డెవిల్‌ మే క్రై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Infobox VG series

డెవిల్‌ మే క్రై (デビル メイ クライ)అనేది ఆధునిక కాలంలో ఉన్న ఐదు హాక్‌ అండ్‌ స్లాష్‌ వీడియో గేమ్స్‌ (క్రీడలు) సెట్‌లలో ఒకటి. ఈ సిరీస్‌ను హిడెకి కమియ సృష్టించగా, క్యాప్‌కామ్‌ దీనిని అభివృద్ధి చేశారు. నిజానికి ఇది క్యాప్‌కామ్‌ యొక్క రెసిడెంట్‌ ఈవిల్‌ సిరీస్‌కు సీక్వెల్‌ (వరుస క్రమం)లో రావాలసి ఉంది. కానీ డెవిల్‌ మే క్రై సిరీస్‌ యొక్క తరహా నుంచి విప్లవాత్మకంగా బయటకు వచ్చి, పూర్తిగా కొత్త ఆస్తిగా అభివృద్ధి చెందింది. 3డి హాక్‌ అండ్‌ స్లాష్‌ క్రీడలకు డెవిల్‌ మే క్రై మూలం. దీని తర్వాత నింజా గైడెన్‌ , షినోబి మరియు గాడ్‌ ఆఫ్‌ వార్‌ సిరీస్‌లో వీడియో క్రీడలు వచ్చాయి. ఈ సిరీస్‌లో ప్రధానంగా ఉండే పాత్ర డాంట్‌‌. తన తల్లిని హత్య చేసి చంపిన దెయ్యాల మీద ప్రతీకారం తీర్చుకోవడం చుట్టూ ఈ సిరీస్‌ నడుస్తుంది. ఈ ఆటలో పెద్ద పెద్ద యుద్ధాల దృశ్యాలు ఉంటాయి. ఇందులో ఆటగాడు యుద్ధాన్ని అందంగా ప్రదర్శించడంతో పాటు, తనకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటూ, సుదీర్ఘ పోరాటాల్లో పాల్గంటూ దాడులు చేయాల్సి ఉంటుంది. ఈ క్రీడలో ఆటగాడి ప్రదర్శనను కొలిచేందుకు, అతడు వెచ్చించిన సమయం మరియు సేకరించిన వస్తువులను పరిగణనలోకి తీసుకుంటారు.

ఈ సిరీస్‌లో మొదటి మూడు క్రీడలు అనేక మిలియన్ల కాపీలు అమ్ముడవడంతో పెద్ద విజయం సాధించాయి. దీనికి క్యాప్‌కామ్‌ ప్లాటినమ్‌ టైటిల్‌ పురస్కారం ఇచ్చారు. ఈ వీడియో క్రీడ యొక్క విజయం హాస్య పుస్తకాలు, నోవలైజేషన్స్‌, ఒక ఎనిమి సిరీస్‌, గైడ్స్‌, వస్తువుల సేకరణ, ప్రచురణలు మరియు విభిన్నమైన యాక్షన్‌ ఫిగర్స్‌కు దారితీసింది.

సిరీస్‌ మూలాలు[మార్చు]

1998లో రెసిడెంట్‌ ఈవిల్‌ 2 , పూర్తయిన తర్వాత, టీమ్‌ లిటిల్‌ డెవిల్‌ పేరుతో హిడెకి కమియా నిర్దేశకత్వంలో రెసిడెంట్‌ ఈవిల్‌ సిరీస్‌ను ప్లేస్లేషన్‌2లో ఏర్పాటు చేసే ప్రాథమిక కార్యక్రమం మొదలైంది.[1] ఆరంభంలో పరిశోధన మరియు అభివృద్ధిలో భాగంగా, క్రీడల వాతావరణానికి సరిపోయే రకరకాల భవంతులను అధ్యయనం చేయడానికి స్పెయిన్‌కు వెళ్లారు. ఏదేమైనా, తిరుగులేని స్థాయి కారణంగా, ఇది ఒక విప్లవాత్మక కార్యక్రమంగా రెసిడెంట్‌ ఈవిల్‌ సూత్రం మరియు సాధారణంగా ఉన్న భయానకం నుంచి బయటకు వచ్చింది. అయితే పూర్తిగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేయకుండా, ఆవరణను మార్చారు. క్రమంగా ఇది డెవిల్‌ మే క్రై గా మారింది.[2]

సిరీస్‌లోని క్రీడలు[మార్చు]

టైటిల్ సంవత్సరం వేదికలు
డెవిల్‌ మే క్రై 2001 ప్లేస్టేషన్ 2
డెవిల్‌ మే క్రై 2 2003 ప్లేస్టేషన్ 2
Devil May Cry 3: Dante's Awakening 2005 ప్లేస్టేషన్‌ 2 మైక్రోసాఫ్ట్‌ విండోస్‌
డెవిల్‌ మే క్రై 4 2008 ప్లేస్టేషన్‌ 3, Xbox 360, మైక్రోసాఫ్ట్‌ విండోస్‌
డిఎమ్‌సి (డెవిల్‌ మే క్రై) TBA (ఇంకా ప్రకటించాల్సి ఉంది) ప్లేస్టేషన్‌ 3, Xbox 360,[3]

భవిష్యత్తు[మార్చు]

DmC డెవిల్‌ మే క్రై సిరీస్‌లో తర్వాతి క్రీడ. ఇందులో ఓ యువ డాంట్‌ ఉంటాడు. సిరీస్‌లోని పాత క్రీడల మాదిరిగా కాకుండా, ఈ క్రీడను క్యాప్‌కామ్‌ అభివృద్ధి చేయలేదు. బ్రిటిష్‌ అభివృద్ధికారుడు నింజా థియరీ దీనిని వృద్ధి చేశాడు. నింజా థియరీ డాంట్‌ను కూడా తిరిగి రూపొందించారు. గత సిరీస్‌లలో (డెవిల్‌ మే క్రై 3 మినహా) కనిపించిన దాని కంటే యువ డాంట్‌ను తయారుచేశారు. ఇందులో మరింత చీకటి, మరియు కఠిన పరిస్థితులను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అతడి జట్టు నల్లగా ఉంది. అయితే వెనక తెల్ల మచ్చను మాత్రం అలాగే కొనసాగించారు. డాంట్‌ దగ్గర రెబెలియన్‌, తొలి నాలుగు క్రీడల్లో ఉన్న పెద్ద ఖడ్గం ఉండదు. దీని వల్ల ఇది వాటికంటే ముందు వచ్చిన క్రీడ అనే భావన కలుగుతుంది. డాంట్‌ మణికట్టు మీద అనేక గీతలు కూడా కనిపిస్తాయి. ఇది తనని తాను కోసుకున్నాడనడానికి సూచన.

సహజంగా ఆటఆడే అంశాలు[మార్చు]

ఇందులో ఆట ఆడే విధానం ముఖ్యంగా వేగం మరియు నైపుణ్యంతో యుద్ధం చేసే అంశాల పై ఆధారపడి ఉంటుంది. అత్యధికంగా మెరుగైన స్థానం పొందేందుకు సుదీర్ఘ దాడులు చేయడంతో పాటు, నష్టాన్ని తప్పించుకోవడంలో తెలివిగా తప్పించుకోవాలి. తర్వాతి క్రీడల్లో, విధానాన్ని స్వల్పంగా మార్చారు. ఇందులో ఆటగాళ్లు తమ స్థానాన్ని నిలుపుకోవడం కోసం దాడులు చేసే పద్దతులను చురుగ్గా మార్చాలి. ఇందులో స్థానాన్ని (ర్యాంక్‌) యుద్ధం సమయంలో అక్షరాల పద్దతి ద్వారా ఇస్తారు. చెత్త నుంచి ఉత్తమం వరకు D, C, B, A, స అని గ్రేడ్‌లు ఉంటాయి. ఈ అక్షరాలు నిర్వచనంలోని మొదటి అక్షరాన్ని కూడా సూచిస్తాయి. ఉదాహరణకు డి అంటే డల్‌ అనే తరగతికి చెందుతాడు. మూడో గేమ్‌లో "SS" "SSS" ర్యాంక్‌లు కూడా ప్రవేశపెట్టారు. ఇది నాలుగో క్రీడలోనూ కొనసాగింది. ఈ అక్షరాలను ఉపయోగించి, ప్రతి స్థాయిలోనూ ఆటగాడి ప్రదర్శనను లెక్కిస్తారు.[4]

ఈ క్రీడలో కొన్ని పజిల్స్‌ను పరిష్కరించడం మరియు ఎక్స్‌ప్లోరేషన్‌ లాంటి అంశాలు కూడా ఉన్నాయి. సర్వైవల్‌ హారర్‌ మొదలైన దగ్గర్నించి వీటిని ఉంచుకోవాలి. అయితే వీటి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ కారణంగా డెవిల్‌ మే క్రై పూర్తిగా యాక్షన్‌ (హింస) మీద ఆధారపడి ఉంది.

డెవిల్‌ ట్రిగ్గర్‌ సామర్ధ్యం ఆటగాడి పాత్ర‌ను, దెయ్యం మాదిరి రూపంతో అదనపు శక్తులు సమకూర్చుకునే అవకాశం వారి దగ్గర ఉన్న ప్రస్తుత ఆయుధాలను బట్టి ఇస్తుంది. ఈ సమయంలో పాత్ర‌ యొక్క బలం మరియు వేగం పెరుగుతూ, క్రమంగా ఆరోగ్యం కూడా తిరిగి పుంజుకుంటుంది.[4] సిరీస్‌లో గుర్తించదగ్గ ఆయుధాలు, డెవిల్‌ మే క్రై [5] లో ఫోర్స్‌ ఎడ్జ్‌ / స్పార్‌డా అనే కత్తులు, డెవిల్‌ మే క్రై 2 [6] లో రెబెలియన్‌ మరియు [7] డెవిల్‌ మే క్రై 3 లో యమాటో. తొలి మూడు క్రీడల్లో ఆయుధాలను తిరిగి దాచుకోవడం లేదా తిరిగి లోడ్‌ చేయాల్సిన అవసరం లేదు.

రెండో క్రీడలో ట్రిష్‌ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ సాధారణంగా అన్ని క్రీడల్లోనూ డాంట్‌ ప్రముఖ పాత్ర‌. డెవిల్‌ మే క్రై 2 లో మరో పాత్ర‌ కూడా అందుబాటులో ఉంది. అతడి బదులు దీనిని (లూసియా) ఎంచుకోవచ్చు. ప్రత్యేక సంచిక‌ లోDevil May Cry 3: Dante's Awakening ఆటగాడు వెర్జిల్‌ ను ఉపయోగించుకోవచ్చు. డెవిల్‌ మే క్రై 4లో ఓ కొత్త ప్రధాన పాత్ర పేరు నీరో.

సిరీస్‌లో మార్పులు[మార్చు]

సిరీస్‌లోని ప్రతి క్రీడలో ఆట ఆడే విధానంలో కొత్త అంశాలు చేర్చారు.

డెవిల్‌ మే క్రై 'స్టైల్‌ 1' మీటర్‌ను మరియు ర్యాంకులను ప్రవేశపెట్టింది. దీని వల్ల ఆటగాళ్లు వరుసగా దాడులు చేయడం, నష్టాన్ని నివారించుకోవడంలో ప్రోత్సాహం లభించింది.[4]

డెవిల్‌ మే క్రై 2లో కాంబినేషన్‌లో ప్రదర్శన చేయగల సామర్ధాన్ని ప్రవేశపెట్టారు మరియు గాలి మధ్యలో దాడులు చేయడంతో పాటు తప్పించుకోవడానికి ఒక బటన్‌ను కూడా రూపొందించారు. ఇందులో ఆయుధాన్ని మార్చుకునే బటన్‌ను కూడా ప్రవేశపెట్టారు. దీని వల్ల స్క్రీన్‌ను మార్చుకోకుండా ఆటగాడు అవసరానికి తగ్గట్లుగా ఆయుధాలు మార్చుకోవచ్చు.

డెవిల్‌ మే క్రై 3; డాంట్‌ యొక్క అవాక్‌నింగ్‌, ఆట ఆడే విధానాల్లో కొన్ని మార్పులను ఎంచుకునే అవకాశం కల్పించింది. ఇందులో ఆటగాళ్లు తనకు నచ్చిన అంశాలు లేదా ఆయుధాల పై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం లభించింది. అవి కత్తులైనా, తుపాకులైనా తప్పించుకోవడమైనా లేదా రక్షణ అయినా సరే. నాలుగు ప్రాథమిక స్థాయిల్లో, అనుభవానికి కూడా పాయింట్లు సంపదించుకోవచ్చు. దీని వల్ల ఎక్కువ టెక్నిక్‌లను తీసుకోవడంతో పాటు, సిరీస్‌ యొక్క డబ్బు 'రెడ్‌ ఆర్బ్స్‌'ను నష్టపోకుండా ఎక్కువ టెక్నిక్స్‌ను నేర్చుకోవచ్చు. రెండో ఆయుధం మార్పు బటన్‌ జోడించారు. దీనివల్ల ఆటగాడు తన ఆయుధ సామాగ్రిని మార్చుకుంటూ ఆడొచ్చు. ముఖ్యంగా డెవిల్‌ ఆయుధాలను కూడా ఇందులో మార్చుకోవచ్చు.[8]

డెవిల్‌ మే క్రై 4 ప్రధాన క్యారెక్టర్‌ నీరోకు సంబంధించి పెద్ద మార్పులను తీసుకొచ్చింది. డెవిల్‌ బ్రింగర్‌ ఆయుధం వచ్చింది. దీనితో ఆటగాడు దూరంగా ఉన్న శత్రువుల పై కూడా దాడి చేయొచ్చు. అంతే కాదు వారిని మైదానంలోనే మట్టికరిపించవచ్చు. నీరో మరో కొత్త కత్తి రెవ్డ్‌ కూడా వచ్చింది. దీనిని ఒక హ్యాండిల్‌ ద్వారా ప్రయోగించవచ్చు. దీనివల్ల ఆటగాడు తన కత్తికి జరిగిన అదనపు నష్టాన్ని కూడా తిరిగి బాగు చేసుకోవచ్చు లేదా ప్రతి దాడికి ముందు దానికి ఎలాంటి నష్టం జరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు. డాంట్‌ లాగే, ఆటగాళ్లు కూడా యుద్ధం మధ్యలో వేగంగా తమ యుద్ధ విధానాన్ని మార్చుకోవచ్చు.[9]

సిరీస్‌ కథ[మార్చు]

మూస:Devil May Cry chronology డెవిల్‌ మే క్రై సిరీస్‌ విడుదలైన క్రమం, కథ యొక్క క్రమంలో విడుదల కాలేదు. టైమ్‌లైన్‌లో మొదటి గేమ్‌ డెవిల్‌ మే క్రై 3లో వస్తుంది. దీని తర్వాత డెవిల్‌ మే క్రై, డెవిల్‌ మే క్రై 4, మరియు డెవిల్‌ మే క్రై 2 వరుసలో ఉంటాయి. ది డెవిల్‌ మే క్రై ఎనిమ్‌ సిరీస్‌ డెవిల్‌ మే క్రై మరియు డెవిల్‌ మే క్రై 4కు మధ్య కొంత సమయాన్ని చూపుతుంది. ఈ మాంగా డెవిల్‌ మే క్రై 3 వరకూ జరిగిన సంఘటనలకు ముందు వరుసలాగా వస్తుంది. ఈ జాబితాలలో నవలలను కలపలేదు. ఆటలకు సంబంధించిన కథలతో విభేదించేలా ఇవి ఉండటం వల్ల అధికారికంగా వీటిని నాన్‌ కేనన్‌గా ప్రకటించారు.[ఆధారం కోరబడింది]

డెవిల్‌ మే క్రై 3లో సిరీస్‌ యొక్క కథ ఇప్పటికీ పేరు పెట్టని డాంట్‌ యొక్క దుకాణంలో ప్రారంభమవుతుంది. ఒక అనుమానాస్పద పాత్ర అర్కమ్‌ వచ్చి, డాంట్‌ యొక్క సోదరుడు వెర్జిల్‌కు ఒక ఆహ్వానాన్ని ఇస్తాడు.[10] దుకాణానికి దగ్గర్లో ఉన్న ఒక టవర్‌ కూలిపోతుంది. ఈ పరిస్థితిని డాంట్‌ సవాల్‌గా తీసుకుంటాడు.[11] టెమెన్‌ని గ్రు మరియు వెర్జిల్‌తో యుద్ధం సహా అనేక యుద్ధాల తర్వాత డాంట్‌ టవర్‌ యొక్క పైభాగానికి చేరుకుంటాడు. వెర్జిల్‌ డాంట్‌ను ఓడించి తప్పుకుంటాడు. తర్వాత అతడు టవర్‌ యొక్క పునాది దగ్గర ఉన్న నియంత్రణ గది దగ్గర దొరికిపోతాడు. మరోసారి సోదరులిద్దరూ యుద్ధం చేస్తారు. దీనికి ఒక మహిళ అంతరాయం కలిగిస్తుంది. వీరిని మభ్యపెట్టిన అర్కమ్‌ తర్వాత టవర్‌ను మళ్లీ ఏక్టివేట్‌ చేస్తాడు. అర్కమ్‌ ఉద్దేశం, స్పార్డా యొక్క కత్తి ఫోర్స్‌ ఎడ్జ్‌ను దొంగిలించడం.[12][13]

డాంట్‌ దెయ్యాల ప్రపంచాన్ని అధిగమించి అర్కమ్‌ను పట్టుకుంటాడు. అతడు మరియు వెర్జిల్‌ కలిసి పనిచేసి అర్కమ్‌ను కిందకు దించుతారు. డాంట్‌ మరియు వెర్జిల్‌ యొక్క యుద్ధంలో డాంట్‌ విజయాన్ని సొంతం చేసుకుంటాడు. తిరిగి మానవ ప్రపంచానికి రాగానే, డాంట్‌ టవర్‌ బయట ఒక మహిళను కలుస్తాడు. ఆమె డెవిల్‌ మే క్రై అనే పద్యం పాడుతూ ఉంటుంది. తన సోదరుడి చేతిలో ఓడిన డాంట్‌ను సాంత్వన పరిచే ప్రయత్నం చేస్తుంది. ఈ ఇద్దరికీ స్నేహం కుదురుతుంది. ఇద్దరూ కలిసి భాగస్వామ్యంతో దెయ్యాల స్లేయింగ్‌లో పని చేస్తారు. డాంట్‌ తన దుకాణానికి డెవిల్‌ మే క్రై అని పేరు పెడతాడు.[14][15]

డెవిల్‌ మే క్రై కథ, డాంట్‌ పై అతడి కార్యాలయంలోనే ట్రిష్‌ దాడి చేయడంతో మొదలవుతుంది. ఆమె చేసిన నేరాలను అతడు చెరిపేస్తాడు. ఆమె దెయ్యాల సామ్రాజ్యం ముండుస్‌ తిరిగి వస్తుందని చెబుతుంది.[16] డాంట్‌ మాలెట్‌ ద్వీపాన్ని పేల్చేస్తాడు. ఈ క్రమంలో అనేక దయ్యాలను నెలో ఏంజెలో అనే దెయ్యంతో సహా మట్టుపెడతాడు.[17] డాంట్‌ ఓడిపోతాడు. కానీ నెలో ఏంజెలో భయంతో పారిపోతుంది. దెయ్యాల ముండుస్‌కు సంబంధించిన వారితో డాంట్‌ పోరాడటం ద్వారా,డెవిల్‌ మే క్రై 3లో తాను వచ్చినప్పట్నించి కూడా తన తండ్రి కంటే శక్తిమంతుడినని నిరూపించుకుంటాడు.[18] నీలో ఎంజెలో తర్వాత మిషన్స్‌లో రెండుసార్లు దాడి చేస్తుంది. కానీ డాంట్‌ యొక్క కవల సోదరుడు వెర్జిల్‌కు పట్టుబడుతుంది. ముండుస్‌ను వెతుక్కుంటూ డాంట్‌ అండర్‌వరల్డ్‌లోకి ప్రవేశిస్తాడు. అక్కడ ట్రిష్‌ అతడి కోసం తనని తాను త్యాగం చేస్తుంది. డెవిల్‌ మే క్రై 3లో వెర్జిల్‌ సంపాదించిన స్పార్డా శక్తిని డాంటా విడుదల చేస్తాడు.[19] తర్వాత డాంట్‌ మరియు ముండుస్‌ మరోసారి మనుగడ కోసం పోరాటం చేస్తారు. ట్రిష్‌ తిరిగి వచ్చి డాంట్‌కు ఆమె శక్తిని ఇస్తుంది. తర్వాత డాంట్‌ ముండుస్‌ను ఓడిస్తాడు.[20] ద్వీపం కుప్పకూలే సమయానికి డాంట్‌ మరియు ట్రిష్‌ తప్పించుకుంటారు. తర్వాత ఇద్దరూ కలిసి పేరు మార్చిన దుకాణం డెవిల్‌ నెవర్‌ క్రైలో పని చేస్తారు.

డెవిల్‌ మే క్రై ఏనిమ్‌ సిరీస్‌లో, పాటీ అనే పేరుగల అమ్మాయిని తనకు అంగరక్షకురాలిగా నియమించుకుంటాడు. ప్రారంభంలో అతడి వ్యక్తిత్వం గురించి సందేహాలున్నా, పాటీ క్రమంగా పెరుగుతూ డాంట్‌తో అనుబంధాన్ని పెంచుకుంటుంది. దీంతో ఎక్కువసేపు అతడి దుకాణంలోనే సమయం గడుపుతూ ఉంటుంది. దానిని శుభ్రం చేస్తూ, అమ్మాయిల తరహాలో దానిని అలంకరిస్తూ డాంట్‌ యొక్క అభిరుచికి తగ్గట్లుగా చేస్తుంది. ఈ సిరీస్‌లో డాంట్‌ యొక్క ప్రధాన కర్తవ్యం పాటీని రక్షించడం. తన దుకాణంలో కష్టమైన ఉద్యోగాలు చేస్తూ తన సమయాన్ని ఎక్కువగా అక్కడే గడిపేవాడు. (డెవిల్‌ మే క్రై అంశాల తర్వాత కొంతకాలానికి దుకాణానికి తిరిగి డెవిల్‌ మే క్రై అనే పేరు పెట్టారు.) తరచుగా అతడు నగరాన్ని పీడించే దెయ్యాలను చంపడానికి సమయం తీసుకునేవాడు. తిరిగి మహిళ డెవిల్‌ హంటర్‌గా పనిచేస్తూ తిరిగి వస్తుంది. డాంట్‌కు ఉన్న పెద్ద అప్పులను తీర్చేసి, డాంట్‌ను తన దగ్గర నియమించుకోవాలని భావిస్తుంది. ట్రిష్‌ కూడా త్వరగానే కనిపిస్తుంది. ఆమె డాంట్‌కు దూరంగా కొంత కాలంగా పనిచేస్తూ, తన సొంత కెరీర్‌ను డెవిల్‌ హంటర్‌గా ఏర్పాటు చేసుకునేందుకు పనిచేస్తూ ఉంటుంది. ఆ మహిళ మరియు ట్రిష్‌ తొలిసారి కలుస్తారు. కానీ ఇద్దరూ ఎక్కువసేపు కలిసి ఉండరు. ఇది కాకుండా, ఈ మగ్గురూ కలిసి పని చేయడం మానేసి, మూడు క్లిష్టమైన ఉద్యోగాలను చూసుకుంటారు. సిరీస్‌ ముగింపు దశలో, దెయ్యాల దేవుడు అబిగెయిల్‌ యొక్క శక్తిని బంధించివేసింది డాంట్‌ యొక్క తల్లి అని, ఆమె తన మానవశక్తులతో ఈ పనిచేసిందని బయటపడుతుంది. దీంతో దెయ్యం సిడ్‌ బయటకు వచ్చి సిరీస్‌ యొక్క ప్రతినాయకుడిగా కనిపిస్తాడు. అబిగెయిల్‌ యొక్క బంధింపబడిన శక్తిని వెలికితీయం అతడి లక్ష్యం. సిడ్‌ పంపించిన దెయ్యాలతో ట్రిష్‌ మరియు మహిళ పోరాడతారు. డాంట్‌ యుద్ధం చేసి సిడ్‌ తనని తాను చంపుకునేలా చేస్తాడు. కొంతకాలం తర్వాత, డాంట్‌, ట్రిష్‌ మరియు మహిళ ముగ్గురూ కలిసి ఒకే దుకాణంలో ఉద్యోగానికి చేరతారు. ఎవరు గెలుస్తారనే అంశం పై పందేలు తీసుకుంటారు. పాటీ డాంట్‌ యొక్క దుకాణానికి శుభ్రం చేయడానికి వస్తుంది. తర్వాత వారిద్దరూ తండ్రి కూతురు తరహా సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు చూపిస్తారు.

డెవిల్‌ మే క్రై 4 లో, మహిళ డాంట్‌ యొక్క షాప్‌ (ఇప్పటికీ డెవిల్‌ మే క్రై అనే పేరుతోనే ఉంటుంది. డెవిల్‌ నెవర్‌ క్రై పేరుతో కాదు)కు ఖడ్గం యొక్క వరుసను పరిశీలించడానికి వస్తుంది. స్పార్డాను పూజించే బృందం ఒకటి దెయ్యాల ఆయుధాలను సేకరిస్తూ ఉంటుంది. నిజానికి డాంట్‌ దీని పట్ల ఆసక్తితో లేడు. కానీ ట్రిష్‌ (తన వృత్తి జీవితాన్ని పూర్తిగా వదిలేసుకుని డాంట్‌ కింద మళ్లీ పనిచేస్తుంటుంది) ముందుకు వెళ్లి స్పార్డా ఖడ్గాన్ని తనతో తీసుకుంటుంది. తర్వాత, డాంట్‌ ఒక సమావేశంలో నాయకుడు సాంక్టస్‌ను చంపివేయడం నీరో చూస్తుంది. దీంతో నీరో డాంట్ ‌పై దాడి చేసి, అతడి డెవిల్‌ బ్రింగర్‌ ఆయుధాన్ని స్వాధీనం చేసుకుంటుంది. తమ మధ్య యుద్ధాన్ని డాంట్‌ తీవ్రంగా తీసుకోకూడదని ఈ పనిచేస్తుంది. నీరో డాంట్‌ను పొందుతుంది. ఈ క్రమంలో దెయ్యాల లోకానికి తలుపులు తెరిచి వాటి శక్తులను తిరిగి తెచ్చుకునేందుకు తాము కారణమయ్యామని తెలుసుకుంటారు. దెయ్యాల శక్తి ద్వారా సాంక్టస్‌ మళ్లీ బతుకుతాడు. నీరో ప్రేమ మీద ఆసక్తి ఉన్న కైరీని బంధించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తాడు. నీరో దీనిని అడ్డుకుని, సాంక్టస్‌తో పారాడుతుంది. కానీ ఓడిపోతుంది. దీంతో కైరీతో కలిసి దేవుడి రూపంలో ఉన్న పెద్ద దెయ్యం, ద జెయింట్‌లోకి వెళుతుంది. డాంట్‌ రంగంలోకి దిగి అన్ని నరకపు గేట్లను తుణాతుణకలు చేస్తాడు. తర్వాత సేవియర్‌తో పోరాడతాడు. బయట నుంచి నాశనం చేయడానికి కుదరకపోవడంతో, లోపల ఉన్న నీరోకు ఆ బాధ్యతను అప్పగిస్తాడు. నీరో సాంక్టస్‌ను చంపి కీరీని రక్షిస్తాడు. చివరికి సావియర్‌ను కూడా నాశనం చేస్తారు. గతంలో వెర్జిల్‌కు చెందిన ఖడ్గం యామాటోను డాంట్‌ నీరోకు ఇస్తాడు. (దొరికినప్పుడు ఇది విరిగి ఉంటుంది. కానీ నోరో దానిని బాగు చేసి తన సొంత డెవిల్‌ ట్రిగ్గర్‌లా ఉపయోగించుకుంటాడు.) తర్వాత, డెవిల్‌ మే క్రై దుకాణంలో, మహిళ డాంట్‌ మరియు ట్రిష్‌లకు వారి పనికి డబ్బు చెల్లిస్తుంది. కానీ ట్రిష్‌ ఈ మొత్తం పట్ల సంతృప్తిగా ఉండదు. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి డాంట్‌ ప్రయత్నిస్తాడు మరియు ఒక పాస్‌వర్డ్‌ ఫోన్స్‌ కోసం వచ్చిన వినియోగదారుడిగా ఉంటాడు. ముగ్గరూ కలిసి మరో మిషిన్‌ కోసం బయటకు వెళతారు.

డెవిల్‌ మే క్రై 2, మెడాగిలా అని పిలువబడే ఒక ముఖ్యమైన వస్తువును దాచిపెట్టిన మ్యూజియంలోకి డాంట్‌ ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది. లూసియా డుమరి ద్వీపానికి డాంట్‌ను ఆహ్వానిస్తుంది. దెయ్యాల శక్తిని కలిగి ఉన్న ఒక వ్యాపారవేత్త ఆరియస్‌తో పోరాడాలని లూసియా తల్లి మాటియర్‌ డాంట్‌ను కోరుతుంది.[21] ఆమెకు సహాయం చేయాలని డాంట్‌ నిర్ణయించుకుంటాడు.[22] లూసియా ఆరియస్‌తో పోరాడుతుంది. కానీ ఆమెను తానే సృష్టించానని అతడు చెబుతాడు.[23] కొద్దిసేపటి తర్వాత, లూసియా డాంట్‌కు చివరిదైన ఆర్కానాను వెళ్లిపోయే ముందు ఇస్తుంది.[24] డాంట్‌ ఆ తర్వాత తనని ఆర్కానాను తీసుకుని ఆరియస్‌ నుంచి లూసియాను రక్షించమని కోరిక మాటియర్‌ను చంపేస్తాడు.[25] లూసియా తనను ఆక్రమించుకున్న ఆరియస్ ‌పై దాడి చేస్తుంది. డాంట్‌ వచ్చి లూసియా కోసం ఆర్కానాను కొంటాడు. తర్వాత ఆరియస్‌ పై దాడి చేసినా, అతడు తప్పించుకుంటాడు.[26] పెద్ద మొత్తం శక్తిని ఉపయోగించింది యురోబురోస్‌ (ఈవిల్‌ 5 రిఫరెన్స్‌లో నివాసి కాదు, తన సొంత తోక ఉండి పెద్ద వృత్తాకారంలో ఉన్న డ్రాగన్‌కు సూచిక) టవర్‌ను కూలుస్తారు. దెయ్యాల ప్రపంచంలోకి వెళ్లే దర్వాజాను తెరుస్తారు. ఎవరు అందులోకి ప్రవేశించాలనే అంశం పై లూసియా, డాంట్‌ల మధ్య వాగ్వాదం జరుగుతుంది. చివరకు ఆర్గోసాక్స్‌ను ఎదుర్కొనేందుకు డాంట్‌ ఆ పోర్టల్‌లోకి ప్రవేశిస్తాడు.[27]

డాంట్‌ వెళ్లిపోయిన తర్వాత, ఆరియస్‌ కూడా తిరిగి వస్తాడు. అయితే లూసియా వెళ్లి అతడిని ఓడిస్తుంది.[28] పోర్టల్‌ లోపల, డాంట్‌ ఆర్గోసాక్స్‌తో పోరాడి గెలుస్తాడు. పోర్టల్‌ ద్వారం మూసుకుందన్న విషయాన్ని గ్రహించిన డాంట్‌, మోటార్‌ సైకిల్ ‌పై దెయ్యాల దీవిలోకి మరింత లోపలకు వెళతాడు. యుద్ధం తర్వాత, లూసియాతో మాటియర్‌, స్పార్డా ఇలాంటి ప్రయాణం ద్వారానే వస్తుందని చెబుతుంది. కొంత సేపటి తర్వాత డాంట్‌ యొక్క దుకాణంలో లూసియా డాంట్‌ గురించి ఆలోచిస్తూ, అతడు ఆమెకు ఇచ్చిన నాణేన్ని పరిశీలిస్తుంటుంది. అందులో రెండు తలలు ఉంటాయి. బయట మోటార్‌సైకిల్‌ శబ్దం వినిపిస్తుంది. దీంతో లూసియా తన పరిశోధనను ఆపేస్తుంది. అది డాంటా లేక మరెవరైనానా అనే అంశాన్ని చూపించలేదు.

సాంస్కృతిక ప్రభావం[మార్చు]

డెవిల్‌ మే క్రై సిరీస్‌ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడయింది.[29] ప్రతి విడుదలకూ ఒక ప్లాటినమ్‌ టైటిల్‌ వచ్చింది.[30] డెవిల్‌ మే క్రైను యాక్షన్‌ క్రీడలకు మాతృకగా కూడా పరిగణించడం జరిగింది. వీటినే ఎక్స్‌ట్రీమ్‌ కంబాట్‌ అని కూడా పిలిచారు. వీటిలో శక్తివంతమైన హీరోలు, అద్భుతమైన యాక్షన్‌తో పోరాటాలు జరుపుతారు.[31] ఈ క్రీడ విజయవంతంగా ట్విచ్‌ బేస్‌ను పొందిన, సరదాగా సాగే ఆట విధానాలతో, అనేక క్లాసిక్‌ 2డి యాక్షన్‌ క్రీడలులో మొదటి దానిగా కూడా గుర్తింపు పొందింది.[32] మిగిలిన 3 డి యాక్షన్‌ క్రీడలు గాడ్‌ ఆఫ్‌ వార్‌ [33][34], చావోస్‌ లెజియన్‌ [35] మరియు బ్లడ్‌ విల్‌ టెల్‌ [36] లతో పోలిస్తే ఈ క్రీడకు ఎక్కువ ఆదరణ లభించింది.

డాంట్‌ యొక్క ఆత్మవిశ్వాసం మరియు భయం లేని దృక్పథం మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. గేమ్స్‌ క్రష్‌ యొక్క టాప్‌ 10; మోస్ట్‌ బడాస్‌ వీడియో గేమ్‌ క్యారెక్టర్స్‌లో [37] డాంట్‌కు ఏడో స్థానం దక్కింది మరియు స్క్రూ ఎటాక్‌ యొక్క టాప్‌ టెన్‌ కూలెస్ట్‌ వీడియో గేమ్‌ పాత్రలలో‌ మూడో స్థానం లభించింది.[38] డెవిల్‌ మే క్రై సిరీస్‌కు లభించిన ఆదరణ చూసి టాయ్‌కామ్‌ డెవిల్‌ మే క్రై అనే లైన్‌తో యాక్షన్‌కు దారితీసింది.[39] జపాన్‌ కంపెనీ కాయ్‌వోడో ఇలాంటి తరహా లైన్‌తో డెవిల్‌ మే క్రై 2 మరియు డెవిల్‌ మే క్రై 3 లో డాంట్‌ యాక్షన్‌ను చూపిస్తూ చిత్రాలను నిర్మించింది.[40][41]

ఇతర మీడియా[మార్చు]

డెవిల్‌ మే క్రై కు సంబంధించి షిన్యా గోయికెడా రాసిన, షిరోవ్‌ మివా ఉదహరించిన రెండు సాధారణ నవలలు ప్రచురణ అయ్యాయి. తొలుత 2002లో జపాన్‌లో తర్వాత 2006 అమెరికాలో ఇవి విడుదల అయ్యాయి. తొలి నవల డెవిల్‌ మే క్రై వాల్యూమ్‌ 1, జపాన్‌లో ప్రచురణ అయింది. ఇది తొలి గేమ్‌ విడుదలకు అడ్డంకి అయింది. గేమ్‌ విడుదల కాకముందే డాంట్‌ను ఒక అడ్వంచర్‌ సెట్‌గా మార్కెట్‌లోకి తేవడం జరిగింది. రెండో నవల (డెవిల్‌ మే క్రై వాల్యూమ్‌ 2, అమెరికాలో) కూడా జపాన్‌లో ప్రచురితమయింది. రెండో గేమ్‌ విడుదల సమయంలో ఇది వచ్చింది. తొలి గేమ్‌ అంశాల పూర్తి తర్వాతే ఇది ఆచరణలోకి వచ్చింది. ప్రచురణ కర్త టోక్యోపాప్‌ ఈ పుస్తకాలను యు.ఎస్‌. మార్కెట్‌లో వరుసగా జూన్‌ మరియు నవంబరు 2006లో విడుదల చేశారు.

డెవిల్‌ మే క్రై 3 ఈవెంట్‌ రావడానికి ఒక సంవత్సరం ముందే, మూడు భాగాలు ఉన్న డెవిల్‌ మే క్రై 3 మాంగా సిరీస్‌ రెండు సంపుటులుగా ప్రచురణ అయి యు.ఎస్‌., మరియు జపాన్‌ మార్కెట్‌లలో విడుదల అయింది. ఈ మాంగా పాత్రలు ఎలా ఉండబోతున్నాయి, ఎక్కడ ఆట మొదలుకాబోతుందనే అంశాలను బయటపెట్టాయి.

తొలి ఆట‌ యొక్క హాస్య రచన మూడు భాగాలుగా 2004లో నిర్మితమయింది. కెనడాకు చెందిన పబ్లిషర్‌ డ్రీమ్‌ వేవ్‌ పబ్లికేషన్స్‌ దీని ప్రచురిణకు పూనుకుంది. అయితే 2005లో కంపెనీ దివాళా తీయడంతో ఇది పూర్తి కాకుండా మిగిలిపోయింది.[42]

డెవిల్‌ మే క్రై అనే పేరుతో యానిమీ సిరీస్‌లో వచ్చిన వీడియోలో డాంట్‌ WOWOW TV నెట్‌వర్క్‌లో అరంగేట్రం చేశాడు. ఇది జపాన్‌లో 2007, జూన్‌ 12న జరిగింది. ఈ సిరీస్‌ మొత్తం 12 భాగాల్లో నడిచింది.[43][44] ఈ ప్రదర్శనను యానిమి స్టూడియో మ్యాచ్‌హౌస్‌ నిర్మించడం జరిగింది. దీనికి షిన్‌ ఇటగాకి దర్శకత్వం చేశారు. బింగో మోరిహషి మూడు, నాలుగు ఆటలకు రచయితలలో ఒకరు. దీనికి సంబంధించిన తొలి పూర్తి ట్రయిలర్‌ డాంట్‌ తన తొలి ఆట‌లో సంపాదించుకున్న అంశాలతో కూడి ఉంది. ఇందులో అతడి భాగస్వాములు (మహిళ మరియు ట్రిష్‌)లతో పాటు మరో రెండు కొత్త పాత్రలు కూడా ఉన్నాయి.

2008 జూలై 25న, విల్డ్‌ స్లార్మ్‌ (ఒక డిసి కామిక్‌ యొక్క ఇమ్‌ప్రింట్‌) మరియు క్యాప్‌కామ్‌ కలిసి, తామిద్దరము కలిసి ఒక కొత్త డెవిల్‌ మే క్రై హాస్య పుస్తకాల సిరీస్‌ను తీసుకొస్తున్నామని ప్రకటించారు. కొత్త కామిక్‌ సిరీస్‌కు సంబంధించిన వివరాలు, క్రియేటివ్‌ జట్టు మరియు విడుదల చేసే నెల తదితర అంశాలు తర్వాతి కాలంలో ప్రకటిస్తారు.[45]

ఇతర క్రీడల్లో[మార్చు]

 • హిడికి కమియా నిర్మించిన, క్యాప్‌కామ్‌కు సంబంధించిన మరో క్రీడ వ్యూటిఫుల్‌ సిరీస్‌లో కూడా డెవిల్‌ మే క్రై లోని క్యారెక్టర్లు ప్లేస్టేషన్‌ వెర్షన్‌లలో కనిపిస్తాయి. డాంట్‌ PS2 వెర్షన్‌ వ్యూటిపుల్‌ జోయ్‌లో ఆడుకోదగిన పాత్ర మరియు PSP వెర్షన్‌లో Viewtiful Joe: Red Hot Rumble అతడితో పాటు వెర్జిల్‌, ట్రిష్‌, స్పార్డా, మారినెట్టి మరియు ప్లాస్మా క్యారెక్టర్లు కూడా ఉన్నాయి.
 • డాంట్‌ సోల్‌క్యాలిబర్‌ III లోనూ కనిపించాల్సింది. కానీ ఇది జరగలేదు.[46]
 • క్యాప్‌కామ్‌ మరియు అథ్లస్‌ల ఒప్పందం ప్రకారం, మెగామి టెన్సీ పాత్రను సృష్టించిన కజుమా కనెకో దయ్యాల రూపంలో డాంట్‌ మరియు వెర్జిల్‌ యొక్క పాత్రలను కూడా రూపొందిస్తారు.Devil May Cry 3: Dante's Awakening దీని ప్రతిగా ఆథ్లస్‌ తను జపాన్‌లో విడుదల చేసే మ్యానియాక్స్‌లో డాంట్‌ (డెవిల్‌ మే క్రై 2లో మాదిరిగా)Shin Megami Tensei III: Nocturne పాత్రను ఉపయోగించుకుంటారు. తర్వాతి కాలంలో వచ్చిన నాక్‌టర్న్‌ కూడా మ్యానియాక్స్‌ సంచిక ఆట‌ను ఆధారంగా చేసుకుని ఆంగ్లంలోకి అనువదించారు.[47]
 • డాంట్‌ మరియు ట్రిష్‌ కనపడటానికి సిద్ధం అయ్యారు.Marvel vs. Capcom 3: Fate of Two Worlds

ఆదరణ[మార్చు]

మూస:VG Series Reviews

డెవిల్‌ మే క్రై సిరీస్‌కు తాజా పేర్లతో అన్నిచోట్లా సానుకూల స్పందన వచ్చింది. అయితే పిసి వెర్షన్‌ మాత్రం విమర్శలకు గురయింది. ఇవి మూలానికి చెందిన వెర్షన్‌లతో పోలిస్తే తక్కువ మార్కులను ఇస్తున్నాయని, వారితో పోటీ పడలేకపోతున్నాయని విమర్శ ఉంది.

వీటిని కూడా పరిశీలించండి[మార్చు]

 • బయోనెట్ట

సూచనలు[మార్చు]

 1. Mielke, James (August 18, 2006). "The Okami Family Tree". 1UP.com. Retrieved March 29, 2007.
 2. "E3 2001: Interview with Shinji Mikami". IGN. May 17, 2001. Retrieved May 25, 2007.
 3. James Chalmers. "DmC (Devil May Cry) Announced".
 4. 4.0 4.1 4.2 Devil May Cry Instruction Booklet. Capcom. 2001.
 5. దెయ్యాల యొక్క వారసత్వం; ఫోర్స్‌ ఎడ్జ్‌ / స్పార్డా' గేమ్‌ ఇన్‌ఫార్మర్‌ 179 (మార్చి 2008); 112.
 6. దెయ్యాల యొక్క వారసత్వం; డాంట్‌ గేమ్‌ ఇన్‌పార్మర్‌ 179 (మార్చి 2008); 113.
 7. దెయ్యాల యొక్క వారసత్వం; యమాటో గేమ్‌ ఇన్‌ఫార్మర్‌ 179 (మార్చి 2008); 113.
 8. "List of styles in Devil May Cry 3". devilmaycry.org. Retrieved April 3, 2007.
 9. "Official English language DMC4 site from Capcom Japan". Retrieved January 31, 2007.
 10. ఆర్కమ్‌ ; నీ పేరు డాంటా? స్పార్డా కొడుకువా? డాంట్‌; నువ్వు దీనిని ఎక్కడ విన్నావు? ఆర్కమ్‌; నీ సోదరుడి దగ్గరి నుంచి. అతడు ఈ ఆహ్వానాన్ని నీ కోసం పంపించాడు. దయచేసి దీనిని అంగీకరించు. డాంట్‌; ఆహ్వానం? హూ (డెవిల్‌ మే క్రై 3 ) క్యాప్‌కామ్‌ 2005.
 11. డాంట్‌; మనం చివరిసారిగా కలుసుకుని ఏడాది కావస్తోంది. సమయం అప్పుడు ఎలా గడిచిపోయింది? సందేహం లేదు. నువ్వు నా కోసం క్తొం సరదాను తీసుకొచ్చావు. కదా. వెర్జిల్‌? (డెవిల్‌ మే క్రై 3 ) క్యాప్‌కామ్‌ 2005.
 12. జెస్టర్‌; ఇది చాలా రైడ్‌. నీకు తెలుసా. ఒకవేళ మీలో ఎవరైనా ఇక్కడికి రావడానికి ముందే మరణిస్తేమన చిన్న ప్రణాళిక వృథా అయ్యేది. కాబట్టి, నా ఉద్యోగం మీ ఇద్దరినీ యుద్ధరంగంలోకి దించడం, తర్వాత నిన్ను బలహీనపరచడం. కానీ అదే సమయంలో, నేను నీకు మార్గనిర్దేశం చేస్తూ, నిన్ను సజీవంగా ఉంచాలి. నేను ఒక పూర్తి స్థాయి మూర్ఖుడిలా బట్టలు ధరించి చాలా దూరం వెళ్లాను. (డెవిల్‌ మే క్రై 3 ) క్యాప్‌కామ్‌ 2005.
 13. ఆర్కమ్; అతడు మనల్ని వేలి నుంచి పాదం వరకూ నృత్యం చేయించడానికే ఈ దారాలు తెంచాడు. మనం సంతోషాన్ని చాలా తక్కువగా ఇచ్చేశాం. మనం చీకతి మరియు మాయ ద్వారా కొంత కలిసిపోయాం. గంటగంటకూ మనం దిగజారిపోతున్నాం. నెమ్మదిగా, క్రమంగా నరకానికి దగ్గరవుతున్నాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం పూర్తిగా మునిగిపోని. చినిపోయిన ఆత్మలు కానీ అధికంగా తినని! అత్యాశ కోరికలు తీర్చుకుని కోపాలు ఆపుకోలేని గర్వం కానీ ఏదైనా జరగనీ. మానవుల కోరికలన్నీ ఆటంకాలు లేకుండా తీర్చుకోనియ్యి. 2000 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత, ఎప్పుడో మూసివేయబడ్డ దెయ్యాల ప్రపంచం ద్వారం మళ్లీ తెరుచుకుంది. విధ్వంసం జరుగుతుంది! కార్నైజ మరియు డెస్పైర్ నీ కోరికలు నిన్ను నడపాలి. ఈ ప్రపంచంలో భయం పోగొట్టాలి. దాని పేరు టెమెన్‌ ని గ్రు మానవజాతిలో భయం పెంచుతోంది. తర్వాత నేను ఈ ప్రపంచానికి ఎదురులేని పాలకుడిని అవుతాను. స్పార్డా ప్రదర్శించే దెయ్యాల శక్తి నాది కాబోతోంది. (డెవిల్‌ మే క్రై 3 ) క్యాప్‌కామ్‌ 2005
 14. మహిళ; నువ్వు ఏడుస్తున్నావా? డాంట్‌; అది కేవలం వర్షం మాత్రమే మహిళ; వర్షం ఎప్పుడో ఆగిపోయింది. డాంట్‌; దెయ్యాలు ఎప్పుడూ ఏడవవు. మహిళ; అవునా. కొన్ని చోట్ల దెయ్యాలు కూడా ఏడుస్తాయి. తమకు ఇష్టమైన వారిని కోల్పోతే. నువ్వు అది ఆలోచించలేదా? డాంట్‌; కావచ్చు (డెవిల్‌ మే క్రై 3 ) క్యాప్‌కామ్‌ 2005.
 15. మహిళ; ఓహ్‌, దయగల దెయ్యంతో మాట్లాడిన తర్వాత, చివరకు అతడు తన దుకాణానికి పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం అతడు చాలా సమయం తీసుకున్నాడు. ఆ పేరేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నావా? డెవిల్‌ మే క్రై (డెవిల్‌ మే క్రై 3 ) క్యాప్‌కామ్‌ 2005.
 16. ట్రిష్‌; అవును. అతడి అధికారాలను స్పార్డా బంధించింది. మానవ ప్రపంచం పై ఆధిపత్యాన్ని సంపాదించేందుకు అతడు మరోసారి ప్రయత్నిస్తున్నాడు. మాలెట్‌ ద్వీపంలోని ద్వారా తెరిచేందుకు అతడు సిద్ధమవుతున్నాడు. మాలెట్‌ ద్వీపం (డెవిల్‌ మే క్రై ) క్యాప్‌కామ్‌ 2001
 17. డాంట్‌; ఎంతో కొంత దమ్మున్న వ్యక్తులను నేను చివరిసారిగా చూడబోయే ప్రదేశం ఇదే కావచ్చు. (డెవిల్‌ మే క్రై ) క్యాప్‌కామ్‌ 2001
 18. గ్రిఫన్‌; నీది కచ్చితంగా స్పార్డా యొక్క శక్తే. కాదా? అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు. (డెవిల్‌ మే క్రై ) క్యాప్‌కామ్‌ 2001.
 19. డాంట్‌; ఎంతకాలమని ఇలా దాక్కుంటూ ఉంటావు. ముండాస్‌, బయటకు వచ్చి నిన్ను నువ్వు చూపించుకో. (డెవిల్‌ మే క్రై ) క్యాప్‌కామ్‌ 2001.
 20. ట్రిష్‌; డాంట్‌, నా శక్తిని ఉపయోగించుకో. డాంట్‌; సరే, ట్రిష్‌ ఫర్వలేదా? (డెవిల్‌ మే క్రై ) క్యాప్‌కామ్‌ 2001
 21. మాటియర్‌; స్పార్డా యొక్క కుమారుడా... నువ్వు మాకొక సహాయం చేయాలి. అక్కడో మనిషి ఉన్నాడు. అతడు మా నేలను దెయ్యాలకు స్వర్గంగా మార్చాడు. అతడి పేరు అరియస్‌. అతడు ఒక అంతర్జాతీయ పబ్లిక్‌ సంస్థకు అధ్యక్షుడు అయినప్పటికీ, దెయ్యాల శక్తిని ఉపయోగిస్తున్నాడు. దయచేసి అరియస్‌తో మరియు అతడి శక్తితో నువ్వు పోరాడు. (డెవిల్‌ మే క్రై 2 ) క్యాప్‌కామ్‌ 2003
 22. (ఒక నాణేన్ని గాలిలో ఎగరవేసి, అది హెడ్స్‌ పడిన తర్వాత ) డాంట్‌; ...చూడటానికి ఇది కలిసొచ్చే రోజులా ఉంది. (డెవిల్‌ మే క్రై 2 ) క్యాప్‌కామ్‌ 2003
 23. అరియస్‌; నువ్వు నా సృష్టి. లూసియా; అబద్దాలు చెప్పే వాడా. మాటియర్‌ నా తల్లి. ఆరియస్‌ కార్యదర్శి తన ముసుగును తొలగిస్తుంది. ఆమె మొహం లూసియా మాదిరిగా ఉందన్న విషయం బయటకు వస్తుంది. ఆరియస్‌; నువ్వు నాశనం కాబోతున్న కొద్ది క్షణాల ముందు ఆమె నిన్ను కనుగొంది. తర్వాత నిన్ను సైనికురాలిగా మార్చింది. దానికి నువ్వు ఆమెను తల్లిగా భావిస్తున్నావా? (డెవిల్‌ మే క్రై 2 ) క్యాప్‌కామ్‌ 2003
 24. లూసియా; కానీ... నిజానికి... నాకు ఈ శక్తిని తీసుకునే అర్హత లేదు.. లూసియా; దయచేసి నాకోసం ఇది మాటియర్‌కు తీసుకురా. నేను జాగ్రత్తగా చూసుకోవాల్సింది నా దగ్గర ఉంది. (డెవిల్‌ మే క్రై 2 ) క్యాప్‌కామ్‌ 2003
 25. మాటియర్‌; నేను ఇది మినహా మరేమీ నిన్ను అడగను. ఓ స్పార్డా యొక్క కుమారుడా. నా కూతురు ఆరియస్‌తో పోరాడటానికి తనంతట తానే వెళ్లింది. దయచేసి, ఇవి తీసుకుని లూసియాను రక్షించు. (డెవిల్‌ మే క్రై 2 ) క్యాప్‌కామ్‌ 2003
 26. ఆరియస్‌; నువ్వు గెలవలేవు... నిన్ను వెనక ఎవరో పట్టుకున్నారు... లూసియా; హాగ్, నా గురించి మర్చిపో, ఆరియస్‌ను చంపెయ్యి. డాంట్‌: ఆందోళన చెందవద్దు. నేను నిన్ను దక్కించుకుంటాను. (డెవిల్‌ మే క్రై 2 ) క్యాప్‌కామ్‌ 2003
 27. లూసియా; కానీ...! డాంట్‌; దీనిని విధికి వదిలేద్దాదం. హెడ్స్‌ పడితే నేను వెళ్తాను. టెయిల్స్‌ పడితే నువ్వు వెళ్లాలి. అతడు నాణేన్ని గాలిలోకి ఎగరవేస్తాడు. మరోసారి హెడ్స్‌ పడుతుంది. డాంట్‌; ఎక్కడో మళ్లీ కలుస్తాను. లూసియా; మాటియర్‌ నుంచి స్పార్డా యొక్క కథ గురించి వినదలచుకోలేదా. మాటియర్‌ డాంట్‌; నాకు తెలుసు. అతడు మళ్లీ అదే చేస్తాడు. నా నాణేన్ని పట్టుకో లూసియా. (డెవిల్‌ మే క్రై 2 ) క్యాప్‌కామ్‌ 2003
 28. ఆరియస్‌; నువ్వు మానవుడివి కాదు. నువ్వు ఒక అతీతశక్తివి. నేను సృష్టించిన అతీత శక్తివి. లూసియా; డాంట్‌ నాకు చెప్పాడు. దెయ్యాలు ఎప్పుడూ ఏడ్వవు. (డెవిల్‌ మే క్రై 2 ) క్యాప్‌కామ్‌ 2003
 29. Haruhiro Tsujimoto (February 20, 2008). "Smokin'! Capcom's "Devil May Cry 4" Ships over 2 Million Stylish Units - Making it the fastest game in the DMC series to reach that milestone". Capcom. Retrieved February 21, 2008.
 30. "Platinum Titles". Capcom. January 17, 2007. Retrieved April 4, 2007.
 31. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 32. Ahmed, Shahed (October 17, 2001). "Gamespot Devil May Cry review". GameSpot. Retrieved March 29, 2007.
 33. "God of War". IGN. Retrieved April 3, 2007.
 34. "God of War Review". Playstation World. June 16, 2005. Retrieved April 3, 2003.
 35. Varanini, Giancarlo (August 4, 2003). "Chaos Legion review". Gamespot. Retrieved April 3, 2007.
 36. Bedigian, Louis (September 29, 2004). "Blood Will Tell review". Gamezone. Retrieved April 3, 2007.
 37. Rocco Inzauto, Edward (February 25, 2007). "Top 10: Most Badass Video Game Characters". Archived from the original on January 29, 2009. Retrieved April 20, 2007.
 38. "Top ten coolest games". Retrieved April 20, 2007.
 39. Borst, Brian (June 1, 2003). "Devil May Cry Action Figures review". Retrieved April 20, 2007.
 40. "Amazon.com Listing for Devil May Cry 2 Action Figures". Retrieved April 23, 2007.
 41. "Amazon.com Listing for Devil May Cry 3 Dante Revoltech action figure". Retrieved April 23, 2007.
 42. "Dreamwave Productions closes up shop". Retrieved April 23, 2007.
 43. "ActiveAnime:Devil May Cry Anime and Pre Site Opening". Retrieved January 23, 2007.
 44. "Devil May Cry anime official site (in Japanese)". Retrieved January 23, 2007.
 45. Mike Fahey (July 29, 2008). "Resident Evil And Devil May Cry Comics On The Way". Kotaku. Retrieved August 31, 2008.
 46. James Ransom-Wiley (February 9, 2005). "Joystiq's report on Dante's inclusion on the Soul Calibur III roster". Retrieved April 4, 2007.
 47. "Atlus USA presents Shin Megami Tensei: Nocturne". Atlus. Retrieved April 16, 2007.

బాహ్య లింకులు[మార్చు]

జపనీస్ భాష[మార్చు]

మూస:Devil May Cry series మూస:Franchises by Capcom