డూమ్ (వీడియో గేమ్)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
"DOOM" redirects here. For other uses, see Doom (disambiguation).

మూస:Infobox VG

డూమ్ (అధికారిక పత్రాల్లో DOOM అనే రూపంలో ముద్రించారు)[1] అనేది 1993లో మైలురాయిగా నిలిచిన ఫస్ట్-పర్సన్ షూటర్ వీడియో గేమ్. id సాఫ్ట్‌వేర్ ద్వారా ఇది విడుదలైంది అత్యంత ఆదరణ కలిగిన ఫస్ట్ పర్సన్ షూటర్ శైలిని కలిగిన వీడియో గేమ్‌‌గా ఇది ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించింది. ఆకట్టుకునే 3D గ్రాఫిక్స్‌తో పాటు నిజమైన తర్డ్ డైమెన్షన్ అంతరిక్ష సంబంధిత గేమ్‌గా ఇది అగ్రస్థానంలో నిలిచింది. నెట్‌వర్క్ చేయబడిన మల్టీప్లేయర్ గేమింగ్, మరియు కస్టమైజ్డ్ అడిషన్లకు మద్దతుగా ఉండడం మరియు "WADలు"గా సుపరిచితమైన డేటా ఆర్కీవ్‌లోని ప్యాకేజ్డ్ ఫైల్స్ ద్వారా మార్పుచేర్పులకు అనువుగా ఉండడం, మొత్తం డేటాను చూపించే సంక్షిప్త నామమైన మోడ్స్‌ని కలిగిన డేటా ఫైల్స్‌ విస్తరణ లాంటి అంశాలన్నీ ఈ గేమ్‌లో భాగంగా ఉంటాయి.[2] ఇక ఈ గేమ్‌లో భాగమైన గ్రాఫిక్ మరియు పరస్పర హింస,[3]తో పాటు సాతానిక్ చిత్రాలు లాంటివి సైతం ఈ వీడియో గేమ్‌ విషయంలో కావల్సినంత వివాదం రేపేందుకు కారణంగా నిలిచాయి. మొత్తం గేమ్‌లోని మూడో వంతు (9 స్థాయిలు) షేర్‌వేర్ రూపంలో పంపిణీ చేయబడింది, డూమ్ విడుదలైన కేవలం రెండేళ్ల కాలంలోనే దాదాపు 10 మిలియన్ ప్రజలు ఈ గేమ్‌ను ఆడినట్టు అంచనా, తద్వారా గేమ్‌ప్లే యొక్క మోడ్ మరియు గేమింగ్ సబ్‌కల్చర్‌ లాంటివి ఆదరణ పొందాయి; గేమింగ్ పరిశ్రమపై ఇది వేసిన ముద్రతో, 1990ల మధ్యలో ఫస్ట్-పర్సన్ షూటర్ గేమ్‌లు వెల్లువగా వచ్చాయి. అప్పట్లో వీటిని సాధారణంగా "డూమ్ క్లోన్స్" అని పిలిచేవారు. గేమ్‌స్పే వివరాల ప్రకారం, 2004 మొత్తంలో అత్యంత కీర్తిని ఆర్జించిన గేమ్‌గా పరిశ్రమ అంతరంగికుల ద్వారా డూమ్ ఎన్నికైంది.[4] ఆగస్ట్ 3, 2007కు పైన స్టీమ్‌పై లభించేలా ఈ గేమ్ తయారైంది.[5]

డూమ్ ఫ్రాంచైజ్ అనేది ఫాలో-అప్ Doom II: Hell on Earth (1994) మరియు ది అల్టిమేట్ డూమ్ (1995), మాస్టర్ లెవల్స్ ఫర్ డూమ్ II (1995), మరియు ఫైనల్ డూమ్ (1996)లతో సహా అనేక విస్తరణ ప్యాక్‌లతో కొనసాగింది. వాస్తవానికి PC/DOSల కోసం విడుదలైన ఈ గేమ్, అటు తర్వాత తొమ్మిది విభిన్న గేమ్ కన్సోల్‌లు, రాక్‌బాక్స్ ఫిర్మ్‌వేర్, మరియు PDAలు మరియు ఫ్లాష్ ప్లేయర్ వర్చువల్ మెషిన్ లాంటి రూపాలతో సహా ఇతర అనేక వేదికలకు దిగుమతైంది. 1990ల మధ్యలో డూమ్ గేమ్ ఇంజిన్ యొక్క సాంకేతికత విస్తరించడంతో ఈ సిరీస్ ప్రముఖంగా దర్శనమివ్వడాన్ని కోల్పోయింది, అయినప్పటికీ అభిమానులు మాత్రం WADలు, స్పీడ్‌రన్‌లు, మరియు 1997లో విడుదలైన సోర్స్ కోడ్‌కు మార్పులు చేయడం లాంటి అంశాల్ని కొనసాగించారు. డూమ్ 3 విడుదలతో 2004లో ఫ్రాంచైజీ మరొకసారి అద్వితీయమైన స్పందనను అందుకుంది, కొత్త సాంకేతికను ఉపయోగించి ఒరిజినల్ గేమ్‌ని పునఃవివరణ చేసిన ఈ కొత్త గేమ్, 2005లో డూమ్ మోషన్ పిక్చర్‌తో జతకట్టింది. నిజంగా అనిపించే లైటింగ్ ఉపయోగించడం ద్వారా డూమ్ 3 సాధారణంగానే ఎక్కువ మార్కులను సాధించింది. అయితే, ఇందులో కొంత విచారించాల్సిన విషయం ఏమిటంటే, కొత్త డూమ్ అనేది ఎక్కువ భాగం దాని అసలు సిరీస్‌తో సరిపోలే విధంగా లేదని గత డూమ్‌కి అభిమానులైన చాలామంది విమర్శించారు.

అటుపై మే 7, 2008న డూమ్ 4 నిర్మాణం జరుపుకుంటోందన్న ప్రకటన వెలువడింది. జాన్ కార్‌మాక్ ద్వారా ఆగస్టు 3, 2007న క్వాక్‌కాన్ వద్ద జరిగిన ఆలోచన ఫలితంగా ఈ ప్రకటన వెలువడింది. ఈ గేమ్ డూమ్ 3 కి కొనసాగింపు కావచ్చు లేదా ఫ్రాంచైజీ యొక్క కొత్త ప్రారంభం కావచ్చు. అలాగే కంపెనీ కొత్త గుర్తింపు టెక్ 5 ఇంజన్‌ను ఉపయోగించేందుకు ఇది సిద్ధమైంది. అయితే కొత్త గేమ్ గురించి చేసిన ప్రకటనకు సంబంధించిన సమాచారమేదీ ఏప్రిల్ 10, 2009 నుంచి, అస్సలు విన్పించలేదు.

ఇక జూన్ 26, 2009న, జాన్ కార్‌మార్క్ డూమ్ రీసర్రక్షన్ విడుదల చేశారు, ఐఫోన్ OS కోసం ఎస్కలేషన్ స్టూడియోస్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ కొత్త గేమ్ id సాఫ్ట్‌వేర్ ద్వారా విడుదలైంది. డూమ్ రీసర్రక్షన్ కోసం చేసిన అమరికలు డూమ్ 3 కి , సమాంతరంగా నిలవడంతో పాటు అంతకుముందు అభివృద్ధి చేయబడిన గేమ్‌లోని పాత్రలు మరియు కళనే ఇందులోనూ ఉపయోగించడం జరిగింది.

గేమ్ విశిష్టతలు[మార్చు]

కథాంశం[మార్చు]

డూమ్ అనేది ఒక సైన్స్ ఫిక్షన్/హర్రర్ నేపథ్యంతో తయారైన గేమ్. ఇందులోని నేపథ్య కథనాన్ని గేమ్ యొక్క మ్యాన్యువల్‌‌ అందిస్తుంది; ఇక మిగిలిన కథనమంతా గేమ్ యొక్క ప్రతి సెక్షన్ (ఎపిసోడ్లు అని పిలుస్తారు) మధ్యలో కనిపించే సంక్షిప్త సందేశాలతో ఆధునికంగా ఉంటుంది, ఆటగాడి పాత్ర అభివృద్ధి అనేది ఈ స్థాయిలు, మరియు కొన్ని దృశ్య సంబంధ సంకేతాల ద్వారా జరుగుతుంది.

ఈ గేమ్‌లోని ఆటగాడు దండనపూర్వకంగా అంగారక గ్రహానికి పోస్ట్ చేయబడిన ఒక పేరులేని అంతరిక్ష నౌక పాత్రను పోషించాలి, పౌరులపై కాల్పులు జరపాలని తన బృందానికి ఆదేశాలు జారీచేసిన అతని కమాండింగ్ అధికారి దాడి అనంతరం ఈ నౌక అంగారక గ్రహానికి పోస్ట్ చేయబడుతుంది. మార్టిన్ మెరైన్ బేస్ అనేది యూనియన్ ఏరోస్పేస్ కార్పోరేషన్ (UAC) భద్రతకు పనిచేస్తుంది, బహుళ-గ్రహాల సమ్మేళనం అయిన ఈ UAC, అంగారకుడి రెండు చంద్రులైన ఫోబోస్ మరియు డైమోస్‌ల మధ్య గేట్‌వేలను సృష్టించడం ద్వారా టెలిపోర్టేషన్తో రహస్య పరిశోధనలు నిర్వహిస్తుంటుంది. ఫోబోస్ అనేది నిరుత్సాహపూరిత అస్సైన్‌మెంట్ ఇమేజినబుల్‌గా అంతరిక్ష మెరైన్‌ల ద్వారా పరిగణించబడుతుందని మ్యాన్యువల్ స్పష్టం చేస్తుంది: "యాభై మిలియన్ మైళ్లపాటు ఎలాంటి చర్య లేకపోవడం వల్ల మీ రోజు మొత్తం దుమ్ముని చప్పరించడం మరియు రెక్ గదినుంచి ఆంక్షలు విధించబడిన ఫ్లిక్స్‌ని పరిశీలించడంతోనే సరిపోతుంది." UAC పరిశోధనలు భయంకర అస్తవ్యస్తంగా మారిన సమయంలో ఈ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఫోబోస్‌ పైన కంప్యూటర్ వ్యవస్థలు సరిగా పనిచేయవు, ఇక డైమోస్‌పై పూర్తిగా కనిపించకపోవడంతో పాటు, "ఏదో దెయ్యం దాడి చేయడం" ప్రారంభమై UAC సిబ్బందినందరిని చంపడం లేదా తీవ్ర ప్రభావానికి గురిచేయడం జరుగుతుంది. ఆక్రమిత శాస్త్రవేత్తల నుంచి వచ్చే ఒక ఉద్వేగంతో నిండిన దుఃఖపూరిత పిలుపుకు ప్రతిస్పందనగా, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం మార్టిన్ మెరైన్ బృందం వేగంగా అక్కడికి పంపబడుతుంది, అక్కడ మిగిలిన బృందం మొత్తం లోపలి వైపుగా చొచ్చుకుపోయే సమయంలో స్థావరాన్ని కాపాడడం కోసం ఆటగాడి పాత్రను కేవలం ఒక తుపాకీతో సహా అక్కడ వదిలివేయడం జరుగుతుంది. అలా జరిగే సమయంలో కొన్ని గంటల తర్వాత, క్రమరహత రూపంలోని రేడియో సందేశం, తుపాకీ కాల్పులు, మరియు అరుపులు లాంటివి మెరైన్‌ వింటుంది: అంతకుముందు ఉన్న నిశబ్ధం కారణంగా "సీమ్స్ యువర్ బడ్డీస్" అని వారు అనుకుంటారు.

అంతిమ పోరాటంలో భాగంగా, భూతాలు భూమిపైకి దాడి చేయకుండా నిరోధించడం కోసం ఆటగాడి పాత్ర స్వయంగా వాటితో జరిగే భీకరమైన దాడిలో పాల్గొనాలి.[6] మొత్తం మీద ఈ గేమ్ పూర్తి కావాలంటే, మెరైన్ తప్పకుండా పోబోస్, డేమోస్, మరియు హెల్ ఇట్‌సెల్ఫ్ ద్వారా పోరాడాల్సి ఉంటుంది, ఇవి ఒక్కొక్కటీ ఒక ఎపిసోడ్‌ని కలిగి ఉండడంతో పాటు తొమ్మిది వేర్వేరు స్థాయిలుగా ఉంటుంది. నీ-డీప్ ఇన్ ది డెడ్ అనేది మొదటి ఎపిసోడ్ మాత్రమే కాకుండా, ఇది మాత్రమే షేర్‌వేర్ వెర్షన్‌గా ఉంటుంది, ఈ ఎపిసోడ్ పోబోస్‌పై ఉండే హై-టెక్ మిలటరీ బెసెస్, పవర్ ఫ్లాంట్లు, కంప్యూటర్ సెంటర్స్ మరియు జియోలాజికల్ ఎనోమైల్స్‌లో జరుగుతుంది. ఆటగాడి పాత్ర డెమోస్‌కు దారితీసే టేలీపోర్టర్‌లో ప్రవేశించడంతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది, ఈ దారిలో ఉండే భూతాలను చంపనట్టైతే ఆ భూతాలు ఆటగాడి పాత్రను ముంచేయడంతో అతని ప్రయతం చివరికొస్తుంది. ఇక రెండో ఎపిసోడ్‌ అయిన షోర్స్ ఆఫ్ హెల్‌ లో, ఆటగాడి పాత్ర డెమోస్ మీద ఉండే ఇన్‌స్టాలేషన్స్ ద్వారా ప్రయాణిస్తుంది, ఈ ప్రాంతం మొత్తం క్షద్ర శక్తుల దాడి ద్వారా నాశనమైన జంతురూప నిర్మాణాలతో నిండి ఉంటుంది. టిటానిక్ సైబర్‌డెమోన్ లార్డ్‌ను ఓడించిన తర్వాత, కనిపించకుండా పోయిన చంద్రుడి గురించి ఆటగాడికి తెలుస్తుంది: అది నరకంపై కదలాడుతుంటుంది. అటుపై నేలకు దిగిన తర్వాత, ఇన్‌ఫెర్నో అని పిలిచే మూడో ఎపిసోడ్ మొదలవుతుంది. ఇందులో భాగంగా దండయాత్రకు మూలకారణమైన భారీ స్పైడర్‌డెమోన్‌ను ఆఖరి ఘట్టంలో భాగంగా నాశనం చేయడంతో "తనని నిలవరించడం చాలా కష్టమని నిరూపించిన" హీరో కోసం భూమి వైపుకు దారితీసే దాగిఉన్న తలుపు మార్గం తెరుచుకుంటుంది. ఇక గేమ్ చివరి అంకంలో, కెమెరా ఒక పచ్చటి పొలాల వెంట పయనిస్తూ, పూలు మరియు తలబయటపెట్టిన కుందేళ్లతో నిండిన ప్రదేశాన్ని చూపెడుతుంది, ఇలా కొంతదూరం సాగాక ఒక తగలబడుతున్న పట్టణం మరియు ఒక కర్రకు గుచ్చిన కుందేలు తల కనిపిస్తుంది: దీన్నిబట్టి భూతాలు భూమిపైకి దాడి చేసిన విషయం తెలియడంతో పాటు గేమ్ సైతం డూమ్ II వైపుకి దారితీస్తుంది.

ఇక గేమ్ యొక్క రీటైల్ స్టోర్ వెర్షన్‌గా విడుదలైన ది అల్టిమేట్ డూమ్‌ , దే ఫ్లెష్ కన్జూమ్డ్ అనే నాలగవ ఎపిసోడ్‌ని అందించింది. ఇది డూమ్ మరియు డూమ్ II యొక్క మూడు ఒరిజినల్ ఎపిసోడ్స్ తర్వాత విడుదలైంది, ఇద యొక్క ఆమోదంతో స్వతంత్ర మాస్టర్ స్థాయి డిజైనర్లు ఈ ఎపిసోడ్‌ని అభివృద్ధి చేశారు, నిపుణులైన డూమ్ ఆటగాళ్లకు ఒక అతిపెద్ద సవాలుగా ఉండేందుకై ఈ నాల్గవ ఎపిసోడ్‌ని తెరమీదకు తెచ్చారు. మిగిలిన మూడు ఒరిజినల్ ఎపిసోడ్స్‌తో పోలిస్తే ఈ నాలుగవ ఎపిసోడ్ ఆడేందుకు అత్యంత కష్టంగా ఉంటుంది.

ఆడే విధానం[మార్చు]

దస్త్రం:Doom ingame 1.png
ఎపిసోడ్ I: నీ-డీప్ ఇన్ ది డెడ్, UAC మరియు ఫోబోస్‌పై ఉండే సైన్యం యొక్క సౌకర్యాల్లో చోటు చేసుకుంటుంది.


ఫస్ట్-పర్సన్ షూటర్‌ రూపంలో, డూమ్ అనేది ప్రధాన పాత్ర కళ్ల ద్వారా అనుభూతిని అందిస్తుంది. అయితే, గేమ్ మొత్తంలో ఈ పాత్రకు పేరు కేటాయించడం జరగదు. గేమ్ రూపకర్త అయిన జాన్ రోమెరో, ఈ విషయమై మాట్లాడుతూ, ఆటగాడు ఈ గేమ్‌లో మరింత లీనమయ్యేందుకు ఇది చాలా అవసరం అని అన్నారు: "డూమ్ మెరైన్‌కు ఎలాంటి పేరూ ఉండదు ఎందుకంటే ఒకవేళ అది మీరే కావచ్చు" అని ఆయన అన్నారు.[7]

ఈ గేమ్‌లోని ప్రతి స్థాయి లక్ష్యం తర్వాతి ప్రదేశానికి దారితీసే నిష్క్రమణ గదిని గుర్తించడం, నిష్క్రమణ సంకేతం మరియు/లేదా ఒక ప్రత్యేక రూపంలోని తలుపుతో గుర్తించబడే ఆ మార్గంలోనే అన్ని కష్టనష్టాలు చోటు చేసుకుంటాయి. ఈ మార్గంలో ఉండే భయంకరమైన ప్రేతాత్మలు, విషం లేదా రేడియోయాక్టివ్ ద్రవాలు కలిగిన గుంతలు, తక్కువ ఎత్తులో ఉండే పైకప్పులు లాంటివి ఆటగాడిని నలిపి వేస్తాయి. మూసి ఉన్న తలుపులను తెరవాలంటే కీకార్డ్, పుర్రె-ఆకారంలోని తాళం లేదా రిమోట్ స్విచ్‌ని కనిపెట్టాలి. గేమ్‌లోని స్థాయిలు ఒక్కోసారి చిక్కు దారులను కలిగి ఉండడంతో పాటు అదనపు మందుగుండు సామగ్రి, ఆరోగ్య వృద్ధి మరియు ఇతర "పవర్-అప్స్" లాంటి అనేక అంశాలు కూడా ఈ దారివెంట ఉంటాయి, దీంతోపాటు అప్పుడప్పుడు కనిపించే రహస్య ప్రదేశాలు కూడా ఈ దారిలో ఉంటాయి. అయితే, ఇవి అప్పటికప్పుడు ఆటగాడికి ప్రయోజనం కలిగించవు కాబట్టి ఆటగాళ్లు అత్యంత జాగ్రత్తగా ఈ మార్గంలో శోధించాల్సి ఉంటుంది. ఈ స్థాయిల వెంట సులభంగా వెళ్లేందుకు ఒక ఫుల్ స్క్రీన్ ఆటోమ్యాప్ అనేది అందుబాటులో ఉండడంతో పాటు ఆ చోట్లో అన్వేషించాల్సిన ప్రదేశాల గురించి అది చూపెడుతుంది.

డూమ్ అనేది మెరైన్‌కు అందుబాటులో ఉండే ఆయుధాల శాలకు ప్రసిద్ధి, ఇవి ఫస్ట్-పర్సన్ షూటర్ల కోసం మూలరూపంగా పరిణమిస్తాయి. ఈ గేమ్‌ను ఆడే ఆటగాడు మొదట కేవలం ఒకే ఒక తుపాకీతో , అలాగే ఒకవేళ మందుగుండు ఖాళీ అయిపోతే ఇత్తడి-కణుపులు కలిగిన పిడికిలి ఆకారాపు పరికరం అందుబాటులో ఉంటుంది. అయితే, భారీ ఆయుధాలను కూడా తీసుకోవచ్చు: చైన్‌సా, ఒక షాట్‌గన్, ఒక చైన్‌గన్, ఒక రాకెట్ లాంచర్, ఒక ప్లాస్మా రైఫిల్తో పాటు అత్యంత శక్తివంతమైన BFG 9000 లాంటి ఆయుధాలు ఇందులో భాగంగా అందుబాటులో ఉంటాయి. ఈ గేమ్‌లో విస్తృత శ్రేణిలో పవర్ అప్స్ అందుబాటులో ఉంటాయి, బ్యాక్‌ప్యాక్ అనేది ఇందులో ఒకటి. దీన్ని దక్కించుకోవడం ద్వారా ఆటగాడు ఆయుధాల మోసే సామర్థ్యం, కవచం, ఆరోగ్యాన్ని పునరుద్ధరించేందుకు అవసరమైన ప్రధమ చికిత్స పెట్టెలు లాంటివి అందుబాటులో ఉంటాయి, దీంతోపాటు బెర్సెర్క్ ప్యాక్ (ఇది ఒక ముదురు రంగు ప్రధమ చికిత్స పెట్టె. ఇది ఆటగాడి పాత్రను బెర్సెర్క్ మోడ్‌లో ఉంచుతుంది. ఈ పవర్ అప్‌ను దక్కించుకోవడం ద్వారా ఆటగాళ్లు తమ చేతి పిడికిలితో రాకెట్ లాంచర్ కలిగించగల స్థాయిలో నష్టాన్ని కలిగించవచ్చు. అలాగే అంతకుముందు మానవులను, దెయ్యాలను సమర్థంగా సృష్టించవచ్చు, అలాగే ఆటగాడి ఆరోగ్యం తగ్గినట్టైతే దాన్ని 100%కు పెంచుతుంది), సూపర్‌నేచురల్ బ్లూ ఆర్బ్స్‌ (మ్యానువల్స్‌లో దీన్ని సోల్ స్పియర్స్ ‌గా పేర్కొంటారు)లు కూడా ఉంటాయి. బ్లూ ఆర్బ్స్ అనేది ఆటగాడి పాత్ర యొక్క ఆరోగ్య శాతాన్ని 100% పెంచుతుంది, గరిష్టంగా 200% వరకు ఇలా పెంచుతుంది, ఇవి మాత్రమే కాకుండా నైట్‌విజన్, కంప్యూటర్ మ్యాప్‌లు (ఇది గేమ్ స్థాయి యొక్క ప్రతి ప్రాంతాన్ని చూపెడుతుంది), పార్షియల్ ఇన్‌విజిబులిటీ, మరియు విష రసాయనాల నుంచి రక్షణ కల్పించే రక్షణ సూట్లు లాంటివి కూడా ఉంటాయి.

డూమ్‌ లోని శ్రతు భూతాలను ప్రధాన గేమ్‌ప్లే మూలకం సిద్దం చేసింది. గేమ్‌లో భాగంగా ఆటగాడి పాత్ర ఇలాంటి శత్రు భూతాలని ఎక్కువ సంఖ్యలో ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఒక కొత్త గేమ్‌ని ఎంచుకున్న సమయంలో అందులో ఉండే ఐదు కష్టతరమైన స్థాయిలు నుంచి ఆటగాడు ఎంచుకునే స్థాయిపై ఆధారపడి ఈ భూతాల సంఖ్య పెరుగుతుంది. అతీంద్రియ శక్తులు కలిగిన మానవులతో పాటు ప్రత్యేకించి భయంకర భూతాలుతో సహా మొత్తం 10 రకాల భూతాలు ఉంటాయి. ఇవన్నీ అనేక మార్గాల నుంచి దాడి చేస్తుంటాయి. భూతాలు చాలా సరళమైన ప్రవర్తనను కలిగి ఉంటాయి, ప్రత్యర్థి వైపు దూసుకు రావడం గానీ లేకుంటే ఫైర్‌బాల్స్‌ని విసరడం, కొరకడం, మరియు రక్కడం లాంటి విధానాల ద్వారా ఇవి దాడికి ప్రయత్నిస్తాయి. అదేసమయంలో ఒక రకానికి చెందిన భూతం దాడి చేసిన సమయంలో మరో రకం భూతం కూడా దాడి చేసినట్టైతే, అప్పుడు ఆ రెండు రకాల భూతాలు ఒకదానితో ఒకటి ఘర్షణకు దిగుతాయి (మానవ భూతాలు సైతం తమదైన సొంత రూపంలో దాడికి దిగుతారు)

డూమ్‌ (మరియు దాని కొనసాగింపులు)కు సంబంధించిన అనేక వెర్షన్‌లు రహస్య స్థాయిలను కూడా కలిగి ఉంటాయి. ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొన్న సమయంలో ఇవి ఆటగాడి ద్వారా తెరవబడుతాయి, అయితే, చాలా సందర్భాల్లో దాగిఉన్న ఈ రకమైన రహస్య తలుపులు లేదా ప్రాంతాలను సమీపించడమనేది కష్టంతో కూడుకున్న పని. దూమ్ II యొక్క కొన్ని వెర్షన్లలో ఇన్‌కార్పోరేట్ లెవల్ డిజైన్ మరియు డూమ్‌స్ ప్రీకర్షర్ , వుల్ఫెన్‌స్టెయిన్ 3D లాంటి రెండు రహస్య స్థాయిలు సైతం id ద్వారానే అభివృద్ధి చేయబడింది.

సింగిల్ ప్లేయర్ గేమ్ మోడ్ అంశాన్ని పక్కనపెడితే, నెట్‌వర్క్ ద్వారా ఆడేందుకు వీలుగా డూమ్ రెండు మల్టీప్లేయర్ మోడ్స్‌ని కలిగి ఉంటుంది: "కోపరేటివ్" అనే విధానంలో ఇద్దరు నుంచి నలుగురు ఆటగాళ్లు ఒక బృందంగా గేమ్‌ని ఆడవచ్చు. ఇక "డెత్‌మ్యాచ్" విధానంలో ఇద్దరు నుంచి నలుగురు ఆటగాళ్లు ప్రత్యర్థులుగా ఈ గేమ్‌ని ఆడవచ్చు.

అభివృద్ధి[మార్చు]

డూమ్ అభివృద్ధి 1992లో ప్రారంభమైంది, ఈ సమయంలో జాన్ D. కార్‌మాక్ డూమ్ ఇంజిన్ అనే ఒక కొత్త 3D గేమ్ ఇంజన్‌ని అభివృద్ధి చేశారు, అదేసమయంలో మిగిలిన id సాఫ్ట్‌వేర్ బందం వుల్ఫెన్‌స్టెయిన్ 3D ప్రీక్వెల్‌ని, స్పియర్ ఆఫ్ డెస్టినీ ని పూర్తి చేసింది. 1992లో గేమ్ డిజైన్ ఫేజ్ ప్రారంభమైన సమయంలో, ఈ గేమ్‌కు సంబంధించిన ప్రధాన నేపథ్యానికి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం అయిన ఏలియన్స్ మరియు భయానక చిత్రం ఈవిల్ డెడ్ II లాంటి చిత్రాలు స్ఫూర్తిగా నిలిచాయి. ఇక ఈ గేమ్ టైటిల్‌ను కార్‌మాక్ సూచించారు:

There is a scene in The Color of Money where Tom Cruseమూస:Sic shows up at a pool hall with a custom pool cue in a case. "What do you have in there?" asks someone. "Doom." replied Cruse with a cocky grin. That, and the resulting carnage, was how I viewed us springing the game on the industry.

— John Carmack[8]

డిజైనర్ టామ్ హాల్, డూమ్ బైబిల్ పేరుతో ఒక విస్తృత స్థాయి డిజైన్ డాక్యుమెంట్‌ని రాశారు. గేమ్‌కి సంబంధించిన ఒక వివరణాత్మక స్టోరీలైన్, మల్టిపుల్ ప్లేయర్ క్యారెక్టర్స్, మరియు అసంఖ్యాక ఇంటర్యాక్టివ్ ఫీచర్లకు సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి.[9] అయినప్పటికీ, కార్‌మ్యాక్ ద్వారా ప్రాథమికంగా సూచించబడిన సాధారణ రూపకల్పన అభివృద్ధి సందర్భంగా టామ్ హల్ సూచించిన అనేక ఆలోచనలను తొలగించారు. దీంతో దర్శకత్వం విషయంలో ప్రభావవంతమైన పాత్ర వహించలేక పోవడంతో హల్ ఈ గేమ్‌ రూపకల్పన నుంచి వైదొలిగారు. అయితే, మిగిలిన సభ్యులు మాత్రం గేమ్‌ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. చివరి గేమ్‌లో పూర్తయ్యే లెవెల్ డిజైన్ చాలావరకు జాన్ రోమెరో మరియు శాండీ పీటర్‌సన్ల ద్వారా రూపొందింది. ఇక ఈ గేమ్‌కు సంబంధించిన గ్రాఫిక్ అంశాలు ఆడ్రిన్ కార్‌మాక్ ద్వారా రూపొందింది, అలాగే కెవిన్ క్లౌడ్ మరియు గ్రెగర్ పంచట్జ్‌లు వివిధ రకాల మార్గాల్లో నమునాలను సిద్ధం చేశారు: ఈ గేమ్‌లోని చాలా భాగాలను గీయడం లేదా చిత్రీకరించడం జరిగినప్పటికీ, అనేక భూతాల రూపాలను బంకమట్టి లేదా లేటెక్స్‌తో రూపొందించారు, అలాగే ఇందులోని కొన్ని ఆయుధాలు బొమ్మ తుపాకులు. ఇవి టాయ్స్ "R" Us నుంచి తీసుకోబడింది. అలాగే హెవీ మెటల్-ఆంబియంట్ సౌండ్‌ట్రాక్‌ను బాబీ ప్రిన్స్ అందించారు.[10]

ఇంజిన్ సాంకేతికత[మార్చు]

డూమ్ ‍ '​ విడుదలైన సమయంలో, దాని వాస్తవిక 3D గ్రాఫిక్స్ దాని ప్రాథమిక ప్రత్యేక లక్షణంగా నిలిచింది, అటుపై వినియోగదారుని-స్థాయి హార్డ్‌వేర్‌పై నడిచే ఇతర వాస్తవ-సమయ- గేమ్స్ ద్వారా అది అద్వితీయమైనదిగా తయారైంది. id సాఫ్ట్‌వేర్ యొక్క క్రితం గేమ్ అయిన వుల్ఫెన్‌స్టెయిన్ 3D కి జోడించిన అనేక కొత్త అంశాలను డూమ్ ఇంజన్‌‌లో చూడవచ్చు:

దస్త్రం:Doom darkness.png
గేమ్ వాతావరణాన్ని వృద్ధిచేయడంలో భాగంగా డూమ్ ఎక్కువగా లైటింగ్ కాంట్రాస్ట్‌లపై ఆధారపడుతుంది.
 • ఎత్తులో తేడా – వుల్ఫెన్‌స్టెయిన్ 3D లో అన్ని గదుల ఎత్తు ఒకేలా ఉంటుంది;
 • నాన్-పెర్పెన్డికులర్ వాల్స్ – వుల్ఫెన్‌స్టెయిన్ 3D లోని అన్ని గోడలు దీర్ఘచతురాస్త్రాకార గ్రిడ్ వెంబడి పయనిస్తాయి;
 • అన్ని సమతలాల పూర్తి టెక్చర్ మ్యాపింగ్ – వుల్ఫెన్‌స్టెయిన్ 3D లోని, నేలలు మరియు పైకప్పులు లాంటివి ముదురు రంగులో ఉంటాయి;
 • కాంతి స్థాయిల్లో వైవిధ్యం – వుల్ఫెన్‌స్టెయిన్ 3D లోని అన్ని ప్రాంతాలు ఒకే రకమైన కాంతిని కలిగిన అమరికలను కలిగి ఉంటాయి. డూమ్స్ యొక్క వాతావరణం మరియు గేమ్‌ప్లేలతో సంబంధం లేకుండా దాని విజువల్ ప్రామాణికతకు ఇది సాయపడింది.డూమ్కి ముందు వచ్చిన గేమ్స్‌లో వినని విధంగా ఇందులో ఆటగాడిని భయపెట్టేందుకు లేదా తికమక పెట్టేందుకు చీకటిని ఉపయోగించారు .'

వుల్ఫెన్‌స్టెయిన్ 3D యొక్క స్థిర స్థాయిలతో తేడా చూపే విధంగా, డూమ్‌ లో మాత్రం ఇవి ఎక్కువ క్రియాశీలకంగా ఉంటాయి: ప్లాట్‌ఫాంలు కిందికి మరియు పైకి కదలగలవు, నేలలు వరుసగా మెట్లు రూపంలోకి మారగలవు, మరియు వంతెనలు పెరగగలవు మరియు పడిపోగలవు. స్టీరియో సౌండ్ వ్యవస్థ ద్వారా వాస్తవజీవితం లాంటి పర్యావరణం ముందుకు విస్తరించబడుతుంది, దీనివల్ల సౌండ్ ఎఫెక్ట్ యొక్క మార్గం మరియు దూరంలను దాదాపుగా గుర్తించేందుకు అవకాశం కలుగుతుంది. ఆటగాడు భూతాల యొక్క అరుపులు మరియు కేకల మధ్య ముందుకు సాగుతాడు, అలాగే రహస్య ప్రాంతాలను కనుగొనే ప్రయత్నంలో దాగిఉన్న తలుపులు వాటికవే తెరుచుకునే రూపంలో ఆటగాడికి అప్పుడప్పుడూ ఆధారాలు లభిస్తాయి. వుల్ఫెన్‌స్టెయిన్ 3D లో లాగే, దూరంగా వినపడే తుపాకీ కాల్పుల శబ్ధాల ద్వారా ఆటగాడి ఉనికిని భూతాలు పసికట్టగలుగుతాయి.

1993లోని హోమ్ కంప్యూటర్లపై ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ గేమ్‌ని ఆడేందుకు అవసరమైన ఈ అంశాల కోసం కార్‌మ్యాక్ అనేక వ్యూహాలను ఉపయోగించారు. అయితే చాలావరకు డూమ్ స్థాయిలేవీ నిజమైన త్రి-డైమెన్షనల్ కావు; స్థానభ్రంశం రూపంలో ప్రత్యేకంగా నిల్వచేసిన ఎత్తు తేడాలతో అవి అంతర్గతంగా ఒక సమతలంని సూచిస్తాయి. (బయటి వాతావరణాన్ని ఎక్కువ మొత్తంలో సృష్టించడం కోసం అనేక గేమ్‌లలో ఇదే రకమైన ఉపాయాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు). అనేక డిజైన్ పరిమితులు ఉన్నప్పటికీ రెండు స్థానాల ప్రదర్శన ప్రభావాన్ని కలిగించేందుకు ఇది అనుమతిస్తుంది: ఉదాహరణకు, ఒక గదిపై మరొకటి ఉన్నట్టుగా చూపించడం డూమ్ ఇంజన్‌కి సాధ్యం కాదు. అయినప్పటికీ, బైనరీ స్పేస్ విభజన విధానాన్ని ఉపయోగించడం ద్వారా ఈ గేమ్‌లో పర్యావరణం చాలా వేగంగా మారిపోగలదు, ఇందులోని టు-డైమెన్షన్ అంశం ఇందుకు సాయపడుతుంది. అతివ్యాప్తికి సంబంధించిన ఎలాంటి సమస్య లేకుండా 2D దిశతో ఉండడం వల్ల ఆటోమ్యాప్ యొక్క స్పష్టత అనే ఇంకో రకమైన సౌలభ్యం కూడా ఉంది. వీటితోపాటు, బ్రూస్ నైలర్ రూపొందించిన BSP ట్రీ టెక్నాలజీని కూడా ఇందులో ఉపయోగించారు.[11]

మాడ్యులర్ డేటా ఫైల్స్ అనేది డూమ్ ఇంజన్‌ యొక్క మరో ముఖ్యమైన అంశం, ఇది కస్టమ్ WAD ఫైల్స్‌ని జతచేయడం ద్వారా గేమ్ యొక్క ఎక్కువ భాగం విషయాన్ని పునఃస్థాపింపజేసేందుకు అనుమతిస్తుంది. విస్తరణకు వీలయ్యే విధంగా వుల్ఫెన్‌స్టెయిన్ 3D ని రూపొందించలేదు, అయినప్పటికీ ఈ గేమ్ అభిమానులు మాత్రం తమ సొంత స్థాయిలను ఎలా రూపొందించాలనే విషయంలో ముందుకు సాగారు. అయితే, డూమ్ మాత్రం తదుపరి విస్తరణకు వీలయ్యే విధంగా రూపొందించబడింది. కస్టమ్ సీనరీలను సృష్టించే అవకాశం ఉండడమనేది ఈ గేమ్ యొక్క ఆకర్షణ (కింద ఉండే WADలుపై ఉండే సెక్షన్‌ని చూడండి)ని గణనీయంగా పెంచింది.

విడుదల మరియు గత చరిత్ర[మార్చు]

ప్రాథమిక జనాదరణ[మార్చు]

డూమ్ యొక్క అభివృద్ధి, ఎక్కువ భాగం ముందస్తు అంశాలతో నిండి ఉంటుంది. డూమ్ గురించి ఇంటర్నెట్ న్యూస్‌గ్రూప్‌లో భారీగా చోటుచేసుకున్న పోస్టులన్నీ దీన్ని ఒక SPISPOPD[12] జోక్‌గా అభివర్ణించాయి, ఈ కోడ్ అనేది గేమ్‌లో భాగంగా చీట్ కోడ్ రూపంలో అందించబడుతుంది. దీంతోపాటు గేమ్‌కు సంబంధించిన వార్తలు, పుకార్లు మరియు స్క్రీన్‌షాట్‌లు, అనధికారికంగా బయటకు పొక్కిన ఆల్పా వెర్షన్‌లు లాంటివి కూడా ఆన్‌లైన్‌లో కనిపించాయి. (చారిత్రక ఆసక్తి కారణంగా చాలా ఏళ్ల తర్వాత id సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ ఆల్పా వెర్షన్లు విడుదలయ్యాయి; ప్రాథమిక డిజైన్ స్థాయిల కంటే ప్రస్తుత గేమ్ ఏవిధంగా అభివృద్ధి చెందిందనే విషయాన్ని ఇవి బహిర్గతం చేశాయి).[13] డూమ్ యొక్క మొదటి పబ్లిక్ వెర్షన్‌ను సాఫ్ట్‌వేర్ క్రియేషన్స్ BBSకు అప్‌లోడ్ చేశారు. అలాగే యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్‌సిన్-మ్యాడిసన్‌లోని FTP సర్వర్‌కి సైతం డిసెంబర్ 10, 1993న దీన్ని అప్‌లోడ్ చేశారు.

ప్రజలు దీన్ని మరింతగా పంపిణీ చేయడానికి వీలుగా డూమ్ అనేది షేర్‌వేర్ రూపంలో విడుదల చేశారు. అలాగే మరిన్ని చర్యలు చేపట్టారు: 1995లో, డూమ్‌ ను 10 మిలియన్లకు పైగా కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ చేసే అవకాశముందని అంచనా వేశారు. అయితే చాలామంది యూజర్లు రిజిస్టర్డ్ వెర్షన్‌ని కొననప్పటికీ, ఒక మిలియన్ పైగా కాపీలు అమ్ముడయ్యాయి, అలాగే ఈ సందర్భంగా లభించిన ప్రజాదరణ అటుపై వెలువడిన డూమ్ సిరీస్ గేమ్‌లు ఎక్కువగా అమ్ముడయ్యేందుకు సాయపడింది. అయితే, ఈ గేమ్‌లు షేర్‌వేర్ రూపంలో విడుదల కాలేదు. 1995లో, ది అల్టిమేట్ డూమ్ (వెర్షన్ 1.9, IVవ ఎపిసోడ్‌తో సహా) విడుదలైంది, ఈ సందర్భంగా మొదటిసారిగా డూమ్ వాణిజ్యపరంగా దుకాణాల్లోనూ అందుబాటులోకి వచ్చింది.

దస్త్రం:Billdoom.png
విండోస్ 95ను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు, వీడియో గేమ్స్ యొక్క జనాదరణను వినియోగించేందుకు బిల్ గేట్స్ సిద్ధమయ్యారు, ఇందులో భాగంగా డూమ్‌ నేపథ్యంలో ఒక వీడియో ప్రజెంటేషన్‌ని సిద్ధం చేయడమే కాకుండా ఆ వీడియోలో జోంబిస్‌పై కాల్పులు జరిపే దృశ్యంలో ఆయన కనిపించారు.

జనవరి 1, 1993న విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో భాగంగా, డూమ్ అనేది "ప్రపంచ వ్యాప్త వ్యాపారంలో ఉత్పాదకత తగ్గేందుకు ప్రప్రథమ కారణం కాగలదు" అని id సాఫ్ట్‌వేర్ తెలిపింది. id సాఫ్ట్‌వేర్ చెప్పిన జోస్యం కొంతవరకు నిజమైంది: డెత్‌మ్యాచ్‌ల కారణంగా కంప్యూటర్ నెట్‌వర్క్‌లు ట్రాఫిక్‌కు గురికావడం మరియు ఉద్యోగుల పని సమయాన్ని ఈ గేమ్ ఆక్రమించుకోవడం లాంటి రెండు కారణాల వల్ల డూమ్ అనేది పని ప్రదేశాల్లో ఒక పెద్ద సమస్యగా తయారైంది. దీంతో పని సమయాల్లో డూమ్ ‌ను ఆడేందుకు నిరాకరిస్తూ ఇంటెల్, లోటస్ డెవలప్‌మెంట్ మరియు కార్నీజ్ మెల్లాన్ యూనివర్సిటీలతో సహా మరెన్నో సంస్థలు విధానాలను రూపొందించాయి. ఇక మైక్రోసాఫ్ట్ క్యాంపస్‌లో, డూమ్ అనేది ఒక "మతపర అంశాని"కి సమానమైనదిగా మారింది.[10]

1995 చివర్లో, మిలియన్-డాలర్ ఖర్చుతో ప్రకటనలను గుప్పించినప్పటికీ మైక్రోసాఫ్ట్ కొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్ 95ను ఇన్‌స్టాల్ చేసుకున్న కంప్యూటర్ల సంఖ్య కంటే, డూమ్‌ ను ఇన్‌స్టాల్ చేసుకున్న కంప్యూటర్ల సంఖ్యే ఎక్కువ. ఈ గేమ్‌కు లభించిన ఆదరణ, id సాఫ్ట్‌వేర్‌ను సొంతం చేసుకునే దిశగా బిల్ గేట్స్‌ను పురిగొల్పింది,[10] అలాగే ఆపరేటింగ్ సిస్టంను ఒక గేమింగ్ ప్లాట్‌ఫాంగా వెలుగులోకి తేవడం కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ డూమ్ యొక్క విండోస్ 95 పోర్ట్‌ని అభివృద్ధి చేసింది. విండోస్‌ 95ను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా నిర్వహించిన పరిచయ కార్యక్రమాల్లో భాగంగా బిల్‌గేట్స్ ఈ గేమ్‌ విషయంలో డిజిటల్ రూపంలో చొచ్చుకు పోయేందుకు సిద్ధమయ్యారు.[14] మైక్రోసాఫ్ట్ 1995 తన ఎక్సెల్ 95ను డూమ్-ఎస్క్యూ సీక్రెట్ లెవల్‌తో పాటు విడుదల చేసింది, ఇది ఇతర అంశాల మధ్య ప్రోగ్రామర్స్ యొక్క ఈస్టర్ ఎగ్‌ కలిగిన రేఖాచిత్రాల రూపంలో ఉంటుంది. స్ప్రెడ్‌షీట్ కార్యక్రమంలో కోడ్‌ని ఉంచే దిశగా డూమ్ విండోస్ 95 పోర్ట్‌పై పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ ఇంజనీర్లు తన అనుభవాన్ని అవకాశంగా తీసుకున్నారనే అనుమానాలు చోటు చేసుకున్నాయి.[15]

గేమింగ్ ప్రెస్‌లో డూమ్‌ కు భారీస్థాయిలో ప్రశంసలు లభించాయి. 1994లో, PC గేమర్ మరియు కంప్యూటర్ గేమింగ్ వరల్డ్ ద్వారా ఇది గేమ్ ఆఫ్ ది ఇయర్ ‌గా అవార్డును దక్కించుకుంది. అలాగే ఇది PC మేగజైన్ ద్వారా టెక్నికల్ ఎక్సలెన్స్ అవార్డును అందుకుంది, మరియు అకాడమీ ఆఫ్ ఇంటరాక్టివ్ ఆర్ట్స్ & సైన్సెస్ ద్వారా బెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ గేమ్ అవార్డును దక్కించుకుంది.

దీంతోపాటు థ్రిల్లింగ్ స్వభావం కలిగిన ఇందులోని సింగిల్-ప్లేయర్ గేమ్, డెత్‌మ్యాచ్ మోడ్ అనేది ఈ గేమ్ ఆదరణ పొందేందుకు ప్రధాన కారణంగా నిలిచింది. డెత్‌మ్యాచ్ మోడ్‌తో ఫస్ట్-పర్సన్ షూటర్‌ని కలిగిన మొదటి గేమ్ డూమ్ మాత్రమే కాబోదు- అటారీ STకి చెందిన MIDI మేజ్ 1987లో ఇలాంటి గేమ్‌ని ఒకదాన్ని అందుబాటులోకి తెచ్చింది, ఇందులో భాగంగా నాలుగు మెషిన్ల వరకు కలిసిపనిచేసేలా నెట్‌వర్క్‌ని అభివృద్ధి చేయడం కోసం STని నిర్మించేందుకు MIDIని ఉపయోగించడం జరిగింది. అయినప్పటికీ, ఎథెర్‌నెట్‌పై డెత్‌మ్యాచ్‌ని అనుమతించిన మొదటి గేమ్ డూమ్ మాత్రమే, అలాగే స్నేహితులతో పోరు ద్వారా హింస మరియు రక్తపాతంలు జనించడం అనేది డూమ్ ‌లోని డెత్‌మ్యాచ్‌ని ప్రత్యేకించి ఆకర్షణీయంగా మార్చింది. మోడమ్‌ని ఉపయోగించడం ద్వారా ఒకే ఫోన్ లైన్‌పై టు-ప్లేయర్ మల్టీప్లేయర్ కూడా సాధ్యమవుతుంది. దీని విస్తారమైన పంపిణీ కారణంగా, పెద్ద మొత్తంలో ప్రేక్షకులకు పరిచయమైన డెత్‌మ్యాచ్ గేమ్‌గా (("డెత్‌మ్యాచ్" అనే పదాన్ని ఉపయోగించిన తొలి గేమ్‌గా కూడా) డూమ్ అవతరించింది.

WADలు[మార్చు]

దస్త్రం:Ghostbusters Doom.png
డూమ్ WADలలో చేర్చబడిన అనేక చిత్రాల్లో గోస్ట్‌బస్టర్స్ కూడా ఒకటి.

కస్టమ్ WAD ఫైల్‌లు రూపంలో కస్టమ్ స్థాయిలను సృష్టించగల సామర్థ్యంతో పాటు గేమ్‌ని మార్చగలగడం లాంటివి డూమ్ ‌కు ప్రత్యేక ఆదరణ అందించే లక్షణంగా రూపొందింది. మొదటి భారీ మోడ్-మేకింగ్ కమ్యూనిటీగా వృద్ధి చెందడం ద్వారా, ఫస్ట్-పర్సన్ షూటర్స్ చుట్టూ ఉండే సంస్కృతిని మరియు దానికి సంబంధించిన పరిశ్రమను సైతం డూమ్ ప్రభావితం చేసింది. వృత్తిరీత్యా గేమ్ డిజైనర్‌లు అయిన అనేకమంది డూమ్ WADలను రూపొందించడాన్ని వ్యాపకంగా మార్చుకోవడం ద్వారానే తమ కెరీర్‌లను ప్రారంభించారు. అలాంటి వారిలో ఒకరైన టిమ్ విల్లిట్స్ అటుపై id సాఫ్ట్‌వేర్‌లో ప్రధాన డిజైనర్‌గా పనిచేశారు.

మొదటి లెవెల్ ఎడిటర్‌లు 1994 ప్రారంభంలో కనిపించారు, అలాగే గేమ్‌లోని అనేక అంశాలను ఎడిట్ చేసేందుకు అనుమతించే అధనపు పరికరాలు రూపొందాయి. ఒరిజినల్ గేమ్ రూపంలోనే ఎక్కువభాగం WADలు ఒకటి లేదా అనేక కస్టమ్ స్థాయిలను కలిగి ఉన్నప్పటికీ, ఇతరులు కొత్త భూతాలను మరియు ఇతరను వనరులను ఇందులోకి చొప్పించడం ద్వారా గేమ్‌ప్లే రూపాన్ని భారీగా మార్పు చేశారు; ప్రజాదరణ పొందిన అనేక సినిమాలు, టెలివిజన్ సిరీస్‌లు, ఇతర వీడియో గేమ్‌లు మరియు పాపులర్ కల్చర్ నుంచి వచ్చిన ఇతర బ్రాండ్‌లు లాంటివి అభిమానుల కారణంగా డూమ్ WADలలో ( అధికారిక ముద్ర లేకుండానే) చేరాయి, అలాగే అభిమానుల చొరవతో ఏలియన్స్ , స్టార్ వార్స్ , ది X-ఫైల్స్ , ది సింప్సన్ , సౌత్ పార్క్ , సైలర్ మూన్ , డ్రాగన్ బాల్ Z , రెడ్ ఫ్యాక్షన్ , పోకేమన్ మరియు బ్యాట్‌మెన్ చిత్రాల నేపథ్యాలు ఈ గేమ్‌లో చేరాయి. థీమ్ డూమ్ ప్యాచ్ లాంటి కొన్నింటిలో కనిపించే శత్రువులు ఏలియన్స్ , ప్రిడేటర్ మరియు ది టెర్మినేటర్ లాంటి చిత్రాలను దిగుమతి అయిన వారే.

అలాగే గేమ్‌లోని వివిధ రకాల పాత్రలు మరియు ఆయుధాలు చేసే శబ్ధాన్ని మార్చగలిగే విధంగా కొన్ని యాడ్-ఆన్ ఫైల్స్ కూడా రూపొందాయి. బియావిస్ అండ్ బుట్‌హెడ్ మరియు వెన్ హ్యారీ మెట్ శాలీ... నుంచి తీసుకున్న ప్రఖ్యాత ఉద్వేగ సన్నివేశం లాంటివి గుర్తించదగిన కొన్ని ఉదాహరణలు.

1994 మరియు 1995 ప్రాంతంలో, WADలు ప్రాథమికంగా బులెటిన్ బోర్డ్ సిస్టంలు రూపంలో ఆన్‌లైన్ ద్వారా లేదా కాంపాక్ట్ డిస్క్‌ కలెక్షన్ల రూపంలో కంప్యూటర్ షాపుల ద్వారా, కొన్నిసార్లు ఎడిటింగ్ పుస్తకాలతో కలిపిన రూపంలోనూ ఇవి పంపిణీ అయ్యాయి. ఆ తర్వాతి సంవత్సరాల్లో FTP సర్వర్లు ప్రాథమిక పద్ధతిగా తయారైంది. మాస్టర్ లెవల్స్ ఫర్ డూమ్ II తో సహా కొన్ని WADలు వాణిజ్యపరంగా విడుదలయ్యాయి, మ్యాగ్జిమమ్ డూమ్‌ తో సహా ఇవి 1995లో విడుదలయ్యాయి, ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన 1,830 WADలను ఈ CD కలిగి ఉంటుంది. అనేక వేల WADలు ఒక మొత్తంగా తయారయ్యాయి: idగేమ్స్ FTP ఆర్కీవ్‌లో 13,000కు పైగా ఫైల్స్ ఉన్నప్పటికీ,[16] డూమ్ అభిమానుల నుంచి రూపొందిన మొత్తం ఉత్పాదనలో ఇదొక చిన్న భాగంగా మాత్రమే నిలవగలిగింది.

ఈ గేమ్ ఒక DOS గేమ్‌గాను మరియు దీన్ని నడిపేందుకు అవసరమైన అన్ని కమాండ్లు కమాండ్ లైన్‌లోని ప్రవేశించడం జరిగిన తర్వాత నుంచి వివిధ WADలను లోడ్ చేయడం కోసం మూడవ పార్టీ ప్రోగ్రామర్లు కూడా ప్రోగ్రాంలు రాశారు. మెనూ నుంచి ఏ ఫైల్స్‌ని లోడ్ చేయాలనే విషయాన్ని ఆటగాడు ఎంచుకునేందుకు ఒక ప్రత్యేకమైన లాంచర్ అనుమతించడం ద్వారా దీన్ని ప్రారంభించడం మరింత సులభంగా మారింది.

విజార్డ్‌వర్క్స్‌ సాఫ్ట్‌వేర్, D! జోన్ విస్తరణ ప్యాక్‌ను విడుదల చేసింది. ఇందులో డూమ్ మరియు డూమ్ II ల కోసం వందల సంఖ్యలో స్థాయిలు అందుబాటులో ఉంటాయి.[17] D జోన్ అనేది 1995లో డ్రాగన్ #217లోని "ఐ ఆఫ్ ది మానిటర్" కాలమ్‌లో భాగంగా జే & డీ ద్వారా సమీక్షించబడింది. అందులో భాగంగా జే ఈ ప్యాక్‌కి 5 స్టార్లకు గాను 1 స్టార్ కేటాయించగా, డీ 1½ స్టార్లను కేటాయించారు.[17]

క్లోన్స్ మరియు సంబందిత ఉత్పత్తులు[మార్చు]

డూమ్-తరహా గేమ్స్‌లోని గేమ్‌ప్లే శైలిని వర్ణించేందుకు "డూమ్ క్లోన్" అనే మాట ప్రాథమికంగా ఆదరణ పొందింది, అయితే, 1996 తర్వాత క్రమేణా ఈ పదం స్థానాన్ని "ఫస్ట్-పర్సన్ షూటర్‌" అనే పదం ఆక్రమించిగా 1998 నాటికి ఫస్ట్-పర్సన్ షూటర్" అనేపదం "డూమ్ క్లోన్" అనే పదాన్ని పూర్తిగా తుడిచిపెట్టింది.

డూమ్‌ కు లభించిన ఆదరణ దాని సీక్వెల్‌ (కొనసాగింపు), Doom II: Hell on Earth (1994), దీంతోపాటు అదే రకమైన గేమ్ ఇంజన్‌పై ఆధారపడి విస్తరణ ప్యాక్‌లు మరియు ది అల్టిమేట్ డూమ్ (1995), ఫైనల్ డూమ్ (1996), మరియు డూమ్ 64 (1997) లాంటి ప్రత్యామ్నాయ వెర్షన్ల అభివృద్ధికి కూడా దారితీసింది. దీంతో డూమ్ ఒక "కిల్లర్ అఫ్లికేషన్‌"గా అవతరించింది, సమర్థవంతమైన అన్ని కన్సోల్‌లు మరియు ఆపరేటింగ్ సిస్టంలు దాని కోసమే సిద్ధం చేశారు, అలాగే అటుపై విడుదలైన డూమ్ వెర్షన్లు కింది సిస్టమ్స్ కోసం విడుదల చేయబడ్డాయి: DOS, మైక్రోసాఫ్ట్ విండోస్, ఎమెగా, QNX, ఇరిక్స్, NEXTSTEP, లీనక్స్, యాపిల్ మాసిన్‌తోస్, సూపర్ NES, సేగ 32X, సోనీ ప్లేస్టేషన్, గేమ్ బాయ్ అడ్వాన్స్, ఐఫోన్ OS, RISC OS, అటారీ జాగౌర్, సేగ శాటరన్, నిన్టెన్డో 64, ట్యాప్‌వేవ్ జోడియాక్, 3DOలతో పాటు డూమ్ 3 యొక్క ఒక ఫీచర్‌గా Xబాక్స్ విడుదలైంది: ఇదొక పరిమిత ఎడిషన్, మరియు Xబాక్స్ లైవ్ ఆర్కేడ్‌గా Xబాక్స్ 360ని రూపొందించారు. ఇటీవల, నెట్రిక్స్ ద్వారా హ్యాక్ చేయబడిన ఓపెన్ ZDK సాయంతో జూన్ HD ద్వారా గేమ్ కోసం ఒక పోర్ట్ రూపొందించబడింది. డూమ్ గేమ్స్‌ అమ్మకాలు ఎంత ఉండొచ్చు అనే విషయంలో స్పష్టత లేనప్పటికీ 4 మిలియన్లకు పైగా ఉండవచ్చని అంచనా; అదేసమయంలో మొత్తం అమ్మకాల్లో ఒక్క డూమ్ II మాత్రమే $100 మిలియన్లను సాధించింది.

దీంతోపాటు ఈ గేమ్‌ని ఆధారం చేసుకుని తమ సొంత గేమ్స్‌ని విడుదల చేయడం కోసం ఈ గేమ్ ఇంజన్ లైసెన్స్‌ని అనేక ఇతర కంపెనీలకు అందించారు, హెర్టిక్ , హెక్సెన్ , స్ట్రైఫ్ మరియు హ్యాక్స్ లాంటి కొన్ని కంపెనీలు ఈ విధంగా లైసెన్స్ పొందాయి. మరోవైపు పప్పుల అమ్మకాలను పెంచడంలో భాగంగా 1996లో ర్యాల్‌స్టన్ ఫుడ్స్ ద్వారా ఒక డూమ్ -ఆధారిత గేమ్ చెక్స్ క్వెస్ట్ విడుదల చేయబడింది,[18] అలాగే "కలిసి పనిచేయడాన్ని, సహకారం మరియు నిర్ణయం-తీసుకోవడాన్ని బోధించేందుకు" యునైటెడ్ స్టేట్స్ మెరైన్ క్రాప్స్ వారు మెరైన్ డూమ్‌ ను రూపొందించారు.

డూమ్ యొక్క విడుదల తర్వాత డజన్ల కొద్దీ కొత్త కొత్త ఫస్ట్-పర్సన్ షూటర్ టైటిళ్లు విడుదలయ్యాయి, చాలా సందర్భాల్లో అలాంటి వాటిని "ఫస్ట్-పర్సన్ షూటర్స్" అని పిలవడానికి బదులు డూమ్ "క్లోన్స్" అని పిలవడం జరిగింది. వీటిలో కొన్నింటిని కచ్చితంగా "క్లోన్స్" గానే చెప్పవచ్చు — తొందర తొందరగా తయరైన ఇలాంటి గేమ్‌లను అంతే తొందరగా మర్చిపోవడం జరిగింది- మిగిలినవి ఈ ప్రక్రియలో సరికొత్త స్థాయిలను సృష్టించడంతో పాటు మంచి గుర్తింపును సాధించాయి. ఆయుధాల ఎంపిక మరియు చీట్ కోడ్స్ లాంటి విషయాల్లో ఈ రకమైన గేమ్‌లలో చాలా భాగం డూమ్‌ ను పోలిన రూపంలోనే విడుదలయ్యాయి. ఈ విధంగా వచ్చిన గేమ్‌లలో అపోగీ'స్ రైజ్ ఆఫ్ ది ట్రైడ్ మరియు లుకింగ్ గ్లాస్ స్టూడియోస్' సిస్టం షాక్ (ఇవి డూమ్‌ లా కాకాండా, నిజమైన 3D గేమ్‌ప్లేతో విడుదలయ్యాయి) లాంటివి డూమ్ 'స్‌కి శత్రువుల్లా తయారయ్యాయి. లూకాస్‌ఆర్ట్స్ తమ ఫస్ట్-పర్సన్ షూటర్ అయిన డార్క్ ఫోర్సెస్‌ ని విడుదల చేయడానికి ముందు దానికి ప్రచారం కల్పించడం కోసం స్టార్ వార్స్ -నేపథ్యం కలిగిన WADలను విడుదల చేసింది.[19]

అటుపై మూడేళ్ల తర్వాత, 3D రీలీమ్స్ తన డ్యూక్ నూకెమ్ 3D ని విడుదల చేసింది, టంగ్-ఇన్-చెక్ సైన్స్ ఫిక్సన్ షూటర్ అయిన ఇది కెన్ సిల్వర్‌మ్యాన్'యొక్క సాంకేతికపరమైన పోలిక కలిగిన బుల్డ్ ఇంజన్ ఆధారంగా రూపొందింది, అలాగే id సాఫ్ట్‌వేర్ తన తర్వాతి-తరం గేమ్ అయిన క్వీక్‌ ని దాదాపు పూర్తి చేసింది, ఇవి డూమ్ ‍ '​ యొక్క 1990ల విజయాన్ని గుర్తు చేయడంతో పాటు అంతకుముందు వచ్చిన వాటిపై ఉన్న ఆసక్తిని గణనీయంగా తగ్గించాయి. 2000 వరకు ఆ ఫ్రాంచైజీ అదే స్థితిలో కొనసాగింది, అదేసమయంలో డూమ్ 3 ప్రకటించబడింది. ఇది పూర్తిగా కొత్త గ్రాఫిక్ సాంకేతికతతో కూడిన ఒక ఒరిజినల్ డూమ్ తరహాలోనే రూపొందింది, ఒరిజినల్ డూమ్ తరహాలోనే రియలిజమ్ మరియు ఇంటరాక్టివిటీలలో అతిపెద్ద స్థానం కల్పించేందుకు డూమ్ 3 ని హైప్ చేశారు, దీనివల్ల డూమ్ ఫ్రాంచైజీలు విడుదలైన సమయంలో వాటిపై ఆసక్తి తిరిగి నెలకొనేందుకు ఇది సాయపడింది.

గేమ్స్ రూపంలోనే కాకుండా డూమ్ అనేది కామిక్ బుక్, డేఫెడ్ అబ్ హగ్ మరియు బ్రాడ్ లినావీవర్ (ఈ గేమ్స్‌లోని సంఘటనలు మరియు పరిసరాలను ఆధారం చేసుకుని)లు రాసిన నాలుగు నవలలు, ఒక బోర్డ్ గేమ్ మరియు కార్ల్ అర్బన్ మరియు ది రాక్ నటించి 2005లో విడుదలైన ఒక లైవ్-యాక్షన్ ఫిల్మ్ రూపాలతో సహా అనేక రూపాల్లో దర్శనమిచ్చింది. ఈ గేమ్ అభివృద్ధి మరియు పాపులర్ కల్చర్‌పై దాని ప్రభావం లాంటి అంశాలు డేవిడ్ కౌషనర్ రాసిన మాస్టర్ ఆఫ్ డూమ్ పుస్తకానికి ఒక అంశంగా ఉపయోగపడింది.

వివాదం[మార్చు]

దస్త్రం:Doom gibs.png
డూమ్ యొక్క గ్రాఫిక్ హింస స్థాయి ఆ గేమ్‌ని అత్యంత వివాదాస్పదంగా తయారు చేసాయి.

ఎక్కువ స్థాయి హింస, రక్తపాతం, మరియు సాతాన్ తరహా చిత్రాల కారణంగా డూమ్ క్రూరమైన గేమ్‌గా నిలిచింది, ఇవన్నీ కలిసి విస్తృతమైన బోర్డుల నుంచి అత్యధిక స్థాయి వివాదాన్ని సృష్టించాయి. యాహూ! గేమ్స్ దీనిని అన్ని సమయాల్లో అత్యంత వివాదాస్పదంగా నిలిచిన గేమ్స్‌లలో ఒకటిగా పేర్కొంది.[20] దీని క్రూర స్వభావం వల్ల మత సంస్థల నుంచి అనేక సమయాల్లో ఈ గేమ్ విమర్శలు ఎదుర్కొంది, మరియు "సామూహిక హత్యల తరహా" అంశాన్ని కలిగి ఉందంటూ విమర్శకుడు మరియు కిల్లోలజీ రీసెర్చ్ గ్రూప్ స్థాపకుడు డేవిడ్ గ్రోస్‌మ్యాన్‌ ద్వారా కూడా విమర్శలు ఎదుర్కొంది.[21] దీంతోపాటు పెరుగుతున్న వర్చువల్ రియాలిటీ సాంకేతికత అనేది నిజమైన హత్యలకు కూడా దారితీసే ప్రమాదముందనే భయాలకు డూమ్ కేంద్రమైంది, 1994లో వాషింగ్టన్ స్టేట్ సెనేటర్ ఫిల్ టాల్‌మ్యాడ్జ్‌పై జరిగిన ఒక విఫల హత్యాయత్నం కారణంగా ఈ రకమైన భయాలు నెలకొన్నాయి, VR ఉపయోగం కోసం కచ్చితంగా లైసెన్స్‌ను ప్రవేశపెట్టేందుకు ఈ సంఘటన దారితీసింది.[ఆధారం కోరబడింది]

అమెరికాలో ఒక నిర్ణీత కాలం పాటు చోటు చేసుకున్న పాఠశాల కాల్పులుతో ఈ గేమ్‌ మరొకసారి వివాదాల్లో చిక్కుకుంది, 1999లో కొలంబియా హై స్కూల్ హత్యాకాండకు కారణమైన ఎరిక్ హ్యారీస్ మరియు డైలన్ క్లేబోల్డ్‌లు ఈ గేమ్‌కి వీరాభిమానులనే విషయం ఈ సందర్భంగా కనుగొనబడింది. చంపడమనేది "లైక్ పక్కింగ్ డూమ్ "గా మారగలదని మరియు తన షాట్‌గన్ "స్ట్రెయిట్ అవుట్ ఆఫ్ ది గేమ్" అని హత్యాకాండకు సిద్ధమైన తరుణంలో హ్యారీస్ పేర్కొన్నాడు.[22] హత్యాకాండకు ముందు డూమ్ స్థాయిలని రూపొందించిన హ్యారీస్, వాటిని తన పాఠశాల గదులు గాను, వాటిలోని పాత్రలను తన సహచర విద్యార్థులుగాను, ఉపాధ్యాయులుగా చిత్రీకరించడంతో పాటు కాల్పుల విషయంలో తన పాత్ర అభ్యసన కోసం ఈ స్థాయిలను పదే పదే ఆడడం జరిగిందనే పుకార్లు వ్యాపించాయి. అయితే, హ్యారీస్ డూమ్ స్థాయిలను రూపొందించడం జరిగినప్పటికీ, అవి కొలంబియన్ హై స్కూల్‌కు పోలికలుగా లేవు.[23]

అదేసమయంలో దేశవ్యాప్తంగా పాఠశాలల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకోవడంతో డూమ్ మరియు ఇతర హింసాత్మక వీడియో గేమ్‌లపై విమర్శలు వెల్లువెత్తాయి, అయితే, ఈ రెండు అంశాల మధ్య దగ్గరి సంబంధం ఏదీ లేదని గ్రేటర్ గుడ్ సైన్స్ సెంటర్[24] ద్వారా ఇటీవల జరిగిన పరిశోధన తేల్చింది. దీంతోపాటు హింసాత్మక వీడియో గేమ్‌లకు, పాఠశాలల్లో కాల్పులకు మధ్య ఎలాంటి సహసంబంధం లేదని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు చెరియల్ ఓల్సన్ మరియు లావరెన్స్ కుట్నెర్‌‌లు కనుగొన్నారు. మరోవైపు పాఠశాల హింసకు సంబంధించిన 37 ఘటనలను విశ్లేషించిన U.S. సీక్రెట్ సర్వీస్ మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లు స్కూల్ షూటర్ల గురించిన వివరాలను సిద్ధం చేయాలని కోరాయి, అటుపై ఈ వివరాలను విశ్లేషించడం ద్వారా కాల్పులకు తెగబడిన వారందరి మధ్య ఉన్న కొన్ని పోలికలను కనుగొన్నారు. దాని ప్రకారం, కాల్పులు జరిపిన వారంతా మగవారే, వారంతా డిప్రెషన్ చరిత్ర కలిగి ఉండడంతో పాటు ఆత్మహత్యకు ప్రయత్నించారు. అదేసమయంలో హంతకుల్లో చాలామంది యువకులు - వారంతా వీడియో గేమ్స్ ఆడేవాళ్లే అయినప్పటికీ, గేమ్‌లు ఆడడానికి మరియు పాఠశాల కాల్పులకు మధ్య సంబంధం ఏదైనా ఉందా అనే విషయం ఈ అధ్యయనం ద్వారా బయటపడలేదు. నిజానికి, కాల్పులకు తెగబడిన మొత్తం ఎనిమిది మందిలో కనీసం ఒక్కరు కూడా హింసాత్మక వీడియో గేమ్స్ విషయంలో ప్రత్యేకమైన అభిరుచి కలిగిన వారుగా తేలలేదు; అయితే కాల్పులు జరిపిన వారిలో చాలామంది హింసాత్మక అంశాలు కలిగిన పుస్తకాలు మరియు సినిమాల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నట్టు తేలింది.[25]

ఆదరణ[మార్చు]

1994లో డ్రాగన్ #203లో డౌగ్ కాఫ్‌మ్యాన్ ద్వారా "ఐ ఆఫ్ ది మానిటర్" కాలమ్‌లో ఈ గేమ్ సమీక్షించబడింది. ఈ సమీక్షలో భాగంగా కాఫ్‌మ్యాన్ ఈ గేమ్‌కు 5 కు 5 స్టార్లను కేటాయించారు.[26]

వారసత్వం[మార్చు]

గేమింగ్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన టైటిల్స్‌తో ఒకటిగా డూమ్ భారీ స్థాయి ఆదరణను అందుకుంది. జూలై 2001లో గేమ్‌స్పై ద్వారా నిర్వహించబడిన ఒక పోల్‌లో భాగంగా 100 మంది గేమ్ డెవలపర్స్ మరియు జర్నలిస్టుల సమక్షంలో ఈ గేమ్ "#1 గేమ్ ఆఫ్ ఆల్ టైమ్‌"గా ఎన్నికైంది,[27] అలాగే ఏప్రిల్ 2004లో PC గేమర్ తన పదవ వార్షికోత్సవ సంచికలో భాగంగా ఆ పదేళ్ల కాలంలో అత్యంత ప్రభావశీల గేమ్‌గా డూమ్ ‌ను ఎంపిక చేసింది, అలాగే ఏడాది తర్వాత రెండవ ఆల్ టైమ్ బెస్ట్ (మొదటిది హాఫ్-లైఫ్ )గా కూడా ఇది ఎంపికైంది. చివరగా గేమ్ ట్రైలర్స్ ద్వారా #1 బ్రేక్‌త్రూ PC గేమ్‌గా డూమ్ ఎంపికైంది.[28] 2009లో, గేమ్ ఇన్‌ఫార్మర్ డూమ్‌ కు తన "ది టాప్ 200 గేమ్స్ ఆఫ్ ఆల్ టైమ్" జాబితాలో 6వ స్థానం కేటాయించింది, "రెండు దశాబ్దాల తర్వాత గేమింగ్ క్షేత్రాన్ని పాలించేందుకు అవసరమైన కిక్ స్టార్ట్ శైలి [అందించింది]" ఇందులో ఉందని అది ప్రశంసించింది.[29]

అయితే అనేక ఆధునిక ఫస్ట్ పర్సన్ షూటర్స్ విడుదలకావడంతో డూమ్ గేమ్‌ల ఆకర్షణ తగ్గినప్పటికీ,[ఆధారం కోరబడింది] పోటాపోటీగా ఈ గేమ్‌ని ఆడడం మరియు WADలను (idగేమ్స్ FTP ఆర్కివ్ ప్రతివారం కొద్ది మొత్తం మొదలుకుని డజన్ వరకు కొత్త WADలను స్వీకరిస్తుందిas of 2005) సృష్టించడం లాంటి అంశాలతో ఈ గేమ్ నేటికీ ఒక బలమైన అభిమానుల పునాదిని కొనసాగిస్తోంది, మరియు డూమ్ సంబంధిత వార్తలు నేటికీ డూమ్‌వరల్డ్ లాంటి వివిధ వైబ్‌సైట్లలో కనిపిస్తుంటుంది. 1997లో డూమ్‌ పై ఆసక్తి పునఃప్రారంభమైంది, ఆ సమయంలో డూమ్ ఇంజన్ కోసం సోర్స్ కోడ్ విడుదలైంది (1999లో GNU జనరల్ పబ్లిక్ లైసెన్స్ కింద ఇది కూడా చోటుచేసుకుంది[ఆధారం కోరబడింది]). డ్రీమ్‌క్యాస్ట్, ప్లేస్టేషన్ పోర్టబుల్, నైన్టెన్డో DS, TI క్యాలికులేటర్స్, ఐపాడ్, విల్ మరియు అత్యంత తాజాగా T-మొబైల్ G1 లాంటి అంతకుముందు మద్దతు ఇవ్వని ప్లాట్‌ఫాంలు మొదలుకుని వివిధ ఆపరేటింగ్ సిస్టంలకు అభిమానులు గేమ్ యొక్క పోర్టింగ్ చేయడం ప్రారంభించారు. PC విషయానికి వస్తే, గేమ్‌ప్లేని మరింత ఎక్కువగా మార్పులు చేసేందుకు WADలను అనుమతించే ఓపెన్GL వ్యాఖ్యానం మరియు స్క్రిప్టింగ్ లాంటి కొత్త అంశాలు జతచేరాయి. ఈ విధంగా దాదాపు 50కి పైగా విభిన్నరకాల డూమ్ సోర్స్ పోర్ట్స్ ఏర్పడ్డాయి, వీటిలో కొన్ని ఇంకా అభివృద్ధి దశలో ఉన్న స్థితిలో నిలిచాయి.

ఈ గేమ్‌పై ఆరాధన కలిగిన ఆటగాళ్లు డూమ్ కోసం స్పీడ్‌రన్స్ సృష్టించడం కోసం అనేక సంవత్సరాలు గడిపారు, అత్యంత త్వరిత ముగింపు కోసం మరియు స్థాయిల గుండా సాగే దారుల గురించిన జ్ఞానాన్ని పంచుకునేందుకు మరియు షార్ట్‌కట్స్ కోసం డూమ్ ఇంజిన్‌లోని బగ్స్‌ని ఎలా ఉపయోగించాలేనే అంశం కోసం పోటీపడ్డారు. డూమ్ మరియు డూమ్ II లు ఒక్కోదాన్ని అల్ట్రా-వయలెన్స్ ప్రయాస స్థాయి కూర్పుపై 30 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో పూర్తి చేయడం లాంటి సాధనలు కూడా నమోదయ్యాయి. అలాగే, మరికొంతమంది ఆటగాళ్లు డూమ్ II ను నైట్‌మేర్! ప్రయాస అమరికపై సింగిల్ రన్‌లో పూర్తి చేయగలిగారు, ఇందులోని భూతాలు చాలా భయంకరమైనవి, ఇవి చచ్చిన 30 సెకండ్ల తర్వాత కూడా ప్రాజెక్టెల్స్ (లేదా, ఇలాంటి సందర్భాల్లో పింకీ డెమోన్ వేగంగా వెళ్లిపోతుంది) మరియు రెస్పాన్‌లు వేగంగా వస్తూనే ఉంటాయి (అలాంటి ఒక రన్ "[తీసుకు తీరాల్సిందే] అసాధ్యం అనే విధంగా స్థాయి డిజైనర్ జాన్ రోమెరో రూపొందించారు").[30] ఈ రన్స్ యొక్క ఎక్కవ భాగం సినిమాలు COMPET-N వెబ్‌సైట్ నుంచి అందుబాటులో ఉన్నాయి.

ఒడామెక్స్ ,[31] స్కల్‌ట్యాగ్ ,[32] ZDఏమోన్ [33] మరియు డూమ్ కనెక్టర్ .[34] లాంటి సర్వర్ల ద్వారా ఆన్‌లైన్ సహకారం మరియు డెత్‌మ్యాచ్ ప్లే లాంటివి ఇప్పటికీ కొనసాగుతోంది.

సూచనలు[మార్చు]

 1. id Software (1993). "Doom Press Release". Retrieved April 2, 2008. 
 2. "Doom Bible Appendices". Retrieved April 20, 2010. 
 3. Entertainment Software Rating Board. "Game ratings". Retrieved December 4, 2004. 
 4. Gamespy. "Top 50 Games of All Time". Retrieved April 24, 2006. 
 5. http://store.steampowered.com/news/?appids=9010
 6. id Software (1993). "The Doom story (unofficial transcript)". Retrieved February 25, 2008. 
 7. John Romero (2002). "Doom Marine's Name forum post at Planet Romero". Retrieved August 23, 2008. 
 8. Doomworld. "Interview with John Carmack". Retrieved November 15, 2005. 
 9. Hall, Tom (1992). "The Doom Bible". Doomworld (1998). Retrieved November 15, 2005. 
 10. 10.0 10.1 10.2 Kushner, David (2003). Masters of Doom: How Two Guys Created an Empire and Transformed Pop Culture. Random House Publishing Group. ISBN 0-375-50524-5. 
 11. రెట్రో గేమెర్ మ్యాగజైన్, సంచిక 75: ఇన్ ది చైన్ విత్ ... జాన్ రోమెరో (pages 78-89)
 12. SPISPOPD = స్మాషింగ్ పంపుకిన్స్ ఇన్‌టూ స్మాల్ పైల్స్ ఆఫ్ పుట్రిడ్ డెబ్రిస్ వివరాలు ఇక్కడున్నాయి.
 13. డూమ్ ఆల్ఫా వెర్షన్‌కు సంబంధించిన లింక్స్, స్క్రీన్‌షాట్స్ మరియు డౌన్‌లోడ్స్
 14. Lombardo, Mike. "Bonus movie: Bill Gates "DOOM" video". Reel Splatter. Retrieved November 15, 2005. 
 15. ఈస్టర్ ఎగ్ ఆర్కీవ్ - ఎక్సెల్ 95
 16. Doomworld. "/idgames database". Retrieved September 3, 2005. 
 17. 17.0 17.1 Jay & Dee (May 1995). "Eye of the Monitor". Dragon (217): 65–74. 
 18. http://www.allgame.com/game.php?id=14300&tab=overview
 19. Turner, Benjamin & Bowen, Kevin (2003). "Bringin' in the DOOM Clones". GameSpy. Retrieved November 15, 2005. 
 20. Ben Silverman (2007-09-17). "Controversial Games". Yahoo! Games. Retrieved 2007-09-19. 
 21. Irvine, Reed & Kincaid, Cliff (1999). "Video Games Can Kill". Accuracy In Media. Retrieved November 15, 2005. 
 22. 4-20: a Columbine site. "Basement Tapes: quotes and transcripts from Eric Harris and Dylan Klebold's video tapes". Retrieved November 15, 2005. 
 23. Snopes (2005). "The Harris Levels". Retrieved November 7, 2008. 
 24. ప్లేయింగ్ ది బ్లేమ్ గేమ్, గ్రేటర్ గుడ్ మేగజైన్‌ నుంచి ఆర్టికల్
 25. [www.treas.gov/usss/ntac/ssi_final_report.pdf THE FINAL REPORT AND FINDINGS OF THE SAFE SCHOOL INITIATIVE]
 26. Petersen, Sandy (March 1994). "Eye of the Monitor". Dragon (203): 59–62, 69. 
 27. GameSpy (2001). "GameSpy's Top 50 Games of All Time". GameSpy. Retrieved November 15, 2005. 
 28. GT టాప్ టెన్ బ్రేక్‌థ్రూ PC గేమ్స్
 29. The Game Informer staff (December 2009). "The Top 200 Games of All Time". Game Informer (200): 44–79. ISSN 1067-6392. OCLC 27315596. 
 30. Hegyi, Adam (1992). "Player profile for Thomas "Panter" Pilger". Retrieved November 15, 2005. 
 31. "ODAMEX". Odamex.net. Retrieved 2008-10-28. 
 32. "Skulltag". Skulltag.net. Retrieved 2010-03-27. 
 33. "Online Multiplayer Doom - ZDaemon.org". Zdaemon.org. Retrieved 2008-10-28. 
 34. "Doom Connector. All source ports in a single GUI.". CodeImp. Retrieved 2008-11-29. 

బాహ్య లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
అధికారిక వెబ్‌సైట్
క్రింద ఉన్న వెబ్‌సైట్ల నుంచి షేర్‌వేర్ వెర్షన్‌ని చట్టబద్ధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డూమ్-సంబంధిత వార్తలు మరియు సమాచారం కలిగిన అనధికారిక పోర్టల్ వెబ్‌సైట్లు
సమాచార వనరులు

మూస:DOOMgames మూస:Video game controversy