డర్టీ ఫెలో
| డర్టీ ఫెలో | |
|---|---|
| దర్శకత్వం | ఆడారి మూర్తి సాయి |
| రచన | ఆడారి మూర్తి సాయి |
| నిర్మాత | జి.ఎస్. బాబు |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | రామకృష్ణ ఎస్ |
| కూర్పు | జెపి |
| సంగీతం | డాక్టర్ పి. సతీష్ కుమార్ |
నిర్మాణ సంస్థ | రాజ్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 2024 మే 30 |
| దేశం | భారతదేశం |
| భాష | భారతదేశం |
డర్టీ ఫెలో 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] గుడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జి.ఎస్. బాబు నిర్మించిన ఈ సినిమాకు ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించాడు.[2] శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి బతిజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 సెప్టెంబర్ 29న విడుదల చేసి, ట్రైలర్‌ను మే 17న దర్శకుడు మల్లిడి వశిష్ఠ చేతుల మీదుగా విడుదల చేయగా,[3] సినిమాను మే 24న విడుదల చేశారు.[4]
కథ
[మార్చు]మాఫియా డాన్ జేపీ (నాగినీడు), శంకర్ నారాయణ (సత్య ప్రకాష్) ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసే దందాలు చేస్తూ ఉంటారు. జేపీని తప్పిస్తే తనే మాఫీయా డాన్‌గా ఎదగొచ్చని శంకర్ నారాయణ కుట్ర పన్ని జేపీని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో శంకర్ నారాయణ కొడుకు చనిపోవడంతో జేపీ కొడుకు శత్రు అలియాస్ డర్టీ ఫెలో (శాంతి చంద్ర)ని చంపుతానని శంకర్ నారాయణ హెచ్చరిస్తాడు. సిద్దు (శాంతి చంద్ర) ఓ గూడెంలో ఓ పూజరి ఇంట్లో ఉంటూ అక్కడి పిల్లలకు చదువు చెప్తూ ఉంటాడు. పూజారి కూతురు రాగ (దీపికా సింగ్) సిద్దుని ఇష్టపడుతుంది. ఆ గూడెం, అక్కడ అటవీ ప్రాంతాన్ని శంకర్ నారాయణ మనిషి పోతురాజు తన గుప్పిట్లో పెట్టుకుని అందర్నీ భయపెడుతుంటే అతన్ని సిద్దు చంపేస్తాడు. ఈ గ్రామానికి సేంద్రియ వ్యవసాయ పరిశోధన మీద వచ్చిన చిత్ర (సిమ్రితి) సిద్ధుని షూట్ చేస్తుంది. అసలు చిత్ర ఎందుకు సిద్ధుని షూట్ చేస్తుంది? సిద్దు, డర్టీ ఫెలో ఒక్కరేనా ? శంకర్ నారాయణ పగ తీర్చుకుంటాడా ? జేపీ ఏమయ్యాడు? అనేదే మిగతా సినిమా కథ.[5][6]
నటీనటులు
[మార్చు]- శత్రుగా శాంతి చంద్ర
- చిత్రగా సిమ్రితి బతిజా[7]
- సైరాగా నిక్కేష్ రంగ్వాలా[7]
- రాగ పాత్రలో డి దీపికా సింగ్[7]
- నాగినీడు
- సత్య ప్రకాష్
- కుమానన్
- ఎఫ్.ఎం. బాబాయ్
- జయశ్రీ
- పూజా
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "సందె వేళ విందు[8]" | శ్రావణభార్గవి | సతీష్ కుమార్ | 3:15 |
| 2. | "తడబడుతున్న వి అడుగులే" | 4:20 | ||
| 3. | "డర్టీ ఫెలో" | 4:40 | ||
| 4. | "నీ శ్వాసలో" | 4:26 |
మూలాలు
[మార్చు]- ↑ "అందర్నీ అలరించే యాక్షన్ చిత్రమిది". Eenadu. 18 May 2024. Archived from the original on 15 January 2026. Retrieved 15 January 2026.
- ↑ "ఓ తండ్రి కథ". NT News. 5 October 2023. Archived from the original on 15 January 2026. Retrieved 15 January 2026.
- ↑ "'విశ్వంభర' డైరెక్టర్ వశిష్ఠ లాంచ్ చేసిన.. 'డర్టీ ఫెలో' ట్రైలర్ చూశారా?". 10TV Telugu. 17 May 2024. Archived from the original on 15 January 2026. Retrieved 15 January 2026.
- ↑ "మే 24న "డర్టీ ఫెలో" వస్తున్నాడు!". NTV Telugu. 17 May 2024. Archived from the original on 15 January 2026. Retrieved 15 January 2026.
- ↑ "'డర్టీ ఫెలో' మూవీ రివ్యూ". Sakshi. 24 May 2024. Archived from the original on 15 January 2026. Retrieved 15 January 2026.
- ↑ "డర్టీ ఫెలో రివ్యూ". NTV Telugu. 24 May 2024. Archived from the original on 15 January 2026. Retrieved 15 January 2026.
- ↑ 7.0 7.1 7.2 "ఎక్కడా లాగ్ ఉండదు.. నలుగురు హీరోయిన్స్ ఉన్నారు". Chitrajyothy. 21 May 2024. Archived from the original on 15 January 2026. Retrieved 15 January 2026.
- ↑ "'డర్టీ ఫెలో' నుంచి 'సందెవేళ..' సాంగ్ చూశారా? బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా." 10TV Telugu. 16 February 2024. Archived from the original on 15 January 2026. Retrieved 15 January 2026.