డీఫైబ్రిలేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డీఫిబ్రిలేటర్‌ స్థానాన్ని, పొజిషన్‌ను చూడటం, చేతులు లేకుండా ఎలక్ట్రోడ్‌లను ఉపయోగించడం.

డీఫైబ్రిలేషన్‌ జీవితాన్ని ప్రమాదంలో పడేసే కార్డియాక్‌ అరైత్‌మియాస్‌, వెంట్రిక్యులర్‌ ఫిబ్రిలేషన్‌ మరియు పల్స్‌లెస్‌ వెన్ట్రిక్యులర్‌ టాచికార్డియాలకు కచ్చితమైన చికిత్స అందించే విధానం. డీఫైబ్రిలేషన్‌లో దెబ్బతిన్న గుండెకు చికిత్సా చేసే సమయంలో విద్యుత్‌శక్తిని, డీఫైబ్రిలేటర్‌ అనే పరికరం ద్వారా పంపిస్తారు. ఇది గుండె కండరాల్లో ఉన్న క్లిష్టమైన పూడిక‌ను తొలగిస్తుంది. అరైత్‌మియాన్‌ను నివారిస్తుంది మరియు సైనస్‌ రిథమ్‌ను సహజంగా చేస్తుంది. ఇవన్నీ గుండె యొక్క సినోట్రియల్‌ నోడ్‌లో, శరీరం యొక్క సహజ పేస్‌మేకర్‌ను తిరిగి సరిజేస్తుంది. డీఫైబ్రిలేటర్స్‌ ఎక్స్‌టర్నల్‌ (బాహ్య), ట్రాన్స్‌వీనస్‌, లేదా ఇంమ్‌ప్లాంటెడ్‌ (శరీరం లోపల అమర్చడం)గా ఉండొచ్చు. ఎలాంటి పరికరాన్ని వాడారు, ఎలాంటి పరికరం అవసరం అనే అంశాల పై ఇది ఆధారపడి ఉంటుంది. కొన్ని బాహ్య‌ యూనిట్లను ఆటోమేటెడ్ & ఎక్సటర్నల్‌ డీఫైబ్రిలేటర్స్‌ (AED) అని కూడా అంటారు. ఇవి చికిత్స రిథమ్‌ను వాటంతట అవే నిర్ధారణ‌ చేయగలుగుతాయి. లే రెస్పాండర్స్‌ లేదా బై స్టాండర్స్‌ (రోగులు) వీటిని కొద్దిపాటు శిక్షణ లేదా శిక్షణ లేకుండా కూడా సమర్ధంగా ఉపయోగించగలరు.

విషయ సూచిక

చరిత్ర[మార్చు]

డీఫైబ్రిలేషన్‌ తొలుత, 1899లో స్విట్జర్లాండ్‌లోని జెనీవా విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు ఫిజియాలజిస్ట్‌లు ప్రొవెస్ట్‌ మరియు బేటెల్లి చూపించారు. చిన్న విద్యుత్‌ షాక్‌లు కుక్కల్లో వెంట్రిక్యుర్‌ ఫైబ్రిలేషన్‌ను కలిగిస్తున్నాయని వీరు గుర్తించారు. వీటిని భారీ స్థాయిలో వాడితే పరిస్థితిని పూర్తిగా మార్చివేయవచ్చని భావించారు.

తొలుత దీనిని క్లాడ్‌ బెక్‌ [1] 1947లో మనిషి మీద ప్రయోగించారు. ఈయన కేస్‌ వెస్టర్న్‌ రిజర్వ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌ ఆఫ్‌ సర్జరీగా ఉండేవారు. బెక్‌ యొక్క సిద్ధాంతం ప్రకారం, గుండెల్లో వెంట్రిక్యులర్‌ ఫైబ్రిలేషన్‌ తరచుగా జరుగుతుంది, నిజానికి ఇది ఆరోగ్యంగా ఉండాలి. ఆయన మాటల్లో గుండెలు చాలా బాగున్నాయి మరియు వీటిని రక్షించడానికి ఇది మంచి మార్గం. బెక్‌ ఈ ప్రక్రియ‌ను తొలుత 14 ఏళ్ల బాలుడి పై విజయవంతంగా ప్రయోగించారు. ఈ బాలుడికి అప్పటికే కాంజినిటల్‌ చాతి లోపం కారణంగా శస్త్రచికిత్స జరిగింది. ఈ బాలుడి చాతి ఆపరేషన్‌ కోసం తెరచి ఉంది, డీఫైబ్రిలేటర్‌ వచ్చే వరకూ దాదాపు 45 నిమనిషాల పాటు మాన్యువల్‌గా అతడికి కార్డియాక్‌ మసాజ్‌ చేశారు. బెక్‌ ఇంటర్నల్‌ ప్యాడిల్స్‌ను గుండెకు రెండు వైపులా ఉపయోగించారు. దీనితో పాటు ప్రొకైనమైడ్‌ అనే ఆంటిఅరైత్‌మియాన్‌ మందును ఇచ్చారు. దీని ద్వారా సైనస్‌ రిథమ్‌ను సాధారణ స్థాయికి తీసుకొచ్చారు.

ఆరంభంలో డీఫైబ్రిలేటర్స్‌ను పవర్‌ సాకెట్‌ నుంచి విద్యుత్‌ను తీసుకోవడం ద్వారా ఉపయోగించేవారు. 300 నుంచి 1000 వాల్ట్స్‌ వరకూ 110-240 వాల్ట్స్‌ లైన్‌ల నుంచి తీసుకునేవారు. తెరిచి ఉంచిన గుండెలోకి ప్యాడిల్‌ టైప్‌ ఎలక్ట్రోడ్స్‌ను పంపించేవారు. ఈ టెక్నిక్‌ VF‌ను మార్చడంలో తరచుగా ప్రభావరహితంగా మారింది. బాహ్యరూప అధ్యయనంలో గుండె కండరాలు దెబ్బతింటున్నాయని బయటపడింది. పెద్ద ట్రాన్స్‌ఫార్మర్‌లు ఉన్న AC యంత్రం వల్ల వీటిని రవాణా చేయడం కూడా కష్టమయింది మరియు ఇవి చక్రాల పై ఉండే పెద్ద యూనిట్లుగా పేర్కొనబడ్డాయి.

క్లోజ్‌ చెస్ట్‌ మెథడ్‌ (చాతి మూసి ఉంచే పద్దతి)[మార్చు]

1950ల ఆరంభం వరకూ, శస్త్రచికిత్స సమయంలో ఛాతి క్యావిటీని తెరచి ఉంచితేనే గుండెకు డీఫైబ్రిలేషన్‌ చేయడం సాధ్యపడేది. ఈ టెక్నిక్‌ను 300 లేదా అంతకంటే ఎక్కువ వోల్ట్స్‌ ప్రత్యామ్నాయ విద్యుత్‌ను పంపించడం ద్వారా చేసేవారు. తెరచి ఉంచిన గుండెకు రెండు వైపులా పాడిల్‌ ఎలక్ట్రోడ్‌ను పంపుతారు. ఇందులో ప్రతి ఎలక్ట్రోడ్‌ కొద్దపాటి కాన్‌సేవ్‌ మెటల్‌ ప్లేట్‌ను 40mm వ్యాసార్ధంలో పంపుతాయి. మూసి ఉన్న ఛాతి డీఫైబ్రిలేటర్‌, 1000 కంటే ఎక్కువ వోల్ట్స్‌ ఉన్న విద్యుత్‌ను పంపడం ద్వారా వినియోగిస్తారు. ఇవి ఛాతి కేజ్‌ నుంచి గుండెక్‌ బాహ్య పద్దతి ద్వారా ఎలక్ట్రోడ్స్‌ను చేరుస్తాయి. దీనిని డాక్టర్‌ వి. ఎస్కిన్‌ అనే వైద్యుడు ఎ. క్లిమోవ్‌ అనే సహాయకుడితో కలిసి 1950ల మధ్య కాలంలో ఫ్రుంజ్‌, USSR (ప్రస్తుతం బిష్‌కెక్‌, క్రిగిజస్థాన్‌)లో కనుగొన్నారు.[2]

మూవ్‌ టు డైరెక్ట్‌ కరెంట్‌ (నేరుగా విద్యుత్‌శక్తికి మార్పు)[మార్చు]

అతి సింపుల్‌ డీఫిబ్రిలేటర్‌ డిజైన్‌ (నాన్‌ ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్‌) యొక్క సర్క్యూట్‌ డయాగ్రమ్‌ను చూపడం. ఇండక్టర్‌మీద ఆధారపడటం (డంపింగ్‌), లోన్‌, ఎడ్‌మార్క్‌ లేదా గుర్విచ్‌ వేవ్‌ఫామ్‌

1959లో బెర్నార్డ్‌ లోన్‌ మరో ప్రయోగం చేసి, ప్రత్యామ్నాయ విధానాన్ని కనుగొన్నారు. ఇందులో బ్యాంక్‌ ఆఫ్‌ కెపాసిటర్స్‌ను 1000 వోల్ట్‌ల వరకూ 100-200 జోల్స్‌ శక్తిని ఉపయోగించి చార్జ్‌ చేస్తారు. ఆ తర్వాత వీటిని ఇండక్టెన్స్‌ ద్వారా ప్రవేశపెడతారు. బాగా చెడిపోయిన సిన్సోడియల్‌ వేల్‌ ద్వారా అతి తక్కువ సమయంలో (5 మిల్లీ సెకన్లు), గుండెకు పాడిల్‌ ఎలక్ట్రోడ్స్‌ను చేరుస్తారు. లోన్‌ యొక్క ప్రయోగానికి ఇంజినీర్‌ బారో బెర్క్‌కోవిట్స్‌ తన కార్డియోవెర్టర్‌ ద్వారా క్లినికల్‌ అప్లికేషన్‌ను తీసుకొచ్చారు.

1980ల చివరి వరకూ లోన్‌ యొక్క తరంగ విధానం డీఫైబ్రిలేషన్‌కు ప్రామాణికంగా ఉంది. తర్వాత అనేక స్టడీస్‌ బైఫాసిక్‌ టర్న్‌కేటెడ్‌ వేవ్‌ఫామ్‌ (బిటిఇ) కూడా సమానమైన, సమర్ధంగా పని చేసే పద్దతి అని కనుగొన్నారు. ఈ కొత్త పద్దతిలో డీఫైబ్రిలేషన్‌ కోసం తక్కువ స్థాయి శక్తిని వినియోగిస్తే సరిపోతుంది. యంత్రం యొక్క బరువు చాలా ఎక్కువగా తగ్గిపోవడం దీనితో పాటు వచ్చిన సహ పరిణామం. BTE తరంగ విధానం ట్రాన్స్‌థోరసిస్‌ ఇమ్‌పెడన్స్‌ యొక్క సహజ కొలతతో ఉంటుంది. ఆధునిక డీఫైబ్రిలేటర్స్‌కు ఇది మూలం.

అందుబాటులోకి చిన్న యూనిట్లు[మార్చు]

ఆసుపత్రి బయట వాడేందుకు చిన్న డీఫ్రిబిలేటర్స్‌ను తయారు చేయడం అతి పెద్ద మార్పు. 1960ల ప్రారంభంలో ప్రొఫెసర్‌ ఫ్రాంక్‌ పాంట్రిడ్జ్‌ బెల్‌ఫాస్ట్‌లో దీనిని తయారు చేశారు. ప్రస్తుతం అంబులెన్స్‌ల్లో తీసుకెళుతున్న ముఖ్యమైన పరికరాల్లో చిన్న డీఫ్రిబిలేటర్స్‌ ముఖ్యమైనవి. అకస్మాస్తుగా EMS‌ ద్వారా గుండెపోటుకు గురైన వ్యక్తిని తాత్కాలికంగా రక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఆసుపత్రికి చేరేవరకూ రోగిని వెంట్రాక్యులర్‌ టాచికార్డియా లేదా వెంట్రిక్యులర్‌ ఫైబ్రిలేషన్‌ నుంచి కాపాడేందుకు ఇవి కీలకం.

ఇంప్లాంటెడ్‌ వర్షన్స్‌ (కింద చూడండి) మెరుగుపరచడం ద్వారా డీఫిబ్రిలేటర్స్‌ యొక్క డిజైన్‌ క్రమంగా మెరుగుపడింది. దీనివల్ల ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డిఫిబ్రిలేటర్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఈ పరికరాలు గుండె కొట్టుకునే పద్దతిని తనంతట తానే విశ్లేషిస్తాయి. షాకబుల్‌ రిథమ్స్‌ను కనుగొంటాయి. ఇవి చికిత్స చేయడానికి సహకరిస్తాయి. దీనివల్ల క్లినికల్‌ నైపుణ్యం యొక్క అవసరం తగ్గిపోయింది. అవసరమైన వారు తమంతట తామే అత్యవసర పరిస్థితుల్లో వీటిని ఉపయోగించుకోగల అవకాశం లభించింది.

బైఫాసిక్‌ వేవ్‌ఫామ్‌కు మార్పు[మార్చు]

1980ల చివరి వరకూ, ఎక్స్‌టర్ననల్‌ డిఫిబ్రిలేటర్స్‌ లోన్‌ తరహా వేవ్‌ ఫామ్‌ (బెర్నాడ్‌ లోన్‌ను చూడండి)ను ఉత్పత్తి చేసేవి. ఇవి బాగా ఎక్కువగా సిన్సుడోనియల్‌ ఇమ్‌పల్స్‌ను చెడగొట్టేవి, ముఖ్యంగా యునిఫాసిక్‌ లక్షణాన్ని కలిగి ఉండేవి. ఏదేమైనా, బైఫాసిక్‌ డిఫిబ్రిలేషన్‌ పల్స్‌ యొక్క దిశను మారుస్తాయి. ఒక సైకిల్‌ను సుమారు 10 మిల్లీ సెకన్లలో పూర్తి చేస్తుంది. బైఫాసిక్‌ డిఫిబ్రిలేషన్‌ను ఇమ్‌ప్లాంటబుల్‌ కార్టివెర్టర్‌ - డిఫిబ్రిలేటర్స్‌లో వాడేందుకు వృద్ధి చేశారు. ఎక్స్‌టర్నల్‌ డిఫిబ్రిలేటర్స్‌కు దీనిని అన్వయిస్తే, బైఫాసిక్‌ డిఫిబ్రిలేషన్స్‌లో విజయవంతంగా డిఫిబ్రిలేషన్‌ చేయడానికి చాలా తక్కువ శక్తిని వినియోగించవచ్చు. దీని వల్ల కాలిపోయే ప్రమాదం‌ తగ్గిపోతుంది. మయోకార్డియల్‌ దెబ్బతినే అవకాశాలు కూడా బాగా తక్కువగా ఉంటాయి.

గుండెపోటు వచ్చిన రోగులో 60 శాతం మందికి వెంట్రిక్యులర్‌ ఫైబ్రిలేషన్‌ (VF‌) సహజ సైనస్‌ రిథమ్‌కు, మోనోఫాసిక్‌ డిఫిబ్రిలేటర్‌తో సింగిల్‌ షాక్‌ ఇవ్వడం ద్వారా వస్తుంది. అధిక బైఫాసిక్‌ డిఫిబ్రిలేటర్స్‌ 90 శాతం కంటే ఎక్కువసార్లు మొదటి షాక్‌లోనే విజయం సాధించాయి.[3]

అమర్చదగిన పరికరాలు[మార్చు]

డిఫిబ్రిలేషన్‌లో తర్వాత అభివృద్ధి, ఇమ్‌ప్లాంటబుల్‌ పరికరాలను కనుగొనడం ద్వారా వచ్చింది. వీటిని ఇమ్‌ప్లాంటబుల్‌ కార్డియోవెర్టర్‌ డిఫిబ్రిలేటర్‌ (లేదా ICD)గా కూడా పిలుస్తారు. దీనిని బాల్టిమోర్‌లోని సినాయ్‌ ఆసుపత్రిలో కనుగొన్నారు. స్టీఫెన్‌ హెల్‌మన్‌, అలియోస్‌ లాంగర్‌, జాక్‌ లటుకా, మోర్టన్‌ మోవెర్‌, మైకేల్‌ మిరోవ్‌స్కీ మరియు మిర్‌ ఇమ్రాన్‌లతో కూడిన వైద్యుల బృందం, ఇంటెక్‌ సిస్టమ్స్‌ ఆఫ్‌ పిట్స్‌బర్గ్‌ యొక్క పారిశ్రామిక సహకారంతో దీనిని కనుగొన్నారు.[4] మోవెర్‌ మరియు స్టీవెన్‌లతో జత కట్టి మిరోవ్‌స్కీ దీని పై పరిశోధన 1969లో ప్రారంభించారు. కానీ వారు తమ తొలి రోగిని పరీక్షించడానికి 11 సంవత్సరాలు పట్టింది. ఇదే సమయంలో మిస్సోరి విశ్వవిద్యాలయంలో షూడర్‌ మరియు అతడి బృందం ఇదే తరహా అభివృద్ధి పనిని చేపట్టారు.

అకస్మాత్తుగా మరణం సంభవిస్తుందని మరియు అరిత్‌మియాస్‌లో నిపుణులు దీని మీద అనేక సందేహాలు వెలిబుచ్చినా, పరిశోధన కొనసాగింది. వారి ఆలోచనలో వాస్తవంలో సాధ్యమవుతయా అనే సందేహాలు వెలువడ్డాయి. 1962లో బెర్నార్డ్‌ లోన్‌ బాహ్య‌ DC డిఫిబ్రిలేటర్‌ను ప్రవేశపెట్టారు. ఈ పరికరం గుండె రిఫిబ్రిలేషన్‌ను ఆపడానికి ఛాతీ గోడ‌ నుంచి గుండెకు డిస్‌శార్చ్‌ కెపాసిటర్‌ ద్వారా డైరెక్ట్‌ కరెంట్ ను తీసుకుంటుంది.[5] 1972లో లోన్‌ సర్క్యులేషన్‌ జర్నల్‌లో, వెంట్రాక్యులర్‌ ఫిబ్రిలేషన్‌ యొక్క బౌట్స్‌ తరచుగా ఉండే రోగి చాలా అరుదుగా ఉంటాడు. అలాంటి వ్యక్తికి కరోనరి కేర్‌ యూనిట్‌ ద్వారా మంచి చికిత్స ఇవ్వొచ్చు. ప్రభావవంతమైన యాంటీయరాహితమిస్‌ కార్యక్రమం లేదా కొరనరి రక్త ప్రవాహంలో అరుదుగా చేసే కరెక్షన్స్‌ లేదా వెంట్రాక్యులర్‌ మాల్‌ఫంక్షన్‌ల ద్వారా మంచి చికిత్స ఇవ్వొచ్చు. వాస్తవానికి, అమర్చిన డిపిబ్రిలేటర్‌ వ్యవస్థ పాల్స్‌బుల్‌ మరియు వాస్తవ వినియోగంలో సరైన పరిష్కారం కాదు అని రాశారు.[6]

ఈ సమస్యలను ఒక డిజైన్‌ను రూపొందిచండం ద్వారా అధిగమించవచ్చు. ఇది వెంట్రాక్యులర్‌ ఫైబ్రిలేషన్‌ లేదా వెంట్రాక్యులర్‌ టాచికార్డియాను కనుగొనడం ద్వారా సాధ్యం. ఆర్థికంగా ఎలాంటి సహాయం లేకపోయినా, నిధుల కొరత ఉన్నా 1980 ఫిబ్రవరిలో మొదటి పరికరాన్ని తయారు చేశారు. జాన్‌స హాప్‌కిన్స్‌ ఆసుపత్రిలో డాక్టర్‌ లెవి వాట్కిన్స్‌ ఆవిష్కరించారు. జూ.మోడర్‌న్‌ ICDలకు థోరాకోటమిగానీ, పాసెస్‌ పాసింగ్‌గానీ, కార్డోవెర్షన్‌గానీ, డిఫిబ్రిలేషన్‌ సామర్ధ్యంగానీ అవసరం లేదు.

లోపల అమర్చే యూనిట్లను కనుగొనడం విలువకట్టలేని అంశం. గుండె జబ్బులతో బాధపడేవారికి ఇవి చాలా మేలు చేశాయి. అప్పటికే ఒకసారి గుండె సమస్యను ఎదుర్కున్న వారికి మాత్రమే వీటిని ఇచ్చినప్పటికీ ఇవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.

రకాలు[మార్చు]

మాన్యువల్‌ ఎక్స్‌టర్నల్‌ డిఫిబ్రిలేటర్‌[మార్చు]

ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్‌ / మానిటర్‌

ఈ యూనిట్లు ఎలక్ట్రోకార్డియోగ్రామ్‌ రీడర్స్‌ను (సాధారణంగా లోపల అమర్చి ఉంటాయి) కలిగి ఉంటాయి. దీనివల్ల కార్డియాక్‌ పరిస్థితిని ఆరోగ్యరక్షణ ఇచ్చేవారు సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. (చాలా తరచుగా ఫిబ్రిలేషన్‌ లేదా టాచికార్డియాతో లేదా వివిధ రకాల షాక్‌లతో వచ్చే కదలికలు ఉంటాయి). ఆ తర్వాత ఎలాంటి చార్జ్‌ (జోలస్‌లో)ను ఉపయోగించాలనే అంశాన్ని ఆరోగ్య రక్షణ ఇచ్చేవారు తెలుసుకుంటారు. దీని కోసం రకరకాల నిబంధనలు, అనుభవం అవసరం. రోగి యొక్క చాతిలోకి ప్యాడిల్స్‌ లేదా ప్యాడ్స్‌ ద్వారా షాక్‌ను పంపిస్తారు. వీటికి పూర్తి వైద్య పరిజ్ఞానం అవసరం. అందుకే సాధారణంగా ఇవి ఆసుపత్రులలో మరియు కొన్ని అంబులెన్స్‌లలో మాత్రమే కనిపిస్తుంటాయి. ఉదాహరణకు, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని ప్రతి NHS అంబులెన్స్‌లో, మాన్యువల్‌ ఎక్స్‌టర్నల్‌ డిఫిబ్రిలేటర్‌ పరికరంతో పాటు దీనిని ఉపయోగించే పారామెడిక్స్‌ మరియు సాంకేతిక నిపుణులు ఉంటారు. యునైటెడ్‌ స్టేట్స్‌లో అనేక ఆధునిక ఇఎమ్‌టిలలో మరియు అన్ని పారామెడిక్స్‌ లెథన్‌ అరిథామియాస్‌ను గుర్తించడంలో, అవసరమైన ఎలక్ట్రికల్‌ చికిత్సను ఇవ్వడంలో సరిపడా మాన్యువల్‌ డిఫిబ్రిలేషన్‌ ఇవ్వడంలో శిక్షణ పొంది ఉంటారు.

మాన్యువల్‌ ఇంటర్నల్‌ డిఫిబ్రిలేటర్‌[మార్చు]

ఇవి బెక్‌ మరియు లోన్‌ యొక్క ప్రయోగాల నుంచి నేరుగా వచ్చాయి. ఇవి ఎక్స్‌టర్నల్‌ వెర్షన్‌కు దాదాపుగా సమాంతరంగా ఉంటాయి. కాకపోతే ఇందులో గుండెతో నేరుగా అనుసంధానం కోసం చార్జ్‌ను ఇంటర్నల్‌ ప్యాడ్‌ల ద్వారా ఇస్తారు. ఇవి అన్ని ఆపరేషన్‌ థియేటర్లలోనూ ఉంటాయి. ఛాతి భాగం తెరచి ఆపరేషన్‌ చేసినప్పుడు, లేదా ఒక సర్జెన్‌ వేగంగా దీనిని తెరవగలిగినప్పుడు ఇవి ఉపయోగిస్తారు.

ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డిఫిబ్రిలేటర్‌ (AED)[మార్చు]

జపాన్‌లోని ఒక రైల్వేస్టేషన్‌లో ఉన్న AED.AED బాక్స్‌ పై, దానిని ఎలా ఉపయోగించాలనే సమాచారం జపనీస్‌, ఇంగ్లిష్‌, చైనీస్‌ మరియు కొరియన్‌ భాషల్లో ప్రచురించారు. స్టేషను‌ సిబ్బందికి దానిని వాడటం గురించి శిక్షణ ఇచ్చారు.

ఇవి కంప్యూటర్‌ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసిన సాధారణ యూనిట్లు. గుండె లయను దానంతట అదే గుర్తిస్తుంది. తర్వాత షాక్‌ అవసరమో లేదో సూచిస్తుంది. ఇవి సామాన్య ప్రజలు కూడా ఉపయోగించేందుకు వీలుగా తయారు చేయబడ్డాయి. కాకపోతే వీటిని సరిగా ఉపయోగించేందుకు కొద్దిపాటి శిక్షణ అవసరం. VF (వెంట్రిక్యులర్‌ ఫిబ్రిలేషన్‌) మరియు VT (వెంట్రిక్యులర్‌ టాచికార్డియా) రిథమ్స్‌లో హై జోల్‌ షాక్‌లు ఇస్తున్నప్పుడు వీటి పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య వృత్తి నిపుణులు వీటిని తక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే వీరు సెమీ ఆటోమేటిక్‌ యంత్రాల ద్వారానే అనేక రకాల సమస్యలను గుర్తించగలరు.

ఆటోమేటిక్‌ యూనిట్లు రిథమ్‌ను గురన్తించడానికి సాధారణంగా సమయం (సాధారణంగా 10-20 సెకన్లు) తీసుకుంటాయి. ఇదే సమయంలో మాన్యువల్‌ యూనిట్‌తో ప్రొఫెషనల్స్‌ దీనిని మరింత వేగంగా గుర్తించగలుగుతారు.[7] విశ్లేషణల్లో ఈ సమయం అంతరాయం, చాతి కంప్రెషన్‌ను ఆపేది కాబట్టి అనేక అధ్యయనాలలో షాక్‌ విజయం‌లో దీని ప్రభావం పై వ్యతిరేక ప్రభావం చూపించాయి.[8] ఈ ప్రభావం ఎహెచ్‌ఎ డిఫిబ్రిలేషన్‌ నిబంధనావళిపై తాజాగా మార్పులకు దారితీసింది. (కార్డియాక్‌ రిథమ్‌ను అంచనా వేయకుండా ఒక్కో షాక్‌కు సిపిఆర్‌ తర్వాత రెండు నిమిషాలు తీసుకుంటుంది). శిక్షణ పొందిన ఆపరేటర్లు, మాన్యువల్‌ డిఫిబ్రిలేటర్స్‌ లేని సమయంలో మాత్రమే AEDలను ఉపయోగించాలని కొన్ని సంస్థలు సూచనలు చేశాయి.[7]

ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డిఫిబ్రిలేటర్స్‌ సాధారణంగా సంఘటనలకు హాజరయ్యేలా శిక్షణ తీసుకున్న వ్యక్తులు మాత్రమే ఉపయోగిస్తారు. కార్పొరేట్‌, ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్‌ సెంటర్స్‌, విమానాశ్రయాలు, కాసినోలు, రెస్టారెంట్‌లు, హెటళ్లు, స్పోర్ట్స్‌ స్టేడియాలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లు, ఫిట్‌నెస్‌ సెంటర్లు మరియు హెల్త్‌ క్లబ్స్‌ లాంటి ప్రజా వినియోగం‌ ఉన్న యూనిట్లు కూడా వీటినే కలిగి ఉంటాయి.

ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్‌, అతికించడానికి సిద్ధంగా తెరచి ఉన్న ప్యాడ్లు.

ప్రజా వినియోగం‌ ఉన్న AEDలను గుర్తించాలంటే, ఎక్కువగా ప్రజలు ఎక్కడ సమూహాలుగా ఉంటారో తెలుసుకోవాలి. ప్రమాదం‌ వచ్చే అవకాశం ఉన్నవారు ఎక్కువగా ఉండేది ఎక్కడో పరిశీలించాలి. కార్డియాక్‌ అరెస్ట్‌ ఎక్కువగా వచ్చే ప్రదేశాలు ఏమిటో చూడాలి. ఉదాహరణకు, యుక్త వయస్సు పిల్లల కోసం ఏర్పాటు చేసే కేంద్రాలలో ప్రమాదం‌ తక్కువగా ఉంటుంది. (ఎందుంటే పిల్లలకు చాలా అరుదుగా VF లేదా VT లాంటి హార్ట్‌ రిథమ్స్‌ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే యువకులు ఎక్కువ మంది ఆరోగ్యంగా ఉంటారు. చాలా సందర్భాల్లో పిల్లల్లో కార్డియాక్‌ అరెస్ట్‌, రెస్పిరేటరీ అరెస్టు మరియు ట్రామాకు దారి తీస్తుంది. ఇక్కడ గుండె ఎక్కువగా అసిస్టోల్‌ అయి లేదా PEA (ఇక్కడ AEDతో ఉపయోగం ఉండదు)గా ఉంటుంది. మరోవైపు, 50 ఏళ్ల పైబడి వయసు ఉన్న పెద్దలు ఎక్కువగా ఉండే కార్యాలయాల్లో ప్రమాద‌ వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుంది.

చాలా ప్రాంతాల్లో అత్యవసర సర్వీసు వాహనాలు AEDలను కలిగి ఉంటాయి. అధిక ప్రాంతాల్లో EMT బేసిక్స్‌, మాన్యువల్‌ డిఫిబ్రిలేషన్‌ గురించి సరైన శిక్షణను కలిగి ఉండరు. కొన్ని అంబులెన్సులు మాన్యువల్‌ యూనిట్లకు అదనంగా AEDలను కలిగి ఉంటాయి. కొన్ని పోలీసు వాహనాలు, ఫైర్‌ సర్వీస్‌ వాహనాలు కూడా తొలుత స్పందించడానికి వీలుగా AEDలను కలిగి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిటీ తొలి స్పందనదారులు ఉంటారు. వీరు స్వచ్ఛందంగా AEDని కలిగి ఉండి, వారి ప్రాంతంలో బాధితులకు వీటి ద్వారా తక్షణ సాంత్వన కలగజేస్తారు. ఇటీవల కాలంలో రవాణా సాధనాల్లోనూ AEDలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్యపరమైన విమానాలు, క్రూయిజ్‌ షిప్‌లలో ఇవి ఏర్పాటు చేస్తున్నారు. నైపున్యమైన వైద్య సహాయం కొన్ని గంటల వరకూ అందుబాటులో లేని సమయాల్లో AEDలను కలిగి ఉండటం గుండెజబ్బు ఉన్న రోగులకు బాగా సహాయపడుతుంది.

AEDలు బాగా కనిపించడం కోసం, వీటికి రంగులు వేసి ఉంచుతారు. భవనం ద్వారం దగ్గర రక్షణ ఉన్న బోనుల్లో వీటిని ఉంచుతారు. ఎవరైనా ఈ బోనును తెరిచి, డిఫిబ్రిలేటర్‌ను తీస్తే, దగ్గర్లో ఉన్న సిబ్బందికి బజర్‌ శబ్దం వస్తుంది. దీనివల్ల ఎవరూ ప్రత్యేకంగా చెప్పకుండానే అత్యవసర సర్వీసు అందుబాటులోకి వస్తుంది. శిక్షణ పొందిన ఎఇడి ఆపరేటర్లు అందరూ అంబులెన్స్‌కు ఫోన్‌ చేయడానికి సన్నద్ధంగా ఉంటారు. రోగి అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పుడు ఎఇడి ఉపయోగిస్తున్నా, అత్యవసర సర్వీసు కోసం అంబులెన్స్‌లు అవసరం.

సెమీ ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డిఫిబ్రిలేటర్స్‌[మార్చు]

దస్త్రం:Lifepak.JPG
అంబులెన్స్‌లో ఏర్పాటు చేసిన లైఫ్‌ప్యాక్‌ సెమీ ఆటోమేటిక్‌ డీఫిబ్రిలేటర్‌/ECG మానిటర్‌ఈ యూనిట్లు కేవలం వైద్యరక్షణ నిపుణులు ఉపయోగించడానికి మాత్రమే రూపొందించబడ్డాయి. ఇవి రక్తపోటును తగ్గించడంతో పాటు రక్తంలోని ఆక్సిజన్‌ సాచురేషన్‌ పాయింట్‌ను గుర్తించి, ప్రాథమిక చర్యలను గుర్తిస్తాయి.

ఇవి పూర్తి మాన్యువల్‌ యూనిట్‌కు ఆటోమేటెడ్‌ యూనిట్‌కు మధ్యస్థంగా ఉంటాయి. ఇవి సాధారణంగా ఆరోగ్య రక్షణ ప్రొఫెషనల్స్‌కు ముందు ఉపయోగిస్తారు. వీరు పారామెడిక్స్‌ మరియు అత్యవసర వైద్య సాంకేతిక నిపుణులై ఉంటారు. ఈ యూనిట్లలో AED యొక్క ఆటోమేటెడ్‌ సామర్ధ్యంతో పాటు ECG డిస్‌ప్లే కూడా ఉంటుంది. క్లినీషియన్‌ సొంత నిర్ణయం తీసుకోవడానికి వీలుగా మాన్యువల్‌ కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో కంప్యూటర్‌ సహాయం లేకపోయినా నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ గుండె కొట్టుకునే రేటు తక్కువగా ఉంటే (బ్రాడికార్డియా) ఇవి పేస్‌మేకర్‌లా కూడా ఉపయోగపడతాయి. అంతే కాకుండా నైపుణ్యం ఉన్న ఆపరేటర్లు చేసే పనులు వీరు కూడా చేయగలుగుతారు.

ఇమ్‌ప్లాంటబుల్‌ కార్డియోవెర్టర్‌-డిఫిబ్రిలేటర్‌ (ICD)[మార్చు]

ఇవి ఆటోమేటిక్‌ ఇంటర్నల్‌ కార్డియాక్‌ డిఫిబ్రిలేటర్‌ (AICD)గా సుపరిచితం. ఈ పరికరాలు ఇమ్‌ప్లాంటర్స్‌. ఇవి పేస్‌మేకర్స్‌కు సమాంతరంగా (పేస్‌మేకింగ్‌ ఫంక్షన్‌ కూడా ఇవి ప్రదర్శించగలుగుతాయి)ఉంటాయి. ఇవి స్థిరంగా రోగి యొక్క గుండె రిథమ్‌ను పర్యవేక్షిస్తుంటాయి. ప్రాణాన్ని ప్రమాదంలో పడేసే అనేక యారెథిమియాస్‌ నుంచి రక్షించేందుకు, అందులో ఉన్న ప్రోగ్రామ్స్‌ ప్రకారం వాటంతట అవే షాక్‌లు ఇస్తాయి. చాలా ఆధునిక పరికరాల్లో వెంట్రిక్యులర్‌ ఫిబ్రిలేషన్‌, వెంట్రిక్యులర్‌ టాచికార్డియాలకు ఉన్న తేడాలను గుర్తించే పరిజ్ఞానం ఉంటుంది. చాలా సందర్భాల్లో సుప్రావెంట్రిక్యులర్‌ టాచికార్డియా మరియు ఆట్రియల్‌ ఫిబ్రిలేషన్‌కు సంబంధించిన ఎరాథిమియాస్‌ను గుర్తించవచ్చు. కొన్ని పరికరాలు సింక్రనైజ్డ్‌ కార్డియోవర్షన్‌ను ముందుగానే తొలగిస్తాయి. ప్రాణాన్ని ప్రమాదంలో పడేసే వెంట్రిక్యులర్‌ ఫిబ్రిలేషన్‌ ఏర్పడినప్పుడు, సింక్రనైజ్‌ కాని షాక్‌ను తక్షణమే ఇచ్చేలా ఇందులో ప్రోగ్రామ్‌ రూపొందించబడి ఉంటుంది.

కొన్ని సందర్భాలలో రోగుల యొక్క ICD స్థిరంగా లేకపోవడం జరుగుతుంది. దీనిని వైద్యపరమైన అత్యవసరంగా పిలుస్తారు. ఇది పరికరం యొక్క బ్యాటరీ జీవితం తగ్గిపోయినప్పుడు జరిగితే, రోగిలో ఉత్కంఠ పెరగడంతో పాటు అసౌకర్యానికి లోనవుతాడు. ఇప్పుడు కొన్ని అత్యవసర వైద్య సేవల‌ వ్యక్తులు, రింగ్‌ అయస్కాంతాన్ని ఈ పరికరం పై అమర్చుకుంటున్నారు. ఇది పరికరం యొక్క షాక్‌ ఫంక్షన్‌ను సమర్ధంగా నిర్వీర్యం చేయడంతో పాటు, పేస్‌మేకర్‌ పని చేయడానికి తోడ్పడుతుంది (పరికరం ఎక్విప్‌మెంట్‌తో ఉంటే). ఒకవేళ పరికరం తరచుగా షాక్‌ను కలిగిస్తుంటే, EMS‌ వ్యక్తులు దీనిని సెడేషన్‌ చేసే అవకాశం ఉంది.

ధరించదగిన కార్డియాక్‌ డిఫిబ్రిలేటర్‌[మార్చు]

AICD యొక్క అభివృద్ధితో చెడ్డీ వలె ధరించదగిన ఒక చిన్న ఎక్స్‌టర్నల్‌ డిఫిబ్రిలేటర్‌ను తయారు చేశారు.[9] ఈ యూనిట్‌ రోగిని రోజులో 24 గంటల పాటూ పర్యవేక్షిస్తుంటుంది. అవసరమైనప్పుడు బైఫాసిక్‌ షాక్‌లను ఇస్తూ ఉంటుంది. ఇమ్‌ప్లాంటబుల్‌ డిఫిబ్రిలేటర్స్‌ కోసం ఎదురు చూస్తున్న రోగులకు ఈ పరికరం బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం వీటిని కేవలం ఒక్క కంపెనీ మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. ఇవి చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి.

మోడలింగ్‌ డీఫిబ్రిలేషన్‌[మార్చు]

కార్డియాక్‌ డీఫిబ్రిలేటర్‌ యొక్క సామర్ధ్యం దానిలో ఉన్న ఎలక్ట్రోడ్‌ల స్థానం పై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అనేక అంతర్గత డీఫిబ్రిలేటర్స్‌ ఆక్టోజెనరియన్స్‌లో ఏర్పాటు చేయబడి ఉంటాయి. కానీ కొద్ది మంది పిల్లలకు మాత్రమే ఈ పరికరం అవసరం. చిన్నపిల్లల్లో డీఫిబ్రిలేటర్స్‌ను ఏర్పాటు చేయడం చాలా క్లిష్టమైన పని. చిన్నవాళ్లు కాబట్టి, తర్వాతి కాలంలో వారు పెరుగుతారు. వీరిలో కార్డియాక్‌ అనాటమీ పెద్దవాళ్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. తాజాగా, ఒక సాఫ్ట్‌వేర్‌ మోడలింగ్‌ సిస్టమ్‌ను తయారు చేయడం పరిశోధనకారులు సఫలమయ్యారు. ఇది వ్యక్తుల యొక్క థోరాక్స్‌ను మ్యాపింగ్‌ చేసి, ఎక్స్‌టర్‌నల్‌ లేదా ఇంటర్నల్‌ కార్డియాక్‌ డీఫిబ్రిలేటర్‌ను ఎక్కడ ఏర్పాటు చేయొచ్చో గుర్తిస్తుంది.[ఉల్లేఖన అవసరం]

ప్రస్తుతం ఉన్న సర్జికల్‌ ప్లానింగ్‌ అప్లికేషన్స్‌ సహాయంతో, ఈ సాఫ్ట్‌వేర్‌ మియోకార్డియల్‌ వోల్టేజ్‌లో ఉండే అంశాలను అంచనా వేసి, డీఫైబ్రిలేషన్‌ను విజయవంతంగా ఎలా చేయొచ్చో తెలుసుకోవచ్చు. క్రిటికల్‌ మాస్‌ హైపోథీసిస్‌ ప్రకారం, డీఫిబ్రిలేషన్‌ త్రేష్‌హెల్డ్‌ వోల్టేజ్‌ గ్రేడియంట్‌, మెయో కార్డియాక్‌లో పెద్ద భాగంలో మెకో కార్డియల్‌ మాస్‌ ఉన్నప్పుడు మాత్రమే డీఫిబ్రిలేషన్‌ సమర్ధంగా పనిచేస్తుంది. సాధారణంగా మూడు నుంచి ఐదు వోల్ట్‌లలో సెంటిమీటర్‌కు ఒక గ్రేడియంట్‌ మాత్రమే గుండెలో 95 శాతానికి అవసరం. వోల్టేజ్‌ గ్రేడియంట్స్‌ 60 V/cm‌ కంటే ఎక్కువగా ఉంటే, కణజాలాన్ని దెబ్బతీస్తాయి. ఈ మోడలింగ్‌ సాఫ్ట్‌వేర్‌ డీఫిబ్రిలేసన్‌ ఎక్కువగా అవసరమైన సందర్భాల్లో వోల్టేజ్‌ గ్రేడియంట్స్‌ను తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది.

ప్రారంభంలో ఈ సాఫ్ట్‌వేర్‌లోని కదలికలను ఉపయోగించి ఎలక్ట్రోడ్‌ల స్థానాల్లో కొన్ని మార్పులను సూచించారు. ఇది డీఫిబ్రిలేషన్‌లో పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఇంజినీరింగ్‌ సమస్యలు అలాగే ఉన్నా, ఈ మోడలింగ్‌ వ్యవస్థ పిల్లలతో పాటు పెద్దవాళ్లలో డీఫిబ్రిలేటర్స్‌ను ఏర్పాటు చేసే ప్రదేశాన్ని గుర్తించడంలో ఉపయోగపడింది.

ఇటీవల వచ్చిన డీఫిబ్రిలేటర్స యొక్క గణితపరమైన నమూనాలు‌, కార్డియాక్‌ కణజాలం యొక్క బిడోమైన్‌ నమూనా‌ మాదిరిగా ఉన్నాయి. [10] ఒక గట్టి విద్యుత్‌ షాక్‌కు కార్డియాక్‌ కణజాలం ఎలా స్పందిస్తుందనేది, సహజమైన గుండె ఆకారం, ఫైబర్‌ జియోమెట్రీలను ఉపయోగించి లెక్కించారు.

రోగిలో అంతర్భాగం[మార్చు]

ఎలక్ట్రోడ్‌లలో బాగా ప్రాచుర్యం ఉన్నది (ఎక్కువగా సినిమాల్లో, టీవీల్లో చూపించేది) సంప్రదాయబద్దమైన మెటల్‌ పాడిల్‌. దీనికి ఒక (ప్లాస్టిక్‌) హ్యాండిల్‌ ఉంటుంది. ఒక షాక్‌ లేదా వరుస షాక్‌లు ఇస్తున్నప్పుడు ఇది రోగి యొక్క చర్మం మీద ఉంటుంది. ప్యాడిల్‌ ఉపయోగించడానికి ముందు, రోగి చర్మం పై ఒక జెల్‌ పూస్తారు. ఎలక్ట్రికల్‌ నిరోధాన్ని తగ్గించి, మంచి అనుసంధానాన్ని ఏర్పాటు చేసేందుకు ఇది ఉపకరిస్తుంంది. దీనినే చెస్ట్‌ ఇమ్‌పెడెన్స్‌ (డిసి డిస్‌చార్జ్‌తో సంబంధం లేకుండా) అని పిలుస్తారు. ఇవి సాధారణంగా మాన్యువల్‌ ఎక్స్‌టర్నల్‌ యూనిట్స్‌ ఉపయోగించినప్పుడు మాత్రమే కనిపిస్తాయి.

కొత్త తరహా రెసుసియేషన్‌ ఎలక్ట్రోడ్‌లను అడ్‌హెసివ్‌ ప్యాడ్‌ కోసం రూపొందించారు. వీటి వెనక భాగాన్ని తొలగించి, రోగికి అవసరం అనుకున్న సమయంలో చాతి పై అతికించవచ్చు. ఇది మరే ఇతర స్టిక్కర్‌లాగే ఉంటుంది. ఈ ఎలక్ట్రోడ్‌లు తర్వాత డీఫిబ్రిలేటర్‌కు అనుసంధానం‌ చేస్తారు. ఒకవేళ డీఫిబ్రిలేషన్‌ అవసరమైతే, యంత్రాన్ని చార్జ్‌ చేసి, షాక్‌ను డెలివర్‌ చేస్తారు. ఇలాంటి సమయంలో ప్యాడ్‌ను అమర్చడానికి లేదా తొలగించడానికి ఎలాంటి జెల్‌ అవసరం లేదు. ఈ ప్యాడ్లు చాలా ఆటోమేటెడ్‌, సెమీ ఆటోమేటెడ్‌ యూనిట్లలో కనిపిస్తాయి. ఇవి క్రమంగా నాన్‌ హాస్పిటల్‌ సెట్టింగ్స్‌లోనూ ప్యాడిల్స్‌ను రీప్లేస్‌ చేస్తాయి.

ప్రస్తుతం ఘన మరియు తడి జెల్‌ ఎడ్‌హెసివ్‌ ఎలక్ట్రోడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఘన జెల్‌ ఎలక్ట్రోడ్స్‌ ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటాయి ఎందుకంటే చర్మం పై ఎలక్ట్రోడ్స్‌ను తొలగించిన తర్వాత శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదు. ఏదేమైనా, ప్రస్తుతం ఘన జెల్‌ ఎలక్ట్రోడ్స్‌ను వాడటంలో డీఫిబ్రిలేషన్‌ సమయంలో కాలే‌ ప్రమాదం ఉందని భావిస్తున్నారు. తడి జెల్‌ ఎలక్ట్రోడ్స్‌ విద్యుత్‌ను సమానంగా శరీరంలోకి పంపుతాయి.

కొన్ని అడ్‌హెసివ్‌ ఎలక్ట్రోడ్స్‌ కేవలం డీఫిబ్రిలేషన్స్‌ కోసం మాత్రమే కాక, ట్రాన్స్ క్యుటేనియస్‌ ప్లేసింగ్‌కు మరియు సింక్రనైజ్డ్‌ ఎలక్ట్రికల్‌ కార్డియోవెర్షన్‌ కోసం కూడా వీటిని ఉపయోగిస్తారు.

ఆసుపత్రి వాతావరణంలో, ప్యాడిల్స్‌ సహజంగా ప్యాడ్ల రూపంలో వాడతారు ఎందుకంటే వీటిని ఏర్పాటు చేయడం, తొలగించడం చాలా సులభం. కార్డియాక్‌ అరెస్ట్‌ ఏర్పడిన సమయంలో ఇది చాలా క్లిష్టం. ఎందుంటే, ఈ సమయంలో ప్రతి సెకన్‌ నాన్‌పెర్‌ఫ్యూషన్‌ కణజాలం యొక్క నష్టం జరుగుతుంది. ఏదేమైనా, కార్డియాక్‌ అరెస్ట్‌ ఉందని అనుమానం వచ్చినప్పుడు, పాచెస్‌ను ప్రొఫాలటికల్‌గా అమర్చాలి. ఇది మనిషి ఏర్పాటు చేసే ప్యాడిల్స్‌ కంటే EKGని గుర్తించడంలో వేగంగా పని చేస్తాయి. అడ్‌హెసివ్‌ ఎలక్ట్రోడ్స్‌ డీఫిబ్రిలేటర్‌ను వాడే ఆపరేటర్‌ ఏర్పాటు చేసే ప్యాడిల్స్‌ కంటే సురక్షితం. ఇవి రోగితో ఆపరేటర్‌ శారీరకంగా కలగజేసుకుని (ఇవి ఎలక్ట్రికల్‌ కాబట్టి) పనిచేయడంలో ఉన్న ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల రోగికి షాక్‌ ఇచ్చే సమయంలో ఆపరేటర్‌ దూరంగా నిలుచుని చూడొచ్చు. అడ్‌హెసివ్‌ ప్యాచెస్‌లో షాక్‌ను సరిపడా డెలివర్‌ చేయడంలో ఎలాంటి బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ప్యాడిల్స్‌కు షాక్‌ డెలివర్‌ చేసే సమయంలో 25 lbs బలం అవసరం. ' [Citation Needed]

స్థానం[మార్చు]

రేసుసిసేషన్‌ ఎలక్ట్రోడ్‌లను రెండటిలో ఒక పద్దతిని ఉపయోగించి అమర్చవచ్చు. ది ఏంటిరియర్‌ పోస్టీరియర్‌ స్కీమ్‌ (చిత్రం‌) దీర్ఘకాలిక ఎలక్ట్రోడ్‌ల ఏర్పాటులో మంచి పద్దతి. ఇందులో ఒక ఎలక్ట్రోడ్‌ ఎడమ ప్రెసోర్డియమ్‌ పై (చాతి యొక్క కింది భాగంలో, గుండెకు ముందు) ఏర్పాటు చేస్తారు. మరో ఎలక్ట్రోడ్‌ను వెనకవైపు, గుండె వెకన స్కాపులా మధ్య భాగంలో ఏర్పాటు చేస్తారు. నాన్‌ ఇన్‌వేసివ్‌ పేసింగ్‌కు ఈ పద్దతి చాలా శ్రేయస్కరం.

ది ఏంటిరియర్‌ ఎపెక్స్‌ పద్దతిని ఏంటిరియర్‌ పోస్టీరియర్‌ పద్దతి ఉపయోగించడానికి సౌకర్యవంతంగా లేనప్పుడు లేదా అది అనవసరం అనుకున్నప్పుడు వినియోగిస్తారు. ఈ పద్దతిలో, ఏంటీరియర్‌ ఎలక్ట్రోడ్‌లను క్లావికిల్‌ కింద కుడివైపు అమరుస్తారు. ఎపెక్స్‌ ఎలక్ట్రోడ్‌ రోగి యొక్క ఎడమవైపు వినియోగిస్తారు. ఇది పెక్టోరియల్‌ కండరానికి కొద్దిగా ఎడమవైపు ఉంటుంది. ఈ స్కీమ్‌ డీఫిబ్రిలేషన్‌కు మరియు కార్డియోవెర్షన్‌కు బాగా పనిచేస్తుంది. ECGని పరిశీలిస్తూ ఉండటానికి కూడా ఇది మంచి పద్దతి.

ప్రసిద్ధ సంస్కృతి సిఫార్సులు[మార్చు]

రోగి యొక్క ఆరోగ్యాన్ని యంత్రాలు వేగంగా, నాటకీయంగా మెరుగుపరుస్తున్నందున, డీఫిబ్రిలేటర్స్‌ను తరచుగా సినిమాల్లో, టీవీల్లో, వీడియో గేమ్స్‌లో మరియు ఇతర ఫిక్షనల్‌ మీడియాలో ఉపయోగిస్తున్నారు. వీటి పనితీరు తరచుగా ఎక్కువగా అయిపోతుంది. డిఫిబ్రిలేటర్‌లు తరచుగా భయానకమైన జెర్క్‌లు ఇస్తున్నాయి లేదా రోగిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాస్తవంలో, చాలా అరుదుగానే ఇలా రోగి యొక్క కండరాల నాటకీయంగా దెబ్బతింటాయి. అదే విధంగా, వైద్యాన్ని అందించేవారు, డీఫిబ్రిలేటింగ్‌ రోగులను ECG రిథమ్‌ (యాసిస్టోల్‌గా కూడా పరిచితం) ఫ్లాట్‌ లైన్‌లో ఉంచుతారు. అయితే ఇది వాస్తవ జీవితంలో జరగదు. కేవలం కార్డియాక్‌ అరెస్ట్‌ రిథమ్స్‌ వెంట్రిక్యులర్‌ ఫిబ్రిలేషన్‌లో మరియు పల్స్‌లెస్‌ వెంట్రిక్యులర్‌ టాచికార్డియాలో సాధారణంగానే డీఫిబ్రిలేషన్‌ జరుగుతుంది. (ఇక్కడ అనేక రకాల హార్ట్‌ రిథమ్స్‌ ఉంటాయి. రోగి కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైనప్పుడు వీటికి షాక్‌ ఇస్తారు. సుప్రావెంట్రిక్యులర్‌ టాచ్‌కార్డియా మరియు వెంట్రిక్యులర్‌ టాచికార్డియా లాంటివి పల్స్‌ను సృష్టిస్తాయి. ఈ పద్దతిని కార్డోవెర్షన్‌ అని పిలుస్తారు. ఇది డీఫిబ్రిలేషన్‌ కాదు)

1990ల వరకూ ఆస్ట్రేలియాలో అంబులెన్స్‌లు డీఫిబ్రిలేటర్స్‌ను కలిగి ఉండటం చాలా అరుదు. 1990 తర్వాత ఆస్ట్రేడియా మీడియా మొఘల్‌ కెర్రీ ప్యాకర్‌కు గుండెపోటు వచ్చాక ఈ పద్దతిని మార్చారు. ఆయనకు గుండెపోటు వచ్చినప్పుడు పిలిచిన అంబులెన్స్‌లో అదృష్టవశాత్తు డీఫిబ్రిలేటర్‌ ఉంది. కోలుకున్న తర్వాత, కెర్రీ ప్యాకర్‌ న్యూ సౌత్‌వేల్స్‌లోని అంబులెన్స్‌ సర్వీసుల కోసం భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ డబ్బుతో న్యూసౌత్‌వేల్స్‌లో ఉన్న అన్ని అంబులెన్స్‌లలోనూ డీఫిబ్రిలేటర్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. అందుకే ఈ సంఘటన తర్వాత ఆస్ట్రేలియాలో డీఫిబ్రిలేటర్‌లను ప్యాకర్‌ వాకర్స్‌ అని పిలుస్తున్నారు.[11]

వీటిని కూడా పరిశీలించండి[మార్చు]

 • కార్డియోపల్‌మోనరీ రెసుసియేషన్‌ (CPR‌)
 • ఆధునిక కార్డియాక్‌ లైఫ్‌ సపోర్ట్‌ (ACLS)
 • కార్డియో వర్షన్‌
 • ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్‌నల్‌ డీఫిబ్రిలేటర్‌
 • మెయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌కేషన్‌ (గుండెపోటు)
 • అంబులెన్స్‌
 • ధరించగలిగిన కార్డియోవెర్టర్‌ డీఫిబ్రిలేటర్‌

సూచనలు[మార్చు]

 1. "Claude Beck, defibrillation and CPR". Case Western Reserve University. మూలం నుండి 2007-10-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-06-15. Cite web requires |website= (help)
 2. Sov Zdravookhr Kirg. "Some results with the use of the DPA-3 defibrillator (developed by V. Ia. Eskin and A. M. Klimov) in the treatment of terminal states" (Russian లో). Retrieved 2007-08-26. Cite web requires |website= (help)CS1 maint: unrecognized language (link)
 3. "హార్ట్‌ స్మార్టర్‌; ఇఎమ్‌ఎస్‌ ఇంప్లికేషన్‌ ఆఫ్‌ ది 2005 AHA గైడ్‌లైన్‌ ఫర్‌ ECC&CPR" (PDF). మూలం (PDF) నుండి 2007-06-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-24. Cite web requires |website= (help)
 4. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2013-01-05 న ఆర్కైవు చేసారు. Retrieved 2020-01-07. Cite web requires |website= (help)
 5. Aston, Richard (1991). Principles of Biomedical Instrumentation and Measurement: International Edition. Merrill Publishing Company. ISBN 0-02-946562-1.
 6. "Pacemaker Failure following External Defibrillation" (PDF). Circulation: Journal of the American Heart Association. 1972. ISSN 1524-4539.
 7. 7.0 7.1 editors Jasmeet Soar ... (2006). Immediate Life Support: Second Edition. Resuscitation Council (UK). ISBN 1-903812-12-7. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)CS1 maint: extra text: authors list (link)
 8. ఎఫ్‌టెస్టల్‌ టి, సుండె కె, స్టీన్‌ పిఎ. ఎఫెక్ట్స్‌ ఆఫ్‌ ఇంటరప్టింగ్‌ ప్రిసోర్డియల్‌ కంప్రెసన్స్‌ ఆన్‌ ది కాలిక్యులేటెడ్‌ ప్రాబబులిటీ ఆఫ్‌ డీఫిబ్రిలేషన్‌ సక్సెస్‌ డ్యూరింగ్‌ అవుట్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ కార్డియాక్‌ అరెస్ట్‌, సర్క్యులేషన్‌
 9. "What is the LifeVest?". Zoll Lifecor. మూలం నుండి 2008-11-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-02-09. Cite web requires |website= (help)
 10. Trayanova N (2006). "Defibrillation of the heart: insights into mechanisms from modelling studies". Experimental Physiology. 91 (2): 323–337. doi:10.1113/expphysiol.2005.030973. PMID 16469820.
 11. "Defibrillation". Farlex, Inc. Retrieved 2009-04-21. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]

మూస:Emergency medicine