డి.సి. గౌరీ శంకర్
| డి.సి. గౌరీ శంకర్ | |||
| పదవీ కాలం 2018 – 2023 మే 13 | |||
| ముందు | బి. సురేష్ గౌడ | ||
|---|---|---|---|
| తరువాత | బి. సురేష్ గౌడ | ||
| నియోజకవర్గం | తుమకూరు రూరల్ | ||
| పదవీ కాలం 2008 – 2013 | |||
| ముందు | జీ. పరమేశ్వర | ||
| తరువాత | అనిత కుమారస్వామి | ||
| నియోజకవర్గం | మధుగిరి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్[1] | ||
| ఇతర రాజకీయ పార్టీలు | జనతాదళ్ (సెక్యులర్) | ||
| తల్లిదండ్రులు | సి. చెన్నిగప్ప, సిద్ధగంగమ్మ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
డి.సి. గౌరీ శంకర్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు మధుగిరి, తుమకూరు రూరల్ నియోజకవర్గాల నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]డి.సి. గౌరీ శంకర్ జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో మధుగిరి శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి కే. ఎన్. రాజన్నపై 563 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో తుమకూరు రూరల్ శాసనసభ నియోజకవర్గం జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బి. సురేష్ గౌడ చేతిలో 1572 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
డి.సి. గౌరీ శంకర్ 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో తుమకూరు రూరల్ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బి. సురేష్ గౌడపై 5,640 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బి. సురేష్ గౌడ చేతిలో 4,594 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Two former JD(S) MLAs join Congress in Karnataka" (in Indian English). The Hindu. 15 November 2023. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-17.
- ↑ "Assembly Election Results in 2018, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-17.
- ↑ "Karnataka assembly results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). India Today. 15 May 2018. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
- ↑ "Karnataka Assembly Elections 2023: Tumkur Rural". Election Commission of India. 13 May 2023. Archived from the original on 5 May 2025. Retrieved 5 May 2025.