డిబేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇరువర్గాల మధ్య పరస్పరం ప్రాతినిధ్యం ఉండే విధంగా ఒక క్రమపద్ధతిలో జరిగే వాదనలనే డిబేట్ లేదా డిబేటింగ్‌ ‌ అని అంటారు. ప్రతిపాదిత సిద్ధాంతం యొక్క సంగతత్వాన్ని పరీక్షించే తార్కిక వాదనకు మించి,ఏది సరైనది,ఏది కాదు అని పరీక్షించే వాస్తవిక వాదనకు మించి,అవతలి వారిని ఒప్పించగలిగే వాక్పటిమకు మించి,విస్త్రతమైనదిగా డిబేట్ను మనం అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. తార్కికత,వాస్తవికమైన కచ్చితత్వం,ప్రేక్షకులను కొంతమేరకైనా భావోద్వేగాలకు గురిచేయడం అనే మూడు, అవతలి వారిని ఒప్పించే కళలో ముఖ్యమైన అంశాలైనప్పటికీ,చర్చిస్తున్న అంశానికి సంబంధించి అవతలి వర్గం కంటే మెరుగైన "నేపధ్యాన్ని" మరియు/ లేక ఫ్రేమ్‌వర్క్‌ను ముందుంచడం ద్వారా డిబేట్లో ఒక వర్గం మరొక వర్గంపై విజయం సాధిస్తుంది.కాబట్టి మరింత డిబేట్‌ను సునిశితమైనది,వ్యుహత్మకమైనదిగా మనం చూడవలసి ఉంటుంది.

లాంఛనంగా జరిగే డిబేట్ పోటీలలో వారే విధంగా చర్చించుకోవాలో నిర్దేశించిన ఫ్రేమ్‌వర్క్‌కు లోబడి ఇరువర్గాలు వాదించుకునేందుకు, భేదాభిప్రాయాలు వస్తే పరిష్కరించుకునేందుకు కొన్ని నియమాలు రూపొందించబడి ఉంటాయి. డిబేట్ యొక్క నాణ్యత,లోతు అనేవి అందులో పాల్గొనే వ్యక్తుల జ్ఞానం, నైపుణ్యాల ఆధారంగా ఉంటాయి. పార్లమెంట్,అసెంబ్లీ వంటి చట్టసభలలో,అన్ని రకాల సమావేశాలలోనూ డిబేట్ జరుగుతూనే ఉంటాయి. ప్రేక్షకుల యొక్క ఓట్ల ద్వారా లేదా న్యాయమూర్తుల నిర్ణయం ద్వారా లేదా ఈ రెండింటి కలయికతోనూ వీటి యొక్క ఫలితాలు నిర్ణయించబడుతుంటాయి. అందరి అనుమతితోనే వాస్తవాలుంటాయన్న భావన స్పరిస్తుంది.కానీ అది వాస్తవం కాదు. నాయకుల మధ్య జరిగే చర్చలుఅమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలలో జరిగే చర్చలు వంటి చట్ట సభల అభ్యర్థుల మధ్య జరిగే చర్చలు ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం.

డిబేట్లో పాల్గొనే ఏ వర్గం వైపు నుండైనా సమానమైన ప్రతిభతో వాదించగలిగే సామర్ధ్యాన్ని పెంపొందించుకోవడమే, ఒక కళగా లేక పద్ధతిగా డిబేట్ అధ్యయనం చేయడం వెనుక ఉన్న ముఖ్యమైన లక్ష్యం. అంతగా అనుభవం లేని వారు డిబేట్లో పాల్గొంటే తమను తాము సమర్ధించుకునేందుకు, ఎదుటివారిపై దాడి చేసేందుకు వారికి కొన్ని అవకాశాలు మాత్రమే కనిపిస్తాయి. అదే అనుభవజ్ఞులైతే, అదే సమయంలో లేదా ఇంకా తక్కువ సమయంలో ఎటువంటి అవకాశాన్నైనా తమకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. ఎదుటివారి వైపు అన్నీ వాస్తవాలే కనిపిస్తున్నప్పటికీ,న్యాయవాదులు తమ కక్షిదారుని వైపే బలంగా వాదిస్తారు. అయితే మనకుండే బలమైన నమ్మకాల చుట్టూనే చర్చలు తిరుగుతాయనే ఒక అపప్రధ బలంగా ఉన్నప్పటికీ అది వాస్తవం కాదు.

విషయ సూచిక

డిబేట్ పోటీలు[మార్చు]

స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇతర వర్గాలతో వాదనలు చేసేందుకుగానూ ఈ చర్చా పోటీలు నిర్వహించబడతాయి. ప్రపంచమంతటా, ముఖ్యంగా దక్షిణాఫ్రికా,కెనడా,యునైటెడ్ స్టేట్స్,యునైటెడ్‌ కింగ్‌డమ్‌,ఐర్లాండ్,ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ వంటి దేశాల ఉన్నత పాఠశాలలలో, ఇంగ్లీషు మాట్లాడే విశ్వవిద్యాలయాల్లో ఈ డిబేట్ పోటీలు ఎంతో ప్రముఖంగా నిర్వహించబడుతుంటాయి. రకరకాల సంస్థలలో, రకరకాల నియమాలతో,విభిన్న పద్ధతులలో ఈ పోటీలు జరుగుతుంటాయి.

పాఠశాలలు,కళాశాలల్లో,స్పష్టమైన నియమ నిబంధనలతో తరచుగా ఈ డిబేట్ పోటీలు జరుగుతూనే ఉంటాయి. వీటికి ఒకరు లేక అంతకన్నా ఎక్కువ న్యాయమూర్తులు అధ్యక్షత వహించవచ్చు. నిర్దేశించిన నియమాలను అనుసరిస్తూ, ఒక్కోసారి వాటి పరిధిలోనే ఉంటూ కొన్ని నియమాలను ఉల్లంఘించేందుకు మరికొన్ని నియమాలను వాడుకుంటూ,రెండు వర్గాలూ గెలవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఒక ప్రతిపాదనకు (విబేధించదగ్గ లేక తీర్మానించదగ్గ ప్రతిపాదన)అనుకూలంగా లేక వ్యతిరేకంగా రెండు వర్గాలు విడిపోయి ఆ ప్రతిపాదన స్వీకరిస్తే ఏమి జరుగుతుందనే అభిప్రాయాన్ని ఈ పోటీలలో తెలియచేస్తారు.కొన్ని సందర్భాలలో ఆ ప్రతిపాదన యొక్క పరిధిని నిర్వచించేందుకు కూడా వారికి అవకాశం ఇవ్వబడుతుంది. నియమాల యొక్క ప్రాముఖ్యత గురించి మరింత వివరంగా చెప్పాలంటే, ఎవరైతే ప్రతిపాదనకు వ్యతిరేకంగా వాదన చేస్తారో వారు ఆ ప్రతిపాదన ఎందుకు స్వీకరించాకూడదో విశదీకరిస్తూ వాదన చేస్తే సరిపోతుంది. వారేమీ ప్రత్యామ్నాయ పరిష్కారాలను సూచించాల్సిన అవసరం లేదు.

డిబేట్ లో రకాలు[మార్చు]

పార్లమెంటరీ (పార్లి)డిబేట్[మార్చు]

బ్రిటిష్ పార్లమెంటరీ విధానాల నుండి రూపొందించిన నియమాలతో పార్లమెంటరీ చర్చలు (అమెరికాలో వీటిని "పార్లి" అంటారు)నిర్వహించబడతాయి. విభిన్న వ్యక్తుల నేపథ్యంలో వ్యక్తుల మధ్య జరిగే పోటీ, ఇందులో ప్రధాన లక్షణం. దీనిలో బ్రిటిష్ పార్లమెంట్ నుండి అరువు తెచ్చిన "ప్రభుత్వం" మరియు "ప్రతిపక్షం" అనే పదాలు ఉంటాయి. (యునైటెడ్ కింగ్డంలో జరిగే చర్చలలో "ప్రభుత్వం"కు బదులుగా ఒక్కోసారి "ప్రతిపాదన" అనే పదం వాడబడుతుంది).

చాలా దేశాలు "డిబేటింగ్"గా పిలుచుకునే పార్లమెంటరీ డిబేట్‌నే ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌,ఆస్ట్రేలియా,ఇండియా,గ్రీస్,ఇతర అనేక దేశాలు ప్రధానంగా పాటిస్తునాయి. ప్రపంచంలో ఎంతో గొప్పగా పార్లమెంటరీ డిబేట్ నిర్వహించే వరల్డ్ యూనివర్సిటీస్ డిబేటింగ్ చాంపియన్ షిప్ బ్రిటిష్ పార్లమెంట్ తరహాలో నిర్వహించబడుతుంది.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో కూడా బ్రిటిష్ పార్లమెంటరీ విధానాలు ఉపయోగించకపోయినప్పటికీ,ఇంగ్లీష్ మాట్లాడే యూనియన్ అంతటా స్కూల్ జాతీయ చాంపియన్ షిప్ పోటీలు 'మేస్' అనే వినూత్న తరహాలో నిర్వహించబడతాయి.అయితే మరోవైపు జాతీయ విశ్వవిద్యాలయాల చాంపియన్ షిప్ పోటీలు మాత్రం బ్రిటిష్ పార్లమెంట్ తరహాలోనే నిర్వహించబడతాయి.

అమెరికాలో ఇటివల స్థాపించబడిన నేషనల్ పార్లమెంటరీ డిబేట్ అసోసియేషన్(NPDA) కళాశాలల వక్తృత్వమునకు అతిపెద్ద స్పాన్సర్ అయినప్పటికీ ఐవీ లీగ్ మొత్తాన్ని కలుపుకుని తూర్పుతీరం కేంద్రంగా పనిచేస్తున్న అమెరికన్ పార్లమెంటరీ డిబేట్ అసోసియేషన్ అత్యంత ప్రాచీన జాతీయస్థాయి పార్లమెంటరీ డిబేటింగ్ సంస్థగా ఉంది. యునైటెడ్ స్టేట్స్ లోని మాధ్యమిక పాఠశాలల స్థాయిలో పనిచేస్తున్న అన్ని పార్లమెంటరి డిబేటింగ్ లు నేషనల్ పార్లమెంటరి డిబేట్ లీగ్ యొక్క పరిధిలోనే నిర్వహించబడుతున్నాయి. కెనడాలో కెనడియన్ యూనివర్సిటీస్ సొసైటీ ఫర్ ఇంటర్ కాలేజియేట్ డిబేటింగ్ అనే సంస్థ అన్ని యూనివర్సిటీ స్థాయి డిబేటింగ్ నిర్వాహక సంస్థగా ఉంది.మాధ్యమిక పాఠశాలల స్థాయిలో కెనడియన్ స్టూడెంట్ డిబేటింగ్ ఫెడరేషన్ (CSDF) ఇదే విధమైన కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

పార్లమెంటరీ చర్చలలో ఏ అంశంపై చర్చించాలి అనే విషయం నిర్వాకులచే లేదా పోటిదారులచే నిర్ణయించబదుతుంది.చర్చ సహజంగా"ప్రభుత్వ" పక్షం ప్రారంభిస్తుంది. ఉదాహరణకు "ఈ చట్ట సభ సాంస్కృతిక ప్రదేశాలను విధ్వంసం చేయవచ్చు" అనేది కనుక చర్చాంశమైతే ప్రభుత్వం దీనిని తనకు అనుకూలమైన విధంగా ఉదాహరణకు,'కేవలం యుద్ధ సమయాలలో లేదా మత ప్రాధాన్యత కల ప్రాంతాలను వదిలిపెట్టి" అని నిర్వచించుకోవచ్చు. ఆ నిర్వచనం విషయంలో నియమాలను ఉల్లంఘిoచినట్లయితే 'ప్రతిపక్షం' ప్రశ్నించే అవకాశం ఉంది కాబట్టి నిర్వచనం న్యాయబద్ధంగా లేనట్లయితే తమకేమి ప్రయోజనం ఉండదని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. విషయం, పద్ధతుల విషయంలో దాదాపుగా సమానమైన మార్కులే లభిస్తాయి కాబట్టి వాక్పటిమ,వాదించే విధానం,సాంప్రదాయ జ్ఞానం,పరిశోధన విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది అత్యంత ప్రజాస్వామ్యయుతమైన చర్చా విధానంగా గుర్తింపు పొందింది.

మేస్ డిబేట్[మార్చు]

ఇది బ్రిటన్లో స్కూల్ స్థాయిలో ఎంతో ప్రాచుర్యంలో ఉన్న చర్చా పద్ధతి. "ఒక ప్రతిపాదించబడిన తీర్మానంపై ఇద్దరు సభ్యులుగా ఉండే రెండు జట్లు చర్చిస్తాయి. ఇందులో ఒక జట్టు ప్రతిపాదన చేయగా(ఉదాహరణకు "ఈ చట్టసభ ఖైదీలకు ఓటు హక్కు కల్పిస్తుంది") మరొక జట్టు దానిని వ్యతిరేకిస్తూ వాదించాల్సి ఉంటుంది. మొదటి ప్రతిపాదన,మొదటి వ్యతిరేకత,2వ ప్రతిపాదన,2వ వ్యతిరేకత. ఈ వరుసలో ప్రతివక్తకూ ఏడు నిముషాల పాటు ప్రసంగించే అవకాశం ఇవ్వబడుతుంది. ప్రతి ప్రసంగంలోనూ మొదటి నిముషం తర్వాత, ప్రతిపక్ష జట్టు సభ్యులు 'పాయింట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్'(పివోఐ)కొరకు అడగవచ్చు. వక్త అంగీకారంతో ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నలు అడగవచ్చు. వక్త మాట్లాడిన విషయంలో తప్పులు ఉంటే ఎత్తి చూపేందుకు, లేక వక్త చెప్పిన ఏదేని అంశం పై వాదించేందుకు ఈ పాయింట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లను ఉపయోగించుకోవచ్చు. అయితే 6 నిముషాల తర్వాత ఇక ఎటువంటి పాయింట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంగీకరించబడవు. నలుగురు వక్తలూ మాట్లాడటం ముగిసిన తరువాత చర్చ ప్రేక్షకుల వైపు మళ్ళుతుంది. ప్రేక్షకులు ఇరుజట్లనూ ప్రశ్నలు అడగవచ్చు. ఈ చర్చ కూడా ముగిసాక, ప్రతి జట్టు నుండి ఒక వక్త (సాంప్రదాయకంగా మొదటి వక్త) మరొక 4 నిముషాలు ప్రసంగిస్తారు. ఈ ముగింపు ప్రసంగంలో ముఖ్యమైన అంశాలను సంక్షిప్తంగా వివరిస్తూనే ఆ వక్త ప్రేక్షకులు, ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వాల్సి ఉంటుంది. ఈ మేస్ విధానంలో,విశ్లేషణా నైపుణ్యాలు,వినోదం,చర్చించే విధానం,వాదనలలోని బలం అన్నింటికీ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. గెలుపొందే జట్టు ఈ అన్ని అంశాలలోనూ రాణించాల్సి ఉంది.

జేస్ డిబేట్[మార్చు]

బహిరంగ చర్చ[మార్చు]

1997 ఫిబ్రవరి 15 న టెక్సాస్ లోని సాన్ అంటోనియాలో గల సెయింట్ మేరిస్ విశ్వవిద్యాలయంలో ప్రారంభించబడిన ఇంటర్నేషనల్ పబ్లిక్ డిబేట్ అసోసియేషన్(ఐపిడిఏ)అనేది అర్కాన్సాస్, లూసియానా, కాన్సాస్, అలబామ, టెక్సాస్, మిస్సిసిపి, తెన్నేస్నే, వాషింగ్టన్, ఒరెగాన్, ఇదాహో, ఫ్లోరిడా మరియు ఒక్లహామా సంయుక్త రాష్ట్రాలలో ప్రస్తుతం చురుకుగా పనిచేస్తున్న జాతీయ సమాఖ్య. అమెరికాలోని విశ్వవిద్యాలయాలన్నింటిలోనూ వేగంగా ఎదుగుతున్న డిబేట్ సంస్థ (ఐపిడిఏ)నే. సాక్ష్యాధారాలను వినియోగించినప్పటికి, సాక్ష్యాన్ని,వేగాన్నిమించి నలుగురిలో మాట్లాడగలగడం,ఎదుటివారిని ఒప్పించగలిగే కళలకు ప్రాధాన్యతనిచ్చే డిబేట్ విధానాన్ని ప్రోత్సహించడం ఐపిడిఏ ప్రధాన ఉద్దేశం. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోయేందుకుగానూ ఐపిడిఏ ఎక్కువగా సాధారణ న్యాయమూర్తులను ఉపయోగిస్తూ ప్రేక్షకుల పాత్ర ఎక్కువగా ఉండే డిబేట్ విధానాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంతేకాక,వక్తృత్వములో పాల్గొనే వ్యక్తుల ముఖ్యమైన లక్ష్యం న్యాయమూర్తులను మెప్పించడమే అయినప్పటికీ ఐపిడిఏ ప్రతి పోటీలోనూ ఉత్తమ వక్తను సత్కరించడం రివాజు.

ఐపిడిఏ ఇద్దరిద్దరు సభ్యులు ఉండే రెండు జట్ల మధ్య డిబేట్ పోటీలనూ,అదేవిధంగా వ్యక్తిగత డిబేట్ పోటీలనూ నిర్వహిస్తుంది. జట్టుల మధ్య పోటి, వ్యక్తిగత పోటి ఏదైనా సరే పోటీ మొదటి రౌండ్ ప్రారంభానికి అరగంట ముందుగా ఏ అంశాల మీద చర్చించాలో ఆ జాబితాను ఆయా జట్లకు ఇస్తారు. వాటిలోంచి ఒక అంశాన్ని వారిలో వారు చర్చించుకుని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఒక వర్గం ఆ తీర్మానానికి అనుకూలంగా,మరొక వర్గం వ్యతిరేకంగా ఒక ప్రారంభ ప్రసంగాన్ని సిద్ధం చేసుకోవడం, ఒకరిని ఒకరు ఎదురు ప్రశ్నించుకోవడం,ఆ రౌండ్ కు ముగింపు పలకడం జరుగుతాయి.

ఇంటర్నేషనల్ పబ్లిక్ డిబేట్ అసోసియేషన్ సభ్యుల కార్యక్రమాలన్నీ సాధారణంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు అనుబంధంగానే జరిగినప్పటికీ ఈ ఐపిడిఏ పోటిలలో ఏడవ గ్రేడు, ఆ పైన విద్యార్హతలు కలిగిన వారెవరైనా పాల్గొనే అవకాశం ఉంటుంది.

ఆస్ట్రేలియా డిబేట్[మార్చు]

ఆస్ట్రేలియా తరహా డిబేట్లో రెండు జట్లు ఒక అంశం మీద వాదించడం జరుగుతుంది.ఈ అంశాన్నే సాధారణంగా ప్రతిపాదన అంటుంటారు. "సాంప్రదాయకంగా ఈ అంశం ఒక అంగీకార సూచకమైన ప్రతిపాదన రూపంలో ఉండి సహజంగా " ఆ పిల్లలు కుక్కలా కన్నా మెరుగైనవి" లేక "ఈ చట్టసభ ఒక ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది"అనే తరహాలో "ఆ", "ఈ", అనే పదాలతో ప్రారంభమవుతుంది. చర్చించే అంశాలలోని విషయం ప్రాంతానికి,ప్రాంతానికి మారుతూ ఉంటుంది. అయితే పోటీదారులకు, ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉండేందుకుగానూ ఆయా ప్రాంతాలకు సంబంధించిన అంశాలనే చర్చకు తీసుకోవడం జరుగుతుంది.

ప్రతి జట్టులోనూ ముగ్గురు సభ్యులు ఉండి, వారిలో ప్రతి ఒక్కరికీ వారి టీం, ఆ టీంలో వారు మాట్లాడే స్థానాన్ని బట్టి పీర్లు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక ప్రతిపాదనకు అనుకూల౦గా వాదించే జట్టులో రెండవ వక్తను"రెండవ అనుకూల వక్త"లేక'రెండవ ప్రతిపాదిత వక్త"అని పిలవడం జరుగుతుంది. ప్రతి వక్త యొక్క స్థానానికీ ఒక నిర్దేశిత ప్రాంతం ఉంటుంది.ఉదాహరణకు మూడవ స్థానంలో ఉన్న వక్తకు ప్రతిపక్ష జట్టు యొక్క వాదనలను ఖండిస్తూ, కొత్త ఆధారాలను జోడిస్తూ తమ వాదనలకు బలం చేకూర్చుకునే అవకాశం ఉంటుంది. చివరి వక్తను'జట్టు సలహాదారుడు/నాయకుడు"గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ నమూనా డిబేట్ పోటీలలో,ప్రతి జట్టు నుండి మొదటి వక్తల యొక్క ముగింపు వాదనలతో ముగిసి,ఆపై ఎటువంటి ఆధారాలూ అంగీకరించబడవు. అనుకూల జట్టుతో ప్రారంభించి మొత్తం ఆరుగురు వక్తలూ ఒకరి తర్వాత ఒకరు వరుసగా ప్రసంగించాలి. వక్తల వరుస సహజంగా ఇలా ఉంటుంది.మొదటి అనుకూల వక్త,మొదటి వ్యతిరేక వక్త,రెండవ అనుకూల వక్త,రెండవ వ్యతిరేక వక్త,మూడవ అనుకూల వక్త,మూడవ వ్యతిరేక వక్త.

నమూనా చర్చా విధానం, ఉపయోగించే నేపథ్యాన్ని బట్టి మారుతుంది.ఐతే ఆస్ట్రేలియా,న్యూజిలాండ్‌లో సాధారణంగా స్కూలు స్థాయిలో జరిగే పోటీల నుంచి, అనేక రౌండ్లు,ఫైనల్‌ సీరిస్‌తో సంవత్సరం అంతా వివిధ స్కూళ్ల మధ్య జరిగే పోటీలకు ఈ విధానాన్ని అనుసరిస్తుంటారు.

వరల్డ్ యూనివర్సిటీస్ పీస్ ఇన్విటేషనల్ డిబేట్ డబ్యుయుపిఐడి[మార్చు]

డబ్యుయుపిఐడి అనేది బ్రిటిష్‌ పార్లమెంట్‌ లేదా ప్రపంచ డిబేట్ నమూనాలను అనుసరించే ఇన్విటేషన్‌ టోర్నమెంట్‌. కోల్‌ఫ్లెన్‌ నేతృత్వంలోని వరల్డ్‌ డిబేట్‌ వెబ్‌సైట్‌ అందించిన సమాచారానికి అనుగుణంగా ప్రపంచంలోని అతిముఖ్యమైన 30డిబేటింగ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ను వీరు ఆహ్వానిస్తారు. ఒకవేళ వీటిలో ఏదైనా టీమ్‌ పోటీల్లో పాల్గొననట్లయితే,60ప్రముఖ టీమ్‌ల నుంచి గానీ లేక యూనివర్సిటీ డిబేట్‌ కమ్యునిటీకి చెందిన సీనియర్‌ సభ్యుల సూచనల మేరకు టీమ్‌లను ఎంపిక చేస్తారు.

డబ్యుయుపిఐడి మొదట 2007 డిసెంబరులో జరిగింది.సిడ్నీ యూనివర్సిటీ ఈ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచింది. 2008లో జరిగిన రెండో పోటీల్లో మోన్‌షా ట్రోఫీని ఎగరేసుకుపోయింది. మూడో డబ్యుయుపిఐడి యూనివర్సిటీ పుత్రా మలేసియా(యుపిఎం)లో డిసెంబరు 2009లో జరిగింది. మొదటి రెండు టోర్నమెంట్లకు యూనివర్సిటీ కౌలాలంపూర్‌(యుఎన్‌ఐకెఎల్‌)సహ అతిథ్యం ఇచ్చింది.

డానియల్ హస్ని ముస్తాఫ్ఫా, సైఫుల్ అమిన్ జాలున్ మరియు మొహమ్మద్ యూనుస్ జాకరయ్యల ఆలోచనా రూపమే డబ్యుయుపిఐడి. వారందరూ గతంలో యూనివర్సిటి పుత్ర మలేసియాలో మలేసియా జాతీయ పోటిల నుండి ప్రపంచ చాంపియన్ షిప్ వరకూ అన్ని రకాల పోటీల్లో పాల్గొన్నవారే.

ఆసియా విశ్వవిద్యాలయాల డిబేట్ చాoపియన్ షిప్[మార్చు]

తూర్పు మధ్య ఆసియా నుండి జపాన్ వరకూ అన్ని దేశాల జట్లు పోటీపడే అతి పెద్ద డిబేట్ టోర్నమెంట్ ఇది. ఆసియాలో ఇది అతిపెద్ద డిబేట్ టోర్నమెంట్‌గా చెప్పవచ్చు.మిడిల్‌ ఈస్ట్‌ నుంచి జపాన్‌ వరకు ఆయాదేశాలకు చెందిన టీమ్‌లు వక్తృత్వము‌లో పాల్గొనేందుకు వస్తాయి.సంప్రదాయబద్ధంగా ఈ టోర్నమెంట్‌ను దక్షిణ ఈశాన్య ఆసియాలో నిర్వహిస్తారు.ఎందుకంటే మిగిలిన ఆసియా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ నుంచి పోటీలో పాల్గొనేవారి సంఖ్య ఎక్కువ.

ఆసియన్‌ డిబేట్స్‌ అన్నీకూడా ఆస్ట్రేలియన్‌ వక్తృత్వ విధానాలను స్వీకరించాయి. దీనిలో ఉన్న తేడా ఒక్కటే. ప్రతి ప్రసంగీకుడికి ఏడు నిమిషాల వ్యవధి ఇస్తారు.అదేవిధంగా ప్రసంగంలో మొదలైన రెండు నుంచి ఆరునిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి జట్టు పాయింట్స్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇస్తుంది. ఒకటి, మరియు ఏడోనిమిషాన్ని పరిరక్షణ కాలంగా పరిగణిస్తారు.ఈ సమయంలో ఎలాంటి పాయింట్స్‌ను ఇవ్వరు.

ఈ చర్చ ప్రధాన మంత్రి(మొదటి ప్రసంగం) స్పీచ్‌తో ప్రారంభమవుతుంది.దీని తరువాత మొదటి ప్రత్యర్థి మాట్లాడతాడు. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరుగా మూడవ వ్యతిరేక వక్త వరకూ పోటీ కొనసాగుతుంది. దీని తరువాత ప్రత్యర్థి జట్టు బదులు సమాధానం ఇస్తుంది.

ఈ బదులు సమాధానంలో ముందుగా ప్రత్యర్థి జట్లు,ఆ తరువాత చర్చగా ముందుగా ప్రారంభించిన జట్టు ప్రసంగిస్తాయి. రిప్లై స్పీచ్‌కు సంబంధించిన ప్రసంగం ముగిసిన తరువాత డిబేట్‌ పూర్తవుతుంది.బదులు సమాధానానికి నాలుగు నిమిషాల వ్యవధి ఉంటుంది.ఈ సమయంలో ఎలాంటి పాయింట్‌ఆఫ్‌ ఇన్ఫ్‌ర్మేషన్‌ను అనుమతించరు.

విధాన డిబేట్[మార్చు]

ఒక ప్రభుత్వ విధానంలో మార్పు కోసం చేసిన ఒక తీర్మానం నుండి రూపొందిన ప్రణాళికకు అనుకూలంగా లేక ప్రతికూలంగా మాట్లాడే ఇద్దరిద్దరు సభ్యులతో కూడిన రెండు జట్లు పోటీపడే చర్చనే పాలసీ వక్తృత్వము అంటారు. ఇరు జట్లు సాధారణంగా ఒక దాని తర్వాత ఒకటి'అనుకూలంగా' లేక 'వ్యతిరేకంగా'వాదనలు చేస్తూ ఉంటాయి. చాలా సందర్భాలలో ఒక ఏడాది పాటు లేదా నిర్దేశించిన కాల పరిమితిలో చర్చకుగాను ఒక అంశం నిర్ణయించబడుతుంది. పార్లమెంటరీ డిబేట్ తరహలో విధాన చర్చ కూడా పరిశోధిత ఆధారాలపై ఆధారపడి ప్రతి వ్యూహాలు,కీలక సిధాంతాలతో సహా న్యాయబద్దమైన వాదనను సిద్ధం చేసుకుని, ఆ కార్యక్రమానికి సంబంధించిన సిద్ధాంతపరమైన ప్రమాణాల గురించి చర్చ జరుగుతుంది. ఇందులో వాక్పటిమకు ప్రాముఖ్యత ఉండి, దాని ఆధారంగా ప్రతి వక్తకూ 'స్పీకర్ పాయంట్లు' కేటాయించబడినప్పటికీ,ప్రతి రౌండ్ లో వక్త ప్రసంగంలోని ఆధారాలూ,తర్కం ఆధారంగానే ఎవరు గెలుపొందారో నిర్ణయిస్తారు. దీనితో పాటు కొన్ని సందర్భాలలో, వీలైనన్ని ఆధారాలు చూపించడం కోసం,వీలైనంత సమాచారం ఇవ్వడం కోసం,ఎదుటి వారిని ప్రశ్నించడం కోసం చాలా వేగంగా మాట్లాడతారు. ప్రత్యర్థిని నోరేత్తనివ్వకుండా చేయడమే ఈ అత్యంత వేగంగా మాట్లాడేవారి లక్ష్యం. దీని ఫలితంగా ఎంతో సమాచారాన్ని అందించగలుగుతారు. దీనితో ప్రత్యర్థి జట్టుకు అన్ని అంశాలను పూర్తి చేసే సమయం ఉండక పోవడంతో పాటు మొదటి జట్టు స్పృశించిన అంశాలలో కొన్నింటిని వదిలిపెట్టాల్సి వస్తుంది.

యూరోప్ మరియు జపాన్ లలో కొంత ప్రయత్నించబడినప్పటికి ఈ తరహ చర్చ అధికంగా సంయుక్త రాష్ట్రాలలోనే(ఇక్కడ దీనిని క్రాస్ ఎగ్జామినేషన్ లేక CX డిబేట్ అని కూడా అంటారు) ఎక్కువగా ఉపయోగిస్తారు.దీని యొక్క ప్రభావం కచ్చితంగా ఇతర డిబేట్ నమూనాలపై కూడా ఉంది. దీని పరిణామ క్రమం గమనించిన వారు దీనిని కొందరికే అర్థం అయ్యే నమూనాగా భావిస్తారు.

సంప్రదాయ డిబేట్[మార్చు]

చర్చకు సంబంధించి సంప్రదాయ డిబేట్ ఒక సరికొత్త రూపమని చెప్పవచ్చు. దీన్ని అమెరికాలోని మిన్సెసొటా రాష్ట్రంలో సంప్రదాయ డిబేట్ గురించి ముందుగా ఊహించి,ఓ సరికొత్త రూపాన్ని ఇచ్చారు. పాలసీ డిబెట్‌కు ప్రత్యామ్నాయంగా దీన్ని రూపొందించారు. ఒక విధానాన్ని అభివృద్ధి చేయడం వల్ల చర్చ అనేది పూర్తిగా ప్రత్యేకరూపంలోకి మారుతుందని,వాస్తవిక అంశాల గురించి మాట్లాడటంలో అవగాహన లోపించడంతో వ్యూహాత్మక వాదనలకు భిన్నంగా తిట్టుకోవడమే ప్రధానమవుతుందని కొంతమంది జడ్జీలు, కోచ్‌లు భావిస్తుంటారు. పాలసీ డిబెట్‌ తరహాలోనే నిర్మాణాన్ని కలిగి ఉన్నప్పటికీ,సంప్రదాయ వక్తృత్వము తార్కికత మరియు వాస్తవమైన చర్చను ఉద్ఘాటిస్తుంది. ఈ కారణంగానే దీనికి పాలసీ లైట్‌ అనే మారుపేరు కూడా ఉంది.

చర్చ ప్రారంభానికి ముందు ఒక తీర్మానాన్ని ఎంచుకుంటారు.సమర్థకులు సమర్థిస్తారు,వ్యతిరేకులు వ్యతిరేకిస్తారు. వాదనలు సుదీర్ఘకాలం సాగడం కంటే వాదనలు లోతుగా జరిగే విధంగా చర్చను నిరోధిస్తారు. ఫలితంగా మిగిలిన ఫార్మెట్ల తరహాలో చర్చ నిస్సారంగా సాగకుండా,ఆసక్తికరంగా సాగుతుంది.

సందర్భోచిత డిబేట్[మార్చు]

సందర్భోచిత చర్చలో ముందస్తుగా ఎలాంటి ప్లానింగ్‌ ఉండదు.రెండు టీమ్‌ల్లోనూ మాట్లాడే వారు ఇద్దరు ఉంటారు. వర్తమాన అంశాలు మరియు వివిధ రకాల గణాంకాలను(వీటి విశ్వసనీయతను ఎదుటి బృందం వారు ప్రశ్నిస్తారు)ఉదహరించడాన్ని మెజారిటీ జడ్జీలు అనుమతిస్తారు. డిబేట్ మునుపు డిబేట్‌కు సంబంధించిన తీర్మానంతోపాటు,దానికి సంబంధించిన పరిశోధనాత్మక వ్యాసాలు ఒకటి,రెండు అందిస్తారు. తీర్మానాన్ని సమర్థిస్తూ,ఆ తరువాత వ్యతిరేకిస్తూ మొదటి వ్యక్తి యొక్క ప్రసంగం ఉంటుంది.ఆ తరువాత రెండో వ్యక్తి కూడా ఇదే తరహాలో నిర్మాణాత్మకంగా సమర్థిస్తూ,వ్యతిరేకిస్తూ ప్రసంగిస్తాడు. ఈ ప్రసంగాలన్నీ కూడా ఆరునిమిషాల వ్యవధిపాటు సాగుతాయి.దీని తరువాత రెండు నిమిషాల పాటు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ఉంటుంది. ఆ తరువాత మొదట మాట్లాడిన వ్యక్తి సమర్థించుకుంటూ, వ్యతిరేకిస్తూ ఎదుటివారి వాదనలను ఖండిస్తాడు.ఇదే తరహాలో రెండో వ్యక్తి కూడా వాటిని ఖండిస్తాడు. ఈ ప్రసంగాలు నాలుగు నిమిషాల పాటు సాగుతాయి. ఖండన సమయంలో ఏ కొత్తవిషయాన్ని చర్చలో చొప్పించడాన్ని అంగీకరించరు.

ఈ తరహా డిబేట్లో సాధారణంగా మూడు ప్రధాన వాదనలపై దృష్టిసారిస్తారు.కొన్ని సమయాల్లో ఒక్కోటీమ్‌ రెండు లేదా నాలుగింటిని ఉపయోగిస్తుంటాయి. తీర్మానాన్ని సమర్థించే జట్టు గెలుపొందాలంటే,అన్ని వ్యతిరేక వాదనలపై విజయం సాధించాల్సి ఉంటుంది. అదే సమయంలో అన్ని సమర్థించే వాదనలు నిలబడగలగాలి. డిబేట్లో అందించే అధిక సమాచారం ఈ వాదనలను సమర్థించే విధంగానో లేదా అవి గ్రహించే విధంగానో ఉంటాయి. సందర్భోచిత డిబేట్ చాలా వరకు పాలసీ డిబేట్‌ను పోలి ఉంటుంది. రెండింటి మధ్య ఒకే ఒక ప్రధానమైన తేడా ఏమిటంటే,తీర్మానాల అమలుకు సంబంధించి సందర్భోచిత వక్తృత్వము తక్కువగా దృష్టి సారిస్తుంది.

లింకన్‌-డగ్లస్‌ డిబేట్[మార్చు]

లింకన్‌-డగ్లస్‌ డిబేట్ అనేది ప్రాథమికంగా అమెరికాలోని హైస్కూలు వక్తృత్వము యొక్క స్వరూపంగా చెప్పవచ్చు(దీనికి కాలేజీ స్వరూపంగా ఉంది.దీన్నిఎన్‌ఎఫ్‌ఏ ఎల్‌డి అని అంటారు).1858లో లింకన్‌- డగ్లస్‌ మధ్య జరిగిన చర్చ అనంతరం దీనికి ఆ పేరు వచ్చింది.ముఖాముఖిగా సాగే ఈ చర్చలో తాత్విక సిద్ధాంతాలను వాస్తవిక సమస్యలను అనువర్తింప చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తారు. చర్చలో పాల్గొనే వారు రౌండ్లవారీగా తీర్మానాన్ని సమర్థిస్తే అంగీకరించడం, లేనిపక్షంలో వ్యతిరేకించినట్లయితే వాదనల ద్వారా దాడి చేస్తారు. తీర్మానాలు రెండునెలలకు ఒకసారి మారుతుంటాయి.నిర్ధిష్టమైన విధానం లేదా ప్రని నిర్ధిష్ట స్థాయిని చేరుకుందా లేదా అన్న దాన్ని ప్రశ్నిస్తారు.

పాలసీ డిబేట్ ప్రత్యామ్నాయమైనప్పటికీ,పాలసీ డిబేట్‌ ద్వారా రూపుదిద్దుకున్న కొన్ని టెక్నిక్స్‌ను విభేదించే బలమైన ఉద్యమాలు జరిగాయి.(సదృశ్యంగా, బలమైన ప్రతిస్పందన కలిగిన ఉద్యమం.) ప్లాన్‌, కౌంటర్‌ ప్లాన్‌, క్రిటికల్‌ థియరీ, పోస్టు మోడరన్‌ థియరీ, సిద్ధాంతపరంగా డిబేట్‌ మరియు క్రియాత్మకంగా ఉండే నిబంధనలు, ఇవన్నీ కూడా సార్వజనీకం కానప్పటికీ తరచుగా ఉపయోగించేవారు. సంప్రదాయ ఎల్‌-డి విధానం సంప్రదాయ పాలసీ డిబేట్‌ పదజాలం నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నించేంది. లింకన్‌-డగ్లస్‌ ప్రసంగాల్లో ఒక సాధారణ వేగం నుంచి నిమిషాలనికి 300 పదాల పైచిలుకు వేగంగా సాగుతాయి.( వాదనల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేర్చేందుకు,ప్రతివాదనలోనూ పెంచడానికి). ఈ టెక్నిక్‌ను స్పీడ్‌ అని అంటారు. ఆధారాలను ప్రకటించడానికి ప్రాధాన్యత పెరుగుతోంది.దీన్ని పాలసీ డిబేట్‌లో తక్కువగా చూడవచ్చు. ఈ ట్రెండ్స్‌ డిబేట్‌లో పాల్గొనే వారు,న్యాయమూర్తులు,కోచ్‌లు ఈ మార్పులకు దిశానిర్ధేశం చేసేవారు,అంగీకరించేవారు,వీటిని వ్యతిరేకించే వారి మధ్య తీవ్రమైన విభేదాలు పొడసూపుతాయి.

పాలసీ మరియు లింకన్ - డగ్లస్‌ డిబేట్‌లకు సంబంధించిన టోర్నమెంట్లు తరుచుగా ఒకేస్కూల్లో ఏకకాలంలో జరుగుతుంటాయి.

కార్ల్‌ పోపర్‌ డిబేట్[మార్చు]

కార్ల్‌ పోపర్‌ అనే ఫిలాసపర్‌ పేరిట దీనికి ఆ పేరు వచ్చింది.తూర్పు యూరోప్‌, సెంట్రల్‌ ఆసియాలో హైస్కూళ్లలో ఈ డిబేట్ విధానాన్ని విస్రృతంగా ఉపయోగిస్తారు. టీమ్‌ డిబేట్ విధానం మరింత సరళతరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఓపెన్‌ సొసైటీ ఇన్‌స్టిట్యూట్లు ఈ విధానాన్ని సృష్టించాయి.చాలామంది హైస్కూలు విద్యార్థులు నేర్చుకున్న మొదటి విధానం కావడంతో క్లార్‌పోపర్‌ డిబేట్ విధానానికి భారీగా ప్రజాదరణపొందింది. పొంతనగల మరియు పోరు సృషించే విధంగా ఉండే ప్రసంగాలపై దృష్టి సారిస్తుంది,విలక్షణంగా ఆలోచించే నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడాన్ని,వివిధ రకాల అభిప్రాయాలను విభేదించడంలో సహనం కనపరచడం వంటి అంశాలను ఉద్ఘాటిస్తుంది. ఈ లక్ష్యాల సాధనకు చర్చలో పాల్గోనేవారు మూడు టీమ్‌లుగా, ప్రతి అంశానికి సంబంధించి రెండు పక్కలా పరిశోధిస్తారు. లింకన్‌-డగ్టస్‌ డిబేట్‌ తరహాలోనే నిర్మితమైన ఈ డిబేట్‌ విధానంలో ప్రతి జట్టుకు వాదనలు చేయడానికి,ఎదుటి జట్టును ప్రశ్నించడానికి అవకాశాన్ని కల్పిస్తారు. ఇరుజట్ల నుంచి మొదటగా మాట్లాడే వ్యక్తులు ఆరునిమిషాల వ్యవధిలో తమ నిర్మాణాత్మక వాదనలు లేదా వ్యతిరేక వాదనల విషయానికి వస్తే వాటిని ఖండించడమో చేయాలి. మిగిలిన నలుగురికి ఐదేసి నిమిషాల సమయం కేటాయిస్తారు.ఈ సమయంలో తమ జట్టు యొక్క ప్రధాన వాదనలు బలపరిచే విధంగా వారు ప్రసంగించాల్సి ఉంటుంది. మొదటి నాలుగు ఉపన్యాసాల క్రాస్‌ ఎగ్జామినేషన్‌ జరిగిన తరువాత మరో మూడు నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు.ఈ సమయంలో ప్రత్యర్థి జట్టు అంతకు ముందు ప్రసంగించిన విషయాలకు సంబంధించి వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది.

ప్రతి ఏడాది ఇంటర్నేషనల్‌ డిబేట్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ యాన్యువల్‌ యూత్‌ ఫోరాన్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా కార్ల్‌ పోపర్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన వారు ఈ ఫోరం తరఫున జరిగే టోర్నమెంట్‌, అదేవిధంగా రెండువారాల పాటు సాగే డిబేట్‌ ట్రైనింగ్‌ కార్యక్రమాల్లో పాల్గంటారు.

చట్టసభల అనుకరణ[మార్చు]

హైస్కూలు డిబేట్‌ కార్యక్రమాలైన స్టూడెంట్‌ కాంగ్రెస్‌,మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌,యూరోపియన్‌ యూత్‌ పార్లమెంట్‌,జూనియర్‌ స్టేట్‌ ఆఫ్‌ అమెరికా మరియు అమెరికా లింగోస్‌బాయిస్‌ స్టేట్‌ మరియు గర్ల్స్‌ స్టేట్‌ వంటి కార్యక్రమాలన్నీ కూడా చట్టసభల వాతావరణం యొక్క నకలును అభినయించడాన్ని పూర్వసిద్ధాంతంగా చేసుకొని రూపుదిద్దుకున్నవే.

ఆశువుగా సాగే చర్చ[మార్చు]

ఎంతో ఉన్నతమైన నిర్మాణాత్మక రూపంలో ఉండే ఇతర డిబేట్‌తో పోలిస్తే ఆశువుగా సాగే డిబేట్‌ అనియత శైలిని కలిగిందని చెప్పవచ్చు. చర్చకు సంబంధించిన విషయాన్ని చర్చకు ముందు పదిహేను లేదా ఇరవై నిమిషాల ముందు ఇస్తారు. డిబేట్‌ ప్రక్రియ ఎంతో సులభంగా ఉంటుంది.ఇరు జట్లకు సంబంధించిన ఒక్కొక్క సభ్యుడు ఐదేసి నిమిషాల పాటు మాట్లాడతారు. మొత్తం పదినిమిషాల చర్చా సమయం,ఆ తరువాత ఇతర డిబేట్‌ పద్ధతుల తరహాలోఓపెన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ఉంటుంది.దీని తరువాత ఐదు నిమిషాల విరామం ఉంటుంది.(దీన్ని ఇతర విధానాల్లో ఉండే ప్రిపరేషన్‌ టైమ్‌తో పోల్చవచ్చు). బ్రేక్‌ తరువాత ఇరు జట్లకు నాలుగు నిమిషాల ఖండన సమయం ఉంటుంది.

మూట్‌ కోర్టు మరియు మాక్‌ ట్రయిల్‌[మార్చు]

యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఇంగ్లిష్‌ మాట్లాడే యూనియన్‌ నేషనల్‌ మూటింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌ను నిర్వహిస్తుంది.

పబ్లిక్‌ ఫోరమ్‌(పోవో) డిబేట్‌[మార్చు]

పాలసీ డిబేట్‌ మరియు లింకన్‌ా డంగ్లస్‌ డిబేట్‌ యొక్క కలయిక వల్ల ఏర్పడిందే పబ్లిక్‌ ఫోరం డిబేట్‌. చర్చలో పాల్గనే ఇరువురి మధ్య అన్యోన్యతను కల్పించే విధంగా సుదీర్ఘ సమయం పాటు తక్కువ వ్యవధిప్రసంగాలు సాగుతాయి.వీటిని క్రాస్‌ఫైర్స్‌ అంటారు ఈ విధానాన్ని నేషనల్‌ ఫోర్సెనిక్‌ లీగ్‌ అమెరికాలోని హైస్కూలు డిబేట్‌లో ప్రవేశపెట్టింది. తార్కికంగా అనునయించడం(సరైన ఆధారం ద్వారా మద్ధతు) వాస్తవికమైన వాదనలు, మాట్లాడే సామర్థ్యాన్ని పెంచడం వంటి వాటి ద్వారా, అటు చర్చలో పాల్గొనే వారికి, ఆడియన్స్‌కు సులభంగా అందుబాటులో ఉండటంతో ఒక విస్ఫోటనంలా దీనికి ప్రజాదరణ లభించింది.

పారిస్‌ స్టైల్‌ డిబేటింగ్‌[మార్చు]

ఇది ఓ కొత్త, ప్రత్యేక ఫ్రెంచ్‌ ఫార్మెట్‌. రెండు జట్లలో ఐదుగురేసి మంది నిర్ధేశించిన తీర్మానంపై చర్చలో పాల్గంటారు. ఒక పక్కవారు తీర్మానానికి కాపాడాల్సి ఉండగా,మరొకరు దాన్ని తప్పక ఓడించాల్సి ఉంటుంది. వాదప్రతివాదనల్లో పస,వాక్ఫటిమ,మాట్లాడే వ్యక్తి యొక్క జనాకర్షణ,వాతావరణాన్ని ఆహ్లాదపరిచే హాస్యధోరణి,వ్యక్తిగతంగా ఆలోచించే సామర్థ్యం,వీటన్నింటినీ మించి టీమ్‌వర్క్‌ను ఆధారంగా చేసుకొని చర్చయొక్క స్థాయిని నిర్ధారిస్తారు.

ముందుగా మాట్లాడే వ్యక్తి( ప్రధానమంత్రి) చర్చను ప్రారంభిస్తాడు.ఆ తరువాత ఎదుటి టీమ్‌లోని వ్యక్తి( షాడో ప్రధానమంత్రి) చర్చను కొనసాగిస్తాడు.వీరి తరువాత రెండో ప్రసంగీకుడు, ఇలా సాగిపోతుంది.

ప్రతి ప్రసంగీకుడు ఆరునిమిషాల పాటు మాట్లాడతాడు. మొదటి నిమిషం గడిచిన తరువాత చివరి నిమిషానికి ముందు వరకు ప్రత్యర్థి జట్టులోని వారు అదనపు సమాచారం ఇవ్వాలని కోరవచ్చు.అయితే ప్రసంగీకుడు వీటిని అంగీకరించవచ్చు,లేదా తిరస్కరించవచ్చు(అయితే కనీసం రెండింటిని అంగీకరించాల్సి ఉంటుంది).

[1] ఫ్రెంచ్‌ డిబేటింగ్‌ అసోసియేషన్‌,ఈ తరహాలోనే తమ నేషనల్‌ డిబేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తూ ఉంటుంది.

ఇతర రకాల డిబేట్లు[మార్చు]

ఆన్‌లైన్‌ డిబేటింగ్‌[మార్చు]

ఇంటర్నెట్‌ లభ్యత, వాడకం పెరగడంతో వివిధ రకాల అభిప్రాయాలు క్రమం తప్పకుండా వ్యక్తమవుతుంటాయి. వీటిలో కొన్ని అతివర్ణనలతో కూడినవి,ప్రాథమికంగా ఒక విషయాన్ని వక్కాణించేవిగా ఉంటాయి. ఇవి డిబెట్‌లను నిర్వహించే కొన్ని వెబ్‌సైట్లలో ఆన్‌లైన్‌ ఫోరమ్‌లు లేదా బులెటిన్‌ బోర్డుల రూపంలో కనిపిస్తాయి సమయానికి సంబంధించి ఎలాంటి నియమాలు లేకపోవడం వల్ల (వాస్తవంగా సమయం నియమం అనువర్తించినప్పటికీ,రెండు పోస్టుల మధ్య కాలవ్యవధి ఐదురోజులు మించకుండా ఉండటం) ఈ చర్చా విధానం ఆసక్తికరంగా ఉంటుంది. పరిశోధనతోపాటు బాగా తెలిసిన విషయాలు, వాటికి కౌంటర్‌పాయింట్లు కనిపిస్తాయి.ఫోరమ్స్‌ ఆన్‌లైన్‌లో డిబేట్‌లో పాల్గనేవారిని ఆహ్వానిస్తూ, స్నేహపూరిత విధానంలో డిబేట్‌ జరిగేవిధంగా అనుసంధానకర్తగా వ్యవహరిస్తాయి. ఫలితంగా విషయానికి సంబంధించిన తప్పొప్పుల గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. చాలా మంది దీన్ని ఉపయోగించుకొని తమ వాదనలను బలోపేతం చేసుకోవడం, బలహీనమైన అభిప్రాయాలను విసర్జించడం చేస్తుంటారు. చాలా సందర్భాల్లో సంప్రదాయ డిబేట్‌ విధానంలో(పైన పేర్కొన్న విధంగా స్నేహితులతో సరదాగానూ వాదించవచ్చు. ఉపయోగించడంలో సులభతరం కావడం,స్నేహపూరిత వాతావరణం కారణంగా కొత్తగా చర్చలో పాల్గోనేవారు రావదానికి, వారు తమ అభిప్రాయాలను చాలా వర్గాలతో పంచుకునే అవకాశం ఉంటుంది.

డిబేట్‌ పరంగా ఆన్‌లైన్‌ డిబేట్‌ వెబ్‌సైట్‌ను ఇంటర్నేషనల్‌ డిబేట్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ కలయికతో రూపొందించారు. తొలి ఆన్‌లైన్‌ డిబేట్‌ పోటీల్లో లిథువేనియా విజయం సాధించింది.

అమెరికా అధ్యక్ష డిబేట్స్‌[మార్చు]

1976 సార్వత్రిక ఎన్నికల నుంచి అధ్యక్ష పదవికి పోటీ పడే అభ్యర్థుల మధ్య చర్చ నిర్వహించడం అనేది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగమైంది. హైస్కూలు లేదా కాలేజీ స్థాయిలో నిర్వహించే డిబేట్ల తరహాలో అభ్యర్థుల ఎంపిక, చర్చ జరిగే విధానం,నియమనిబంధనల్ని ఇందులో సర్వస్వతంత్రంగా నిర్వచించలేరు. ఎన్నికల ప్రచారంలో టెలివిజన్‌ అడ్వర్టైజ్‌మెంట్లు,టాక్‌ రేడియో,సౌండ్‌ బైట్లతో హెరెత్తుతుంటుంది. అయినప్పటికీ, ప్రధాన ప్రత్యర్థులు పక్కపక్కన నిలబడి, వివిధ అంశాలపై చర్చించే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తారు. ప్రతి ఎన్నికల్లో అధ్యక్ష డిబేట్‌కు సంబంధించి నిర్వచన మారుతుంటుంది.సంప్రదాదాయ పద్ధతులకు భిన్నంగా, ఇది నియంత్రించబడినట్లు ఉంటుంది.ప్రత్యర్థులపై ప్రశ్నలను సంధించడం,ప్రత్యేకించి ఒక అంశానికి సంబంధించిన చర్చనిర్ధిష్ట సమయానికి మాత్రమే పరిమితం చేస్తుంటారు.

1976, 1980, 1984ల్లో జరిగిన అధ్యక్ష చర్చకు సంబంధించి ద లీగ్‌ ఆఫ్‌ ఉమన్‌ ఓటర్స్‌ సంధానకర్తగా వ్యవహరించింది.కానీ 1987లో డెమక్రాటిక్‌ మరియు రిపబ్లికన్‌ పార్టీలు ద కమిషన్‌ ఆన్‌ ప్రెసిడెంటల్‌ డిబేట్స్‌(సీపీడీ)ని ఏర్పాటు చేశాయి. అమెరికా అధ్యక్ష, ఉపాధ్య్ష అభ్యర్థుల మధ్య జరిగే చర్చలను నిర్వహించడం, వాటిని స్పాన్సర్‌ చేయడం,పరిశోధనను చేపట్టడం, డిబేట్‌కు సంబంధించిన అన్నిరకాల విద్యాకార్యక్రమాలను చేపట్టడం వంటి కార్యక్రమాలను ఇది చేపడుతుంది. లాభాపేక్ష లేకుండా, ఇరువర్గాలకు సమానంగా సహకారం అందించే ఈ సంస్థ 1988,1992,1996,2000,2004ల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల చర్చను స్పాన్సర్‌ చేసింది.

డిబేట్లను స్పాన్సర్‌ చేయడం నుంచి ఉపసంహరించుకున్న ద లీగ్‌ ఆఫ్‌ ఉమన్‌ ఓటర్స్‌ తాను ఉపసంహరించుకోవడానికి గల కారణాలను ఈ విధంగా పేర్కొంది. 'రెండుపక్షాలకు చెందిన ప్రచారనిర్వాహకుల డిమాండ్లు నేరారూపంగా ఉండటంతోపాటు అమెరికన్‌ ఓటర్లను మోసగించే విధంగా ఉన్నాయి'అనిపేర్కొంది. 2004లో అధ్యక్ష చర్చలను స్వతంత్రంగా నిర్వహించే సిటిజన్‌ డిబేట్‌ కమిషన్‌ ఏర్పాటైంది.డిబేట్‌లో పాల్గనేవారు,డిబేట్‌ విధానం, ఇతర నియమనిబంధనలకు సంబంధించి ఈ కమిషన్‌ చేసిన నిర్వచనాల ఆధారంగా ఇది ఓటర్‌వైపు మొగ్గు చూపుతుందని చెప్పవచ్చు.

కామెడీ డిబేట్‌[మార్చు]

సామాన్య ప్రజానీకంలో డిబేట్లకు సంబంధించి ఆసక్తి పెరగడంతో,వినోదం అందించడానికి,కొన్ని సమయాల్లో విద్యాపరమైన ట్విస్టుతో కామెడీ డిబేట్లు అభివృద్ధి చెందాయి. కామెడీ డిబేట్లు ప్రధాన స్రవంతికి చెందిన కార్యక్రమాలు కానప్పటికీ, మెల్‌బోర్న్‌ ఇంటర్నేషనల్‌ కామెడీ ఫెస్టివల్‌ వంటి వాటిలో వీటికి చక్కటి ఆదరణ లభించింది.ఇందులో అనుభవం సాధించైనవారు పాపులర్‌ అవుతున్నారు.

అన్నిరకాల డిబేట్లు కూడా ఉద్ధేశ్యపూర్వకంగానో,యాదృచ్ఛికంగానో,వాదనా సిద్ధాంతానికి సంబంధించి కొన్ని రకాల ఊహాలకు అకాశాన్ని ఇస్తాయి. వాదించడం అనే తలంపే,వాదనా సిద్ధాంతం యొక్క కీలక భావనగా చెప్పవచ్చు. చాలా సందర్భాల్లో, డిబేట్‌లో పల్గోనీ పాల్గనే ఒక వర్గమైనా ఓ మేరకు సత్యాన్ని మాట్లాడటం లేదా వ్యక్తిగత లేదా రాజకీయ మార్పు లేదా ప్రక్రియకు సమర్థించాల్సి ఉంటుంది. చర్చ అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ మంది పోటీపడేవారి ప్రసంగాలు లేదా వారి చర్యగా అభివర్ణించవచ్చు. డిబేట్‌ అనేది కేవలం జనాకర్షణ, భావోద్వేగాలతో ఎటువంటి పక్షవాదనలు లేకుండా సాగే ఓ ఎక్సర్‌సైజ్‌ వంటిదని చెప్పవచ్చు. కానీ ఇది తన యొక్క సంబంధాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
ఇంటర్నేషనల్‌ హైస్కూలు డిబేటింగ్‌
ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ డిబేటింగ్‌

సూచనలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

డిబేటింగ్‌ గురించి తెలుసుకోవడానికి వెబ్‌ టెస్టు పుస్తకాలు
  • కోషి మరియు హాల్వర్‌సన్స్‌(ఎల్‌డి)NFLonline.org
  • క్విన్‌Learndebating.com
  • స్నిడర్‌UVM.edu
  • స్లోబాల్‌Fullerton.edu
  • ముస్లింక్రిస్టియన్‌ డిబేట్‌MCDebate.com
  • ద అన్‌రిటెన్‌ రూల్స్‌ ఆఫ్‌ పాలసీ డిబేట్‌[1]
  • డిబేటింగ్‌ ఫోరమ్స్‌[2]
  • డిక్షనరీ ఆఫ్‌ పాలసీ డిబేట్‌ టర్మ్స్‌[3]
"https://te.wikipedia.org/w/index.php?title=డిబేట్&oldid=2804203" నుండి వెలికితీశారు