డి. డి. లపాంగ్
డి. డి. లపాంగ్ | |
|---|---|
| 5వ [[మేఘాలయ ముఖ్యమంత్రి]] | |
| In office 13 మే 2009 – 19 ఏప్రిల్ 2010 | |
| గవర్నర్ | [మరంజిత్ శేఖర్ మూషాహరి |
| అంతకు ముందు వారు | రాష్ట్రపతి పాలన |
| తరువాత వారు | ముకుల్ సంగ్మా |
| In office 10 మార్చి 2007 – 19 మార్చి 2008 | |
| గవర్నర్ | ఎం. ఎం. జాకబ్ బన్వారీ లాల్ జోషి శివిందర్ సింగ్ సిద్ధూ |
| అంతకు ముందు వారు | జె. డి. రైంబై |
| తరువాత వారు | డోంకుపర్ రాయ్ |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 10 ఏప్రిల్ 1934 మేఘాలయ, భారతదేశం |
| మరణం | 2025 సెప్టెంబరు 12 (వయసు: 91) షిల్లాంగ్, మేఘాలయ, భారతదేశం |
| జాతీయత | భారతీయుడు |
| రాజకీయ పార్టీ | నేషనల్ పీపుల్స్ పార్టీ (భారతదేశం)|నేషనల్ పీపుల్స్ పార్టీ |
| ఇతర రాజకీయ పదవులు | భారత జాతీయ కాంగ్రెస్ (2018 వరకు) |
| జీవిత భాగస్వామి | అమిథిస్ట్ లిండా జోమ్స్ బ్లా (1958–ప్రస్తుతం) |
| సంతానం | — |
డొన్వా డెత్వెల్సన్ లపాంగ్ ( 1934 ఏప్రిల్ 10- 2025 సెప్టెంబర్ 12) మేఘాలయ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయవేత్త. డి. డి. లపాంగ్ మేఘాలయ ముఖ్యమంత్రి గా నాలుగు పర్యాయాలు పనిచేశాడు.
జీవితం వృత్తి
[మార్చు]డి. డి. లపాంగ్ 1934 ఏప్రిల్ 10న జన్మించారు. కూలీగా తన జీవితాన్ని ప్రారంభించి, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎటిగాడు. డి. డి. లపాంగ్ తండ్రి పేరు డోన్వా వార్. 1958లో డి. డి. లపాంగ్ అమెథిస్ట్ లిండా జోమ్స్ బ్లాను వివాహం చేసుకున్నాడు.[1]
1972 మేఘాలయ శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నోంగ్పో శాసన సభ నియోజకవర్గం నుండి డి. డి. లపాంగ్ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత 1992 నుండి 1993 ఫిబ్రవరి వరకు మేఘాలయ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2003 మార్చి 4న రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాల కారణంగా 2006 జూన్ 15న డి. డి. లపాంగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.[2]
2007 మార్చిలో డి. డి. లపాంగ్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.[3] ఆయన నేర్చుత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ 2008 మేఘాలయ శాసనసభ ఎన్నికల్లో అనేక సీట్లను గెలుచుకుంది, 2008 మార్చి 10న డి. డి. లపాంగ్ నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. కానీ కొద్ది రోజులకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 60 మంది సభ్యులు ఉన్న మేఘాలయ శాసనసభ లో 28 మంది మాత్రమే డి. డి. లపాంగ్ కు మద్దతు ఇవ్వడంతో ఇంకా ఇద్దరు సభ్యుల మద్దతు ఇవ్వకపోవడంతో ఆయన రాజీనామా చేయక తప్పలేదు .
ఆయన రాజీనామా చేసిన రెండు నెలల పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. తరువాత 2009 మే 13న డి. డి. లపాంగ్ నాలుగో సారి మేఘాలయ ముఖ్యమంత్రి అయ్యారు, 2010 ఏప్రిల్ 19న రాజీనామా చేశారు.[4] ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక్కసారి కూడా పూర్తికాలం పదవిలో కొనసాగ లేకపోయారు.
డి. డి. లపాంగ్ 2025 సెప్టెంబరు 12న షిల్లాంగ్ 91 సంవత్సరాల వయసులో మరణించాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ Lahkar, Digjyoti. "Former Meghalaya CM D.D. Lapang Passes Away at 91". The Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 13 September 2025.
- ↑ "Sonia 'forces' Lapang exit - Rymbai is new Meghalaya CM". www.telegraphindia.com (in ఇంగ్లీష్). 16 June 2006. Retrieved 2020-03-04.
- ↑ "Apang loses power tussle". www.telegraphindia.com (in ఇంగ్లీష్). 9 April 2007. Retrieved 2020-03-04.
- ↑ Singh, Bikash (2018-09-15). "Ex-Meghalaya Chief Minister Lapang quits Congress". The Economic Times. Retrieved 2020-03-05.
- ↑ "Former Meghalaya Chief Minister D.D. Lapang passes away". The Hindu (in Indian English). 13 September 2025. Retrieved 13 September 2025.
- ↑ Laitphlang, David (13 September 2025). "Former Meghalaya chief minister D.D. Lapang passes away at 91". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 13 September 2025.