డిస్లెక్సియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డిస్లెక్సియా అనేది ఒక వయసులో వారు సాధారణంగా చదువగలిగిన దానికన్నా తక్కువగా చదివేలా చేసే ఒక వ్యాధి.[1][2] 1960 వ దశకం వరకు దీనిని వర్డ్ బ్లైండ్‌నెస్ అనేవారు. ఇది వేర్వేరు వ్యక్తులలో వేర్వేరు స్థాయిలలో ఉంటుంది. పదాలను సరిగా పలకకపోవడం, రాయకపోవడం, తొందరగా చదవలేకపోవడం, మనస్సులో చదవలేకపోవడం, వేరే వాళ్ళు చదువుతుంటే అర్థం చేసుకోలేక పోవడం మొదలైనవి దీని లక్షణాలు.[3] ఈ లక్షణాలు సాధారణంగా పాఠశాలలో గుర్తిస్తారు.[4] ఈ విధమైన ఇబ్బందులు వారికి తెలియకుండానే కలుగుతాయి కానీ అందరిలాగే నేర్చుకోవాలనే తపన వారికీ ఉంటుంది.[5] ఇది ఉన్న వారిలో ఏకాగ్రతా సమస్యలు (ADHD - Attention Deficit Hyperactivity Disorder), భాష, సంఖ్యలు నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.[4][6]

డిస్లెక్సియా రావడానికి జన్యుపరమైన, చుట్టూ ఉన్న వాతావరణం ముఖ్యమైన కారణాలు కావచ్చని విశ్వసిస్తున్నారు. మెదడుకు తీవ్రమైన గాయం కావడం, పక్షవాతం రావడం, డెమెన్షియా (మతిమరుపు) వంటి వాటివల్ల కూడా డిస్లెక్సియా వచ్చే అవకాశం ఉంది. దీన్నే అక్వైర్డ్ డిస్లెక్సియా లేదా అలెక్సియా అంటారు.

మూలాలు[మార్చు]

  1. "Dyslexia Information Page". National Institute of Neurological Disorders and Stroke. 2 November 2018.
  2. Siegel LS (November 2006). "Perspectives on dyslexia". Paediatrics & Child Health. 11 (9): 581–7. doi:10.1093/pch/11.9.581. PMC 2528651. PMID 19030329.
  3. "What are the symptoms of reading disorders?". National Institutes of Health. 1 December 2016.
  4. 4.0 4.1 Peterson, Robin L.; Pennington, Bruce F. (May 2012). "Developmental dyslexia". Lancet. 379 (9830): 1997–2007. doi:10.1016/S0140-6736(12)60198-6. PMC 3465717. PMID 22513218.
  5. "What are reading disorders?". National Institutes of Health. 1 December 2016.
  6. Sexton, Chris C.; Gelhorn, Heather L.; Bell, Jill A.; Classi, Peter M. (November 2012). "The Co-occurrence of Reading Disorder and ADHD: Epidemiology, Treatment, Psychosocial Impact, and Economic Burden". Journal of Learning Disabilities. 45 (6): 538–564. doi:10.1177/0022219411407772. PMID 21757683. S2CID 385238.