Jump to content

డెమోక్రిటస్

వికీపీడియా నుండి

డెమోక్రిటస్ (Democritus) ఒక పురాతన గ్రీకు తత్వవేత్త. ఈయన సోక్రటీసు కంటే ముందుకాలానికి చెందినవాడు. ఈయన విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి పరమాణు తత్వాన్ని (అటామిజం) ప్రతిపాదించాడు.[1] ఈయన ఇంకా చాలా వైవిధ్యమైన అంశాల గురించి విస్తృతమైన రచనలు చేశాడు.[2]

డెమోక్రిటస్ రాసిన అసలు రచనలు ఏవీ నేరుగా లభ్యం కావడం లేదు. కానీ ఆయన రచనలను ఉదహరించిన తర్వాతి రచనలు మాత్రం ఉన్నాయి. వీటిలో చాలా వరకు అరిస్టాటిల్ రాసినవి. అరిస్టాటిల్ సహజ తత్వశాస్త్రం (Natural Philosophy) లో ఇతనిని తనకు పోటీదారుగా భావించాడు.[3] ఈయనను పురాతన రచనల్లో లాఫింగ్ ఫిలాసఫర్ గా పేర్కొన్నారు. ఎందుకంటే ఈయన ఉల్లాసం, సంతోషాన్ని గురించి నొక్కి చెప్పాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Barnes 1987.
  2. Kenny, Anthony. Ancient Philosophy. Oxford Publications. p. 27. ISBN 9780198752721.
  3. Berryman 2016.
  4. Berryman, Sylvia (Spring 2023). ""Democritus", The Stanford Encyclopedia of Philosophy (Spring 2023 Edition), Edward N. Zalta & Uri Nodelman (eds.)". The Stanford Encyclopedia of Philosophy (Spring 2023 Edition), Edward N. Zalta & Uri Nodelman (eds.). Retrieved 30 April 2024.