డీశాలినేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Desalination

డీశాలినేషన్, డీశాలినైజేషన్, లేదా డీశాలినైసేషన్ అనేది నీటి నుండి అధికమైన లవణం మరియు ఇతర ఖనిజాలను తొలగించే అనేక ప్రక్రియల్లో ఒకటి. మరింత సామాన్యంగా, డీశాలినేషన్ అంటే, నేల డీశాలినేషన్లో మాదిరిగానే, లవణాలు మరియు ఖనిజాలను తొలగించడాన్ని సూచించవచ్చు[1].[2]

మొదటి సారిగా డీశాలినేషన్ను కనుగొన్నవారు ఫ్రెడ్ఢీ మరియు మెర్క్యురి. నీటి నుండి లవణాలను తొలగించడం ద్వారా ఉప్పునీటిని మంచి నీరుగా మార్చడం.ఇది మానవ ఉపయోగం లేదా నీటి పారుదలకు అనుకూలంగా మార్చడం జరుగుతుంది. కొన్ని సార్లు ఈ ప్రక్రియలో అదనపు ఉత్పత్తిగా టేబుల్ సాల్ట్ ఉత్పత్తి అవుతుంది. దీనిని సముద్రంలోకి వెళ్ళే ఎన్నో ఓడలు మరియు జలాంతర్గాములలో వాడతారు. డీశాలినేషన్ పై చాలా వరకూ ఆధునిక ఉత్సాహం, నీటి లభ్యత పరిమితంగా ఉన్న లేదా అవుతున్న ప్రాంతాల్లో మానవ ఉపయోగానికి తాజా నీటిని అందించేందుకు తక్కువ-ఖర్చుతో కూడిన మార్గాలను అభివృద్ధి పరచడం, వలన కలిగింది.

పెద్ద-స్థాయి డీశాలినేషన్ సామాన్యంగా అత్యధిక పరిమాణాల్లో శక్తిని, ప్రత్యేకమైన, ఖరీదైన యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటుంది, దీనివలన ఇది నదీజలాలు లేదా భూజలాల నుండి తాజా నీటి ఉపయోగానికన్నా ఎంతో ఖరీదైనది.[3]

ప్రపంచంలో అతి పెద్ద డీశాలినేషన్ ప్లాంట్ సంయుక్త అరబ్ ఎమిరేట్స్లోని జేబెల్ అలీ డీశాలినేషన్ ప్లాంట్ (ఫేస్ 2). ఇది రెండు-ప్రయోజనాల సౌకర్యం, ఇది బహుళ-స్థాయి త్వరిత శుద్ధీకరణను ఉపయోగిస్తుంది మరియు సంవత్సరానికి 300 మిలియన్ ఘన మీటర్ల నీటి ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అన్నింటినీ పోల్చినప్పుడు, సంయుక్త రాష్ట్రాలలోని అతిపెద్ద డీశాలినేషన్ ప్లాంట్ టంపా బే, ఫ్లోరిడాలో ఉంది మరియు టంపా బే వాటర్చే నడుపబడుతుంది, ఇది డిసెంబరు 2007లో మొదలై, సంవత్సరానికి 34.7 మిలియన్ ఘన మీటర్ల నీటిని డీ-శాలినేట్ చేయడం ప్రారంభించింది.[4] జేబెల్ అలీ డీశాలినేషన్ ప్లాంట్స్ తో పోలిస్తే టంపా బే ప్లాంట్ సుమారు 12% ఉత్పత్తి చేస్తుంది. వాల్ స్ట్రీట్ జర్నల్లో 2008 జనవరి 17, నాటి వ్యాసం ఇలా చెపుతుంది, "ఇంటర్నేషనల్ డీశాలినేషన్ అసోసియేషన్ ప్రకారం ప్రపంచ-వ్యాప్తంగా, 13,080 డీశాలినేషన్ ప్లాంట్స్ రోజుకు 12 బిలియన్ గాలన్ల కన్నా ఎక్కువ నీటిని ఉత్పత్తి చేస్తాయి."[5]

బహుళ-దశ త్వరిత పథకం డీ-శాలినేటర్ A - ప్రవాహం లోపలికి B - సముద్రపు నీరు లోపలి C - రవాణా నీరు వెలుపలికి D - వ్యర్థం వెలుపలికి E - ఆవిరి వెలుపలికి F - ఉష్ణ మార్పిడి G - ఘనీభవన సమూహం H - ఉప్పు నీటి హీటర్
సామాన్య రివర్స్ ఆస్మాసిస్ డీశాలినేషన్ ప్లాంట్ పథకం

విషయ సూచిక

పద్ధతులు[మార్చు]

ఈ ప్రయోగాలలో వాడే సంప్రదాయ ప్రక్రియ శూన్య శుద్ధీకరణ—అవశ్యకంగా నీటిని వాతావరణ పీడనానికన్నా తక్కువలో, తద్వారా సాధారణం కన్నా మరింత తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరిగించడం. ఇది ఎందుకంటే ద్రవం మరగడం బాష్ప పీడనం అక్కడి పీడనానికి సమమైనప్పుడు జరుగుతుంది, మరియు బాష్ప పీడనం, ఉష్ణోగ్రతతో పాటు పెరుగుతుంది. కాబట్టి, తగ్గిన ఉష్ణోగ్రత వలన, శక్తి ఆదా అవుతుంది. ఒక ముఖ్యమైన శుద్ధీకరణ పద్ధతి బహుళ-స్థాయి త్వరిత శుద్ధీకరణ, ఇది 2004లో ప్రపంచవ్యాప్తంగా 85% ఉత్పత్తికి కారణంగా ఉంది.[6]

బార్సిలోన, స్పెయిన్ లోని రివర్స్ ఆస్మాసిస్ డీశాలినేషన్ ప్లాంట్

ప్రధానమైన పోటీ పద్ధతులు డీ-శాలినేట్ చేయడానికి పొరలను వాడతాయి, ముఖ్యంగా రివర్స్ ఆస్మాసిస్ సాంకేతికతను ప్రయోగిస్తాయి.[ఉల్లేఖన అవసరం] పొర పద్ధతులు, పాక్షికంగా వడకట్టే పొరల్ని మరియు పీడనాన్ని ఉపయోగించి నీటి నుండి లవణాల్ని వేరుచేస్తాయి.[ఉల్లేఖన అవసరం] రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్ పొర వ్యవస్థలు సామాన్యంగా ఉష్ణ శుద్ధీకరణ కన్నా తక్కువ శక్తిని వినియోగిస్తాయి, దీంతో గత దశాబ్దంలో మొత్తమ్మీద డీశాలినేషన్ ఖర్చులు తగ్గడం జరిగింది. డీశాలినేషన్ శక్తి-ఆధారితమైనది, కానీ భవిష్యత్తు ఖర్చులు శక్తి మరియు డీశాలినేషన్ సాంకేతికత ఖర్చులపై ఆధారపడడం కొనసాగుతుంది.[ఉల్లేఖన అవసరం]

పరిశీలనలు మరియు విమర్శ[మార్చు]

మూస:Criticism section

సహ-ఉత్పాదన[మార్చు]

సహ-ఉత్పాదన అనేది శక్తి ఉత్పత్తిలోని అదనపు ఉష్ణాన్ని మరొక పనికి ఉపయోగించే ప్రక్రియ. డీశాలినేషన్ నేపథ్యంలో, సహ-ఉత్పాదన అనేది సముద్రజలం లేదా brackish భూజలం నుండి రవాణా చేయగలిగే నీరు ఉత్పత్తి చేసే ఒక ఏకీకృత, లేదా "ద్వి-ప్రయోజనాల" సౌకర్యం, ఇందులో డీశాలినేషన్ ప్రక్రియకు శక్తి మూలంగా ఒక పవర్ ప్లాంట్ ఉపయోగపడుతుంది. ఈ సౌకర్యపు శక్తి ఉత్పత్తి పూర్తిగా రవాణా చేయగలిగే నీటికి (వేరైన సౌకర్యం) అంకితం చేయవచ్చు, లేదా అదనపు శక్తి ఉత్పత్తి చేసి, శక్తి వ్యవస్థలో చేర్చవచ్చు (ఒక నిజమైన సహ-ఉత్పాదన సౌకర్యం). సహ-ఉత్పాదనలో వివిధ రూపాలున్నాయి మరియు సైద్ధాంతికంగా ఎలాంటి శక్తి ఉత్పత్తి రూపాన్నైనా వాడవచ్చు. కానీ, ఎన్నో ప్రస్తుతం మరియు భవిష్యత్తులో నిశ్చయించిన సహ-ఉత్పాదన డీశాలినేషన్ ప్లాంట్స్ శిలాజ ఇంధనాలు లేదా అణుశక్తిని వాటి శక్తి మూలాలుగా ఉపయోగించుకుంటాయి. చాలా వరకూ ప్లాంట్స్, వాటి పెట్రోలియం వనరులు మరియు రాయితీల కారణంగా, మధ్య ప్రాచ్యం లేదా ఉత్తర ఆఫ్రికాలో ఉన్నాయి. ద్వి-ప్రయోజన సౌకర్యాల లాభమేమిటంటే అవి శక్తి వినియోగంలో మెరుగైనవి, కాబట్టి నీటి వనరుల సమస్య కలిగిన ప్రదేశాలలో త్రాగునీటికి డీశాలినేషన్ మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.[7][8]

శేవ్చెంకో BN350, ఒక అణుశక్తిచే-ఉష్ణం పొందే డీశాలినేషన్ శాఖ

ది అట్లాంటా జర్నల్-కాన్స్టిట్యూషన్ లోని అభిప్రాయ వేదికలో, 2007 డిసెంబరు 26, నాడు, జార్జియా టెక్ యొక్క అణుశక్తి మరియు రేడియో-ధార్మిక సాంకేతికత ప్రొఫెసర్ ఇలా వ్రాసాడు, "...అత్యధిక స్థాయిలో రవాణా నీటి ఉత్పాదనకు ... అణుశక్తి రియాక్టర్లు ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలలో ఉపయోగంలో ఉంది, ఇండియా నుండి జపాన్ మరియు రష్యావరకూ ఉంది. డీశాలినేషన్ ప్లాంట్స్ తో సందానించిన ఎనిమిది అణుశక్తి రియాక్టర్లు కేవలం జపాన్ లోనే పనిచేస్తున్నాయి ... అణుశక్తి డీశాలినేషన్ ప్లాంట్స్ భూమార్గంలో వందల కొద్దీ మైళ్ళకు రవాణా చేయగలిగే నీటిని ఉత్పత్తి చేయగలవు..."[9][10]

అదనంగా, ద్వి-ప్రయోజన సౌకర్యాలలో ప్రస్తుత రీతి సంకర వ్యవస్థలు, వీటిలో RO డీశాలినేషన్ భాగం నుండి వెలువడిన పదార్థాన్ని థర్మల్ డీశాలినేషన్ నుండి వెలువడిన శుద్ధ వస్తువుతో కలపడం జరుగుతుంది. ప్రాథమికంగా శక్తి ఉత్పాదనకు రెండు లేదా ఎక్కువ డీశాలినేషన్ ప్రక్రియలు కలపబడతాయి. అటువంటి సౌకర్యాలు ఇప్పటికే సౌది అరేబియాలోని జెడ్డా మరియు యంబులలో ఏర్పాటు చేయబడ్డాయి.[11]

U.S. సైన్యంలోని ఒక సామాన్య విమాన వాహకం రోజుకు 400,000 గాలన్లను (US గాల్.) లేదా 1514 m³ నీటిని డీ-శాలినేట్ చేయడానికి అణుశక్తిని వినియోగిస్తుంది.[12]

ఆర్ధిక లావాదేవీలు[మార్చు]

డీశాలినేషన్ కు మూలధన మరియు ఉత్పాదన ధరల్ని నిర్ణయించడంలో ఎన్నో కారణాలు ఉంటాయి: వసతి యొక్క సామర్థ్యం మరియు రకం, ప్రదేశం, వాడుక నీరు, శ్రామికులు, శక్తి, ఆర్థిక అవసరాలు మరియు వ్యర్థ పదార్థాల ఏర్పాట్లు. ప్రస్తుతం డీశాలినేషన్ స్టిల్స్ పీడనం, ఉష్ణోగ్రత మరియు ఉప్పునీరు నీటి గాఢతను నియంత్రించి నీరు రాబట్టే నైపుణ్యాన్ని పెంపొందిస్తాయి. అణుశక్తి-గల డీశాలినేషన్ పెద్ద స్థాయిలో పొదుపైనది కావచ్చు.[13][14]

ధరలు తగ్గుతున్నట్టూ గమనించి, మరియు సముద్రాలకు చేరువలో ఉన్న ధనిక ప్రాంతాలకు సాంకేతికత మంచిదని భావించినా, ఒక పరిశోధన ప్రకారం "లవణాలు తొలగించిన నీరు కొన్ని నీటి-కరువు ప్రాంతాలకు పరిష్కారం కావచ్చు, కానీ బీద, ఖండంలో లోపలివైపు లేదా ఎత్తైన ప్రదేశాలలో ఉండే ప్రాంతాలకు కాదు. దురదృష్టవశాత్తూ, అత్యధిక నీటి సమస్యలు అక్కడే ఉంటాయి." మరియు "నిజంగా, నీటిని 2000 మీ ఎత్తుకు మోయడం లేదా 1600 కి మీ పైగా రవాణా చేయడం వంటి ఖర్చులకు డీ-శాలినేషన్ ఖర్చులు సమానంగా ఉంటాయి. కాబట్టి, డీ-శాలినేట్ చేయడం కన్నా మరెక్కడి నుండైనా నీటిని రవాణా చేయడం పొదుపైన పద్ధతి కావచ్చు. క్రొత్త ఢిల్లీ వంటి సముద్రం నుండి దూరంగా ఉండే ప్రదేశాలలో, లేదా మెక్సికో సిటీవంటి ఎత్తైన ప్రదేశాలలో, అధికమైన డీశాలినేషన్ ఖర్చులకు అదనంగా అధికమైన రవాణా ఖర్చులు కూడా తోడవుతాయి. ఇంకా లవణాలు తొలగించిన నీరు రియాద్ మరియు హరారేవంటి సముద్రం నుండి దూరమైన మరియు ఎత్తైన ప్రదేశాలలో ఖరీదైనదిగా ఉంటుంది. ఎన్నో చోట్ల, ప్రధానమైన ఖర్చు డీశాలినేషన్ కు సంబంధించింది, రవాణాకు కాదు; కాబట్టి ఈ ప్రక్రియ బీజింగ్, బాంగ్ కాక్, జారగోజా, ఫీనిక్స్, మరియు తీర ప్రదేశాలైన ట్రిపోలివంటి చోట్ల కొద్దిగా తక్కువ ఖరీదైనది."[15] జుబైల్, సౌది అరేబియాలో లవణాలు తొలగించిన తరువాత, నీరు 200 miles (320 km) భూమార్గం గుండా గొట్టాల నుండి రాజధాని నగరం రియాద్ కు పంపబడుతుంది.[16] తీరంలోని నగరాల్లో, డీశాలినేషన్ ను సరిగా ఉపయోగించని మరియు అపరిమిత నీటి మూలంగా భావిస్తారు.

అయినప్పటికీ, డీశాలినేషన్ నీటిని తిరిగి ఉపయోగించడం మరియు పాడయిన యంత్రాంగాలను లెక్కలోనికి తీసుకోదు.[ఉల్లేఖన అవసరం] నీటిని ఫౌంటెన్ వాలీ, CA, ఫెయిర్ఫాక్స్, VA, ఎల్ పసో, TX మరియు స్కాట్స్ డేల్, AZ లలో తిరిగి వాడారు. ఈ ప్రక్రియ, తక్కువ లవణ శాతం వలన డీశాలినేషన్ కన్నా 50% తక్కువ శక్తిని వినియోగించుకుంటుంది, మరియు తాజా నీటిని లవణాలు తొలగించిన సముద్రపు నీటికన్నా 30% తక్కువ ఖర్చుతో వినియోగదారుడికి అందిస్తుంది, పైగా డీశాలినేషన్ ప్లాంట్స్ వలన జలజీవనానికి మరియు వాతావరణ సమతౌల్యానికీ జరిగే నష్టం కూడా ఉండదు.[ఉల్లేఖన అవసరం]

ఇజ్రాయెల్ ప్రస్తుతం నీటిలో ఘన మీటరుకు US$0.53 ఖర్చుతో లవణాల్ని తొలగిస్తోంది.[17] సింగపూర్ ప్రస్తుతం నీటిలో ఘన మీటరుకు US$0.49 ఖర్చుతో లవణాల్ని తొలగిస్తోంది.[18] అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నో పెద్ద తీర నగరాలు తప్పనిసరిగా వాన నీటి తొట్టెలు లేదా తుఫాను నీటి భద్రతా యంత్రాంగం ఏర్పాట్లు చేయవలసిన ఇతర నీటి పంపిణీ అవకాశాలతో పోల్చినపుడు ధర-తక్కువైనందు వలన, సముద్రపు నీటి డీశాలినేషన్ సాధ్యాసాధ్యాలను ఆలోచిస్తున్నాయి. పరిశోధనలు[ఉల్లేఖన అవసరం] పెద్ద-స్థాయిలో త్రాగడానికి శుద్ధి చేసిన నీటిని మరలా ఉపయోగించడం కన్నా డీశాలినేషన్ మరింత పొదుపైనది అని తెలుపుతున్నాయి, మరియు ఎంతో ఖరీదైన వాన నీటి తొట్టెలు, లేదా తుఫాను నీటి భద్రతా యంత్రాంగం ఏర్పాటు చేయడం కన్నా ఇది సిడ్నీలో మరింత పొదుపైనది. పెర్త్ నగరం విజయవంతంగా [19] ఒక రివెర్స్ ఆస్మాసిస్ సముద్రపు నీటి డీశాలినేషన్ ప్లాంట్ ను 2006 నుండి నడుపుతోంది మరియు వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ ప్రభుత్వం నగరం అవసరాలకు రెండవ ప్లాంట్ కడతామని చెప్పడం జరిగింది. ఆస్ట్రేలియాలోని అతి పెద్ద నగరం సిడ్నీలో డీశాలినేషన్ ప్లాంట్ కడుతున్నారు, [20] మరియు వన్తగ్గి డీశాలినేషన్ ప్లాంట్ ను వన్తగ్గి, విక్టోరియాలో కట్టాలని నిర్ణయించడం జరిగింది.

పెర్త్ డీశాలినేషన్ ప్లాంట్ పాక్షికంగా ఎము డౌన్స్ విండ్ ఫార్మ్ నుండి పునరుత్పత్తి చేసిన శక్తిని ఉపయోగించుకుంటుంది.[21] సిడ్నీ ప్లాంట్ పూర్తిగా పునరుత్పత్తి వనరులచే శక్తిని పొందుతుంది, [22] దాంతో పర్యావరణంలోనికి హానికర గ్రీన్ హౌస్ వాయువులను విడవడం నివారిస్తుంది, ఇది సాంకేతికత కారణంగా శక్తి అవసరాలకు సముద్రపు నీటిని డీశాలినేషన్ చేయడానికి వ్యతిరేకంగా సామాన్యంగా వినిపించే వాదన. డీశాలినేషన్ ప్లాంట్స్ కొరకు పునరుత్పత్తి శక్తిని కొనడం లేదా ఉత్పత్తి చేయడం వలన సహజంగా డీశాలినేషన్ యొక్క మూలధన మరియు/లేదా ప్రయోగ ఖర్చులు పెరుగుతాయి. కానీ, ఇటీవలి పెర్త్ మరియు సిడ్నీ అనుభవం అదనపు ఖర్చును సమాజం భరిస్తుందని సూచిస్తుంది, అప్పుడైతే నగరం వాతావరణానికి హాని చేయకుండా నీటి పంపిణీని పెంచుకోవచ్చు. ది క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే గోల్డ్ కోస్ట్ డీశాలినేషన్ ప్లాంట్ పూర్తిగా పునరుత్పత్తి వనరుల నుండి శక్తిని పొందుతుందని ప్రకటించి, అదే సమయంలో పెర్త్ మరియు సిడ్నీలలో ఏర్పాటు చేసిన ఇతర ప్రధాన ప్లాంట్ల తరహాలో తన వాతావరణ ముద్రను వేసింది.

డిసెంబరు 2007 లో, దక్షిణ ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఒక సముద్రపు నీటి డీశాలినేషన్ ప్లాంట్ ను ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరం కొరకు, పోర్ట్ స్థాన్వాక్లో నిర్మించనున్నట్టూ తెలిపింది. నీటి ధరలను పెంచడం ద్వారా పూర్తి ధర వసూలు చేసి ఈ డీశాలినేషన్ ప్లాంట్ ను నెలకొల్పడం జరుగుతుంది. [3] [4] ఒక ఆన్లైన్, వైజ్ఞానికం కాని ఎన్నికలో సుమారు 60% వోట్లు డీశాలినేషన్ ఖర్చుల కొరకు నీటి ధరను పెంచడం మంచిదని సూచించడం జరిగింది. [5]

వాల్ స్ట్రీట్ జర్నల్లో 2008 జనవరి 17, నాటి వ్యాసం ఇలా చెపుతుంది, "నవంబర్లో, కనెక్టికట్-లోని పోసీడాన్ రిసోర్సెస్ కార్ప్. US$300 మిలియన్ నీటి-డీశాలినేషన్ ప్లాంట్ ను కార్లస్బాద్లో, సాన్ డియేగోకు ఉత్తరంగా నిర్మించేందుకు ఒక ప్రధానమైన నియంత్రణ సమ్మతిని పొందింది. ఈ వసతి దక్షిణార్థ గోళంలో అతి పెద్దది, ఇందులో రోజుకు 50 మిలియన్ [U.S.] గాలన్ల [190,000 m³] త్రాగు నీరు, సుమారు 100,000 ఇళ్ళకు సరిపడేంత ఉత్పత్తి అవుతుంది ... గత దశాబ్దంలో మెరుగైన సాంకేతికత డీశాలినేషన్ ఖర్చులను సగానికి తగ్గించింది, దీంతో ఇది మరింత మెరుగైంది ... పోసీడాన్ ఆ నీటిని ఎకరం-అడుగుకు [1200 m³] సుమారు US$950 ధరకు అమ్మాలని ఆలోచిస్తోంది. ఇది స్థానిక సంస్థలు ప్రస్తుతం నీటికి చెల్లిస్తున్న సగటు ఎకరం-అడుగుకు [1200 m³] US$700 తో సమానం." [6] ఎకరం-అడుగుకు $1,000 అంటే 1,000 గాలన్లకు $3.06, ఇది స్థానిక నీటి వినియోగదారులు అలవాటు పడిన చెల్లింపు విధానంలో నీటి కొలత ప్రమాణం.[7][8].

పోసీడాన్ రిసోర్సెస్ ఈ నియంత్రణ అడ్డంకిని ఎదుర్కొన్నా, కాలిఫోర్నియా చట్టం ప్రకారం, జలజీవనానికి నీటి పారుదల గొట్టం కలిగించే సమస్యను తొలగించేలా సమ్మతి పొందే వరకూపూర్తిగా విజయవంతం కాలేదు. టంపా బే, FLలో ఒక డీశాలినేషన్ ప్లాంట్, టంపా బే దేశాల్ కట్టడానికి 2001లో విఫలప్రయత్నం చేసినా, పోసీడాన్ రిసోర్సెస్, కార్లస్బాద్, CAలో, కాస్త ప్రగతిని సాధించింది. టంపా బే వాటర్ యొక్క బోర్డ్ అఫ్ డైరెక్టర్స్, టంపా బే దేశాల్ ను పోసీడాన్ రిసోర్సెస్ నుండి 2001లో ప్రాజెక్ట్ యొక్క మూడవ వైఫల్యాన్ని నివారించడానికి కొనవలసి వచ్చింది. 2007 లో ఈ వసతిని పూర్తిగా ఉపయోగించే ముందు జలజీవనం మరియు అభివృద్ధి కొరకు రివర్స్ ఆస్మాసిస్ పాటిస్తూ, టంపా బే వాటర్ అయిదేళ్ళ పాటు సాంకేతిక సమస్యలను ఎదుర్కొని 20% సామర్థ్యంతో పనిచేయవలసివచ్చింది.[23]

ఫోర్బ్స్ పత్రికలో 2008 మే 9, నాడు వెలువడిన వ్యాసం ప్రకారం, సాన్ లీన్డ్రో, కాలిఫోర్నియాలోని, ఎనర్జీ రికవరీ ఇంక్.అనబడే సంస్థ నీటిని ఘన మీటరుకు US$0.46 ఖర్చుతో డీ-శాలినేట్ చేసేది.[24]

గ్లోబ్ అండ్ మెయిల్ పత్రికలో 2008 జూన్ 5, నాటి వ్యాసం ప్రకారం, యూనివర్సిటీ అఫ్ ఒట్టావాలో ఒక జోర్డాన్లో జన్మించిన, రసాయన సాంకేతిక పరిశోధక విద్యార్థి, మొహమ్మద్ రసూల్ క్తిష, ఒక కొత్త డీశాలినేషన్ టెక్నాలజీని కనిపెట్టాడు, అది ప్రస్తుతపు సాంకేతికత కన్నా వర్గ మీటరు పొరకు 600% మరియు 700% ఎక్కువ నీటిని ఉత్పత్తి చేస్తుంది. ఆ వ్యాసం ప్రకారం, జనరల్ ఎలెక్ట్రిక్ అటువంటి సాంకేతికత కోసం చూస్తోంది, మరియు U.S. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ దానిని పరిశోధించడానికి యూనివర్సిటీ అఫ్ మిచిగాన్ నిధిని కేటాయించింది. పేటెంట్లు అప్పటికి పూర్తి కానందున, ఈ వ్యాసం చెప్పబడిన సాంకేతికత వివరాల గురించి అస్పష్టంగా ఉంది.[25]

1,000 గాలన్లు నీటిని డీ-శాలినేట్ చేయడం దాదాపు $3 అయినా, అదే పరిమాణం సీసా నీరు $7,945 ఖరీదు చేస్తుంది.[26]

పర్యావరణ సంబంధమైన[మార్చు]

సముద్రపు నీటి డీశాలినేషన్ ప్లాంట్ల విషయంలో ఒక ప్రధాన వాతావరణ విచారం, అది ఇతర సముద్ర జలాల సంగ్రహణపై చూపే ప్రభావం[ఉల్లేఖన అవసరం], ముఖ్యంగా పవర్ ప్లాంట్లతో కలిసి ఉన్నప్పుడు. ఇది జలజీవనం పై శాశ్వత ప్రభావం చూపినప్పటికీ, సముద్రపు డీశాలినేషన్ ప్లాంట్ల ప్రారంభ ప్రణాళికలు ఈ సంగ్రహణ పైనే ఆధారపడతాయని చాలా మంది భావించారు.[ఉల్లేఖన అవసరం] సంయుక్త రాష్ట్రాలలో, ఇటీవల క్లీన్ వాటర్ ఆక్ట్ గురించి న్యాయస్థానం వెలువరచిన చట్టం ప్రకారం, ఈ సంగ్రహణలు ఏమాత్రం మంచివి కావు, ఇవి సముద్రంలోని ప్లన్క్టన్, చేపల గుడ్లు మరియు చేపల లార్వాలను తొంభై శాతం తగ్గిస్తాయి.[27] దీనికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, ఇందులో సముద్రపు ఒడ్డున బావులు ఉన్నా, ఇవి మరింత శక్తిని మరియు అధిక ఖర్చు కలిగించి, ఉత్పత్తిని పరిమితం చేస్తాయి.[28] ఇతర పర్యావరణ విషయాలు వాయు కాలుష్యం మరియు పవర్ ప్లాంట్ల నుండి గ్రీన్ హౌస్ వాయువు వెలువడడం మొదలైనవి కలిగి ఉంటాయి.

సముద్రంలోనికి ఉప్పునీరును తిరిగి చేరవేయడం ద్వారా ఏర్పడే వాతావరణ ప్రభావాన్ని తగ్గించడానికి, అది సముద్రంలో ప్రవేశించే మరొక నీటి ప్రవాహంలో కరిగించవచ్చు, అది ఉదాహరణకు వ్యర్థ జల శుద్ధీకరణ ప్లాంట్ లేదా పవర్ ప్లాంట్. సముద్రపు నీటి పవర్ ప్లాంట్ ఉత్పత్తులు, వ్యర్థ జల శుద్ధీకరణ ప్లాంట్ ఉత్పత్తుల లాగా తాజా నీరు కాదు కాబట్టి, ఉప్పునీరులో లవణీకరణ తగ్గుతుంది. పవర్ ప్లాంట్ మధ్య-నుండి పెద్ద-పరిమాణం కలిగినది మరియు డీశాలినేషన్ ప్లాంట్ మరీ పెద్దది కానప్పుడు, పవర్ ప్లాంట్ యొక్క చల్లని నీటి ప్రవాహం డీశాలినేషన్ ప్లాంట్ కన్నా కనీసం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. లవణీకరణ పెరుగుదల తగ్గించే మరొక పద్ధతి ఉప్పునీరును ఎంతో పెద్ద పరిధిలో పరచడం ద్వారా కేవలం కొంత లవణీకరణ పెరుగుదల ఉండేలా చేయడం. ఉదాహరణకు, ఉప్పునీరును కలిగిన పైప్ లైన్ సముద్రపు నేలను చేరగానే, దానిని ఎన్నో శాఖలుగా విభజించవచ్చు, తద్వారా ప్రతి ఒక్కటీ ఉప్పు నీటిని క్రమంగా పొడవునా చిన్న రంధ్రాల ద్వారా విడుదల చేస్తుంది. ఈ పద్ధతిని, ఉప్పు నీటిని పవర్ ప్లాంట్ లేదా వ్యర్థ జల ప్లాంట్ ఉత్పత్తులతో కలపడం వంటి పద్ధతులతో కలిపి వాడవచ్చు.

గాఢమైన సముద్రపు నీరు, ముఖ్యంగా అప్పటికే అధికమైన లవణీకరణ కలిగిన తక్కువ బురద నేల మరియు అధిక బాష్పీకరణ కలిగిన ప్రాంతాలలో జల వాతావరణానికి, పర్యావరణ వ్యవస్థలకు హాని కలిగించవచ్చు. అటువంటి ప్రదేశాలకు ఉదాహరణలు పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రం మరియు, ముఖ్యంగా, ప్రపంచంలోని ద్వీపాలు మరియు ఇతర ట్రాపికల్ ద్వీపాలలోని కోరల్ లగూన్లు[ఉల్లేఖన అవసరం]. సముద్రపు నీటికన్నా, ఎక్కువ ద్రావిత గాఢత చేత ఉప్పు నీరు అధిక సాంద్రత కలిగినందువలన, అక్కడి వాతావరణ వ్యవస్థకు హాని కలిగించేంతగా ఉప్పు నీరు అక్కడ ఇంకిపోయి ఎక్కువకాలం ఉంది, నీటి ఒడ్డున వాతావరణానికి హాని కలిగిస్తుంది కాబట్టి అలా వేయడం మంచిది కాదు. జాగ్రత్తగా తిరిగి ప్రవేశపెట్టడం ఈ సమస్యను తగ్గిస్తుంది.[ఉల్లేఖన అవసరం] ఉదాహరణకు, సిడ్నీలో 2007 చివర్లో కట్టిన డీశాలినేషన్ ప్లాంట్ మరియు సముద్ర విసర్జన స్వరూపాలకు, నీటి అధికారులు సముద్ర విసర్జన గాఢమైన సముద్రపు నీటిని విస్తరించడం పెంచే ప్రదేశాలలో ఉండాలని నిర్ణయించారు, దాంతో విసర్జన స్థలాలకు 50 మీటర్ల నుండి 75 మీటర్ల వరకూ మామూలు సముద్రపు నీటి నుండి తేడా తెలియని విధంగా ఉంటుంది. సిడ్నీ అదృష్టవశాత్తూ సముద్రతీరానికి దూరంగా సామాన్య సముద్రీయ పరిస్థితులను కలిగి ఉంది, ఇందు వలన గాఢమైన వ్యర్థ ఉత్పత్తి త్వరగా సజలమై పోయి, వాతావరణానికి హాని తగ్గుతుంది.

పెర్త్, ఆస్ట్రేలియాలో, 2007లో, క్విననా డీశాలినేషన్ ప్లాంట్ ప్రారంభించబడింది. సముద్రం నుండి నీటిని కేవలం సెకనుకు 0.1 మీటర్ వేగంతో పీల్చడం వలన, చేపలు తప్పుకోగల వేగం ఉండేది. ఈ ప్లాంట్ రోజుకు సుమారు 140,000 m³ శుభ్రమైన నీటిని అందిస్తుంది. [9]

ఇతర నీటి పంపిణీ పద్ధతులతో డీశాలినేషన్ పోలిక[మార్చు]

పెరిగిన నీటి సంరక్షణ మరియు నీటి ఉపయోగ నైపుణ్యం ఇప్పటికీ ప్రపంచంలో నీటి ఉపయోగ పద్ధతులను మెరుగుపరిచే అవకాశం ఉండే ప్రదేశాల్లో ఎంతో పొదుపైన ప్రాముఖ్యతలు.[29] సముద్రపు నీటి డీశాలినేషన్ ను వ్యర్థ జలాన్ని తిరిగి త్రాగే నీరుగా మార్చడంతో పోలిస్తే, డీశాలినేషన్ మొదటి ఎంపికగా, వ్యర్థ జలం నుండి మార్చిన నీరు నీటి పారుదల మరియు పరిశ్రమల్లో ఉపయోగించడం ఎన్నో ఉపయోగాలను సమకూరుస్తుంది.[30] పట్టణాల్లో ఎక్కువైన మరియు తుఫాను నీటిని జాగ్రత్త పరచడం వలన కూడా భూజలం శుద్ధీకరణ, భద్రత మరియు తిరిగి బాగుపరచడం జరుగుతుంది.[31] డీ-శాలినైజేషన్ కు కాలిఫోర్నియా మరియు ఇతర అమెరికన్ నైరుతి ప్రాంతాల్లో ప్రతిపాదించిన ప్రత్యామ్నాయం ఏమిటంటే వ్యాపారపరంగా ఎక్కువ నీటిని, నీటి వాహకాలుగా మార్చిన అతిపెద్ద ఇతర వాహకాలు లేదా పైప్ లైన్ల ద్వారా దిగుమతి చేసుకోవడం. ఈ ఆలోచన రాజకీయపరంగా కెనడాలో పేరుపొందలేదు, ఇక్కడ ప్రభుత్వాలు ఎక్కువ పరిమాణంలో నీటిని ఎగుమతి చేయడంపై 1999 లో అధ్యాయం 11 నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ (NAFTA) ద్వారా సన్ బెల్ట్ వాటర్ ఇంక్., 1990లో శాంటా బార్బర, కాలిఫోర్నియాలో, ఆ ప్రాంతంలో తీవ్రమైన కరవు కారణంగా స్థానిక అవసరాలను తీర్చేందుకు ఏర్పడిన కంపెనీ వేసిన దావాపై ప్రతిస్పందనగా నిషేధం విధించడం జరిగింది. సన్ బెల్ట్ ఒక వెబ్ సైట్లో ఆ వివాదానికి సంబంధించిన దస్తావేజులను ఆన్ లైన్లో ప్రచురిస్తూ ఉంటుంది.[32]

ప్రయోగ పద్ధతులు మరియు ఇతర వికాసాలు[మార్చు]

గతంలో, ఎన్నో నూతన డీశాలినేషన్ పద్ధతులను వివిధ విజయవంతమైన స్థాయిల్లో పరిశోధించారు. ఫార్వార్డ్ ఆస్మాసిస్ వంటి కొన్ని, ఇప్పటికీ ప్రారంభంలోనే ఉన్నా, ఇతర పద్ధతులు పరిశోధన నిధులను ఆకర్షించాయి. ఉదాహరణకు: డీశాలినేషన్ యొక్క శక్తి అవసరాలను తులనం చేసేందుకు, U.S. ప్రభుత్వం ప్రాయోగిక సోలార్ డీశాలినేషన్ను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తోంది.

డీశాలినేషన్ కు క్రొత్త సిద్ధాంత ప్రయోగాలకు ఉదాహరణగా, ప్రత్యేకంగా శక్తి ఉపయోగం మరియు ఖర్చులను సవ్యంగా ఉపయోగించడానికి, పస్సరెల్ ప్రక్రియను గుర్తించవచ్చు[ఉల్లేఖన అవసరం].

ఇతర పద్ధతులు భౌగోళిక ఉష్ణ శక్తిని వినియోగిస్తాయి. వాతావరణ మరియు ఆర్థిక దృక్కోణంలో, చాలా ప్రదేశాలలో మానవ అవసరాలకు శిలాజ భూజలం లేదా ఉపరితల జలాన్ని వాడడం కన్నా భౌగోళిక ఉష్ణ డీశాలినేషన్ వాడకం మంచిది, ఎందుకంటే ఎన్నో ప్రదేశాలలో లభ్యమయ్యే ఉపరితల మరియు భూజల వనరులు ఇప్పటికే ఎంతోకాలంగా ఒత్తిడికి గురవుతున్నాయి.

U.S.లో ఇటీవలి పరిశోధన ప్రకారం నీరు వడకట్టడానికి నానోట్యూబ్ పొరలు ఎక్కువ ప్రభావవంతమైనవిగా పనిచేయవచ్చు మరియు రివర్స్ ఆస్మాసిస్ కన్నా ఎంతో తక్కువ శక్తిని వినియోగించుకునే ఆచరణశక్యమైన డీశాలినేషన్ ప్రక్రియను ఉత్పన్నం చేయవచ్చు.[33]

నీటి డీశాలినేషన్ కొరకు పరిశీలింపబడే మరొక పద్ధతి బయో-మెట్రిక్ పొరల వాడకం.[34]

2008 జూన్ 23 నాడు, సముద్రపు నీటిపై విద్యుత్ క్షేత్రాన్ని ప్రయోగించడంపై ఆధారపడిన సాంకేతికతను సీమెన్స్ వాటర్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసిందని చెప్పడం జరిగింది, నివేదిక ప్రకారం, ఇందులో ఇతర ప్రక్రియలలో వాడే శక్తిలో సగం, అంటే కేవలం 1.5 kWh శక్తిని మాత్రమే వాడి ఒక ఘన మీటరు నీటిని డీశాలినేట్ చేయగలదు.[35]

సముద్రపు నీటిని ఘనీభవింపజేయడం ద్వారా కూడా తాజా నీటిని ఉత్పత్తి చేయవచ్చు, ఇది సహజంగా ధ్రువప్రాంతాల్లో జరుగుతుంది, దీనిని ఫ్రీజ్-థా డీశాలినేషన్ అంటారు.

MSNBC ప్రకారం, 2008 and 2020 ల మధ్య ప్రపంచవ్యాప్త డీ-శాలినేటేడ్ నీటి పంపిణీ మూడు రెట్లవుతుందని లక్స్ పరిశోధన నివేదిక అంచనా వేసింది.[36]

అల్ప ఉష్ణోగ్రత థర్మల్ డీశాలినేషన్[మార్చు]

స్థానిక ఉష్ణోగ్రత స్థాయిలో ఉన్న తక్కువ పీడనాలలోనూ నీరు మరుగుతుందనే వాస్తవాన్ని అల్ప ఉష్ణోగ్రత థర్మల్ డీశాలినేషన్ (LTTD) ఉపయోగించుకుంటుంది. ఈ పద్ధతిలో రెండు పరిమాణాల నీటి మధ్య 8 నుండి 10 డిగ్రీల C ఉష్ణోగ్రత ప్రవణతలో నీరు మరిగే విధంగా అల్ప పీడనాన్ని, అల్ప ఉష్ణోగ్రత వాతావరణాన్ని సృష్టించడానికి శూన్యపు గొట్టాలు వాడతారు. చల్లని నీరు సుమారు 600 metres (2,000 ft) సముద్రపు లోతుల నుండి పంపిణీ అవుతుంది. ఈ చల్లని నీరు ఆవిరైన నీటి ఆవిరిని ఘనీభవింపజేయడానికి చుట్టల గుండా పంపబడుతుంది. ఫలితంగా ఘనీభవనం చెందేది స్వచ్ఛమైన నీరు. ఈ LTTD ప్రక్రియ ఇంకా పవర్ ప్లాంట్లలో ఉష్ణోగ్రత ప్రవణతను కూడా ఉపయోగించుకోవచ్చు, ఇక్కడ ప్లాంట్ నుండి వెచ్చని వ్యర్థజలం అధిక పరిమాణంలో విడుదలవుతుంది, దీని ద్వారా ఉష్ణోగ్రత ప్రవణతను సృష్టించడానికి కావలసిన శక్తి తగ్గుతుంది.[37]

LTTDని భారతదేశం యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT), 2004 నుండి అభివృద్ధి చేసింది. ప్రపంచంలో మొట్టమొదటి LTTD ప్లాంట్ 2005లో లక్షద్వీప్ ద్వీపాలలోని కవరత్తిలో ప్రారంభించబడింది. ఈ ప్లాంట్ యొక్క సామర్థ్యం రోజుకు 100,000 లీటర్లు, దీని మూలధన ఖర్చు INR 50 మిలియన్ (€922,000). ఈ ప్లాంట్ లోతైన నీటిని 7 నుండి 15 డిగ్రీల C ఉష్ణోగ్రత వద్ద వాడుతుంది.[38] 2007లో, NIOT ఒక ప్రాయోగిక ప్లవన LTTD ప్లాంట్ ను చెన్నై తీరానికి దగ్గరలో రోజుకు 1 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ప్రారంభించింది. అంతకన్నా చిన్న ప్లాంట్, 2009లో నార్త్ చెన్నై థెర్మల్ పవర్ స్టేషన్ వద్ద పవర్ ప్లాంట్ చల్లని నీరు లభ్యమయ్యే చోట LTTD ప్రయోగాన్ని రుజువు చేయడానికి స్థాపించబడింది.[37][39][40]

ఉష్ణ-అయాను ప్రక్రియ[మార్చు]

అక్టోబరు 2009లో, సాల్ట్ వర్క్స్ టెక్నాలజీస్, ఒక కెనడియన్ సంస్థ, సౌర లేదా ఇతర ఉష్ణ వేడిమిని ఉపయోగించి ఒక అయాను విద్యుత్తును పంపడం ద్వారా మొత్తం సోడియం మరియు క్లోరిన్ అయాన్లను నీటి నుండి తొలగించే ప్రక్రియను ప్రకటించింది.[41]

ప్రస్తుతం ఉన్న మరియు నిర్మాణ దశలో ఉన్న సౌకర్యాలు[మార్చు]

అబూ ధాబి, సంయుక్త అరబ్ ఎమిరేట్స్[మార్చు]

 • తవీలా A1 పవర్ అండ్ డీశాలినేషన్ ప్లాంట్ రోజుకు 385 మిలియన్ లీటర్లు శుభ్రమైన నీటిని ఉత్పత్తి చేస్తుంది.
 • అం అల్ నర్ డీశాలినేషన్ ప్లాంట్ రోజుకు 394 మిలియన్ లీటర్ల శుభ్రమైన నీటిని ఉత్పత్తి చేస్తుంది.
 • ఫుజైరా F2010 జూలై 2 నాటికి పూర్తయి, రోజుకు 492 మిలియన్ లీటర్ల (130 మిలియన్ గాలన్లు) నీటి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది.[42]

అరుబా[మార్చు]

అరుబా ద్వీపంలో పెద్ద (ప్రారంభ సమయంలో ప్రపంచంలో అతి పెద్దది) డీశాలినేషన్ ప్లాంట్ ఉంది, దీని స్థాపిత సామర్థ్యం రోజుకు 42000 మెట్రిక్ టన్నులు (రోజుకు 11.1 మిలియన్ గాలన్లు లేదా 42 × 103 m3).[43]

ఆస్ట్రేలియా[మార్చు]

ఎక్కువ నీటి ఉపయోగం మరియు తక్కువ వర్షపాతం వలన, ఆస్ట్రేలియాలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో డీశాలినేషన్ ప్లాంట్లు కట్టడం జరిగింది, ఇందులో ఇటీవలే ప్రారంభమైన కార్నెల్ డీశాలినేషన్ ప్లాంట్, సిడ్నీ ప్రాంతానికి ఉపయోగపడుతుంది. డీశాలినేషన్ ను రాష్ట్ర ప్రభుత్వాలు నీటి పంపిణీ కొరకు ప్రారంభించినా, అది ఎక్కువ శక్తి-ఆధారితం (~$140 శక్తి అవసరం/ML) మరియు ఆస్ట్రేలియా యొక్క బొగ్గు-ఆధారిత శక్తి ఉత్పత్తి పై ఆధారపడడం వలన ఎక్కువ కార్బన్ ముద్ర కలిగి ఉంటుంది.

సైప్రస్[మార్చు]

సైప్రస్లో సైతం, లర్నకా పట్టణం వద్ద ఉన్నట్టూ, డీశాలినేషన్ ప్లాంట్లు ఉన్నాయి.[44] దీనిని ధెకెలియా డీశాలినేషన్ ప్లాంట్ గా పిలుస్తారు, ఇది రివర్స్ ఆస్మాసిస్ పద్ధతిని వాడుకుంటుంది.[45]

ఇజ్రాయెల్[మార్చు]

ఇజ్రాయెల్లోని హదేరా సముద్రపు నీటి రివర్స్ ఆస్మాసిస్ (SWRO) డీశాలినేషన్ ప్లాంట్ ప్రపంచంలోనే అటువంటి వాటిలో మొదటిది.[46][47] ఈ ప్రాజెక్ట్ ను BOT (బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్) పద్ధతిలో మూడు అంతర్జాతీయ సంస్థల సమ్మేళనం అభివృద్ధి చేసింది: వేయోలియా వాటర్, IDE టెక్నాలజీస్ మరియు ఎల్రాన్.[48]

ప్రాంతం ప్రారంభం పట్టే శక్తి
(mln m3/సంవత్సరం)
పట్టే శక్తి
(mln గాలన్లు/రోజుకు)
పట్టే శక్తి
(మెగా లీటర్స్)
నీటి ధర (m3కు) గమనికలు
అష్కేలాన్ ఆగస్టు 2005 111 (2008నాటికి) 83.2 315 NIS 2.60 [50]
పల్మచిం మే 2007 30 (45 వరకూ విస్తరణ నిర్ణయించబడింది[51]) 32.6 123.4 NIS 2.90 [52]
హదేరా డిసెంబరు 2009 127 91.9 349 NIS 2.60 [53]
ప్రాంతం ప్రారంభం పట్టే శక్తి
(mln m3/సంవత్సరం)
నీటి ధర (m3కు) గమనికలు
ఆశ్దోడ్ 2012 100 (150 వరకూ విస్తరణ సాధ్యం) NIS 2.55 [54][55]
సోరేక్ 2013 150 (300 వరకూ విస్తరణ అనుమతించబడింది) NIS 2.01 - 2.19 [56]

యునైటెడ్ కింగ్‌డమ్[మార్చు]

బెక్టన్ డీశాలినేషన్ ప్లాంట్[మార్చు]

యునైటెడ్ కింగ్‌డంలో మొదటి నీటి డీశాలినేషన్ ప్లాంట్, తేమ్స్ వాటర్ డీశాలినేషన్ ప్లాంట్, [57]ను బెక్టన్, తూర్పు లండన్లో తేమ్స్ నీటికొరకు అక్కియోనా అగ్వా చే నిర్మించబడింది.

సంయుక్త రాష్ట్రాలు[మార్చు]

ఎల్ పసో (టెక్సాస్) డీశాలినేషన్ ప్లాంట్[మార్చు]

ఉప్పని భూజలం ఎల్ పసో ప్లాంట్లో సుమారు 2004 నుండి శుద్ధి చేయబడేది. రోజుకు 27.5 మిలియన్ గాలన్లు (104,000 m³) తాజా నీటిని (పూర్తి తాజా నీటి పంపిణీలో సుమారు 25%) రివర్స్ ఆస్మాసిస్ ద్వారా ఉత్పత్తి చేస్తూ, ఇది ఈ నీటి-ఒత్తిడి నగరానికి ప్రధానమైన ఆధారం.[58]

టంపా బే వాటర్ డీశాలినేషన్ ప్రాజెక్ట్[మార్చు]

టంపా బే వాటర్ డీశాలినేషన్ ప్రాజెక్ట్ నిజానికి పోసీడాన్ రిసోర్సెస్ ప్రారంభించిన ప్రైవేటు సంస్థ. ఈ ప్రాజెక్ట్, పోసీడాన్ రిసోర్సెస్ వరుస భాగస్వాములు, స్టోన్ & వెబ్స్టర్, తరువాత కావంట (మునుపు ఆగ్డెన్) మరియు దాని ప్రధాన ఉప-కాంట్రాక్టర్ హైడ్రానాటిక్స్ ల నష్టాల వలన ఆలస్యం అయింది. స్టోన్ & వెబ్స్టర్ నష్టాల్ని ప్రకటించినప్పుడు, స్టోన్ & వెబ్స్టర్లతో S & W వాటర్ LLC ద్వారా పోసీడాన్ సంబంధం జూన్ 2000 లో ముగిసింది, మరియు పోసీడాన్ రిసోర్సెస్, స్టోన్ & వెబ్స్టర్ వాటాను S & W వాటర్ LLC నుండి స్వంతం చేసుకుంది. పోసీడాన్ రిసోర్సెస్ అటుపై కావంట మరియు హైడ్రానాటిక్స్ తో, 2001 లో భాగస్వామ్యం ప్రారంభించి దానికి టంపా బే దేశాల్ గా పేరు పెట్టింది. ప్రాజెక్ట్ యొక్క నిర్మాణాన్ని కావంట పూర్తి చేయకపోవడంతో, టంపా బే వాటర్ సంస్థ ఆ ప్రాజెక్టును పోసీడాన్ నుండి 2002 మే 15, నాడు ఖరీదు చేసి, దాని స్వంత క్రెడిట్ రేటింగ్ లో ఆ ప్రాజెక్టుకు సహకారం అందించింది. టంపా బే వాటర్ అప్పుడు కావంట టంపా కన్స్ట్రక్షన్ తో ఒప్పందం కుదుర్చుకుని ప్రాజెక్ట్ నిర్మించింది, కానీ అవసరమైన ప్రదర్శన పరీక్షలను ఆ ప్రాజెక్ట్ తట్టుకోలేదు. కావంట టంపా కన్స్ట్రక్షన్ యొక్క మాతృక సంస్థ అక్టోబరు 2003లో టంపా బే వాటర్తో ఒప్పందాన్ని పోగొట్టుకోవడాన్ని నివారించడానికి నష్టాలను ప్రకటించింది. అప్పుడు, కావంట టంపా నిర్మాణపు ఒప్పందపు అంగీకారాలను సంతృప్తి పరచే రూపకల్పనలను చేసే ముందే నష్టాలను ప్రకటించింది. దీంతో సుమారు ఆరు నెలల పాటు కావంట టంపా కన్స్ట్రక్షన్ మరియు టంపా బే వాటర్ల మధ్య సందిగ్ధం నెలకొంది. 2004లో, టంపా బే వాటర్ ఒక పునర్నిర్మాణ బృందాన్ని, అమెరికన్ వాటర్/అక్కియోనా ఆక్వాను, ఆ ప్లాంట్ ను అసలైన, ఊహించిన రూపానికి తీసుకు రావడానికి నియోగించింది. ఆ ప్లాంట్ పూర్తిగా కార్యాచరణను 2007[23]లో ప్రారంభించింది మరియు రోజుకు అత్యధిక సామర్థ్యంగా 25 మిలియన్ గాలన్లు ఉత్పత్తి చేస్తుంది.[59] అయినప్పటికీ, ఈ ప్లాంట్ ఎన్నో సమస్యల్లో కొనసాగుతూ కేవలం అందులో సగం పరిమాణం ఉత్పత్తి చేస్తుంది (2009 లో రోజుకు 14 మిలియన్ గాలన్లు లేదా 42 af).[60]

యుమా డీసాల్టింగ్ ప్లాంట్ (ఆరిజోన)[మార్చు]

యుమా డీసాల్టింగ్ ప్లాంట్ ను 1974 లోని కొలరాడో రివర్ బేసిన్ శాలినిటీ కంట్రోల్ చట్టం క్రింద, ఇది వేల్టాన్-మొహాక్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చే లవణీయ వ్యవసాయ తిరుగు ప్రవాహాల్ని సరిచేయడానికి నిర్మించారు. శుద్ధి చేయబడిన నీరు మెక్సికోకు అందించడానికి ఉంచడం ద్వారా అంతే పరిమాణాన్ని మీడ్ సరస్సులో భద్రపరచవచ్చు. ఈ ప్లాంట్ నిర్మాణం 1992లో పూర్తయింది మరియు అప్పటి నుండి అది రెండు సందర్భాలలో పనిచేయడం జరిగింది. ఈ ప్లాంట్ నిర్వహించబడుతోంది, కానీ కొలరాడో నదిలో అధికంగా మరియు సాధారణ నీటి పంపిణీ పరిస్థితుల కారణంగా ఎక్కువగా ఉపయోగించబడదు.[61] ఏప్రిల్ 2010లో సదర్న్ నేవాడా వాటర్ అథారిటీ, మెట్రోపాలిటన్ వాటర్ డిస్ట్రిక్ట్ అఫ్ సదర్న్ కాలిఫోర్నియా, సెంట్రల్ ఆరిజోన ప్రాజెక్ట్ మరియు U.S. బ్యూరో అఫ్ రిక్లేమేషన్ల మధ్య సంవత్సరం-పాటు పైలట్ ప్రాజెక్టులో ఆ ప్లాంట్ నడిపే ఖర్చును తగ్గించే ఒప్పందం జరిగింది.[62]

ట్రినిడాడ్ మరియు టొబాగో:[మార్చు]

రిపబ్లిక్ అఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో ద్వీపంలోని నీటి పంపిణీని త్రాగే అవసరాలకు డీశాలినేషన్ ద్వారా ఉపయోగిస్తోంది. ఈ డీశాలినేషన్ సౌకర్యం, మార్చి 2003లో మొదలై, అటువంటి వాటిలో మొదటిదిగా భావింపబడుతోంది. ఇది అమెరికాలలో అతి పెద్ద డీశాలినేషన్ వసతి మరియు రోజుకు 28.8 మిలియన్ గాలన్ల నీటిని శుద్ధి చేస్తుంది మరియు నీటిని 1,000 గాలన్లకు $2.67 ధరలో అమ్ముతోంది.[63] ఈ వసతి ట్రినిడాడ్ లోని పాయింట్ లిసాస్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉంది, ఈ ఉద్యానవనంలో 12 పైగా సంస్థలు వివిధ తయారీ మరియు శుద్ధి చర్యల్లో ఉన్నాయి మరియు దేశంలోని పరిశ్రమలు ఇంకా నివాసులకు సులభంగా నీటిని అందిస్తాయి.[64]

వీటిని కూడా పరిశీలించండి:[మార్చు]

 • లవణీకరణ నియంత్రణ
 • భూ లవణీకరణ
 • నేల డీశాలినేషన్ నమూనా
 • నేల లవణీకరణ మరియు భూజలం నమూనా

సూచనలు[మార్చు]

గమనికలు[మార్చు]

 1. "డీశాలినేషన్" (నిర్వచనం), ది అమెరికన్ హెరిటేజ్ సైన్స్ డిక్షనరీ , హౌటన్ మిఫ్లిన్ కంపెనీ, వయా dictionary.com. 2009-01-09 న వెలికితీశారు.
 2. "నీటి నిర్వహణ వ్యవస్థలో చైనాకు ఆస్ట్రేలియా సాయం చేస్తోంది." పీపుల్స్ డైలీ ఆన్లైన్ , 2001-08-03, వయా english.people.com.cn. 2009-01-09 న వెలికితీశారు.
 3. Fischetti, Mark (September 2007). "Fresh from the Sea". Scientific American. 297 (3). Scientific American, Inc. pp. 118–119. doi:10.1038/scientificamerican0907-118. Retrieved 2008-08-03. గమనిక: ధర లేకుండా కేవలం రెండు పేరాగ్రాఫులే ఆన్లైన్లో లభిస్తున్నాయి.
 4. అప్లాజ్, అట్ లాస్ట్, ఫర్ డీశాలినేషన్ ప్లాంట్ Archived 2008-01-13 at the Wayback Machine., ది టంపా ట్రిబ్యూన్, డిసెంబర్ 22, 2007
 5. కాతరిన్ క్రాన్హోల్ద్, వాటర్, వాటర్, ఎవేరీవేర్..., ది వాల్ స్ట్రీట్ జర్నల్ , జనవరి 17, 2008
 6. ఆధారం: water-technology.net
 7. హమీద్, ఒస్మాన్ A. (2005). “సంకర డీశాలినేషన్ పద్ధతులు – ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్తు అవకాశాలు.” డీశాలినేషన్, 186, 207-214.
 8. మిశ్రా, B.M., J. కుపిత్జ్. (2004). “రాబోవు దశాబ్దాలలో నీటి కరవు ప్రాంతాల్లో నీటి అవసరాలను తీర్చడంలో అణుశక్తి డీశాలినేషన్ పాత్ర.” డీశాలినేషన్, 166, 1-9.
 9. http://gift.kisti.re.kr/GTB/infoboard/download.jsp?down_url=data/file/GTB/shleegift/shleegift_1198793876096.doc&cn=GTB2007120672
 10. న్యూక్లియర్ డీశాలినేషన్. 2009-01-09 న వెలికి తీశారు.
 11. లుడ్విగ్, హీన్జ్. (2004). “సముద్రపు నీటి డీశాలినేషన్లో సంకర పద్ధతులు – వాస్తవ రూపకల్పన విషయాలు, ప్రస్తుత పరిస్థితి మరియు అభివృద్ది దృక్పథాలు.” డీశాలినేషన్, 164, 1-18.
 12. విమాన వాహకాలు ఎలా పనిచేస్తాయి
 13. "Nuclear Desalination". World Nuclear Association. January 2010. Retrieved 2010-02-01. Cite web requires |website= (help)
 14. బార్లో, మాడ, మరియు టోనీ క్లార్క్, "హు ఓన్స్ వాటర్?" ది నేషన్ , 2002-09-02, వయా thenation.com. 2009-01-09 న వెలికితీశారు.
 15. జోవా, యువాన్, మరియు రిచర్డ్ S.J. తోల్బ్. " Archived 2007-06-30 at the Wayback Machine.డీశాలినేషన్ మరియు నీటి రవాణా ఖర్చుల విలువ నిర్ణయం." Archived 2007-06-30 at the Wayback Machine. (వర్కింగ్ పేపర్). వయా హాంబర్గ్ యూనివర్సిటీ వెబ్ సైట్. 2004-12-09. 2009-01-09 న వెలికితీశారు.
 16. డీశాలినేషన్ ఈజ్ ది సొల్యూషన్ టు వాటర్ షార్టేజెస్, redOrbit, మే 2, 2008
 17. సిట్బాన్, షిర్లి. "ఫ్రెంచ్-నడిపే నీటి ప్లాంట్ ఇజ్రాయెల్ లో స్థాపించబడింది," Archived 2009-12-13 at the Wayback Machine. యూరోపియన్ జ్యూయిష్ ప్రెస్ , వయా ejpress.org, 2005-12-28. 2009-01-09 న వెలికితీశారు.
 18. "బ్లాక్ & వీచ్-డిజైండ్ డీశాలినేషన్ ప్లాంట్ విన్స్ గ్లోబల్ వాటర్ డిస్టింక్షన్," Archived 2010-03-24 at the Wayback Machine. (ప్రెస్ విడుదల). బ్లాక్ & వీచ్ లి., వయా edie.net, 2006-05-04. 2009-01-09 న వెలికితీశారు.
 19. http://www.water-technology.net/projects/perth/
 20. "సిడ్నీ డీశాలినేషన్ ప్లాంట్ టు డబల్ ఇన్ సైజు," ABC న్యూస్ (ఆస్ట్రేలియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్), వయా abc.net.au, 2007-06-25. 2009-01-09 న వెలికితీశారు.
 21. ఆస్ట్రేలియా టర్న్స్ టు డీశాలినేషన్ బై మైకేల్ సల్లివాన్ అండ్ PX ప్రెజర్ ఎక్స్చేన్జర్ ఎనర్జీ రికవరీ డివైజెస్ ఫ్రం ఎనర్జీ రికవరీ ఇంక్. అన్ ఎన్విరాన్మెంటల్లీ గ్రీన్ ప్లాంట్ డిజైన్ Archived 2008-10-13 at the Wayback Machine.. మార్నింగ్ ఎడిషన్, నేషనల్ పబ్లిక్ రేడియో, జూన్ 18, 2007
 22. "ఫాక్ట్ షీట్స్". మూలం నుండి 2009-04-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-27. Cite web requires |website= (help)
 23. 23.0 23.1 "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2009-04-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-27. Cite web requires |website= (help)
 24. హైడ్రో-ఆల్కెమీ, ఫోర్బ్స్, మే 9, 2008
 25. ఒట్టావా విద్యార్థి వద్ద అందరికీ నీరు రహస్యం ఉండవచ్చు, గ్లోబ్ అండ్ మెయిల్, జూన్ 5, 2008
 26. ది అరిడ్ వెస్ట్—వేర్ వాటర్ ఈజ్ స్కార్స్ - డీశాలినేషన్—ఎ గ్రోయింగ్ వాటర్ సప్లై సోర్స్ Archived 2017-02-02 at the Wayback Machine., లైబ్రరీ ఇండెక్స్
 27. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం (PDF) నుండి 2011-07-25 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-27. Cite web requires |website= (help)
 28. శీర్షిక లేనిది
 29. గ్లీక్, పేటర్ H., డన హాస్జ్, క్రిస్టీన్ హేన్గేస్-జెక్, వీణ శ్రీనివాసన్, గారి వుల్ఫ్, కథేరీన్ కవో కుశింగ్, అండ్ అమర్దీప్ మాన్. నవంబర్ 1993 "వృధా చేయవద్దు, కోరవద్దు: కాలిఫోర్నియాలో పట్టణ నీటి భద్రతావకాశాలు." వెబ్‌సైట్ పసిఫిక్ ఇన్స్టిట్యూట్ . 2009-01-09 న వెలికితీశారు.
 30. కూలీ, హేతర్, పేటర్ H. గ్లీక్, మరియు గారి వుల్ఫ్. జూన్ 1996 "డీశాలినేషన్, విత్ ఎ గ్రైన్ అఫ్ సాల్ట్ – ఎ కాలిఫోర్నియా పర్స్పెక్టివ్." Archived 2010-10-17 at the Wayback Machine. వెబ్‌సైట్ పసిఫిక్ ఇన్స్టిట్యూట్ . 2009-01-09 న వెలికితీశారు.
 31. గ్లీక్, పేటర్ H., హేతర్ కూలీ, డేవిడ్ గ్రోవ్స్. సెప్టెంబర్ 17 "కాలిఫోర్నియా వాటర్ 2030: అన్ ఎఫ్ఫిషిఎంట్ ఫ్యూచర్." వెబ్‌సైట్ పసిఫిక్ ఇన్స్టిట్యూట్ . 2009-01-09 న వెలికితీశారు.
 32. http://www.sunbeltwater.com/docs.shtml సన్ బెల్ట్ ఇంక్. చట్టపరమైన దస్తావేజులు
 33. "Nanotube membranes offer possibility of cheaper desalination" (Press release). Lawrence Livermore National Laboratory Public Affairs. 2006-05-18. మూలం నుండి 2006-10-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-09-07.
 34. బయోమిమేటిక్ మెంబ్రేన్ ఫర్ వాటర్ డీశాలినేషన్
 35. సముద్రపు నీరు డీశాలినేషన్లో విజయవంతమైన సాంకేతికతకు బృందం $4m నిధి సాధించింది Archived 2009-04-14 at the Wayback Machine., ది స్ట్రైట్స్ టైమ్స్, జూన్ 23, 2008
 36. ఎ రైసింగ్ టైడ్ ఫర్ న్యూ డీ-శాలినేటేడ్ వాటర్ టెక్నాలజీస్, MSNBC, మార్చ్. 17, 2009
 37. 37.0 37.1 Sistla, Phanikumar V.S. "Low Temperature Thermal DesalinbationPLants" (PDF). International Society of Offshore and Polar Engineers. మూలం (PDF) నుండి 4 అక్టోబర్ 2011 న ఆర్కైవు చేసారు. Retrieved 22 June 2010. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help); Cite web requires |website= (help)
 38. "డీశాలినేషన్: భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి అల్ప-ఉష్ణోగ్రత ఉష్ణ డీశాలినేషన్ ప్లాంట్ ప్రారంభించింది". మూలం నుండి 2009-03-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-27. Cite web requires |website= (help)
 39. "ఫ్లోటింగ్ ప్లాంట్, ఇండియా". మూలం నుండి 2008-08-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-27. Cite web requires |website= (help)
 40. మొబైల్ డీశాలినేషన్ ప్లాంట్, ఇండియా
 41. కరెంట్ థింకింగ్, అక్టోబరు 29, 2009, ది ఎకనామిస్ట్
 42. http://www.pump-zone.com/global-news/global-news/abu-dhabi-to-build-three-power-and-water-desalination-plants-by-2016-to-meet-demand.html[permanent dead link]
 43. W.E.B. అరుబా N.V. - వాటర్ ప్లాంట్
 44. [1]
 45. [2]
 46. ఇజ్రాయెల్ ఈజ్ నెం. 5 ఆన్ టాప్ 10 క్లీన్-టెక్ లిస్టు ఇన్ ఇజ్రాయెల్ 21c ఎ ఫోకస్ బియాండ్ Archived 2010-10-16 at the Wayback Machine. 2009-12-21 న వెలికితీశారు
 47. అష్కేలాన్ డీశాలినేషన్ ప్లాంట్ సముద్రపు నీటి రివర్స్ ఆస్మాసిస్ (SWRO) ప్లాంట్
 48. అష్కేలాన్ డీశాలినేషన్ ప్లాంట్ — ఒక విజయవంతమైన సవాలు[permanent dead link]
 49. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్ Archived 2012-07-12 at Archive.is, అక్కౌన్టెంట్ జనరల్, మినిస్ట్రీ అఫ్ ఫైనాన్సు
 50. water-technology.net:"అష్కేలాన్ డీశాలినేషన్ ప్లాంట్ సముద్రపు నీటి రివర్స్ ఆస్మాసిస్ (SWRO) ప్లాంట్, ఇజ్రాయెల్"
 51. యూరో-మెడిటరేనియన్ వాటర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (EMWIS):"ఇజ్రాయెల్: ఫైనాన్సు సెక్యూర్డ్ ఫర్ పల్మచిం డీశాలినేషన్ ఎక్స్పాన్స్హన్", ఆగష్టు 19, 2009
 52. అనామక బ్లాగరు "ఇజ్రయేలి వాటర్ ఇంజనీర్":"ఇజ్రాయెల్స్ డీశాలినేషన్ ఇండస్ట్రీ" Archived 2011-11-13 at the Wayback Machine., సెప్టెంబర్ 6, 2007
 53. గ్లోబ్స్ బిజినెస్ అండ్ టెక్నాలజీ న్యూస్:"హదేరా డీశాలినేషన్ ప్లాంట్ విస్తరణకు నిధుల అనుమతి" Archived 2012-02-24 at the Wayback Machine., నవంబర్ 6, 2009
 54. డీశాలినేషన్ & వాటర్ రీ-యూజ్:"స్పానిష్/ఇజ్రాఎలి JV అవార్డేడ్ ఆశ్దోడ్ డీశాలినేషన్ కాంట్రాక్టు", 24 నవంబర్ 2009
 55. గ్లోబ్స్ బిజినెస్ అండ్ టెక్నాలజీ న్యూస్:"మేకోరోట్, ప్రభుత్వం డీశాలినేషన్ నీటి ధరపై రాజీకు సమీపం", June 20, 2010
 56. డీశాలినేషన్ & వాటర్ రీ-యూజ్:"సోరేక్ డీశాలినేషన్ కాంట్రాక్టులో IDE విజయం అవకాశం", 15 December 2009
 57. తేమ్స్ వాటర్ డీశాలినేషన్ ప్లాంట్: water-technology.net
 58. http://www.epwu.org/water/desal_info.html
 59. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2010-12-05 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-27. Cite web requires |website= (help)
 60. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2009-06-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-27. Cite web requires |website= (help)
 61. "యుమా డీ-సాల్టింగ్ ప్లాంట్" Archived 2010-06-05 at the Wayback Machine. U.S. బ్యూరో అఫ్ రిక్లామేషన్, మే 1, 2010 న వెలికితీశారు
 62. "యుమా డీ-సాల్టింగ్ ప్లాంట్ కు నూతన ప్రారంభం" లాస్ ఏంజెలెస్ టైమ్స్, మే 1, 2010
 63. http://www.bizjournals.com/boston/stories/1999/10/04/story7.html"
 64. http://www.waterindustry.org/New%20Projects/ionics-2.htm"

మరింత చదవటానికి[మార్చు]

వ్యాసాలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]