డెలిరియం
| డెలిరియం | |
|---|---|
| ఇతర పేర్లు | తీవ్రమైన మానసిక కల్లోలం లేదా గందరగోళ మానసిక స్థితి |
| 1913లో మానసిక వ్యాధుల పాఠ్యపుస్తకంలో ప్రచురించబడిన, ఒక పాత చికిత్సా విధానాన్ని చూపే చిత్రం. | |
| ప్రత్యేకత | మానసిక వ్యాధులు; వృద్ధుల వ్యాధులు |
| లక్షణాలు | శ్రద్ధ, కార్యాచరణ, అవగాహన, నిద్ర విధానాలు, ఆలోచించే సామర్థ్యంలో మార్పులు |
| సాధారణ ప్రారంభం | 70 సంవత్సరాల పైన |
| కాల వ్యవధి | 1 వారం |
| రకాలు | వ్యక్తి కార్యకలాపాలు పెరగవచ్చు (ఉద్వేగం) తగ్గవచ్చు లేదా రెండింటి మిశ్రమం |
| కారణాలు | మందులు, మాదకద్రవ్యాల మత్తు లేదా పదార్థ ఉపసంహరణ |
| ప్రమాద కారకములు | చిత్తవైకల్యం, దృష్టి సమస్యలు, వినికిడి సమస్యలు, మద్యపానం |
| భేదాత్మక రోగనిర్థారణ పద్ధతి | మానసిక రుగ్మతలు, తీవ్రమైన ఒత్తిడి రుగ్మత, చిత్తవైకల్యం |
| చికిత్స | క్రమబద్ధమైన మంచి సంరక్షణ |
| తరుచుదనము | 1 - 2% మంది |
డెలిరియం అనే పదం తీవ్రమైన మానసిక కల్లోలం లేదా గందరగోళ మానసిక స్థితి ని సూచిస్తుంది. ఇది కొంతకాలం పాటు ఏర్పడి కాలక్రమేణా హెచ్చుతగ్గులకు, మార్పులకు గురయ్యే మానసిక చైతన్యం స్థాయి.[1]దీనిలో శ్రద్ధ, కార్యాచరణ, అవగాహన, నిద్ర విధానాలు, ఆలోచించే సామర్థ్యంలో మార్పులు ఉండవచ్చు.[2] సాధారణంగా ఈ స్థితి ప్రారంభమయిన గంటల నుండి రోజుల వరకు ఉంటుంది, వ్యక్తి పరిస్థితి వారి సాధారణ రోజువారీ మానసిక పనితీరుకు భిన్నంగా ఉంటుంది. ఆసుపత్రిలో, ఈ పరిస్థితి సాధారణంగా ఒక వారం పాటు ఉంటుంది, అయితే కొంతమందికి ఆ తర్వాత కూడా సమస్యలు ఉండవచ్చు.[2]
కారణాలు
[మార్చు]మానసిక కల్లోలం అనేది ఒక అనారోగ్య వైద్య పరిస్థితి, మందులు, మాదకద్రవ్యాల మత్తు లేదా పదార్థ ఉపసంహరణ వల్ల సంభవించవచ్చు. సాధారణంగా అనేక అంశాలు ఇందులో కలిసి ఉంటాయి. అవి ప్రమాద కారకాలలో చిత్తవైకల్యం, దృష్టి సమస్యలు, వినికిడి సమస్యలు, మద్యపానం వంటివి. ఈ సంఘటలనను ప్రేరేపించే మందులలో బెంజోడియాజిపైన్స్, యాంటిహిస్టామైన్లు, ఓపియాయిడ్లు, యాంటిసైకోటిక్స్ అంటువ్యాధులు, నొప్పి లేదా శస్త్రచికిత్స మొదలైనవి. అంతర్లీన యంత్రాంగం స్పష్టంగాలేదు.[1]
రోగనిర్ధారణ కొరకు ఆ వ్యక్తి సాధారణ మానసిక పనితీరు తిరిగి స్థిరంగా ఏర్పడడం అవసరం.[1]వ్యక్తి కార్యకలాపాలు పెరగవచ్చు (ఉద్వేగం) తగ్గవచ్చు లేదా రెండింటి మిశ్రమం కావచ్చు. ఇటువంటి కార్యకలాపాలు తగ్గిన తరువాత తరచుగా నిరాశకు కారణమవుతాయి.[3] అయితే మానసిక రుగ్మతలు, తీవ్రమైన ఒత్తిడి రుగ్మత, చిత్తవైకల్యం వంటివి వేరు, ఈ మానసిక కల్లోలం వేరుగా పరిగణిస్తారు.[2]
చికిత్స
[మార్చు]చికిత్స సాధారణంగా అంతర్లీన కారణాలను అనుసరించి ఉంటుంది. ఇతర చర్యలలో వినికిడి పరికరాలు, కంటి అద్దాలు, తాగడానికి తగినంత ద్రవాలు, నిద్రకు అనుకూలమైన నిశ్శబ్ద వాతావరణం, కనిపించే గడియారం వంటివి ఉండవచ్చు.[1] యాంటిసైకోటిక్స్ ఉపయోగించినప్పటికీ, డెలిరియంకు ప్రయోజనం ఉంటుందనే విషయానికి ఎటువంటి ఆధారాలు లేవు.[1][4][5] అయితే, ఈ డెలిరియంతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తులకు క్రమబద్ధమైన మంచి సంరక్షణ అందించడం ద్వారా తగ్గించవచ్చు.[6]
మానసిక కల్లోలం మొత్తానికి 1 నుండి 2% మందిని ప్రభావితం చేస్తుంది.[2] పెద్దవారిలో, శస్త్రచికిత్స తర్వాత లేదా అత్యవసర విభాగాన్ని సందర్శించినప్పుడు 20% మంది వరకు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న వారు 90% వరకు ప్రభావితులవుతున్నారు.[1] ఆసుపత్రిలో చేరిన వారిలో కూడా సుమారు 20% మంది ఉన్నారు.[2] ఈ పరిస్థితి వయస్సుతో మరింత సాధారణం అవుతుంది, ఇది 85 ఏళ్లు పైబడిన వారిలో 14% మందిని ప్రభావితం చేస్తుంది.[2]
క్రీపూ 400 నాటికే హిప్పోక్రేట్స్ మానసిక కల్లోలం లేదా డెలీరియం అనేపదాన్ని వివరించాడు.[7]
మూలాలు
[మార్చు]- 1 2 3 4 5 6 Ramírez Echeverría, MdL; Paul, M (January 2020). "Delirium". StatPearls. PMID 29261982.
- 1 2 3 4 5 6 Diagnostic and statistical manual of mental disorders : DSM-5 (Fifth ed.). Arlington, VA: American Psychiatric Association. 2013. p. 596-601. ISBN 9780890425596. OCLC 847226928.
- ↑ Gleason OC (March 2003). "Delirium". American Family Physician. 67 (5): 1027–34. PMID 12643363. Archived from the original on 2011-06-06.
- ↑ Neufeld KJ, Yue J, Robinson TN, Inouye SK, Needham DM (April 2016). "Antipsychotic Medication for Prevention and Treatment of Delirium in Hospitalized Adults: A Systematic Review and Meta-Analysis". Journal of the American Geriatrics Society. 64 (4): 705–14. doi:10.1111/jgs.14076. PMC 4840067. PMID 27004732.
- ↑ Burry L, Mehta S, Perreault MM, Luxenberg JS, Siddiqi N, Hutton B, et al. (June 2018). "Antipsychotics for treatment of delirium in hospitalised non-ICU patients". The Cochrane Database of Systematic Reviews. 6: CD005594. doi:10.1002/14651858.CD005594.pub3. PMC 6513380. PMID 29920656. Archived from the original on 2019-11-07. Retrieved 2019-11-07.
{{cite journal}}: CS1 maint: article number as page number (link) - ↑ Siddiqi N, Harrison JK, Clegg A, Teale EA, Young J, Taylor J, Simpkins SA (March 2016). "Interventions for preventing delirium in hospitalised non-ICU patients" (PDF). The Cochrane Database of Systematic Reviews. 3: CD005563. doi:10.1002/14651858.CD005563.pub3. PMID 26967259. Archived (PDF) from the original on 2018-07-23. Retrieved 2019-07-01.
{{cite journal}}: CS1 maint: article number as page number (link) Open access repository Archived 2018-01-22 at the Wayback Machine - ↑ Lindesay, James; Rockwood, Kenneth; Macdonald, Alastair (2002). Delirium in Old Age (in ఇంగ్లీష్). Oxford University Press. p. 1. ISBN 978-0-19-263275-3. Archived from the original on 2021-06-24. Retrieved 2021-02-20.