డా. సలీమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా. సలీమ్‌
దర్శకత్వంఎన్.వి. నిర్మల్ కుమార్
రచనఎన్.వి. నిర్మల్ కుమార్
నిర్మాతసురేష్‌ కొండేటి
తమటం కుమార్ రెడ్డి
తారాగణంవిజ‌య్ ఆంటోని
అక్షా పార్ధసాని
ఛాయాగ్రహణంఎం.సి గణేష్ చంద్ర
కూర్పురాజేష్ కుమార్
సంగీతంవిజ‌య్ ఆంటోని
నిర్మాణ
సంస్థలు
ఎస్.కె. పిక్చర్స్
ఓబులేశ్వర ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2015 మార్చి 13 (2015-03-13)
సినిమా నిడివి
149 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

డా. సలీమ్‌ 2014లో విడుదలైన తెలుగు సినిమా. నాగప్రసార సన్నితి సమర్పణలో ఎస్.కె. పిక్చర్స్, ఓబులేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ల పై సురేష్‌ కొండేటి, తమటం కుమార్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఎన్.వి. నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించాడు.[1] విజ‌య్ ఆంటోని, అక్షా పార్ధసాని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2015 మార్చి 13న విడుదలైంది.

కథ[మార్చు]

డా. సలీమ్‌ (విజయ్‌ విన్సెంట్‌) అనాథ. ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసి ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో పనిచేస్తుంటాడు. సలీమ్‌ చేసే మానవత్వపు ఆలోచనల వల్ల యాజమాన్యంఆదాయం పడిపోతుందని భావిస్తారు. డా. సలీమ్‌ అదే ఆసుపత్రిలో పని చేసే నిషా (అక్ష) ను ప్రేమిస్తాడు. సలీమ్‌ ప్రవర్తన నచ్చి అనాథ అయినా పెండ్లి చేసుకుందామని నిశ్చితార్థం జరుగుతుంది. కానీ వృత్తిరీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల ఆమెతో సమయాన్ని కేటాయించలేకపోతాడు. దాంతో విసుగు చెంది అక్ష సలీమ్ తో విడిపోతుంది. ఆ తర్వాత మానభంగానికి గురై చావుబతుకుల మధ్య వున్న ఓ యువతికి సలీమ్‌ ట్రీట్‌మెంట్‌ చేస్తాడు. కానీ తర్వాత రోజు మాయమైపోతుంది. దీనికి కారణం ఎవరు? తర్వాత ఏం జరిగింది? అనేది మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్లు: ఎస్.కె. పిక్చర్స్, ఓబులేశ్వర ప్రొడక్షన్స్
  • నిర్మాతలు: సురేష్ కొండేటి, తమటం కుమార్ రెడ్డి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్.వి. నిర్మల్ కుమార్
  • సంగీతం: విజ‌య్ ఆంటోని
  • సినిమాటోగ్రఫీ: ఎం.సి గణేష్ చంద్ర
  • సహనిర్మాత: ఎం. అర్జున్ గౌడ్

మూలాలు[మార్చు]

  1. Sakshi (19 January 2015). "డా. సలీమ్ మూవీ స్టిల్స్". Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
  2. CineJosh (13 March 2015). "సినీజోష్‌ రివ్యూ: డా.సలీమ్‌". Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=డా._సలీమ్&oldid=4076030" నుండి వెలికితీశారు