డెన్నిస్ టిటో
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (జూన్ 2017) |
డెన్నిస్ ఆంథోనీ టిటో (జననం 1940 ఆగస్టు 8) ఒక అమెరికన్ ఇంజనీర్, మల్టీమిలియనీర్, ఇతను మొట్టమొదటి అంతరిక్ష పర్యాటకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇతను తన సొంత నిధులను వెచ్చించి అంతరిక్ష పర్యటన గావించాడు.
ఇతను 2001 మధ్యకాలంలో ISS EP-1 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషను విజిటింగ్ మిషన్ లో ఒక బృంద సభ్యుడిగా కక్ష్యలో దాదాపు ఎనిమిది రోజులు గడిపారు. ఈ మిషన్ అంతరిక్ష నౌక సోయుజ్ TM-32 ద్వారా తీసుకుపోబడి సోయుజ్ TM-31 ద్వారా తీసుకురాబడింది.
జీవితం, వృత్తి
[మార్చు]డెన్నిస్ టిటో న్యూయార్క్ లోని క్వీన్స్ లో జన్మించాడు. న్యూయార్క్ నగరంలోని ఫారెస్ట్ హిల్స్ హై స్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు. 1962లో న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, హార్ట్ఫోర్డ్, కనెక్టికట్ లో రెన్స్సెలేర్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ ఉపగ్రహ ప్రాంగణం నుండి ఇంజినీరింగ్ సైన్స్ లో మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందాడు.[1] ఆయన ప్సి యుప్సిలోన్ సభ్యుడు. 2002 మే 18 న రెన్స్సెలేర్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్ యొక్క గౌరవ డాక్టరేట్ పొందాడు. నాసా జెట్ ప్రొపల్షన్ లాబరేటరీ యొక్క ఒక మాజీ శాస్త్రవేత్త.
మూలాలు
[మార్చు]- ↑ "Dennis Tito to Speak at Rensselaer Nov. 14". Rensselaer Magazine. November 4, 2002. the original నుండి 29 అక్టోబరు 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 February 2013.
ఇతర లింకులు
[మార్చు]- Tito the spaceman BBC web site (accessed February 2006)
- Spacefacts biography of Dennis Tito