Jump to content

డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు

వికీపీడియా నుండి
డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు
శైలి
  • మిస్టరీ
  • థ్రిల్లర్
రచయితకృష్ణ పోలూరు
దర్శకత్వంకృష్ణ పోలూరు
తారాగణం
సంగీతంశ్రీరామ్మద్దూరి
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సిరీస్‌లుసంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య6
నిర్మాణం
నిర్మాత
  • కె.వి. శ్రీరామ్
మాటలుమైదాల శృతి
సినిమాటోగ్రఫీరామ్ కే మహేష్
సంపాదకుడుచంద్రశేఖర్.జి.వి
నిర్మాణ సంస్థసౌత్ ఇండియా స్క్రీన్స్
విడుదల
అసలు నెట్‌వర్క్జీ5
అసలు విడుదల2026 ఫిబ్రవరి 27 (2026-02-27)

డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు 2026లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్‌పై కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించాడు. రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, గాయత్రి భార్గవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్‌ను ఫిబ్రవరి 18న విడుదల చేయగా,[1] ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]

చిత్తూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో కిరాణాకొట్టు వ్యాపారి ప్రసాద్ రావు (రాజీవ్ కనకాల) తన భార్య సుజాత (బిందు చంద్రమౌళి) కుమార్తె స్వాతి (వసంతిక)తో కలిసి జీవిస్తుంటాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన స్వాతి (వసంతిక)కి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తుంది, కానీ తనని హైదరాబాద్ పంపడానికి తొలుత ఇష్టపడని ప్రసాద్ రావు ఆ తరువాత అంగీకరిస్తాడు. హైదరాబాద్‌ వచ్చి స్వాతి ఉద్యోగంలో చేరి భవాని (గాయత్రీ భార్గవి) హాస్టల్‌లో ఉంటూ రోజూ ఆఫీసుకు వెళ్లి వస్తుంది. ఒక రోజు హాస్టల్‌కు వచ్చిన స్వాతి అదృశ్యమవుతుంది, దింతో హాస్టల్ వార్డెన్ భవాని స్వాతి కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది, స్వాతి ఫోన్ స్విఛ్ ఆఫ్ రావడంతో కంగారుగా ప్రసాద్ రావు హైదరాబాద్ వస్తాడు. ఈ స్వాతి మిస్సింగ్ కేసును పోలీస్ ఆఫీసర్ ఏసీపీ రెబెక్కా జోసెఫ్ (ఉదయభాను)కు అప్పగిస్తారు? అసలు స్వాతికి ఏమైంది? తన కూతురు స్వాతి (వ‌సంతిక) క‌నిపించ‌కుండా పోవడంతో ఆమెను వెతుకుతూ వచ్చిన తండ్రి ప్రసాద్ రావుకు ఎదురయ్యే నిజాలు ఏమిటి? ఈ కేసును ఉదయభాను చేదించిందా ? లేదా ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా కథ.[3][4]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "భావోద్వేగంగా 'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' ట్రైలర్". Chitrajyothy. 19 February 2026. Archived from the original on 28 February 2026. Retrieved 28 February 2026.
  2. "'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్.. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్." Zee News Telugu. 19 February 2026. Archived from the original on 28 February 2026. Retrieved 28 February 2026.
  3. "'D/O Prasad Rao Kanabadutaledu' series review: This vigilante thriller confuses pace with nuance" (in Indian English). The Hindu. 27 February 2026. Archived from the original on 28 February 2026. Retrieved 28 February 2026.
  4. "డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు రివ్యూ". NTV Telugu. 27 February 2026. Archived from the original on 28 February 2026. Retrieved 28 February 2026.
  5. "రాజీవ్‌ కనకాల ఎదురుగా నిలబడగానే.. నా రియాక్షన్‌ అదే : వాసంతిక". Eenadu. 23 February 2026. Archived from the original on 28 February 2026. Retrieved 28 February 2026.
  6. "ఓటీటీలోకి ఉద‌య భాను 'డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు'." News 18 Telugu. 8 October 2025. Archived from the original on 28 February 2026. Retrieved 28 February 2026.

బయటి లింకులు

[మార్చు]