Jump to content

డియోన్ మైయర్స్

వికీపీడియా నుండి
డియోన్ మైయర్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డియోన్ నెఫీ మైయర్స్
పుట్టిన తేదీ (2002-03-21) 2002 మార్చి 21 (వయసు: 24)
హరారే, జింబాబ్వే
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రతొలి వరస బ్యాటరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 120)2021 జూలై 7 - బంగ్లాదేశ్ తో
చివరి టెస్టు2025 జూలై 6 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 144)2021 జూలై 16 - బంగ్లాదేశ్ తో
చివరి వన్‌డే2024 డిసెంబరు 19 - ఆఫ్ఘనిస్తాన్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.8
తొలి T20I (క్యాప్ 65)2021 జూలై 22 - బంగ్లాదేశ్ తో
చివరి T20I2025 నవంబరు 25 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2020-presentమౌంటెనీర్స్ క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే టీ20
మ్యాచ్‌లు 5 10 31 22
చేసిన పరుగులు 174 154 568 1,560
బ్యాటింగు సగటు 17.40 15.40 21.03 40.00
100లు/50లు 0/1 0/0 0/2 4/8
అత్యుత్తమ స్కోరు 57 34 96 204*
వేసిన బంతులు 33 12 48 694
వికెట్లు 0 1 0 12
బౌలింగు సగటు 13.00 44.25
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/13 2/61
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 4/– 8/– 15/–
మూలం: Cricinfo, 2026 జనవరి 2

డియోన్ నెఫీ మైయర్స్ (జననం 2002 మార్చి 21) జింబాబ్వే క్రికెట్ ఆటగాడు. అతను 2021 జూలైలో జింబాబ్వే క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.[1]

మైయర్స్ 2020 డిసెంబరు 9 న మౌంటెనీర్స్ తరపున 2020–21 లోగాన్ కప్‌లో ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు. [2] దానికి ముందు అతను, 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం జింబాబ్వే జట్టులో చోటు దక్కించుకున్నాడు. [3] 2021 ఏప్రిల్ 10 న మౌంటెనీర్స్ తరపున 2020–21 జింబాబ్వే దేశీయ ట్వంటీ20 పోటీలో ట్వంటీ20 ఆడడం మొదలుపెట్టాడు.[4] అతను 2021 ఏప్రిల్ 18 న మౌంటెనీర్స్ తరపున 2020–21 ప్రో50 ఛాంపియన్‌షిప్‌లో తన తొలి లిస్ట్ A ఆడాడు.[5]

2021 మేలో, దక్షిణాఫ్రికా Aతో జరిగిన లిస్ట్ A సిరీస్ కోసం అతను జింబాబ్వే A క్రికెట్ జట్టులోకి తొలిసారి ఎంపికయ్యాడు. [6] సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో, అతను 96 పరుగులు చేశాడు, ఇది లిస్ట్ A క్రికెట్‌లో అతని మొదటి అర్ధ సెంచరీ కూడా. [7]

2021 జూలైలో, బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక మ్యాచ్ కోసం జింబాబ్వే టెస్ట్ జట్టులో మైయర్స్ ఎంపికయ్యాడు. [8] 2021 జూలై 7 న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టు కెరీర్‌కు శ్రీకారం చుట్టాడు.[9] 2021 జూలైలో మైయర్స్, జింబాబ్వే వన్డే ఇంటర్నేషనల్ (ODI) జట్టులో, బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్ కోసం ఎంపికయ్యాడు. [10] 2021 జూలై 16 న తొలి టెస్టు ఆడాడు.[11] వన్డే మ్యాచ్‌లు ముగిసిన తర్వాత, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ల కోసం జింబాబ్వే ట్వంటీ 20 ఇంటర్నేషనల్ లో కూడా ఎంపికై,[12] 2021 జూలై 22 న తొలి టి20 ఆడాడు.[13]

మూలాలు

[మార్చు]
  1. "Dion Myers". ESPN Cricinfo. Retrieved 9 December 2020.
  2. "Logan Cup at Harare, Dec 9-12 2020". ESPN Cricinfo. Retrieved 9 December 2020.
  3. "Dion Myers". ESPN Cricinfo. Retrieved 9 December 2020.
  4. "1st Match, Harare, Apr 10 2021, Zimbabwe Domestic Twenty20 Competition". ESPN Cricinfo. Retrieved 10 April 2021.
  5. "1st Match, Harare, Apr 18 2021, Pro50 Championship". ESPN Cricinfo. Retrieved 18 April 2021.
  6. "Dion Myers". ESPN Cricinfo. Retrieved 9 December 2020.
  7. "Dion Myers". ESPN Cricinfo. Retrieved 9 December 2020.
  8. "Dion Myers". ESPN Cricinfo. Retrieved 9 December 2020.
  9. "Dion Myers". ESPN Cricinfo. Retrieved 9 December 2020.
  10. "Dion Myers". ESPN Cricinfo. Retrieved 9 December 2020.
  11. "Dion Myers". ESPN Cricinfo. Retrieved 9 December 2020.
  12. "Raza named captain for Bangladesh T20Is". BD Crictime. Retrieved 21 July 2021.
  13. "1st T20I, Harare, Jul 22 2021, Bangladesh tour of Zimbabwe". ESPN Cricinfo. Retrieved 22 July 2021.