డిమ్ము బోర్‌గిర్
![]() | ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
Dimmu Borgir | |
---|---|
![]() Dimmu Borgir performing at 2008's Tuska Open Air Metal Festival. | |
వ్యక్తిగత సమాచారం | |
మూలం | Oslo, Norway |
రంగం | Melodic black metal Symphonic black metal |
క్రియాశీల కాలం | 1993 – present |
లేబుళ్ళు | No Colours (1993–1994) Cacophonous/Century Media (1995–1997) Nuclear Blast (1997–present) |
సంబంధిత చర్యలు | Old Man's Child, Cradle of Filth, Ov Hell, Carpe Tenebrum, Brujeria, The Kovenant, Mayhem, Arcturus, Chrome Division, Code, Susperia, Dødheimsgard, Nile, Borknagar, Nachtmystium, Ragnarok, Angelcorpse, God Dethroned, Vesania, Vader, Infernal Method |
వెబ్సైటు | www.dimmu-borgir.com |
సభ్యులు | Shagrath Silenoz Galder |
పూర్వపు సభ్యులు | Brynjard Tristan Stian Aarstad Nagash Tjodalv Astennu Nicholas Barker Mustis ICS Vortex |
డిమ్ము బోర్‌గిర్ (pronounced /ˌdɪmuː ˈbɔrɡɪər/ ఇంగ్లీషులో) ఓస్లో, నార్వేకి చెందిన నార్వేజియన్ సింపోనిక్ బ్లాక్ మెటల్ సంగీత బృందం, ఇది 1993లో స్థాపించబడింది. డిమ్ము బోర్‌గిర్ అంటే ఫెరోస్ మరియు ఓల్డ్ నోర్స్ ద్వీపానికి చెందిన "చీకటి నగరాలు" లేదా "చీకటి భవంతులు/కోటలు" అని అర్థం. డిమ్ముబోర్‌గిర్ ద్వీపంలోని అగ్నిపర్వత రూపం నుండి ఈ పదం పుట్టింది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ సంగీత బృందం కూర్పులో పలు మార్పులు సంతరించుకున్నాయి; గిటారిస్ట్ సిలెనోజ్ మరియు గాయకుడు షాగ్రాత్ మాత్రమే ఈ బృందంలో ఇప్పటికీ మిగిలి ఉన్న వ్యవస్థాపక సభ్యులు.
విషయ సూచిక
జీవితచరిత్ర[మార్చు]
ఫర్ ఆల్ టిడ్ అండ్ స్ట్రామ్‌బ్లాస్ట్ కాలం[మార్చు]
డిమ్ము బోర్‌గిర్ 1993లో ఒక బ్లాక్ మెటల్ సంగీత బృందంగా ప్రారంభించబడింది. షాగ్రాత్, సిలెనోజ్, మరియు జోడాల్వ్‌లు స్థాపించిన ఈ సంగీత బృందం 1994లో Inn i evighetens mørke (ఇంగ్లీషులో "శాశ్వత అంధకారం లోకి" అని అర్థం) అనే పేరుతో ఒక EPని విడుదల చేసింది. చిన్న పరిమాణంలోని EP వారాలలోపే అమ్ముడయిపోయింది, తర్వాత ఈ బృందం పూర్తి స్థాయి సంగీత ఆల్బమ్ ఫర్ ఆల్ టిడ్ ('ఇంగ్లీషులో 'అన్ని కాలాల కోసం')ని 1994లో విడుదల చేసింది. ఈ ఆల్బమ్‌కి వెడ్ బ్యూన్స్ ఎండె మరియు డోదైమ్స్‌గార్డ్‌కి చెందిన వికోట్నిక్ మరియు డోదైమ్స్‌గార్డ్‌కి చెందిన అల్డ్రాన్ మరియు జైక్లోన్-బిలు గాత్ర సహకారం ఇచ్చారు. ప్రారంభంలో ఈ బృందంలో షాగ్రాత్ డ్రమ్‌లను వాయించగా, జోడాల్వ్ గిటార్‌ను వాయించాడు, సిలెనోజ్ ప్రధాన గాయకుడిగా వ్యవహరించారు. 1996లో కాకోఫోనోస్ రికార్డ్స్‌పై స్టార్మ్‌బ్లాస్ట్ ("స్టార్మ్ బ్లోన్" అని అనువదించారు) విడుదల చేయడానికి ముందు ఈ బృందం కూర్పులో మార్పులు వచ్చాయి. ఈ అల్బమ్‌ని అనేకమంది అత్యుత్తమమైనదిగా గుర్తించారు.[1] ఇది అన్ని పాటలు నార్వేజియన్ భాషలో రాసి, పాడిన చివరి ఆల్బమ్.
అధికారిక అంధకారం విజయం పొందిన కాలం[మార్చు]
స్ట్రామ్‌బ్లాస్ట్ తర్వాత, నార్వేజియన్ సైన్యంలో చేరే లక్ష్యంతో కీబోర్డ్ ప్లేయర్ స్టెయిన్ అర్‌స్టాడ్ ఈ బృందాన్ని వదిలిపెట్టాడు, దీంతో ఇతడు 1996లో రికార్డు చేసిన డెవిల్స్ పాత్లో పాలు పంచుకోలేకపోయాడు. ఈ కాలంలోనే బృందంలోని బాసిస్ట్ బ్రింజార్డ్ ట్రిస్టిన్ తప్పుకోగా, నగాష్ వచ్చి చేరాడు. 1997లో అధికారిక అంధకారం విజయం పొందింది ఆల్బమ్ రికార్డింగ్ కోసం స్టెయిన్ అర్‌స్టాడ్ బృందంలోకి తిరిగొచ్చాడు. ఆల్బమ్‌కి మద్దతుగా పర్యటనలో ఉండగా, రిహార్సల్స్‌కి హాజరు కావడం మరియు పర్యటనలో కొనసాగడంలో చిక్కులు సృష్టించడంతో అతడిపై విరుచుకుపడ్డారు.[2] అధికారిక అంధకారం విజయం పొందింది ఈ బృందానికి భారీ విజయాన్నే తెచ్చిపెట్టింది మరియు ఇది జర్మన్ రికార్డ్ లేబుల్ అయిన న్యూక్లియర్ బ్లాస్ట్ కోసం కుదుర్చుకున్న మొట్టమొదటి ఆల్బమ్. ఈ ఆల్బమ్ హిపోక్రసీ' యొక్క ఫ్రంట్‌మన్ టాట్‌గ్రెన్ యాజమాన్యంలోని అబ్బీస్ స్టూడియోస్‌లో రికార్డ్ చేయబడింది.[3]
స్పిరిచువల్ బ్లాక్ డైమెన్షన్స్ మరియు ప్యూరిటానికల్ యుఫోరిక్ మిసాంథ్రోపియా కాలం[మార్చు]
అధికారిక అంధకారం విజయం పొందింది పర్యటన తర్వాత ఈ బృందం కొత్త సభ్యులుగా కీబోర్డ్‌పై మ్యుస్టిస్ మరియు ప్రధాన గిటారిస్టుగా ఎస్టెన్నును నియమించుకుంది. డిమ్ము బోర్‌గిర్ 1999లో స్పిరిచువల్ బ్లాగ్ డైమెన్షన్స్ మరియు 2001లో ప్యూరిటానికల్ యుఫోరిక్ మిసాంథ్రోపియా అనే పూర్తి స్థాయి ఆల్బమ్‌లను రూపొందించింది, ఈ రెండూ విమర్శకుల ప్రశంసలు పొందాయి.[4][5][6] అయితే, ఈ రెండు ఆల్బమ్‌లను రూపొందిస్తున్న మధ్య కాలంలో బృందం కూర్పులో మరొక మార్పు చోటు చేసుకుంది; నగాష్ వైదొలగగా, అతడి స్థానంలో కొత్త బాసిస్ట్/సింగర్ ICS వోర్టెక్స్ వచ్చి చేరాడు, ఇక కుటుంబ కారణాల వల్ల జోడాల్వ్ బృందంలోంచి తప్పుకున్నాడు, తదుపరి బాండ్ సస్పేరియా,[7]ను ఏర్పర్చడానికి ఇతడి స్థానంలో క్రెడిల్ ఆఫ్ ఫెయిత్‌కి చెందిన నికోలస్ బార్కర్‌ని బృందంలో చేర్చుకున్నారు. ఎస్టెన్ను తన గిటార్ విధి నిర్వహణకు సంబంధించి తీవ్ర విమర్శలకు గురయ్యాడు.
డెత్ కల్ట్ ఆర్మగెడాన్ మరియు స్టార్మ్‌బ్లాస్ట్ MMV కాలం[మార్చు]
తమ తదుపరి ఆల్బమ్ రాబోతోందని MTV2 మరియు ఫ్యూజ్ TVలలో నిత్యం వీడియో ప్లే చేస్తున్నప్పటికీ, ఈ బృందం తమకు వ్యాపార దృక్పథం లేదని ప్రకటించింది. అందుకు భిన్నంగా, వారు తమ సందేశాన్ని మరింతమంది ప్రజలవద్దకు తీసుకుపోవాలని భావించారు'.[8] 2003లో, డిమ్ము బోర్‌గిర్ డెత్ కల్ట్ ఆర్మగెడాన్ని రికార్డ్ చేసింది. డెత్ కల్ట్ ఆర్మగెడాన్ ని ప్రేగ్ ఫిలార్మనిక్ ఆర్కెస్ట్రాతో రికార్డ్ చేశారు, దీనిని ఆడమ్ క్లెమెన్స్ నిర్వహించారు. అందరు ఆర్కెస్ట్రేషన్‌లను గాట్ స్టోరాస్ ద్వారా నియమించుకున్నారు (ఇతడు గతంలో ప్యూరిటానికల్ యుఫోరిక్ మిసాంథ్రోపియా ఆల్బమ్‌కోసం డిమ్ము బోర్‌గిర్‌తో పనిచేసాడు) 2004లో, డిమ్ము బోర్‌గిర్ ఒజ్జ్‌ఫెస్ట్ వద్ద గల ప్రధాన వేదికపై ప్రదర్శించబడింది.
2005లో, ఈ బృందం స్ట్రామ్‌బ్లాస్ట్ ఆల్బమ్‌ని పూర్తిగా రీ రికార్డింగ్ చేసింది, దీంట్లో మేహెమ్ ఫేమ్ హెల్‌హామర్ సీనియర్ డ్రమ్మర్‌గా వ్యవహరించాడు. ఈ ఆల్బమ్ కూడా 2004లో {1}ఒజ్జ్‌ఫెస్ట్{/1} టూర్ నుంచి లైవ్ ప్రదర్శనతో డివిడిని ప్రదర్శించింది.
ఇన్ సోర్టె డయబోలి కాలం[మార్చు]
డిమ్ము బోర్‌గిర్ సరికొత్త ఆల్బమ్ ఇన్ సోర్టె డయబోలి 2007 ఏప్రిల్ 24న విడుదలయింది. డివిడిని కలిగిన బాక్స్‌డ్ కేస్‌లో, వెనుక వైపు ప్రింట్ చేసిన పాటలతో, ఒక అద్దంతో ఒక ప్రత్యేక వెర్షన్ విడుదల చేయబడింది. 2007 ఫిబ్రవరి 14న ఆల్బమ్ కోసం ప్రమోషనల్ వెబ్‌పేజ్‌లో ఆల్బమ్ ఆర్ట్‌వర్క్ విడుదల చేయబడింది. ఈ ఆల్బమ్ మేహెమ్కి చెందిన "హెల్‌హామర్" జాన్ ఆక్సెల్ బ్లోమ్‌బెర్గ్ డ్రమ్మింగ్‌ని కలిగి ఉంది. మెడకు గాయం తగిలిన కారణంగా కుడి చేయి పనిచేయపోవడంతో బ్లోమ్‌బెర్గ్ 2007లో టూర్ మధ్యలోనే ఈ సంగీత బృందాన్ని వదిలి వెళ్లాడు. ఈ ఆల్బమ్ విడుదలతో, డిమ్ము బోర్‌గిర్ మొట్టమొదటి బ్లాక్ మెటల్ బాండ్ అయింది, స్వదేశంలో ఇది నంబర్ వన్ బాండ్‌గా నిలిచింది.[9]
2009లో, ICS వోర్టెక్స్ మరియు ముస్టిస్ సభ్యులు విడివిడిగా డిమ్ము బోర్‌గిర్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు. బాండ్‌లో తనకు తగిన విలువ లేదని పేర్కొంటూ, ముస్టిస్ ఒక ప్రకటన చేశాడు, ఈ బృందం సంగీతంలో తన రాతపూర్వక చేర్పుకు తగిన విధంగా గుర్తింపును కల్పించలేదని, దీనిపై తాను చట్టపరంగా చర్య తీసుకోబోతున్నట్లు ప్రకటించాడు.[10]
డిమ్ము బోర్‌గిర్ ఈ ఇద్దరిని బాండ్ నుంచి తొలగిస్తున్నట్లు త్వరలోనే ప్రకటించింది, ఈ ఇద్దరూ ఎందుకు తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారో వివరిస్తూ ప్రకటన కూడా విడుదల చేసింది.[11] షాగ్రాత్, సిలెనోజ్, మరియు గాల్డర్ రాశారు, "తమాషాగా, ఈ ఇద్దరూ రాసిన వాటిని పొందుపర్చకుండానే బృందంలోని మిగిలిన వారు రాసిన రచనలతో కొత్త ఆల్బమ్ ఎలా సగంవరకు ముగిసిందో ఈనాటికీ మాకు గుర్తుండిపోయంది."[11]
అబ్రహదబ్ర[మార్చు]
డిమ్ము బోర్‌గిర్ తొమ్మిదవ స్టూడియో ఆల్బమ్ అబ్రహదబ్ర 2010 సెప్టెంబరు 24న జర్మనీలో, 2010 సెప్టెంబరు 27న తక్కిన ఐరోపాలో, అక్టోబరు 12న ఉత్తర అమెరికాలో విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది.[12] సిలెనోజ్ ఈ విషయమై వివరిస్తూ, ఆల్బమ్‌ల మధ్య కాలంలో పెరుగుతున్న వ్యవధి వల్ల తమ బృందం పర్యటనల కాలంలో సంగీతం రాయడం నిలిపివేసిందని, దీంతో సంగీతం నాణ్యత దెబ్బతినిందని చెప్పాడు. కొత్త ఆల్బమ్ కొత్త కొత్త గాను మరియు దానికోసం చెవికోసుకనే విధంగాను ఉందని అతడు వర్ణించాడు, దీంట్లోని వస్తువు కావ్య స్ఫూర్తితో కీలకమైనదిగా ఉంటుందని చక్కటి వాతావరణంతో తయారయిందని పేర్కొన్నాడు. షాగ్రాత్ తిరిగి కీబోర్డు విధుల్లో చేరాడనే ప్రకటనతో ఒక ప్రమోషనల్ ఇమేజ్ విడుదల చేయబడింది.[13] ఈ ఆల్బమ్ సామూహిక ఆర్కెస్ట్రా Kringkastingsorkestret (నార్వేజియన్ రేడియో ఆర్కెస్ట్రా)ను కలిగి ఉంది, దీంతో పాటు దాదాపు వందమంది కంటే ఎక్కువ మంది సంగీతకారులు మరియు గాయకులతో కూడిన సికోలా కాంటోరియం కోయిర్‌ను కూడా కలిగి ఉంది.
ఆర్కెస్ట్రా ఏర్పాట్ల కంపోజర్ గాటె స్టోరాస్, ఈ ఆల్బమ్‌లో తన పాత్ర గురంచి ఒక ప్రకటనను విడుదల చేశాడు. వారి సంగీతం ప్రారంభం నుంచి కావ్య స్థాయిలో మెలోడిక్‌గా, సింపోనిక్ స్వభావంతో ఉంటుంది; వారు కంపోజింగ్ పట్ల చాలా స్పష్టమైన ఆర్కెస్ట్రా వైఖరిని కలిగి ఉన్నారు. వారి థీమ్‌లను వింటూ రాస్తున్నట్లుగా ఒక్కోసారి నా పాత్ర ఉంటూ వచ్చింది, కొన్ని సార్లు వారి ఆలోచనలను స్వీకరించాను, వాటిని విడగొట్టి బాండ్ ఉద్దేశాలకు అనుగుణమైన మార్గాల్లో వాటిని పునర్నిర్మించాము. ఈ ఆల్బమ్ సంగీతం ఆసక్తికరంగాను సంగీత కారులు ప్లే చేయదగిన విధంగాను ఉంటుంది, ఆర్కెస్ట్రా ప్రపంచం కోరుకునే నాణ్యతా ప్రమాణాలతో ఉంటుందనే ఆశించవచ్చు.”
జూలై 8న ఈ సంగీత బృందం రాబోయే ఆల్బమ్ "అబ్రహదబ్ర", మరియు ప్రపంచ పర్యటనలో బాసిస్ట్/క్లీన్ వోకలిస్టు ICS వోర్టెక్స్ స్థానంలో స్వీడిష్ మల్టీ ఇన్‌స్ట్రుమెంటలిస్ట్ స్నోవీ షా (థెరియన్, డ్రీమ్ ఈవిల్)ని చేర్చుకున్నామని నిర్ధారించింది.[14] ఆగస్టు 25న థెరియోన్‌లో తిరిగి చేరడానికి గాను స్నోవీ షా డిమ్ము బోర్‌గిర్‌ను వదిలి వేసినట్లు ప్రకటించాడు.[15] 2010 సెప్టెంబరు 17న డిమ్ము బోర్‌గిర్ తమ రాబోయే ఆల్బమ్ అబ్రహదబ్ర నుంచి "బోర్న్ ట్రెకోరస్" పాటను తమ అధికారిక మైస్పేస్ పేజీలో విడుదల చేసింది.
డిస్కోగ్రఫీ[మార్చు]
- ఫర్ ఆల్ టిడ్ (1994)
- స్ట్రామ్‌బ్లాస్ట్ (1996)
- అధికారిక అంథకారం విజయం పొందింది (1997)
- స్పిరిచువల్ బ్లాక్ డైమెన్షన్స్ (1999)
- ప్యూరిటానికల్ యుపోరిక్ మిసాంథ్రోపియా (2001)
- డెత్ కల్ట్ ఆర్మగెడాన్ (2003)
- స్ట్రామ్‌బ్లాస్ట్ MMV (2005)
- ఇన్ సార్టె డయహబోలి (2007)
- అబ్రహదబ్ర (2010)
బృంద సభ్యులు[మార్చు]
మాజీ పూర్తి-కాల సభ్యులు[మార్చు]
మాజీ సెషన్ సభ్యులు[మార్చు]
మాజీ లైవ్ సభ్యులు[మార్చు]
అతిథులు[మార్చు]
ఆల్ టిడ్"
ఆర్మగడాన్"
సంవత్సరం వారీగా సభ్యులు[మార్చు]
ఆల్బమ్ ద్వారా సభ్యులు[మార్చు]
సూచనలు[మార్చు]
బాహ్య లింకులు[మార్చు]
|