డి.పి. యాదవ్
| ధరమ్ పాల్ యాదవ్ (డి.పి. యాదవ్) | |||
| పదవీ కాలం 2007 – 2012 | |||
| ముందు | ఓంకార్ సింగ్ యాదవ్ | ||
|---|---|---|---|
| తరువాత | ఓంకార్ సింగ్ యాదవ్ | ||
| నియోజకవర్గం | సహస్వాన్ | ||
| పదవీ కాలం 1989 – 1996 | |||
| ముందు | ఎస్. సైదుల్ హసన్ | ||
| తరువాత | మహేంద్ర సింగ్ యాదవ్ | ||
| నియోజకవర్గం | బులంద్‌షహర్ | ||
| పదవీ కాలం 1998 – 2004 | |||
| నియోజకవర్గం | ఉత్తర ప్రదేశ్ | ||
| పదవీ కాలం 1996 – 1998 | |||
| ముందు | శ్రీపాల్ సింగ్ యాదవ్ | ||
| తరువాత | ములాయం సింగ్ యాదవ్ | ||
| నియోజకవర్గం | సంభాల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1948 జులై 25 సర్ఫాబాద్ గ్రామం, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా, ఉత్తరప్రదేశ్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | రాష్ట్రీయ పరివర్తన్ దళ్ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ | ||
| జీవిత భాగస్వామి |
ఉమ్లేష్ యాదవ్ (m. 1968) | ||
| సంతానం | 4 (వికాస్ యాదవ్ తో సహా 2 కుమార్తెలు, 2 కుమారులు ) | ||
| నివాసం | నోయిడా | ||
| పూర్వ విద్యార్థి | బనారస్ హిందూ విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ధరమ్ పాల్ యాదవ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసి, ఒకసారి సజ్యసభ సభ్యుడిగా, 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సంభాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]డి.పి. యాదవ్ ములాయం సింగ్ యాదవ్‌తో స్నేహం చేసి 1989 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనతాదళ్ అభ్యర్థిగా బులంద్‌షహర్ నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ములాయం సింగ్ యాదవ్ మంత్రివర్గంలో మంత్రిగా అని చేశాడు. ఆయన ఆ తరువాత 1991 & 1993 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
డి.పి. యాదవ్ 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సంభాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత బహుజన్ సమాజ్ పార్టీలో చేరి 1996 లోక్‌సభ ఎన్నికలలో బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయన ఆ తరువాత 1998 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి 1998 నుండి 2004 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశాడు.
డి.పి. యాదవ్ 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సంభాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి అనంతరం 2007లో రాష్ట్రీయ పరివర్తన్ దళ్ పార్టీని స్థాపించి 2009 లోక్‌సభ ఎన్నికలలో బదౌన్ నుండి, 2014 లోక్‌సభ ఎన్నికలలో ఘాజీపూర్ & సంభాల్ నుండి రెండు స్థానాల నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Former MP DP Yadav sentenced to life imprisonment". Times of India. 11 March 2015. Archived from the original on 15 March 2015. Retrieved 27 December 2015.
- ↑ Singh, S.P.; Manoj, Kumar (11 March 2015). "23 years after Bhati's death, DP Yadav gets life term". Daily Pioneer. Archived from the original on 22 October 2016. Retrieved 21 October 2016.
- ↑ "मुलायम सिंह यादव की कर्मभूमि संभल में बेहद रोचक हुआ मुकाबला, इन दो पार्टियों में होगी कांटे की टक्कर". ETV Bharat News. 20 April 2024. Archived from the original on 27 June 2025. Retrieved 27 June 2025.
- ↑ "Sambhal Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). No. The Times of India. The Times of India. Archived from the original on 26 June 2025. Retrieved 26 June 2025.