Jump to content

డెలిలా లోబో

వికీపీడియా నుండి
డెలిలా మైఖేల్ లోబో
2024లో డెలిలా లోబో
గోవా శాసనసభ
Assumed office
2022 మార్చి 10
అంతకు ముందు వారువినోదా పాలియెంకర్
నియోజకవర్గంసియోలిమ్ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1977-04-23) 1977 ఏప్రిల్ 23 (వయసు: 49)
గోవా, భారతదేశం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ (2022–ప్రస్తుతం)
ఇతర రాజకీయ
పదవులు
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
(2022–2022)
జీవిత భాగస్వామిమైఖేల్ లోబో (రాజకీయవేత్త)
సంతానం2
నివాసంపర్రా, గోవా, భారతదేశం
వృత్తి
  • రాజకీయవేత్త
  • వ్యాపారవేత్త

డెలిలా మైఖేల్ లోబో (ఆంగ్లం: Delilah Michael Lobo; జననం 1977 ఏప్రిల్ 23) ఒక భారతీయ రాజకీయవేత్త, వ్యాపారవేత్త. ఆమె గోవా శాసనసభ సభ్యురాలిగా పనిచేస్తున్నది. ఆమె సియోలిమ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఆమె 2022 గోవా శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ టిక్కెట్ పై సియోలిమ్ నియోజకవర్గం నుండి విజయం సాధించింది. ఆమె భారతీయ జనతా పార్టీకి చెందిన, నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన దయానంద్ మాంద్రేకర్ ను 1,727 ఓట్ల తేడాతో ఓడించింది.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

డెలిలా 1977 ఏప్రిల్ 23న భారతదేశంలోని గోవాలో అల్మిరా, మెల్చియాడెస్ విన్సెంట్ లోబో దంపతులకు జన్మించింది.[2][3] ఆమె రాజకీయవేత్త, వ్యాపారవేత్త మైఖేల్ లోబో ను వివాహం చేసుకున్నది. ఆమె తన హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ చదువును పూర్తి చేసింది. 1998 లో ఆమె బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[4]

రాజకీయ జీవితం

[మార్చు]

డెలిలా లోబో 2022 గోవా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఐదేళ్ల పాటు పంచాయతీ సభ్యురాలిగా ఉన్నది. ఆమె తన భర్త మైఖేల్ లోబో తో కలిసి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి 2022 జనవరి 11న రాజీనామా చేసింది.[5][6]

2022 సెప్టెంబరు 14న, ఆమె తన భర్తతో పాటు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఆరుగురు శాసనసభ్యులతో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరడానికి రాజీనామా చేశారు.[7]

వివాదం

[మార్చు]

గోవాలోని పర్రాలో అక్రమంగా భూమిని డంప్ యార్డ్ గా మార్చినందుకు ఆమె, ఆమె భర్తపై మాపుసా పోలీసులు 2022 మే 5న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. టౌన్ & కంట్రీ ప్లానింగ్ (టిసిపి) మంత్రి విశ్వజిత్ రాణే ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు అయింది.[8]

మూలాలు

[మార్చు]
  1. "Delilah Michael Lobo from INC Won Siolim Assembly Election Result 2022: Candidates List and Winner in Siolim Constituency". indiatoday.in (in ఇంగ్లీష్). Retrieved 2022-07-31.
  2. "Goa Legislative Assembly". www.goavidhansabha.gov.in. Retrieved 2023-11-24.
  3. "Delilah Lobo, INC MLA from Siolim - Our Neta" (in ఇంగ్లీష్). Retrieved 2023-11-24.
  4. "Delilah Michael Lobo(Indian National Congress(INC)):Constituency- SIOLIM(NORTH GOA) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2022-07-31.
  5. Quint, The (2022-01-19). "Goa Polls: Congress Fields Former BJP Leader Delilah Lobo From Siolim". TheQuint (in ఇంగ్లీష్). Retrieved 2022-07-31.
  6. "Goa panchayat polls: CM Sawant claims clean sweep, says confident of 2024 victory". The Indian Express (in ఇంగ్లీష్). 2022-08-13. Retrieved 2022-08-27.
  7. "At centre of Goa defection storm, Michael Lobo returns to haunt Congress again". The Indian Express (in ఇంగ్లీష్). 2022-09-14. Retrieved 2022-11-24.
  8. "Goa: FIR against Lobo duo for illegal land filling at Parra | Goa News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 5 May 2022. Retrieved 2022-11-24.