డి.వై. పాటిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జ్ఞానదేయో యశ్వంతరావు పాటిల్ (జననం 22 అక్టోబర్ 1935) భారతదేశానికి చెందిన విద్యావేత్త, రాజకీయ నాయకుడు. ఆయన 22 మార్చి 2013 నుండి 26 నవంబర్ 2014 వరకు బీహార్ గవర్నర్‌గా పని చేశాడు.[1] ఆయన చేసిన సామజిక సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 1991లో పద్మశ్రీ పురస్కారంతో సన్మానించింది.[2]

విద్యా సంస్థలు[మార్చు]

  • డా. డివై పాటిల్ విద్యాపీఠ్, పూణే
  • పద్మశ్రీ డివై పాటిల్ విద్యాపీఠ్, నవీ ముంబై
  • డా. డివై పాటిల్ మెడికల్ కాలేజ్ నవీ ముంబై
  • డివై పాటిల్ ఎడ్యుకేషన్ సొసైటీ, కొల్హాపూర్
  • డా. డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ
  • పూణేలోని డా. డివై పాటిల్ నాలెడ్జ్ సిటీ
  • డా. డి.వై పాటిల్ ఇంటర్నేషనల్ స్కూల్, ముంబై
  • డాక్టర్ డివై పాటిల్ ఇంటర్నేషనల్ స్కూల్, కాంగ్రా (హిమాచల్ ప్రదేశ్)
  • డివై పాటిల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కొల్హాపూర్
  • డివై పాటిల్ మెడికల్ కాలేజ్, కొల్హాపూర్
  • డాక్టర్ డివై పాటిల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పూణే
  • డివై పాటిల్ హాస్పిటల్, ముంబై
  • డివై పాటిల్ ఇంటర్నేషనల్ స్కూల్, బెల్జియం
  • డాక్టర్ డివై పాటిల్ జూనియర్ కళాశాల, పూణే
  • ఆటోమోటివ్ రీసెర్చ్ అండ్ స్టడీస్ కోసం డివై పి.డి.సి సెంటర్
  • డాక్టర్ డివై పాటిల్ పుష్పలతా పాటిల్ ఇంటర్నేషనల్ స్కూల్, పాట్నా
  • డాక్టర్ డివై పాటిల్ బి-స్కూల్, పూణే
  • డా. డివై పాటిల్ బయోటెక్నాలజీ & బయోఇన్ఫర్మేటిక్స్ ఇన్స్టిట్యూట్, పూణే

రాజకీయ జీవితం[మార్చు]

డి.వై. పాటిల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1957లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొల్హాపూర్ మున్సిపల్ కౌన్సిల్‌కు ఎన్నికై 1962 వరకు కౌన్సిలర్‌గా పని చేశాడు. ఆయన 1967 నుండి 78 వరకు పన్హాలా విధానసభ నియోజకవర్గం నుండి మహారాష్ట్ర విధానసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 21 నవంబర్ 2009న త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా నియమితుడయ్యాడు,[5] 27 నవంబర్ 2009న పదవీ ప్రమాణం చేసి 21 మార్చి 2013 వరకు పని చేశాడు. ఆయన ఆ తరువాత 9 మార్చి 2012న బీహార్ గవర్నర్‌గా నియమితుడై 22 26 నవంబర్ 2014 వరకు పని చేశాడు.

మూలాలు[మార్చు]

  1. The Hindu (22 March 2013). "D.Y Patil sworn in as Governor of Bihar" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.
  2. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.
  3. "Statistical Report on General Election 1967 to the Legilsative Assembly of Maharashtra" (PDF). Election Commission of India website. p. 10. Retrieved 27 November 2009.
  4. "Key Highights of General Election 1972 to the Legilsative Assembly of Maharashtra" (PDF). Election Commission of India website. p. 10. Retrieved 25 November 2009.
  5. "President Appoints Governors". The President of India website. 21 November 2010. Retrieved 25 November 2009.