డి. వి. మోహనకృష్ణ

వికీపీడియా నుండి
(డి.వి. మోహనకృష్ణ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

డి.వి. మోహనకృష్ణ ఒక సుప్రసిద్ధ గాయకుడు. మంగళంపల్లి బాలమురళీకృష్ణకు ప్రియశిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయనతో కలిసి సుమారు 1000 కచేరీల్లో పాల్గొన్నాడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

డి.వి.మోహనకృష్ణ 1963 ఆగస్టు 3 న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించాడు. ఆయన విద్యాభ్యాసం మచిలీపట్నంలోనే సాగింది.

ఆయన బాల్యంలో తాతగారు డి.వి.సుబ్బారావు నాటకాలు వేసేవారు. రంగస్థల కళాకారులు. ఆయన నుండి వారి యింటిలో సంగీత కళ ప్రారంభమైనది. ఆయన కుటుంబం సంగీతం నేపథ్యం ఉన్నది కాబట్టి చిన్నప్పటి నుంచే పాటలు, పద్యాలు పాడటం నేర్చుకున్నాడు. ఆయన మొదటి గురువు శిష్టు ప్రభాకర కృష్ణమూర్తి శాస్త్రి.[2] చిత్ర గీతాలు మాత్రమే పాడుతున్న దశలో తల్లి ద్వారా బాలమురళీకృష్ణ గానాన్ని టేపులో విని ముగ్ధుడై ఎనిమిదేళ్ళ వయసు నుంచి ఆయన దగ్గర సంగీత సాధన ప్రారంభించాడు. 19 ఏళ్ళ వయసులో డిగ్రీ ఆఖరి సంవత్సరంలో ఉండగా కంజెక్టివైటిస్ అనే వ్యాధి సోకి చూపును కోల్పోయాడు. అప్పటి నుంచీ సంగీతం ఎక్కువగా సాధన చేశాడు.

మొదటిసారి ఆయన గురువుగారి ద్వారా బాలమురళీకృష్ణ కచేరిని క్యాసెట్ ద్వారా విన్నారు. ఆ పాటకు ప్రేరణ పొందారు. మోహనకృష్ణ గారిని వారి తండ్రిగారు మద్రాసు తీసుకొని వెళ్లారు. అచ్చట సంగీతకళాకారులైన బంధువు వద్ద బాలమురళీ కీర్తనను వినిపించారు. ఆయన బందరు వెళ్ళి బాలమురళీకృష్ణకు పరిచయం చేసారు. ఆయన మోహనకృష్ణ ఆ పాటను వినిపించారు.6 నెలల తరువాత బాలమురళీకృష్ణ బందరు వచ్చినపుడు ఆయనను మరలా కలిసారు. కొంతకాలానికి బాలమురళీకృష్ణగారి యింటివద్దనే ఐదు సంవత్సరాలు ఉండి సంగీత విద్యను అభ్యసించారు.[3]

1998లో ఆకాశవాణిలో ఉద్యోగం లభించింది. అప్పటి నుంచీ ఆయనకు ఆ రంగంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకూ మోహన కృష్ణ 60 అన్నమాచార్య కీర్తనలకు బాణీలు కట్టి వాటిని ఆరు సిడిలుగా రూపొందించగా వాటిలో 5 సిడిలు విడుదలయ్యాయి.[4]

ఒకప్పటి గాయని బి.వసంత ఆయనకు కజిన్. మొదటి సారి తండ్రితో కలిసి మద్రాసు వెళ్ళినపుడు ఆమె ఇంట్లోనే కొద్ది రోజులు ఉన్నాడు.

అవార్డులు[మార్చు]

 • 1980 : కర్ణాటక సంగీతంలో ఆలిండియా రేడియో వారి పోటీలలో మొదటి బహుమతి.
 • 1989 : టాలెంట్ అకాడమి వారిచే మ్యుజీషియన్ ఆఫ్ ద యియర్.
 • 1998 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖనుండి కళానీరాజనం అవార్డు.
 • 2004 : గణపతి సచ్చిదానంద స్వామి గారిచే "స్వర్ణకంకణం"
 • 2004 : శ్రీ పారుపల్లి కృష్ణయ్య పంతులు మెమోరియల్ అవార్దు, విపంచి-చెన్నై వారిచే.
 • 2005 : చైతన్య ఆర్ట్ ధియేటర్ చే నిర్వహింపబడిన కార్యక్రమంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంచే సన్మానం.
 • 2006 : "మధుర గాన సుధానిథి" బిరుదు - శ్రీరామ గాన సభ, నల్లకుంట్ల, హైదరాబాదు.
 • 2006 : "లలిత సంగీత విశారద" - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చే.

మూలాలు[మార్చు]

 1. http://www.prabhanews.com/tradition/article-325869
 2. http://www.andhrajyothy.com/node/9532
 3. యూట్యూబ్ ఇంటర్యూలో ఆయన చెప్పిన విశేషాలు
 4. "If music can heal". ARUNA CHANDARAJU. ద హిందూ. 12 October 2012. Cite news requires |newspaper= (help); |access-date= requires |url= (help)

ఇతర లింకులు[మార్చు]