డింపుల్ యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డింపుల్ యాదవ్

లోక్‌సభ సభ్యురాలు
పదవీ కాలం
8 ఆగష్టు 2012 – 23 మే 2019
ముందు అఖిలేష్ యాదవ్
తరువాత సుబ్రత్ పథక్
నియోజకవర్గం కన్నౌజ్ లోక్‌సభ నియోజకవర్గం
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
8 డిసెంబర్ 2022
ముందు ములాయం సింగ్ యాదవ్
నియోజకవర్గం మణిపురి

వ్యక్తిగత వివరాలు

జననం (1978-01-15) 1978 జనవరి 15 (వయసు 46)
పూణే, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ సమాజ్‌వాది పార్టీ
జీవిత భాగస్వామి
(m. invalid year)
సంతానం 3
నివాసం సైఫాయి, ఇటావా జిల్లా, ఉత్తర ప్రదేశ్,భారతదేశం
పూర్వ విద్యార్థి లక్నో యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

డింపుల్‌ యాదవ్‌ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఇప్పుడు గతంలో మణిపురి నుండి లోక్‌సభ సభ్యునిగా పనిచేస్తున్నారు, రెండు సార్లు కన్నౌజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా పనిచేసింది. డింపుల్‌ యాదవ్‌ ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య, కేంద్ర మాజీ మంత్రి, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి & స‌మాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు.

వివాహం[మార్చు]

డింపుల్ యాదవ్ 1999 నవంబరు 24న అఖిలేష్ యాదవ్‌ను వివాహం చేసుకుంది. వారికీ ఇద్దరు కుమార్తెలు అదితి, టీనా ఒక కుమారుడు అర్జున్ ఉన్నారు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

డింపుల్ యాదవ్ భర్త అఖిలేష్ యాదవ్ 2009లో ఫిరోజాబాద్, కన్నౌజ్ రెండు లోక్‌సభ స్థానాల నుండి పోటీ చేసి గెలిచి, తరువాత కన్నౌజ్ స్థానానికి ప్రాతినిధ్యం వహించి, ఫిరోజాబాద్‌ స్థానానికి రాజీనామా చేశాడు. ఆమె దీనితో 2009లో ఫిరోజాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో స‌మాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ్ బబ్బర్ చేతిలో ఓడిపోయింది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 224 సీట్లు గెలుచుకుని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడిగా అఖిలేష్ యాదవ్ ఎన్నికై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సి రావడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కన్నౌజ్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికలో ఆమె ఏకగ్రీవంగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.

డింపుల్ యాదవ్ 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కన్నౌజ్ నుండి పోటీ చేసి రెండోసారి ఎంపీగా ఎన్నికైంది.[2][3] ఆమె 2019లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది.[4]

2022 అక్టోబరులో ములాయం సింగ్ యాదవ్ కన్నుమూసిన కారణంగా అనివార్యమైన మెయిన్ పురి లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డింపుల్ యాదవ్ 2.8 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచింది.[5][6]

మూలాలు[మార్చు]

  1. Free Press Journal (30 May 2019). "The love-story of Akhilesh and Dimple Yadav: A drama made for the movies" (in ఇంగ్లీష్). Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
  2. Sakshi (8 January 2017). "సింపుల్‌ యాదవ్‌". Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.
  3. Sakshi (21 April 2019). "డింపుల్‌ యాదవ్‌ 30ఏళ్ల రికార్డు!". Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.
  4. "Elections 2019: Dimple Yadav loses Samajwadi Party bastion Kannauj to BJP's Subrat Pathak". Scroll.in. Scroll. Archived from the original on 27 May 2019. Retrieved 27 May 2019.
  5. "ByPoll Result: SP Candidate Dimple Yadav Wins Mainpuri Bypoll - Sakshi". web.archive.org. 2022-12-08. Archived from the original on 2022-12-08. Retrieved 2022-12-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. V6 Velugu (8 December 2022). "భారీ మెజార్టీతో గెలిచిన డింపుల్ యాదవ్". Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)