డాలర్ శేషాద్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు పక్కన, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డాలర్ శేషాద్రి తదితరులు

డాలర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. తిరుమలలో1944లో జన్మించిన డాల్లర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. ఆయన పూర్వీకులు తమిళనాడులోని కంచికి చెందిన వారు. శేషాద్రి తండ్రి తిరుమల ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించారు. శేషాద్రి తిరుమలలో పుట్టి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అప్పట్లోనే పీజీ చేశారు. తనది జాతక చక్రంలోని మేషరాశి కావడంతో మేక బొమ్మను డాలర్‌గా మెడలో ధరించడం వల్ల డాలర్ శేషాద్రిగా పేరు స్థిరపడి పోయింది.[1] అలాగే గతంలో తిరుమల ఆలయంలో శ్రీవారి బంగారు రూపులు(డాలర్లు) అమ్మేవారు. ఆ విక్రయ విభాగం ఆయన ఆధ్వర్యంలో నడిచేది. కాబట్టే ఆయనకు డాలర్ శేషాద్రి అనే పేరు వచ్చిందనేది మరొక కారణంగా చెప్తారు. 1977 జనవరి 26న తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఉత్తర పారుపత్తేధారుగా విధుల్లో చేరారు. అప్పటి నుంచి తన తుది శ్వాస వరకూ స్వామివారి సేవలోనే తరించారు. 2006 జులై 31న ఉద్యోగ విరమణ చేసి, ఆ తర్వాత ఔట్ సోర్సింగ్ కింద ఆలయ ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా కొనసాగుతూ వచ్చారు. ఈ నాలుగు దశాబ్దాలకుపైగా కాలంలో తిరుమల ఆలయంలో అనేక పదవులు నిర్వహించారు.

జీవిత చరిత్ర[మార్చు]

1944వ సంవత్సరం తిరుమలలో పాల శేషాద్రి జన్మించారు. ఆయన పూర్వీకులు తమిళనాడులోని కంచికి చెందిన వారు. ఆయన తండ్రి తిరుమల ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించారు. శేషాద్రి విద్యాభ్యాసం తిరుపతిలోనే పూర్తి చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన 1978లో టీటీడీలో చేరారు. డాలర్ శేషాద్రికి భార్య, ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. [2]

కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్ళిన ఆయన నవంబరు 29, 2021న గుండెపోటుతో మృతి చెందారు.[3]

మూలాలు[మార్చు]

  1. telugu, 10tv (2021-11-29). "Dollor Seshadri: పి.శేషాద్రి.. డాలర్ శేషాద్రిగా ఎలా మారారు.. 43ఏళ్లుగా శ్రీవారి సేవలో.. | P Seshadri into Dollar Seshadri.. Journey of a Priest". 10TV (in telugu). Retrieved 2021-11-29.CS1 maint: unrecognized language (link)
  2. Velugu, V6 (2021-11-29). "డాలర్ శేషాద్రి ప్రస్థానం: ప్రశంసలు, వివాదాల ప్రయాణం". V6 Velugu (in ఇంగ్లీష్). Retrieved 2021-11-29.
  3. "Dollar Seshadri: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత". EENADU. Retrieved 2021-11-29.