ఆత్మచేతనం లేని అవకాశవాదం లేని ఆమె సెక్సువాలిటి. ఆమెకు జూయిష్ పోలికలు లేదనే అంశానికంటే, ఇవి చాలా ముఖ్యమని అనుకున్నాను" అని గోల్డ్ విన్ వ్యాక్యానించారు.[12] ఈ చిత్రానికి గాను, లేన్ కు ఉత్తమ ప్రధాన నటిగా ఇండిపెన్డింట్ స్పిరిట్ అవార్డు ప్రతిపాదన లభించింది. ఆ సమయములో, నటి జీన్ సేబెర్గ్ గురించిన ఒక చిత్రం తీయాలని, సేబెర్గ్ పాత్ర తానే పోషించాలని లేన్ ఆలోచించింది.[13]

2002లో, లేన్ అన్ఫైత్ఫుల్ అనే ఒక నాటక చిత్రములో నటించింది. ది అన్ఫైత్ఫుల్ వైఫ్ అనే ఒక ఫ్రెంచ్ చిత్రమునును అనుకరించి తీయబడిన ఈ చిత్రానికి అడ్రియాన్ లైన్ దర్శకత్వం వహించారు. ఒక రహస్యమైన పుస్తక వ్యాపారితో వివాహేతర సంబంధం పెట్టుకుంటున్న ఒక గృహిణి పాత్రను లేన్ పోషించింది. ఈ చిత్రములో పలు శృంగార సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలు తీసినప్పుడు పలు మార్లు ఒకే సీన్ ను తీయవలసిన అవసరం వచ్చినప్పుడు, అది నటులకు చాలా కష్టంగా అనిపించేది. ముఖ్యంగా ఆ మొత్తం సమయానికి లేన్ భావాత్మకంగా మరియు శారీరకంగా గాచ్చితంగా ఉండవలసి వచ్చేది.[14] ఈ చిత్రములో ఆమె ప్రదర్శనకు లేన్ విస్తృతంగా ప్రశంసలు అందుకున్నా, అన్ఫైత్ఫుల్ చిత్రానికి లభించిన స్పందన మిశ్రమనుంచి సానుకూలంగానే ఉంది. ఎంటర్టైన్మెంట్ వీక్లీకు చెందిన విమర్శకుడు ఓవెన్ గ్లీబెర్మన్ ఈ విధంగా చెప్పాడు, " తన నటనా వృత్తిలోనే అతి ముఖ్యమైన తరుణములో లేన్ అద్భుత ప్రదర్శన చూపించింది. ఆమె తన ముఖములో వ్యక్తపరిచిన కామం, దిగాజారితనం మరియు తప్పు చేస్తున్నామనే భావం, ఇవే ఈ చిత్రము యొక్క నిజమైన కథ".[15] ఆ చిత్రం తరువాత ఆమె నటించింది,.అండర్ ది టస్కన్ సన్ అనే చిత్రములో. ఇది ఫ్రాన్సిస్ మఎస్ రచించిన ఒక గొప్ప పుస్తకము యొక్క అనుకరణ.

2008లో, నైట్స్ ఇన్ రోడంతే అనే చిత్రములో లేన్ రిచర్డ్ గేర్తో మల్లి కలిసి నటించింది. ఇది, గీర్ మరియు లేన్ కలిసి నటించిన మూడవ చిత్రము. నికోలస్ స్పార్క్స్ రచించిన అదే పేరుగల నవల ఆధారంగా ఈ చిత్రం తీయబడింది. అదే సంవత్సరములో, జంపర్ మరియు అన్ట్రేసబీల్ చిత్రాలలో లేన్ నటించింది. ఆమె నటించిన సరికొత్త చిత్రం, కిల్షాట్ . దీనిలో ఆమె మికీ రూర్కేతో జంటగా నటించింది. ఈ చిత్రం పరిమిత పద్ధతిలో థియేటర్ లలో విడుదల చేయబడి, 2009లో DVDలో విడుదల చేయబడింది.

ఒకే రకమైన పాత్రలో తనను వేయడం గురించి 2008లో లేన్ ఆశాబంగం వ్యక్తం చేసింది. "ఎప్పుడు ఏదో ఒక చెడు కొరకు అన్వేషిస్తున్న పాత్రలోనే నన్ను వేస్తున్నారు. నేను ఒక ఆడదానిగా ఉండాలి, అదే సమయములో ఒక హాస్య చిత్రములో నటించాలి. నేను నిర్ణయం చేసేసాను. మిస్ నైస్ గై పాత్రలో ఇంకా నటించను".[16] అటువంటి పాత్రలు దొరకకపోతే, నటన వృత్తినే వదిలేసి, తన కుటుంబముతో ఎక్కువ సమయం గడపాలని కూడా ఆమె ఆలోచించింది. ఒక భేటీలో ఆమె ఈ విదంగా చెప్పింది, "నేను అధికారకంగా ఏమి చేయలేను. నా ఏజంట్ లు నన్ను చెయ్యనివ్వరు. మన మధ్యలో మాట, నా క్రొత్త చిత్రాలు ఏమి ఇప్పుడు రావడం లేదు".[16]

2009లో, సెక్రేటేరియట్ అనే చిత్రములో లేన్ నటించబోతుందని ఒక ప్రకటన వచ్చింది. ఇది 1973 ట్రిపిల్ క్రౌన్ విజేత అయిన పందెం గుర్రానికి, దాని యజమాని పెన్నీ చేనేరికి మధ్య ఉన్న సంబంధం గురించినది ఈ డిస్నీ చిత్రం. పెన్నీ చేనేరి పాత్రనే లేన్ పోషిస్తుంది.[17]

పురస్కారాలు[మార్చు]

2002లో న్యూ యార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ వారి ఓటింగ్ జరిగే ముందు, ఫిలిం సొసైటి అఫ్ లింకన్ సెంటర్ లేన్ నటనా వృత్తి గురించి ఒక ప్రశంస కథనం ప్రచురించింది. దానికి ఒక్క రోజు ముందు, ఫోర్ సీసన్స్ హోటల్ లో లైన్ లేన్ కోసం ఒక విందు ఏర్పాటు చేసాడు. ఈ రెండు కార్యక్రమాలకు విమర్శకులు మరియు అవార్డ్ ఓటర్లు ఆహ్వానించబడ్డారు.[18] నేషనల్ సొసైటీ అఫ్ ఫిలిం క్రిటిక్స్, మరియు న్యూ యార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ పురస్కారాలను ఆమె గులుచుకుంది. గోల్డెన్ గ్లోబ్ మరియు ఉత్తమ నటిగా అకాడెమి అవార్డు లకు లేన్ ప్రతిపాదించబడింది. 2003లో, షోవెస్ట్ యొక్క 2003 సంవత్సరానికి మహిళా తారాగా లేన్ గుర్తించబడింది.[19]

VH1 వారి 100 ఉత్తమ బాల నటుల జాబితాలో లేన్ #79వ స్థానంలో నిలిచింది. అస్క్ మెన్.com వారి 99 అత్యుత్తమ ఆకర్షణీయమైన మహిళల జాబితాలో 2005లో #45 స్థానం,[20] 2006లో #85వ స్థానం[21] మరియు 2007లో #98వ స్థానంలో నిలిచింది.[22]

వ్యక్తిగత జీవితం[మార్చు]

డిసెంబరు 2009లో భర్త జోష్ బ్రోలిన్ తో లేన్ .

1980ల ప్రారంబములో, టిమోతీ హట్టన్, క్రిస్టోఫేర్ అట్కిన్స్, మాట్ డిల్లాన్, మరియు రాక్ స్టార్ జోన్ బాన్ జోవి లను లేన్ డేటింగ్ చేసింది.[1] 1984లో ది కాటన్ క్లబ్ ప్రచారానికి పారిస్ వెళ్ళినప్పుడు, నటుడు క్రిస్టోఫేర్ లాంబెర్ట్ ను కలిసింది.[2] కొంత కాలం కలిసి ఉన్న ఇద్దరు తరువాత విడి పోయారు. వారిద్దరూ రెండేళ్ళు తరువాత రోమ్ లో మల్లి కలిసారు. ఆఫ్టర్ ది రైన్ అనే చిత్రములో ఇద్దరు కలిసి నటించారు. రెండు వారాలలోనే వారిద్దరూ మల్ల కలిసి పోయారు. లేన్, లాంబెర్ట్ లు 1988లో సంట ఫే, న్యూ మెక్సికోలో పెళ్ళి చేసుకున్నారు.[2] వారికీ ఎలినార్ జాస్మిన్ లాంబెర్ట్ (1993 సెప్టెంబరు 5 పుట్టిన తేది) అనే కూతురు ఉంది. చాలా కాలం వేరుగా ఉన్న తరువాత, వారిద్దారూ విడాకులు తీసుకున్నారు.[23] 1995లో జడ్జ్ డ్రెడ్ అనే చిత్ర నిర్మాణం సమయములో ఆ చిత్ర దర్శుకుడు అయిన డానీ కనాన్ ను లేన్ డేటింగ్ చేయడం మొదలు పెట్టింది.[24]

జూలై 2003లో, నటుడు జోష్ బ్రోలిన్ తో లేన్ పెళ్ళి నిశ్చయం అయింది. వారు 2004 ఆగస్టు 15న పెళ్ళి చేసుకున్నారు.[25] అదే ఏడాది డిసంబర్ 20న, వారిద్దరికీ గొడవ ఏర్పడి, ఆమె పోలీసును పిలిచింది. గృహ హింశ కారణాన అతనిని పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే, ఈ విషయములో లేన్ పట్టు పట్టలేదు. వారిద్దరి ప్రతినిది ఆ సంఘటనను ఒక "అపార్ధం" అని వివరించాడు.[26]

లేన్ అనేక సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొంది. ప్రపంచ ఆకలి మీద కేంద్రీకరించిన హీఫెర్ ఇంటర్నేషనల్ అనే సంస్థ మరియు హైతిలో నివారణ చర్యలు చేపట్టుతున్న ఆర్టిస్ట్స్ ఫర్ పీస్ అండ్ జుస్టిస్ అనే హాలీవుడ్ సంస్థలో ఆమె పాల్గొంటుంది. అయితే, తన సమాజ సేవా కార్యక్రమం గురించి పెద్దగ ఆమె మాట్లాడదు: "కొన్ని సార్లు నేను నా హృదయమునుంచి ఇస్తాను. కొన్ని సార్లు, డబ్బు రూపేణా ఇస్తాను కాని [ఇతరలకు సహాయం చేయడం] అది అనామయంగా ఉండాలని అనుకుంటాను. దాని గురించి గొప్పగా చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు."[27]

చలనచిత్రపట్టిక[మార్చు]

సంవత్సరం చలనచిత్రం పాత్ర ఇతర వివరాలు
1979 ఎ లిటిల్ రోమాన్స్ లారెన్ కింగ్
1980 టచ్డ్ బై లవ్ కరెన్ టు ఎల్విస్, విత్ లవ్ అని కూడా పిలవబడుతుంది.
1981 గ్రేట్ పెర్ఫార్మన్సస్ చారిటి రాయల్ టీవి (1 ఎపిసోడ్)
లేడీస్ అండ్ జెంటిల్మెన్, ది ఫబులస్ స్టైన్స్ కోరిన్ బర్న్స్
కేటిల్ అన్నీ అండ్ లిటిల్ బ్రిట్చేస్ జెన్నీ (లిటిల్ బ్రిట్చేస్)
చైల్డ్ బ్రైడ్ అఫ్ షార్ట్ క్రీక్ జెస్సికా రే జేకబ్స్ టీవీ
1982 నేషనల్ లంపూన్ గోస్ టు ది మోవీస్ లిజా
సిక్స్ ప్యాక్ బ్రీజీ
మిస్ అల్-అమెరికన్ బ్యూటి సాలి బుట్టేర్ఫీల్డ్ టీవీ
1983 ది అవుట్సైడర్స్ షేర్రి 'చెర్రీ' వలన్స్
రాంబిల్ ఫిష్ పాటి
1984 స్ట్రీట్స్ అఫ్ ఫైర్ ఎల్లెన్ ఎయిం
ది కాటన్ క్లబ్ వేరా సిసరో
1987 లేడీ బెవేర్ కాత్య యర్నో
ది బిగ్ టౌన్ లారీ డేన్
1988 ప్రైస్లెస్ బ్యూటి చైనా
లోన్సమ్ డోవ్ లోరెన వుడ్ టివి లఘుధారావాహిక
1990 వైటల్ సైన్స్ గినా వైలేర్
డిసేన్డింగ్ ఏంజెల్ ఇరిన స్ట్రోయియా టీవీ
1992 నైట్ మూవ్స్ కాతి షేప్పార్డ్
మై న్యూ గన్ డెబ్బీ బెండేర్
ది సెట్టింగ్ సన్ చొ రెన్కో
చాప్లిన్ పాలెట్ గొడ్డార్డ్
1993 ఇండియన్ సమ్మర్ జాహ్నవి
ఫాలెన్ ఏంజల్స్ బెర్నేట్ స్టోన్ టివి (1 ఎపిసోడ్)
1994 ఒల్డస్ట్ లివింగ్ కాన్ఫేడేరేట్ విడో టేల్స్ అల్ లూసి హోనికట్ మార్స్డేన్ టీవీ
1995 ఎ స్ట్రీట్కార్ నేమ్డ్ డిసయర్ స్టెల్లా టీవీ
జడ్జ్ డ్రెడ్ జడ్జ్ హెర్షె
1996 వైల్డ్ బిల్ సుసన్నా మూర్
జాక్ కరెన్ పావెల్
మాడ్ డాగ్ టైం గ్రేస్ ఎవేర్లీ ట్రిగ్గేర్ హ్యాపీ (UK) అని కూడా పిలవబడుతుంది
1997 ది ఓన్లీ త్రిల్ కతేరిన్ ఫిట్జ్ సిమ్మన్స్
ముర్డర్ అట్ 1600 ఏజెంట్ నినా చాన్స్
1998 గన్షీ మెలిస్సా
గ్రేస్ & గ్లోరీ గ్లోరియా టీవీ
1999 ఎ వాక్ ఆన్ ది మూన్ పెర్ల్ కంట్రోవిట్స్ ప్రధాన పాత్రలో ఉత్తమ నటికు గాను ఇండిపెన్డెంట్ స్పిరిట్ అవార్డు - ప్రతిపాదన
ఉత్తమ నటికి లాస్ వేగాస్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు - ప్రతిపాదన
2000 మై డాగ్ స్కిప్ ఎల్లెన్ మోరిస్
ది వర్జీనియన్ మోలీ స్టార్క్ టీవీ
ది పెర్ఫెక్ట్ స్టాం క్రిస్టియానా కొట్టేర్
2001 హర్డ్బాల్ ఎలిజబెత్ విల్కేస్
ది గ్లాస్ హౌస్ ఎరిన్ గ్లాస్
2002 అన్ఫైత్ఫుల్ కొన్నీ సమ్నేర్ ఉత్తమ సహాయ నటిగా జాతీయ చిత్ర విమర్శకుల సంస్థ అవార్డు
ఉత్తమ నటికి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు
ఉత్తమ నటిగా శాటిలైట్ అవార్డు - చలన చిత్ర నాటకం
ప్రతిపాదన — ఉత్తమ నటికి అకాడమీ అవార్డు
ప్రతిపాదన — ఉత్తమ నటికి బ్రాడ్‌కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ సహాయ నటిగా చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ప్రతిపాదన — ఉత్తమ నటిగా గోల్డెన్ గ్లోబ్ పురస్కారం – చలన చిత్ర నాటకం
ప్రతిపాదన — ఉత్తమ నటికి ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు
ప్రతిపాదన - ఉత్తమ నటిగా ఫోనిక్స్ ఫిలిం క్రిటిక్స్ సొసైటీ అవార్డ్
ప్రతిపాదన - ఉత్తమ నటిగా స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు - చలన చిత్రములో
2003 అండర్ ది టస్కన్ సన్ ఫ్రాన్సిస్ ప్రతిపాదించబడింది — ఉత్తమ నటికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు – సంగీత ప్రధాన లేదా హాస్యరస చలన చిత్రం
ప్రతిపాదన — ఉత్తమ నటికి శాటిలైట్ అవార్డు - సంగీత ప్రధాన లేదా హాస్యరస చలన చిత్రం
2005 ఫియర్స్ పీపిల్ లిజ్ ఎర్ల్
మస్ట్ లవ్ డాగ్స్ సారా నోలన్
2006 హాలీవుడ్ల్యాండ్ టోని మానిక్స్
2008 అన్ట్రేసబీల్ జేన్నిఫెర్ మార్ష్
జుమ్పర్ మేరి రైస్
నైట్స్ ఇన్ రోడాంత్ అడ్రియాన్ విల్లిస్
2009 కిల్షాట్ కార్మెన్ కొల్సన్
2010 సేక్రేటరియట్ పెన్నీ చేనేరి

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 Sager, Mike (2000-06-01). "The Happy Life of Diane Lane". Esquire. Retrieved 2008-05-02.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 Dougherty, Margot (1989-02-13). "Diane Lane, with a New Husband and No Fear of Flying, Takes Wing Again in Lonesome Dove". People. Retrieved 2008-05-01. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 3. "Diane Lane". Inside the Actors Studio. episode 9. season 10. 2004-02-06. Bravo. http://www.imdb.com/title/tt0611217/. 
 4. Cagle, Jess (2002-05-19). "Diane Lane Gets Lucky". Time. Retrieved 2008-05-01.
 5. Bhattacharya, Sanjiv (2002-05-26). "Memory Lane". The Guardian. Retrieved 2008-05-02.
 6. "Cover of Time Magazine". Time. 1979-08-13. Retrieved 2008-05-01.
 7. Skow, John (1979-08-13). "Hollywood's Whiz Kids". Time. Retrieved 2008-05-01.
 8. 8.0 8.1 Williamson, K (1993-01-02). "Child Star Lane Makes a Comeback — at 28!". Herald Sun.
 9. 9.0 9.1 Wolk, Josh (2002-05-24). "Meet Unfaithfuls Diane Lane". Entertainment Weekly. Retrieved 2008-05-02.
 10. Kleinedler, Clare (2003). "That Exposed Feeling". Los Angeles Times. మూలం నుండి 2013-07-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-04-22.
 11. Lacey, Liam (1999-04-09). "A Walk on the Moon". Globe and Mail.
 12. Arnold, Gary (1999-04-02). "Moon finally shines". Washington Times.
 13. Braun, Liz (1999-04-11). "Looking for Lane Change". Toronto Sun.
 14. Kobel, Peter (2002-05-05). "Smoke to Go With the Steam". New York Times. Retrieved 2008-06-19.
 15. Gleiberman, Owen (2002-05-05). "Unfaithful". Entertainment Weekly. Retrieved 2008-06-19.
 16. 16.0 16.1 "Lane Contemplates Quitting Acting". Showbiz Spy. 2008-09-23. మూలం నుండి 2008-09-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-09-25.
 17. Fleming, Michael (2009-06-10). "Diane Lane takes reins of Secretariat". Variety. Retrieved 2009-06-11.
 18. Bowles, Scott (2003-01-15). "Studio keeps Unfaithful out in open". USA Today. Retrieved 2008-06-19.
 19. Garvey, Spencer (2003-01-30). "ShoWest Salutes Diane Lane". FilmStew.com. Retrieved 2008-04-24.
 20. "Top 99 Most Desirable Women - 2005". AskMen.com. 2005. మూలం నుండి 2013-05-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-04-24.
 21. "Top 99 Most Desirable Women - 2006". AskMen.com. 2006. మూలం నుండి 2011-02-02 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-04-24.
 22. "Top 99 Most Desirable Women - 2007". AskMen.com. 2007. మూలం నుండి 2012-07-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-04-24.
 23. Spines, Christine (May 2005). "Diane on Top". Red.
 24. Pratt, Steve (1995-07-22). "In Love with a Lady Judge". The Northern Echo.
 25. Schneller, Johanna (January 2005). "Changing Lane". In Style.
 26. Rush, George (2004-12-20). "Lane calls cops & hubby's arrested". New York Daily News. Retrieved 2008-05-05.
 27. Spines, Christine (2010-10). "Diane Lane". Ladies' Home Journal. మూలం నుండి 2012-10-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-09. Check date values in: |date= (help)

మరింత చదవటానికి[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]