డా.రాజ్ రెడ్డి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దబ్బాల రాజగోపాల్
రాజ్ రెడ్డి
జననం (1937-06-13) జూన్ 13, 1937 (వయస్సు: 78  సంవత్సరాలు)
కటూర్, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
నివాసం USA
జాతీయత Flag of India.svg భారతీయుడు - అమెరికన్
జాతి తెలుగు
రంగములు కృతిమ మేథస్సు
రోబోటిక్స్
మానవ-కంప్యూటర్ అన్యోన్యత
విద్యాసంస్థలు కార్నిగీ మెల్లన్ విశ్వవిద్యాలయం
స్టాన్‌ఫర్డు విశ్వవిద్యాలయం
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ
ఆల్మ మాటర్ College of Engineering, Guindy
University of New South Wales
Stanford University
పరిశోధనా సలహాదారుడు(లు) John McCarthy
డాక్టరల్ విద్యార్థులు James K Baker[1]
Kai-Fu Lee [1]
Harry Shum
Hsiao-wuen Hon
ముఖ్యమైన అవార్డులు Legion of Honor (1984)
Turing Award (1994)
Padma Bhushan (2001)
Vannevar Bush Award (2006)

దబ్బాల రాజగోపాల్ (రాజ్ రెడ్డి) (1937 జూన్ 13) ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు టూరింగ్ అవార్డు గ్రహీత. ఆయన కంప్యూటర్ సైన్సు మరియు కృత్రిమ మేధస్సు (పౌరుష ప్రజ్ఞానం) రంగాలలో ఖ్యాతి గడించాడు. ఆయన గత 40 సంవత్సరాలుగా స్టాన్‌ఫర్డు మరియు కార్నిగీ విశ్వవిద్యాలయాలలో సేవలను అందిస్తున్నాడు.. ఆయన రోబోటిక్స్ సంస్థకు డైరక్టరుగా కూడా ఉన్నాడు. ఆయన భారత దేశంలోని అల్ప అదాయ వర్గాల యువకులు మరియు ప్రతిభావంతులైన యువకులకు వారి విద్యావసరాలను అందించుటకు "రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ" స్థాపనకు సహాయం చేశాడు. ఆయన ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ నకు ఛైర్మన్ గా కూడా ఉన్నాడు. ఆసియా ఖండంలో ACM ట్యూరింగ్ అవార్డు పొందిన మొదటి వ్యక్తి గా గుర్తింపు పొందాడు. ఈ అవార్డు 1994 లో ఆయనకు వచ్చింది. ఈ అవార్డు కంప్యూటర్ విజ్ఞానం నందు ఇచ్చే అత్యున్నత అవార్డు. ఇది ఆయన పౌరుష ప్రజ్ఞానం రంగంలో చేసిన కృషికి ఇవ్వబడినది.

జీవితం[మార్చు]

రాజ్ రెడ్డి బింట్ నాస్సెర్ విశ్వవిద్యాలయము నందు కంప్యూటర్ విజ్ఞానం నందు ప్రొఫెసరు మరియు కార్నిగీ విశ్వవిద్యాలయం నందు రోబోటిక్స్ ప్రొఫెసరు గా ఉన్నాడు. 1960 నుండి రాజ్ రెడ్డి ఆస్ట్రేలియా నందు ఐ.బి.ఎం నందు పనిచేశాడు.[2] 1969 లో ఆయన కార్నిగీ యూనివర్సిటీనందు అసోసియేట్ ప్రొఫెసర్ గా చేరాడు. 1973 నుండి ఆయన పూర్తిస్థాయి ప్రొఫెసర్ గా నియమింపబడ్డాడు. 1984 లో యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యాడు.[3]

ఆయన "రోబోటిక్స్ ఇనిస్టిట్యూట్ " కు వ్యవస్థాపక డైరక్టర్ గా ఉన్నాడు[4] from 1979[5] to 1991[6] మరియు 1991 నుండి 1999 మధ్య కాలంలో కార్నిగీ మెల్లన్‌ యూనివర్సిటీ లోని కంప్యూటర్ విభాగానికి డీన్ గా కూడా వ్యవహరించాడు. ఆయన కార్నిగీ మెల్లన్‌ విశ్వవిద్యాలయానికి డీన్ గా ఉన్నపుడు లాంగ్వేజ్ టెక్నాలజీస్ ఇనిస్టిట్యూట్ మరియు మానవ-కంప్యూటర్ అన్యోన్యత, సెంటర్ ఫర్ ఆటోమేటెడ్ లెర్నింగ్ అండ్ డిస్కవరీ మరియు ఇనిస్టిట్యూట్ ఫర్ సాఫ్ట్‌వేర్ రీసర్చ్ లను రూపొందించాడు.

ఆయన ఐ.ఐ.టి. హైదరాబాద్ కౌన్సిల్ యొక్క ఛైర్మన్ గా యున్నారు[7] . ఆయన "రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్" కు ఛైర్మన్ మరియు ఛాన్సలర్ గా యున్నారు[8]. రెడ్డి గారు 1999 నుండి 2001 లో యేర్పాటు చేయబడిన "ప్రెసిడెంట్స్ ఇన్పర్మేషన్ టెక్నాలజీ అడ్వైజరీ కమిటీ" (PITAC) కు సహ ఛైర్మన్ గా యున్నారు[9][10] .

సూచికలు[మార్చు]

  1. 1.0 1.1 "CMU Computer Science Ph.D. Awards by Advisor". Carnegie Mellon. Retrieved 3 August 2011. 
  2. "CMU's Raj Reddy fills lives with big questions". Pittsburgh Post-Gazette. Monday, June 15, 1998. Retrieved 2 August 2011.  Check date values in: |date= (help)
  3. "CS50: FIFTY YEARS OF COMPUTER SCIENCE". Carnegie Mellon. Retrieved 2 August 2011. 
  4. "History of the Robotics Institute". Robotics Institute, Carnegie Mellon. Retrieved 2 August 2011. 
  5. "Robotics Institute Founders". Carnegie Mellon University Article Dec. 2004, Vol. 1, No. 4. Retrieved 20 August 2011. 
  6. "Raj Reddy". rr.cs.cmu.edu. Retrieved 24 July 2011. 
  7. "Governing Council of International Institute of Information Technology". IIIT. Retrieved 2 August 2011. 
  8. "Governing Council of Rajiv Gandhi University of Knowledge Technoloiges". RGUKT. Retrieved 2 August 2011. 
  9. "Draft Minutes of PITAC". Networking and Information Technology Research and Development(NITRD). Retrieved 7 September 2011. 
  10. "Former PITAC Members (1997-2001)". Networking and Information Technology Research and Development(NITRD). Retrieved 7 September 2011. 

బయటి లంకెలు[మార్చు]