Jump to content

డియోనాథ్ యాదవ్

వికీపీడియా నుండి
జై ప్రకాష్ యాదవ్

పదవీ కాలం
2005 – 2010
ముందు రామ్ కుమార్ యాదవ్
తరువాత గుల్జర్ దేవి యాదవ్
పదవీ కాలం
1995 – 2000
ముందు రామ్ కుమార్ యాదవ్
తరువాత రామ్ కుమార్ యాదవ్
నియోజకవర్గం ఫుల్పరస్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ సమాజ్ వాదీ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

డియోనాథ్ యాదవ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు ఫుల్పరస్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

డియోనాథ్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1990 బీహార్ శాసనసభ ఎన్నికలలో ఫుల్పరస్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ అభ్యర్థి రామ్ కుమార్ యాదవ్ చేతిలో 5,157 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 1995 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీయూ అభ్యర్థి రామ్ కుమార్ యాదవ్‌పై 3,344 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

డియోనాథ్ యాదవ్ ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీలో చేరి 2000 శాసనసభ ఎన్నికలలో ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీయూ అభ్యర్థి రామ్ కుమార్ యాదవ్‌ చేతిలో 6,008 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2005 బీహార్ శాసనసభ ఎన్నికలలో ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌జేడీ అభ్యర్థి రామ్ కుమార్ యాదవ్‌పై 22,667 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

డియోనాథ్ యాదవ్ 2005 (అక్టోబరు) శాసనసభ ఎన్నికలలో) ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌జేడీ అభ్యర్థి రామ్ కుమార్ యాదవ్‌పై 6179 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. ↑ "Bihar Samajwadi Party President resigns". The Times of India. 2 December 2005. Archived from the original on 25 November 2025. Retrieved 25 November 2025.
  2. ↑ "SP MLA, 27 others get lifer in murder case". The Times of India. 6 August 2006. Archived from the original on 25 November 2025. Retrieved 25 November 2025.