డిబ్రుఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | ||||
స్థితి | నడుస్తోంది | ||||
స్థానికత | అసోం, నాగాలాండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ | ||||
ప్రస్తుతం నడిపేవారు | ఈశాన్య సరిహద్దు రైల్వే | ||||
మార్గం | |||||
మొదలు | డిబ్రూగఢ్ (DBRG) | ||||
ఆగే స్టేషనులు | 57 | ||||
గమ్యం | కన్యాకుమారి (CAPE) | ||||
ప్రయాణ దూరం | 4233 km | ||||
సగటు ప్రయాణ సమయం | 80గం 15ని | ||||
రైలు నడిచే విధం | ప్రతి శనివారం | ||||
రైలు సంఖ్య(లు) | 15905/15906 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | Second AC Third AC Sleeper | ||||
ఆహార సదుపాయాలు | ఉంది | ||||
సాంకేతికత | |||||
రోలింగ్ స్టాక్ | Loco: WAP-4 | ||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
విద్యుతీకరణ | Yes | ||||
వేగం | 50.4 km/h (31.3 mph) | ||||
|
డిబ్రూగఢ్ కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు నడుపుతున్న రైలు. ఇది ఈశాన్య భారతదేశం, అస్సాంలోని డిబ్రూగఢ్ నుండి ద్వీపకల్పం దక్షిణ కొన వద్ద ఉన్న కన్యాకుమారి వరకు ఈ రైలు 4233 కిలోమీటర్ల దూరాన్ని 82 గంటల 30 నిమిషాలలో చేరుతుంది. వివేక్ ఎక్స్‌ప్రెస్ మొత్తం 7 రాష్ట్రాల్లో ప్రయాణిస్తోంది.[1] వివేక్ ఎక్స్‌ప్రెస్ భారతదేశములోనే అత్యదిక దూరం నడిచే, అత్యదిక ప్రయాణసమయం కలిగిన రైలు. ఈ రైలు సరాసరి వేగం 50.4 కి.మీ/గం. మొత్తం ఈ రైలు మొత్తం 57 స్టేషన్ల లో ఆగుతుంది.
చరిత్ర
[మార్చు]భారతీయ రైల్వే బడ్జెట్ 2011-12లో ఈ రైలును అప్పటి రైల్వేశాఖ మంత్రి మమతా బెనర్జీ స్వామి వివేకనందా 150వ జయంతి సందర్భంగా ప్రకటించారు.
మార్గం
[మార్చు]వివేక్ ఎక్స్‌ప్రెస్ ఈశాన్య భారతదేశములో గల అస్సాంలో గల డిబ్రూగఢ్ నుండి భారత ద్వీపకల్పానికి దక్షిణ దిక్కున గల చిట్టచివరి ప్రదేశము తమిళనాడు రాష్ట్రంలోని గల కన్యాకుమారి వరుకు ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ రైలు అస్సాంలో మొదటి రోజు రాత్రి 10 గంటల 45 నిమిషాలకు 15906 నెంబరుతో బయలుదేరి అయిదవ రోజు ఉదయం 9 గంటల 50 నిమిషాలకు కన్యాకుమారి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 15905 నెంబరుతో రాత్రి 11 గంటలకు బయలుదేరి అయిదవ రోజు ఉదయం 07 గంటల 15 నిమిషాలకు డిబ్రూగఢ్ చేరుకుంటుంది. ఈ రైలు అస్సాం, నాగాలాండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఈ రైలు ఈశాన్య, తూర్పు, దక్షిణ భారతదేశాల్లో ముఖ్యమయిన రైల్వేస్టేషన్లయిన దిమాపూర్, గౌహతి, న్యూ జలపాయిగురి జంక్షన్, సిలిగురి, మల్దా, దుర్గాపూర్, అసన్సోల్, భువనేశ్వర్, బరంపురం రైల్వేస్టేషను, విజయనగరం రైల్వే స్టేషను, విశాఖపట్నం రైల్వే స్టేషను, రాజమండ్రి, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను, నెల్లూరు, రేణిగుంట జంక్షన్ రైల్వేస్టేషన్, కాట్పాడి, సేలం జంక్షన్, ఈరోడ్ జంక్షన్, కోయంబత్తూరు జంక్షన్, పాలక్కడ్ జంక్షన్, ఎర్నాకులం, తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ ల మీదుగా ప్రయాణిస్తుంది.
పెట్టెల అమరిక
[మార్చు]క్లాసిక్ స్లీపర్, మూడవ క్లాసు, రెండవ క్లాసు పెట్టెలు, అరక్షిత పెట్టెలు అందుబాటులో కలవు.