డేల్ స్టెయిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డేల్ స్టెయిన్ (Dale Steyn)
Dale Steyn 3.jpg
50px దక్షిణాఫ్రికా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు Dale Willem Steyn
జననం (1983-06-27) 1983 జూన్ 27 (వయస్సు: 36  సంవత్సరాలు)
ఫలబొర్వా, ట్రాన్స్వాల్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా
ఎత్తు 1.79 m (5 ft 10 12 in)
పాత్ర Bowler
బ్యాటింగ్ శైలి Right-handed
బౌలింగ్ శైలి Right-arm fast
International information
తొలి టెస్టు (cap 297) 17 December 2004: v England
చివరి టెస్టు 26-30 December 2015: v England
తొలి వన్డే (cap 82) 17 August 2005: v Asia XI
చివరి వన్డే 14 October 2015:  v India
ODI shirt no. 8
కెరీర్ గణాంకాలు
TestODIFCLA
మ్యాచ్‌లు 81 112 124 162
పరుగులు 1124 492 1,632 338
బ్యాటింగ్ సగటు 14.22 8.11 14.31 7.68
100s/50s -/2 0/0 0/4 0/0
అత్యుత్తమ స్కోరు 76 35 82 35
వేసిన బంతులు 16,782 5,603 24,502 7,927
వికెట్లు 402 175 561 205
బౌలింగ్ సగటు 22.65 25.93 23.49 24.47
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 25 3 33 6
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 5 n/a 7 0
అత్యుత్తమ బౌలింగ్ 7/51 6/39 8/41 6/39
క్యాచ్ లు/స్టంపింగులు 22/– 26/– 28/– 33/–

As of 26 December, 2015
Source: cricinfo

డేల్ విలియమ్ స్టెయిన్ (ఉచ్ఛారణ /ˈsteɪn/) (జననం 1983 జూన్ 27, పుట్టిన ప్రదేశం దక్షిణాఫ్రికాలోని ట్రాన్స్‌వాల్ ప్రావీన్స్‌లో ఉన్న ఫాలాబోర్వా) ఒక దక్షిణాఫ్రికా క్రికెటర్, దక్షిణాఫ్రికా తరపున అతను టెస్ట్ మరియు అంతర్జాతీయ వన్డే క్రికెట్ ఆడుతున్నాడు. ప్రస్తుతం అతను ప్రపంచ టెస్ట్ బౌలర్‌ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు [46]. స్టెయిన్ దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో నాష్వా టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. అతను కుడిచేతివాటం ఫాస్ట్ బౌలర్, సుమారుగా 145–150 కిమీ/గం వేగాల మధ్య బంతులు విసరగలడు (2010 IPLలో అతను 156.2 కిమీ/గం వేగంతో ఒక బంతి విసిరాడు), ఇది అతని అత్యంత వేగవంతమైన బంతిగా గుర్తించబడుతుంది, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టెయిన్ ఈ వేగంతో ఒక బంతి వేశాడు. టెస్ట్ క్రికెట్‌లో వేగంగా 100 వికెట్‌లు పడగొట్టిన దక్షిణాఫ్రికా బౌలర్‌గా స్టెయిన్ రికార్డు సృష్టించాడు, 2008 మార్చి 2న అతను ఈ ఘనత దక్కించుకున్నాడు.[1] స్టెయిన్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ చరిత్రలో మూడో అత్యుత్తమ స్ట్రైక్ రేట్ గల బౌలర్‌గా ఉన్నాడు (కనీసం 2500 బంతులు వేసిన బౌలర్ల జాబితాలో), ఈ జాబితాలో జార్జ్ లోమాన్ మరియు షేన్ బాండ్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.[2] అతను 2007/08 సీజన్‌లో 16.28 ప్రపంచ శ్రేణి సగటుతో మొత్తం 78 వికెట్లు పడగొట్టాడు[3] తరువాత దీనికి గుర్తుగా స్టెయిన్‌కు ప్రతిష్ఠాత్మక ఐసీసీ (ICC) 2008 టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.[4]

విషయ సూచిక

ఆట శైలి[మార్చు]

స్టెయిన్ దూకుడుతో కూడిన నిరపేక్ష్యమైన ఫాస్ట్ బౌలర్, 150 కిమీ/గంపైగా వేగాలతో బంతులు విసరగల సమర్థుడు. గణనీయమైన స్వింగ్‌ను కూడా సృష్టించగల సామర్థ్యం అతనికుంది, ఈ లక్షణాల ప్రభావాన్ని గరిష్ఠంగా ఉపయోగించుకునేందుకు అతడిని ఎక్కువగా కొత్త బంతితో బౌలింగ్ చేసేందుకు ఉపయోగించుకుంటారు.[5] 2010లో నాగ్‌పూర్‌లో భారత్‌తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్‌లో పాత బంతితో రివర్స్ స్వింగ్ సాధించగల సామర్థ్యాన్ని అతను ప్రదర్శించాడు, [6] ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. స్టెయిన్ తీవ్రమైన పోటీతత్వం ఉన్న క్రికెట్ క్రీడాకారుడు, తరచుగా వికెట్ పడగొట్టిన తరువాత గట్టిగా అరుస్తూ ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు. అతను ఒక సందర్భంలో మాట్లాడుతూ వేగంగా విసిరిన బంతి నుంచి వచ్చే ఝంకారాన్ని ప్రేమిస్తానని, ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బౌలర్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.[7]

బ్యాటింగ్‌లో స్టెయిన్ సాధారణంగా కింది వరుస బ్యాట్స్‌మన్‌గా (టెయిలెండర్) బ్యాటింగ్ చేస్తాడు, ఎక్కువగా 10 లేదా 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. అయితే, అతనికి బంతిని బలంగా కొట్టే సామర్థ్యం కూడా ఉంది, అంతేకాకుండా అవసరమైన సమయంలో క్రీజ్‌లో పాతుకుపోవడం కూడా తెలుసు.

దేశవాళీ క్రీడా జీవితం[మార్చు]

నార్తరన్స్ జట్టులో సభ్యుడిగా 2003 అక్టోబరు 17న స్టెయిన్ ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు (ఈ జట్టు తరువాత ఈస్ట్రర్న్స్ జట్టుతో విలీనమై టైటాన్స్ జట్టు ఏర్పడింది). అతను రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు, మొదటి సీజన్‌లో అంతంతమాత్రం రాణించాడు, అయితే 2004/2005 సీజన్ ప్రారంభంలో వరుసగా బలమైన ప్రదర్శనలు ఇవ్వడంతో ఇంగ్లండ్‌తో ఆడే దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టులో అతనికి చోటు లభించింది. మొదటి మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో పేలవమైన ప్రదర్శన ఇచ్చిన స్టెయిన్ తిరిగి టైటాన్స్ జట్టులో ఆడేందుకు వెనుదిరిగాడు.

2005లో ఎసెక్స్‌తో ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లాడు, మే మరియు జూన్ నెలల్లో ఏడు మ్యాచ్‌లు ఆడాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ క్రికెట్‌లో ప్రారంభ మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపడంలో విఫలమైన అతను 59.85 సగటుతో 14 వికెట్‌లు మాత్రమే దక్కించుకున్నాడు.[8] దక్షిణాఫ్రికాలో దేశవాళీ క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెట్టిన తరువాత స్టెయిన్, టైటాన్స్ జట్టు తరపున 2005/2006 సీజన్‌లో అద్భుతంగా బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు, దీంతో న్యూజీలాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో ఆడేందుకు దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు నుంచి అతనికి పిలుపు అందింది.[9]

దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు స్టెయిన్ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు, జాతీయ జట్టులో స్థిరమైన సభ్యుడిగా మారిన ఫలితంగా, అతను గత రెండు సీజన్‌లలో దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో తక్కువగా పాల్గొన్నాడు, టైటాన్స్ తరపున మూడు సూపర్‌స్పోర్ట్ సిరీస్ మ్యాచ్‌ల్లో మాత్రమే అతను ఆడాడు.

2007 ఇంగ్లీష్ సీజన్ ప్రథమార్ధ భాగంలో వార్‌విక్‌షైర్ జట్టు తరపున ఆడేందుకు అతను మరోసారి ఇంగ్లండ్ వెళ్లాడు. ఈసారి అతను ఇక్కడ విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు, ఏడు మ్యాచ్‌ల్లో 25.86 సగటుతో 23 కౌంటీ ఛాంపియన్‌షిప్ వికెట్‌లు పడగొట్టాడు.[8] 50-ఓవర్ల టోర్నమెంట్ అయిన ఫ్రెండ్స్ ప్రావిడెంట్ ట్రోఫీలో కూడా అతను మంచి ప్రదర్శన ఇచ్చాడు, వార్‌విక్‌షైర్ తరపున అత్యధిక వికెట్‌లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. అప్పటి నుంచి అతను దక్షిణాఫ్రికా అంతర్జాతీయ వన్డే జట్టులో కూడా ప్రధాన ఆటగాడిగా మారాడు.

2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు స్టెయిన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు, అతను ఈ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతున్నాడు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నందుకు అతనికి US$325,000 ఆదాయం వస్తుంది.[10]

అంతర్జాతీయ క్రీడా జీవితం[మార్చు]

జనవరి 2009లో SCGలో ఫీల్డింగ్ చేస్తున్న డేల్ స్టెయిన్

ఇంగ్లండ్‌పై స్వదేశంలో టెస్ట్ మ్యాచ్‌లు 2004/05[మార్చు]

2004 డిసెంబరు 17న జరిగిన ఇంగ్లండ్ పర్యటనలో మొదటి టెస్ట్ ద్వారా స్టెయిన్ మొదటిసారి దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టులో అడుగుపెట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో అతను మొదటి వికెట్‌ను మార్కస్ ట్రెస్కోథిక్‌ను అవుట్ చేయడం ద్వారా దక్కించుకున్నాడు, వేగమైన ఇన్-స్వింగర్‌తో స్టెయిన్ అతడిని బౌల్డ్ చేశాడు.[11] అయితే, మొత్తంమీద అతని ప్రదర్శన ఆకట్టుకోలేదు, 52.00 సగటుతో అతను ఎనిమిది వికెట్లు మాత్రమే పడగొట్టాడు, [12] జనవరి 2005లో నాలుగో టెస్ట్‌లో పేలవంగా బౌలింగ్ చేయడంతో అతడు జట్టులో చోటు కోల్పోయాడు, ఈ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అతను వేసిన తొమ్మిది ఓవర్లలో ఎనిమిది నో బాల్స్ వేయడంతోపాటు, 47 పరుగులు సమర్పించుకున్నాడు.[13] ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 77 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అంతర్జాతీయ వన్డేలు 2005/06[మార్చు]

ఈ ఏడాది తరువాతి కాలంలో, స్టెయిన్ 2005/06 ఆఫ్రో-ఆసియా కప్‌లో ఆడిన ఆఫ్రికన్ ఎలెవన్ (XI) జట్టులో చోటు దక్కించుకున్నాడు, 2005 ఆగస్టు 17న అంతర్జాతీయ వన్డేల్లో అతను ఆరంగేట్రం చేశాడు. చివరి బ్యాట్స్‌మన్ ఆశిష్ నెహ్రాను స్టెయిన్ అవుట్ చేయడంతో ఆఫ్రికన్ XI జట్టు రెండు పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.[14] దక్షిణాఫ్రికా జట్టు తరపున 2005-06 VB సిరీస్‌లో ఒక మ్యాచ్ ద్వారా స్టెయిన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు, ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాతో మెల్బోర్న్‌లో 2006 జనవరి 20న జరిగింది. దీనిలో స్టెయిన్ సరిగా బౌలింగ్ చేయలేకపోయాడు, [15] శ్రీలంక[16]తో మరో మ్యాచ్‌లో కూడా పేలవమైన ప్రదర్శన ఇవ్వడంతో అతను దక్షిణాఫ్రికా వన్డే జట్టులో చోటు కోల్పోయాడు.

న్యూజీలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్‌లు 2005/2006[మార్చు]

టైటాన్స్ తరపున దేశవాళీ క్రికెట్‌లో బలమైన ప్రదర్శన ఇచ్చిన తరువాత, స్టెయిన్‌కు ఏప్రిల్ 2006లో న్యూజీలాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో ఆడేందుకు దక్షిణాఫ్రికా జాతీయ జట్టు నుంచి పిలుపువచ్చింది. సెంచూరియన్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో అతను ఐదు-వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు, మఖాయా ఎన్తినీతో కలిసి న్యూజీలాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు, దీంతో 248 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన ప్రత్యర్థి జట్టు 120 పరుగులకే ఆలౌట్ అయింది.[17] మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో అతను మొత్తంమీద 26.00 సగటుతో 16 వికెట్లు పడగొట్టాడు[18] ఈ టెస్ట్ సిరీస్‌లో నిలకడైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.

శ్రీలంకలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లు 2006[మార్చు]

శ్రీలంకలో ఆతిథ్య జట్టుతో జూలై మరియు ఆగస్టు 2006లో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడేందుకు వెళ్లే దక్షిణాఫ్రికా జట్టులో స్టెయిన్ చోటు దక్కించుకున్నాడు. విదేశీ గడ్డపై ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్‌ను స్టెయిన్ కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో ఆడాడు, శ్రీలంక ఈ మ్యాచ్‌లో 756-5 పరుగుల భారీ స్కోరు చేసింది, దీనిలో స్టెయిన్ 129 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు, ఈ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కరా మరియు మహేలా జయవర్దనే అత్యధిక టెస్ట్ క్రికెట్ భాగస్వామ్యాన్ని (624 పరుగులు) నెలకొల్పారు. దీనిలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 153 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది.[19] కొలంబోలోని పైకియాసోథీ శరవణముత్తు స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో స్టెయిన్ టెస్ట్‌ల్లో రెండోసారి ఐదు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు, అయితే రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు వికెట్‌లు పడగొట్టలేకపోవడంతో, శ్రీలంక ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది సిరీస్‌ను 2-0 తేడాతో చేజిక్కించుకుంది.[20] స్టెయిన్ 36.50 సగటుతో ఈ సిరీస్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.[18]

భారత్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్‌లు 2006/07[మార్చు]

భారత్‌పై స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జట్టులో కూడా స్టెయిన్ చోటు దక్కించుకున్నాడు. భారత్‌తో జోహనెస్‌బర్గ్‌లో జరిగిన తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో అతను గాయపడ్డాడు, దీంతో అతను ఈ మ్యాచ్ తరువాతి భాగంలో ఆడలేదు, అంతేకాకుండా తరువాత జరిగిన రెండో టెస్ట్‌కు కూడా ఈ కారణంగా దూరమయ్యాడు. కేప్‌టౌన్‌లో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్‌కు అతను తిరిగి జట్టుకు అందుబాటులోకి వచ్చాడు, 88 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ మ్యాచ్‌లో అతను మంచి ప్రదర్శన ఇచ్చాడు, చివరకు ఈ టెస్ట్‌లో విజయం సాధించడం ద్వారా దక్షిణాఫ్రికా సిరీస్‌ను కైవసం చేసుకుంది.[21] ఈ సిరీస్‌లో అతను 19.00 సగటుతో ఆరు వికెట్లు పడగొట్టాడు.[22]

పాకిస్థాన్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్‌లు 2006/07[మార్చు]

భారత్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో జట్టులోకి తిరిగి వచ్చి మంచి ప్రదర్శన ఇచ్చినప్పటికీ, పాకిస్థాన్‌తో జరిగిన మొదటి రెండు టెస్ట్‌లకు స్టెయిన్‌ను పక్కనబెట్టారు, పూర్తిస్థాయి-స్పిన్నర్ పాల్ హారిస్‌వైపు సెలెక్టర్లు మొగ్గుచూపడంతో అతనికి జట్టులో చోటు దక్కలేదు. మూడో టెస్ట్‌లో అతను జట్టులోకి వచ్చాడు, ఈ టెస్ట్ కేప్‌టౌన్‌లో జరిగింది, త్వరలో జరిగే 2007 క్రికెట్ ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని ఆండ్రి నెల్‌ మరియు షాన్ పొలాక్‌లకు సెలెక్టర్లు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో అతను ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఆడే అవకాశం లభించింది. ఈ మ్యాచ్‌లో అతను 87 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు, మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.[23] అతను ఈ ఒక్క మ్యాచ్‌లోనే ఆడటంతో, ఈ సిరీస్‌లో అతని సగటు 21.75 వద్ద ఉంది.[22]

అంతర్జాతీయ వన్డేలు 2007[మార్చు]

జూన్ 2007లో స్టెయిన్ దక్షిణాఫ్రికా వన్డే జట్టులో తిరిగి చోటు దక్కించుకున్నాడు, జూన్ మరియు ఆగస్టు నెలల్లో ఐర్లాండ్, భారత్ మరియు జింబాబ్వే జట్లతో జరిగిన టోర్నీలో అతను మూడు మ్యాచ్‌ల్లో ఆడాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో అతనికి మిశ్రమ ఫలితాలు వచ్చాయి, వికెట్లు దక్కినప్పటికీ, పరుగులు ఎక్కువగా సమర్పించుకున్నాడు.[24]

పాకిస్థాన్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లు 2007/2008[మార్చు]

అక్టోబరులో పాకిస్థాన్‌లో పర్యటించే టెస్ట్ జట్టులో స్టెయిన్ చోటు దక్కించుకున్నాడు, ఇక్కడ జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో అతను ఆడాడు. కరాచీలో జరిగిన మొదటి టెస్ట్‌లో పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా టెస్ట్ క్రికెట్‌లో అతను మూడోసారి ఐదు వికెట్లు పడగొట్టాడు, 424 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 263 పరుగులకే కుప్పకూలింది.[25][26] రెండో టెస్ట్‌లో స్టెయిన్ అద్భుతంగా రాణించాడు, ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో, దక్షిణాఫ్రికా సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది, ఈ సిరీస్‌ను అతను తొమ్మిది వికెట్లు పడగొట్టి 24.66 సగటుతో ముగించాడు.[27]

న్యూజీలాండ్‌తో స్వదేశంలో టెస్ట్, వన్డే, టీ20 మ్యాచ్‌లు 2007/2008[మార్చు]

స్టెయిన్ ఈ సమయానికి టెస్ట్ జట్టులో ఒక ప్రధాన ఆటగాడిగా మారాడు, న్యూజీలాండ్‌తో నవంబరులో జరిగిన టెస్ట్ సిరీస్‌లో స్టెయిన్ బౌలింగ్ ప్రదర్శన అతని క్రీడాజీవితంలో ఇప్పటివరకు అత్యుత్తమమైనదిగా పరిగణించబడుతుంది. జోహనెస్‌బర్గ్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో అతను నాలుగోసారి మరియు ఐదోసారి ఐదు వికెట్లు పడగొట్టాడు (5/35 మరియు 5/59), న్యూజీలాండ్ 358 పరుగుల తేడాతో ఓడిపోయింది, అతనికి ఇది మొదటి పది వికెట్‌ల మ్యాచ్‌గా నిలవడంతోపాటు, పరుగులపరంగా దక్షిణాఫ్రికాకు ఇది ఇప్పటివరకు అతిపెద్ద విజయంగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్ ద్వారా స్టెయిన్ మొదటిసారి టెస్ట్‌ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.[28] అతని అద్భుతమైన ఫామ్ సెంచూరియన్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో కూడా కొనసాగింది, ఈ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో అతను 4/42 ప్రదర్శన కనబర్చగా, రెండో ఇన్నింగ్స్‌లో (6/49) ఆరోసారి ఐదు వికెట్లు పడగొట్టాడు, ఫలితంగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది అతని రెండో పది వికెట్‌ల మ్యాచ్‌గా నిలిచిపోయింది, అంతేకాకుండా వరుసగా అతనికి రెండో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది[29] ఈ సిరీస్‌లో అతను 9.20 సగటుతో 20 వికెట్లు పడగొట్టడంతోపాటు, [30] మొదటి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శనతో అతను ICC టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అతను తన క్రీడా జీవితంలో మొదటిసారి తొలి ఐదు స్థానాల్లో చోటు దక్కించుకున్నాడు.[31]

న్యూజీలాండ్‌తో 2007 నవంబరు 23న జరిగిన మ్యాచ్ ద్వారా అతను ట్వంటీ-20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు, దీనిలో నాలుగు ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇవ్వడంతోపాటు స్కాట్ స్టైరిస్ వికెట్‌ను పడగొట్టాడు.[32] కేప్‌టౌన్‌లో జరిగిన మూడో వన్డేలో కూడా అతను ఆడాడు, దీనిలో అతను అంతంతమాత్రంగా రాణించాడు, న్యూజీలాండ్ ఓపెనర్‌లు బ్రెండన్ మెక్‌కలమ్ మరియు లౌ విన్సెంట్ వికెట్లను పడగొట్టాడు, అయితే తొమ్మిది ఓవర్లలో 50 పరుగులు ఇచ్చాడు.[33]

వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్, వన్డే మరియు టీ20 మ్యాచ్‌లు 2007/2008[మార్చు]

స్టెయిన్ తరువాత వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన మొదటి అంతర్జాతీయ ట్వంటీ20 మ్యాచ్‌లో ఆడాడు. ఈ మ్యాచ్‌లో అతను మూడు ఓవర్లలో తొమ్మిది పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు, ఈ నాలుగు వికెట్‌లు తిరుగులేని యార్కర్‌ల రూపంలో అతనికి దక్కాయి, వర్షం కారణంగా 13 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 59 పరుగుల లక్ష్యాన్ని చేరుకోకుండా దక్షిణాఫ్రికా బౌలర్ల నిలువరించలేకపోయారు.[34]

స్టెయిన్ ఫామ్ తరువాత జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా కొనసాగింది. పోర్ట్ ఎలిజబెత్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో అతను 188 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టాడు, దాదాపుగా రెండున్నరేళ్ల తరువాత వెస్టిండీస్ ఈ టెస్ట్‌తో తొలిసారి విజయాన్ని రుచిచూసింది, ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో స్టెయిన్ టెస్ట్ క్రికెట్‌లో తన అత్యధిక స్కోరు నమోదు చేశాడు, ఈ ఇన్నింగ్స్‌లో 33 పరుగులతో అజేయంగా నిలిచాడు.[35] కేప్‌టౌన్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో అతను 4/60 మరియు 4/44 బౌలింగ్ ప్రదర్శనతో రాణించి దక్షిణాఫ్రికా సిరీస్ సమం చేయడంలో కీలకపాత్ర పోషించాడు[36], డర్బన్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో కూడా అతను 1/18 మరియు 6/72 ప్రదర్శనతో నిర్ణయాత్మకంగా మారాడు, అతను ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్ల పడగొట్టడం ద్వారా ఇన్నింగ్స్ 100 పరుగుల తేడాతో వెస్టిండీస్ పరాజయం పాలవడంలో కీలకపాత్ర పోషించాడు.[37] ఈ సిరీస్‌లో 19.10 సగటుతో 20 వికెట్లు పడగొట్టడంతో[30] అతనికి వరుసగా రెండో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.

అతను తరువాత జరిగిన అంతర్జాతీయ వన్డే సిరీస్ మొదటి మూడు మ్యాచ్‌ల్లో ఆడాడు, అయితే టెస్ట్‌ల మాదిరిగా వీటిలో విజయవంతం కాలేకపోయాడు, పోర్ట్ ఎలిజబెత్‌లో జరిగిన మూడో వన్డేలో వికెట్ పడగొట్టలేకపోవడం మరియు పది ఓవర్లకు 62 పరుగులు ఇవ్వడంతో అతను జట్టులో చోటు కోల్పోయాడు.[38] జోహనెస్‌బర్గ్‌లో జరిగిన ఐదో మ్యాచ్ జట్టులో అతను తిరిగి చోటు దక్కించుకున్నాడు, అయితే ఈ మ్యాచ్‌లో కూడా స్టెయిన్ ఇబ్బంది పడ్డాడు, ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టి పది ఓవర్లలో 78 పరుగులు సమర్పించుకున్నాడు.[39]

బంగ్లాదేశ్‌లో టెస్ట్‌లు మరియు వన్డేలు 2007/08[మార్చు]

బంగ్లాదేశ్‌పై రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఢాకాలో జరిగిన మొదటి టెస్ట్‌లో దక్షిణాఫ్రికాను పరాజయం నుంచి స్టెయిన్ తప్పించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 192 పరుగులకే ఆలౌట్ అయింది, స్టెయిన్ 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు, దక్షిణాఫ్రికా తరువాత 170 పరుగులకే ఆలౌటవడంతో, ప్రత్యర్థులకు 22 పరుగుల ఆధిక్యం దక్కింది. అయితే స్టెయిన్ (4/48) మరియు జాక్వస్ కలీస్ (5/30) బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 182 పరుగులకు ఆలౌట్ చేశారు, దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ నాలుగో రోజు ఐదు వికెట్‌ల తేడాతో విజయం సాధించింది.[40] చిట్టగాంగ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా సంపూర్ణ విజయం సాధించింది (ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 205 పరుగుల తేడాతో నెగ్గింది) మరియు స్టెయిన్ ఈ మ్యాచ్‌లో 4/66 మరియు 3/35 బౌలింగ్ ప్రదర్శన ఇచ్చాడు[41], ఈ సిరీస్‌లో 12.57 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు[30] దీంతో అతనికి వరుసగా మూడో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో (తన 20వ మ్యాచ్‌లో) జునైద్ సిద్దిఖీని స్టెయిన్ అవుట్ చేయడం ద్వారా అతను టెస్ట్ క్రికెట్‌లో వందో వికెట్‌ను దక్కించుకున్నాడు, దీంతో అత్యంత వేగంగా వంద పరుగుల మైలురాయిని చేరుకున్న దక్షిణాఫ్రికా బౌలర్‌గా అతను హగ్ టైఫీల్డ్ రికార్డును (21 మ్యాచ్‌లు) అధిగమించాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ ఆడుతున్నవారిలో అత్యంత వేగంగా వంద పరుగుల మైలురాయి చేరుకున్న క్రికెటర్‌గా కూడా అతని పేరిట రికార్డు ఉంది.[1]

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో స్టెయిన్ ఆడాడు, దీనిలో వికెట్ దక్కకపోయినప్పటికీ, ఎనిమిది ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు.[42]

భారత్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లు 2007/08[మార్చు]

భారత్‌తో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభంలో స్టెయిన్ ప్రభావంపై మిశ్రమ స్పందనలు వచ్చాయి, కొందకు వ్యాఖ్యాతలు దక్షిణాఫ్రికా జట్టులో అతడిని ఒక కీలక ఆటగాడిగా గుర్తించారు, అతడి నుంచి భారత్‌కు తీవ్రమైన సవాలు ఎదురువుతుందని అభిప్రాయపడ్డారు, [43] ఇతరులు మాత్రం జీవంలేని ఉపఖండ పిచ్‌లపై బలమైన బ్యాటింగ్ లైనప్‌తో ఆడటానికి అతను ఇబ్బంది పడతాడని జోస్యం చెప్పారు.[44]

చెన్నైలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది, దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి 540 పరుగులు చేసింది, భారత్ కూడా దీనికి దీటుగా స్పందించింది, వీరేంద్ర సెహ్వాగ్ 304 బంతుల్లో 319 పరుగులు చేయడంతో భారత్ స్కోరు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 468/1కు చేరుకుంది. నాలుగో రోజు స్టెయిన్ భారత్ ఆధిక్యాన్ని 87 పరుగులకే పరిమితం చేయడంలో సాయపడ్డాడు, ధోనీని ఒక బౌన్సర్‌తో అవుట్ చేసిన స్టెయిన్ తరువాత కింది వరుస బ్యాట్స్‌మెన్‌ను వెంటవెంటనే అవుట్ చేశాడు, రెండు ఓవర్‌లలో రెండు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు, వీరందరూ స్టెయిన్ వేసిన రివర్స్ స్వింగ్ బంతులతో బౌల్డ్ అయ్యారు. అతను ఇన్నింగ్స్‌కు ముగింపు పలకడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది, ఈ మ్యాచ్‌లో స్టెయిన్ 103 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్‌లు పడగొట్టాడు.[45] అహ్మదాబాద్‌లో జరిగిన రెండో టెస్ట్ ఉదయం సెషన్‌లోనే దక్షిణాఫ్రికా భారత్ బ్యాట్స్‌మెన్‌ను ఇరవై ఓవర్లకే పెవీలియన్ దారిపట్టించింది, భారత్ స్కోరు 76 పరుగులే కావడం గమనార్హం. భారత్‌ను ఆలౌట్ చేయడంలో స్టెయిన్ కీలకపాత్ర పోషించాడు, అతను 23 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు నేలకూల్చాడు, సెహ్వాగ్ మరియు రాహుల్ ద్రావిడ్, ఆపై చివరి ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ను 11 పరుగులు మాత్రమే ఇచ్చి అవుట్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతను మరో మూడు వికెట్‌లు పడగొట్టి, మ్యాచ్‌లో తన వికెట్‌ల సంఖ్యను మరింత పెంచుకున్నాడు, ఈ మ్యాచ్‌లో అతను 114 పరుగులు ఇచ్చి మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టాడు, మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 90 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది [46] కాన్పూర్‌లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో స్టెయిన్ మొదటి ఇన్నింగ్స్‌లో మరో మూడు వికెట్లు పడగొట్టాడు, దీంతో అతనికి ఈ సిరీస్‌లో 20.20 సగటుతో మొత్తం 15 వికెట్లు దక్కాయి. దీని ఫలితంగా, 2007/08 సీజన్ మొత్తంమీద అతను 11 మ్యాచ్‌లు ఆడి 75 వికెట్లు దక్కించుకున్నాడు, దీంతో స్టెయిన్ ICC టెస్ట్ మ్యాచ్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మరో ఆటగాడితో సంయుక్తంగా మొదటి స్థానాన్ని (ముత్తయ మురళీధరన్) పంచుకున్నాడు [47]

ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ 2008/2009[మార్చు]

జనవరి 2009లో, అడిలైడ్ ఒవెల్‌లో బంతితో కసరత్తు చేస్తున్న స్టెయిన్

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండో టెస్ట్ మ్యాచ్‌లో స్టెయన్ జేపీ డుమ్నీతో కలిసి తొమ్మిదో వికెట్‌కు 180 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో స్టెయిన్ 76 (191 బంతుల్లో) పరుగులు చేశాడు, ఈ భాగస్వామ్యంతో దక్షిణాఫ్రికా 6-141 స్కోరు నుంచి పుంజుకొని 459 పరుగులు చేయగలిగింది. స్టెయిన్ మొదటి ఇన్నింగ్స్‌లో 5-87 (29.0 ఓవర్లు) బౌలింగ్ ప్రదర్శనతో కూడా ఆకట్టుకున్నాడు.[48] రెండో ఇన్నింగ్స్‌లో కూడా తిరిగి సత్తా చాటిన స్టెయిన్ 5-67 (20.2 ఓవర్లు) బౌలింగ్ ప్రదర్శన ఇచ్చాడు, దీంతో దక్షిణాఫ్రికా ఆతిథ్య ఆస్ట్రేలియన్‌లను 247 పరుగులకే కట్టడి చేసింది, దీంతో వారి ఆధిక్యత 183 పరుగులకే పరిమితమైంది. స్టెయిన్ మ్యాచ్ గణాంకాలు 10-154.[49] అతను తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో ఒకే మ్యాచ్‌లో పది వికెట్‌లు పడగొట్టడం ఇది మూడోసారి. దక్షిణాఫ్రికా తక్కువ విజయలక్ష్యాన్ని తొమ్మిది వికెట్‌లు మిగిలివుండగానే ఛేదించింది, దీంతో వారికి 2-0 ఆధిక్యం లభించడంతోపాటు, ఆస్ట్రేలియాలో మొదటసారి దక్షిణాఫ్రికాకు టెస్ట్ సిరీస్ విజయం దక్కింది. అంతేకాకుండా గత 16 ఏళ్లలో ఆస్ట్రేలియా స్వదేశంలో సిరీస్‌ను కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ ప్రదర్శనకు స్టెయిన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు విజయ యత్నాన్ని అడ్డుకోవడంలో కూడా స్టెయిన్ కీలకపాత్ర పోషించాడు, మఖాయ ఎన్తినీతో కలిసి మ్యాచ్‌ను డ్రా చేసేందకు 105 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు, దీనిలో స్టెయిన్ 65 బంతులు ఎదుర్కొని 28 పరుగులు చేశాడు. మరో మరో 50 బంతులు ఎదుర్కోవాల్సి ఉన్న తరుణంలో స్టెయిన్ అవుటయ్యాడు, దీంతో గాయపడిన కెప్టెన్ గ్రేమ్ స్మిత్ పగిలిన చేతితోనే బరిలో దిగి జట్టు ఆలౌట్ కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. స్మిత్‌ను చివరకు మరో పది బంతులు మిగిలివుండగా మిచెల్ జాన్సన్ బౌల్డ్ చేశాడు.

వెస్టిండీస్‌లో జరిగిన టెస్ట్‌లు 2010[మార్చు]

2010 సిరీస్‌లో విండీస్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా సునాయాసంగా విజయం సాధించింది, స్టెయిన్ సులీమెన్ బెన్‌ను బౌల్డ్ చేయడం (ఆఫ్ స్టంప్) ద్వారా ఈ మ్యాచ్‌లో తన 200వ వికెట్ చేజిక్కించుకున్నాడు. అంతేకాకుండా ఈ వికెట్ ద్వారా అతను తన టెస్ట్ క్రికెట్ జీవితంలో 14వసారి ఐదు వికెట్‌లు పడగొట్టాడు - స్టెయిన్ కేవలం 38 మ్యాచ్‌లలోనే 200 వికెట్‌ల మైలురాయిని రికార్డు సృష్టించాడు.

సాధనలు మరియు రికార్డులు[మార్చు]

టెస్ట్‌ల్లో ఐదు-వికెట్‌ల ఇన్నింగ్స్‌లు[మార్చు]

టెస్ట్‌ల్లో ఐదు-వికెట్‌ల ఇన్నింగ్స్‌లు
సంఖ్య గణాంకాలు మ్యాచ్ ప్రత్యర్థి నగరం/దేశం వేదిక సీజన్
1 5/47 4 న్యూజీలాండ్ సెంచూరియన్, S.A. సూపర్‌స్పోర్ట్ పార్క్ 2005/06
2 5/82 8 శ్రీలంక కొలంబో, శ్రీలంక పి శరవణముత్తు స్టేడియం 2006
3 5/56 12 పాకిస్థాన్ కరాచీ, పాకిస్థాన్ నేషనల్ స్టేడియం 2006/07
4 5/34 14 న్యూజీలాండ్ జోహనెస్‌బర్గ్, S.A. న్యూ వాండరర్స్ స్టేడియం 2007/08
5 5/59 14 న్యూజీలాండ్ జోహనెస్‌బర్గ్, S.A. న్యూ వాండరర్స్ స్టేడియం 2007/08
6 6/49 15 న్యూజీలాండ్ సెంచూరియన్, S.A. సూపర్‌స్పోర్ట్ పార్క్ 2007/08
7 6/72 18 వెస్టిండీస్ డర్బన్, S.A. కింగ్స్‌మీడ్ 2007/08
8 5/23 22 భారత్ అహ్మదాబాద్, భారత్ అహ్మదాబాద్ 2007/08
9 5/87 28 ఆస్ట్రేలియా మెల్బోర్న్, ఆస్ట్రేలియా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ 2008/09
10 5/67 28 ఆస్ట్రేలియా మెల్బోర్న్, ఆస్ట్రేలియా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ 2008/09
11 7/51 37 భారత్ నాగ్‌పూర్, భారత్ విదర్భా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 2009/10
12 5/29 38 వెస్టిండీస్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్, వెస్టిండీస్ క్వీన్స్ పార్క్ ఒవెల్ 2010

టెస్ట్‌ల్లో పది వికెట్‌లు సాధించిన మ్యాచ్‌లు[మార్చు]

టెస్ట్‌ల్లో పది వికెట్‌ల మ్యాచ్‌లు
సంఖ్య మ్యాచ్ గణాంకాలు మ్యాచ్ ప్రత్యర్థి నగరం/దేశం వేదిక సీజన్
1 10/93 14 న్యూజీలాండ్ జోహనెస్‌బర్గ్, S.A. న్యూ వాండరర్స్ స్టేడియం 2007/08
2 10/91 15 న్యూజీలాండ్ సెంచూరియన్, S.A. సూపర్‌స్పోర్ట్ పార్క్ 2007/08
3 10/154 28 ఆస్ట్రేలియా మెల్బోర్న్, ఆస్ట్రేలియా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ 2008/09
4 10/108 37 భారత్ నాగ్‌పూర్, భారత్ విదర్భా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 2009/10

టెస్ట్‌ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు[మార్చు]

టెస్ట్‌ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు
సంఖ్య మ్యాచ్ బౌలింగ్ గణాంకాలు మ్యాచ్ బ్యాటింగ్ గణాంకాలు మ్యాచ్ ప్రత్యర్థి నగరం/దేశం వేదిక సీజన్
1 5/34 మరియు 5/59 13 మరియు బ్యాటింగ్ చేయలేదు 14 న్యూజీలాండ్ జోహనెస్‌బర్గ్, S.A. న్యూ వాండరర్స్ స్టేడియం 2007/08
2 4/42 మరియు 6/49 25 మరియు బ్యాటింగ్ చేయలేదు 15 న్యూజీలాండ్ సెంచూరియన్, S.A. సూపర్‌స్పోర్ట్ పార్క్ 2007/08
3 5/87 మరియు 5/67 76 మరియు బ్యాటింగ్ చేయలేదు 28 ఆస్ట్రేలియా మెల్బోర్న్, ఆస్ట్రేలియా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ 2008/09

టెస్ట్‌ల్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు[మార్చు]

టెస్ట్‌ల్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు
సంఖ్య మ్యాచ్‌లు సిరీస్ వికెట్‌లు మరియు బౌలింగ్ సగటు సిరీస్ పరుగులు మరియు బ్యాటింగ్ సగటు ప్రత్యర్థి దేశం సీజన్
1 2 20 వికెట్‌లు, సగటు 9.20 38 పరుగులు, సగటు 19.00 న్యూజీలాండ్ దక్షిణాఫ్రికా 2007/08
2 3 20 వికెట్‌లు, సగటు 19.10 59 పరుగులు, సగటు 29.50 వెస్టిండీస్ దక్షిణాఫ్రికా 2007/08
3 2 14 వికెట్‌లు, సగటు 12.57 7 పరుగులు, సగటు 7.00 బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ 2007/08

ఇతరాలు[మార్చు]

100 వికెట్‌ల మైలురాయిని వేగంగా చేరుకున్న దక్షిణాఫ్రికా బౌలర్‌గా స్టెయిన్ రికార్డు సృష్టించాడు, అతను ఈ ఘనతను 2008 మార్చి 2న తన 20వ మ్యాచ్‌లో సాధించాడు.

టెస్ట్ మ్యాచ్‌ల్లో వేగంగా 150 వికెట్‌లు పడగొట్టిన దక్షిణాఫ్రికా బౌలర్‌లో స్టెయిన్ రెండో స్థానంలో ఉన్నాడు, మొదటి స్థానంలో హగ్ టాయ్‌ఫీల్డ్ ఉన్నాడు, అతను ఈ రికార్డును తన 29వ మ్యాచ్‌లో సాధించాడు.[50]

టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ స్ట్రైక్ రేట్ గల బౌలర్ల జాబితాలో అతను ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు, మొదటి మూడు స్థానాల్లో జార్జి లోమాన్, జాన్ ఫెర్రిస్ మరియు షేన్ బాండ్ ఉన్నారు.[51]

సూచనలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
 1. 1.0 1.1 [1] మ్యాచెస్ టేకెన్ టు రీచ్ 100 వికెట్స్ ఇన్ టెస్ట్స్. క్రిక్‌ఇన్ఫో, సేకరణ తేదీ 26 మార్చి 2008
 2. [2] బెస్ట్ టెస్ట్ కెరీర్ రేట్స్. క్రిక్‌ఇన్ఫో, సేకరణ తేదీ 6 ఏప్రిల్ 2008
 3. http://stats.cricinfo.com/statsguru/engine/player/47492.html?class=1;template=results;type=bowling
 4. http://content-nz.cricinfo.com/southafrica/content/player/47492.html
 5. [3] స్వింగింగ్ విత్ డేల్ స్టెయిన్ . క్రిక్‌ఇన్ఫో, సేకరణ తేదీ 26 మార్చి 2008
 6. [4] డేల్ స్టెయిన్ రాక్స్ ఇండియా విత్ రివర్స్ స్వింగ్ . ది నమీబియన్, సేకరణ తేదీ 9 ఫిబ్రవరి 2010
 7. [5] పేస్ ఈజ్ బ్యాక్ . క్రిక్‌ఇన్ఫో, సేకరణ తేదీ 26 మార్చి 2008
 8. 8.0 8.1 [6] లిస్ట్ ఆఫ్ ఫస్ట్-క్లాస్ బౌలింగ్ పెర్ఫామెన్స్ బై టీమ్. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 25 మార్చి 2008
 9. [7] లిస్ట్ ఆఫ్ ఫస్ట్-క్లాస్ బౌలింగ్ పెర్ఫామెన్స్ బౌ సీజన్. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 25 మార్చి 2008
 10. [8] హౌ ది టీమ్స్ స్టేక్ అప్ . క్రిక్‌ఇన్ఫో, సేకరణ తేదీ 25 మార్చి 2008
 11. [9] సౌతాఫ్రికా vs ఇంగ్లండ్, 1st టెస్ట్, ఎట్ పోర్ట్ ఎలిజబెత్, 17th-21st డిసెంబర్ 2004. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 25 మార్చి 2008
 12. [10] లిస్ట్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ బౌలింగ్ బై సీజన్. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 25 మార్చి 2008
 13. [11] సౌతాఫ్రికా vs ఇంగ్లండ్, 4th టెస్ట్, ఎట్ జోహనెస్‌బర్గ్, 13th-17th జనవరి 2005. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 25 మార్చి 2008
 14. [12] ఆఫ్రికన్ XI vs ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ XI, 1st వన్డే, ఎట్ సెంచూరియన్, 17th ఆగస్టు 2005. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 25 మార్చి 2008
 15. [13] ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా, VB సిరీస్ 2005-06 4th మ్యాచ్, ఎట్ మెల్బోర్న్, 20 జనవరి 2006. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 25 మార్చి 2008
 16. [14] సౌతాఫ్రికా vs శ్రీలంక, VB సిరీస్ 2005-06 12th మ్యాచ్, ఎట్ హోబర్ట్, 7 ఫిబ్రవరి 2006. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 25 మార్చి 2008
 17. [15] సౌతాఫ్రికా vs న్యూజీలాండ్, 1st టెస్ట్, ఎట్ సెంచూరియన్, 15th-19th ఏప్రిల్ 2006. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 25 మార్చి 2008
 18. 18.0 18.1 [16] లిస్ట్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ బౌలింగ్ పెర్ఫామెన్స్ బై సీజన్. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 25 మార్చి 2008
 19. [17] శ్రీలంక vs సౌతాఫ్రికా, 1st టెస్ట్, ఎట్ కొలంబో, 27th-31st జులై 2006. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 25 మార్చి 2008
 20. [18] శ్రీలంక vs సౌతాఫ్రికా, 2nd టెస్ట్, ఎట్ కొలంబో, 4th-8th ఆగస్టు 2006. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 25 మార్చి 2008
 21. [19] సౌతాఫ్రికా vs ఇండియా, 3th టెస్ట్, ఎట్ కేప్‌టౌన్, 2nd-6th జనవరి 2007. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 25 మార్చి 2008
 22. 22.0 22.1 [20] లిస్ట్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ బౌలింగ్ పెర్ఫామెన్స్ బై సీజన్. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 25 మార్చి 2008
 23. [21] సౌతాఫ్రికా vs పాకిస్థాన్, 3rd టెస్ట్, ఎట్ కేప్‌టౌన్, 26th-28th జనవరి 2007. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 25 మార్చి 2008
 24. [22] లిస్ట్ ఆఫ్ వన్డే మ్యాచ్ బౌలింగ్ పెర్ఫామెన్స్ బై సీజన్. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 26 మార్చి 2008
 25. [23] పాకిస్థాన్ vs సౌతాఫ్రికా, 1st టెస్ట్, ఎట్ కరాచీ, 1st-5th అక్టోబరు 2007. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 26 మార్చి 2008
 26. [24] పాకిస్థాన్ vs సౌతాఫ్రికా, 1st టెస్ట్, ఎట్ కరాచీ, 1st-5th అక్టోబరు 2007. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 26 మార్చి 2008
 27. [25] లిస్ట్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ బౌలింగ్ పెర్ఫామెన్స్ బై సీజన్. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 26 మార్చి 2008
 28. [26] సౌతాఫ్రికా vs న్యూజీలాండ్, 1st టెస్ట్, ఎట్ జోహనెస్ బర్గ్, 8th-11th నవంబరు 2007. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 26 మార్చి 2008
 29. [27] సౌతాఫ్రికా vs న్యూజీలాండ్, 2nd టెస్ట్, ఎట్ సెంచూరియన్, 16th-18th నవంబరు 2007. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 26 మార్చి 2008
 30. 30.0 30.1 30.2 [28] లిస్ట్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ బౌలింగ్ పెర్ఫామెన్స్ బై సీజన్. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 26 మార్చి 2008
 31. [29] లీ అండ్ స్టెయిన్ ఎమాంగ్ ది టాప్ ఫైవ్ టెస్ట్ బౌలర్స్ , క్రిక్‌ఇన్ఫో, సేకరణ తేదీ 25 మార్చి 2008
 32. [30] సౌతాఫ్రికా vs న్యూజీలాండ్, ఓన్లీ T20I, ఎట్ జోహనెస్‌బర్గ్, 23 నవంబరు 2007. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 26 మార్చి 2008
 33. [31] సౌతాఫ్రికా vs న్యూజీలాండ్, 3rd వన్డే, ఎట్ కేప్‌టౌన్, 2 డిసెంబరు 2007. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 26 మార్చి 2008
 34. [32] సౌతాఫ్రికా vs వెస్టిండీస్, 1st T20I, ఎట్ పోర్ట్ ఎలిజబెత్. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 26 మార్చి 2008
 35. [33] సౌతాఫ్రికా vs వెస్టిండీస్, 1st టెస్ట్, ఎట్ పోర్ట్ ఎలిజబెత్, 26th-29th డిసెంబరు 2007. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 26 మార్చి 2008
 36. [34] సౌతాఫ్రికా vs వెస్టిండీస్, 2nd టెస్ట్, ఎట్ కేప్ టౌన్, 2nd-5th జనవరి 2008. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 26 మార్చి 2008
 37. [35] సౌతాఫ్రికా vs వెస్టిండీస్, 3rd టెస్ట్, ఎట్ డర్బన్, 10th-12th జనవరి 2008. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 26 మార్చి 2008
 38. [36] సౌతాఫ్రికా vs వెస్టిండీస్, 3rd వన్డే, ఎట్ పోర్ట్ ఎలిజబెత్, 27th జనవరి 2008. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 26 మార్చి 2008
 39. [37] సౌతాఫ్రికా vs వెస్టిండీస్, 5th ODI, ఎట్ జోహనెస్‌బర్గ్, 3 ఫిబ్రవరి 2008. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 26 మార్చి 2008
 40. [38] బంగ్లాదేశ్ vs సౌతాఫ్రికా, 1st టెస్ట్, ఎట్ ఢాకా, 22nd-25th ఫిబ్రవరి 2008. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 26 మార్చి 2008
 41. [39] బంగ్లాదేశ్ vs సౌతాఫ్రికా, 2nd టెస్ట్, ఎట్ చిట్టగాంగ్, 19th ఫిబ్రవరి-3rd మార్చి 2008. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 26 మార్చి 2008
 42. [40] బంగ్లాదేశ్ vs సౌతాఫ్రికా, 3rd వన్డే, ఎట్ ఢాకా, 14th మార్చి 2008. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 26 మార్చి 2008
 43. [41] స్టెయిన్ విల్ వరీ ఇండియన్ టాప్ ఆర్డర్ - వెసెల్స్ . క్రిక్‌ఇన్ఫో, సేకరణ తేదీ 30 మార్చి 2008
 44. [42] స్టెయిన్ సెట్స్ హిజ్ సైట్స్ ఆన్ ఇండియా . క్రిక్‌ఇన్ఫో, సేకరణ తేదీ 30 మార్చి 2008
 45. [43] భారత్ vs సౌతాఫ్రికా, 1st టెస్ట్, ఎట్ చెన్నై, 26th-30th మార్చి 2008. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 30 మార్చి 2008
 46. [44] భారత్ vs సౌతాఫ్రికా, 2nd టెస్ట్, ఎట్ అహ్మదాబాద్, 3rd-5th ఏప్రిల్ 2008. క్రికెట్ ఆర్కైవ్, సేకరణ తేదీ 6 ఏప్రిల్ 2008
 47. [45] స్టెయిన్ రీచెస్ నెం.1 ఇన్ టెస్ట్ ర్యాంకింగ్స్ . క్రిక్‌ఇన్ఫో, సేకరణ తేదీ 18 ఏప్రిల్ 2008
 48. http://content-nz.cricinfo.com/ausvrsa2008_09/engine/match/351682.html
 49. "South Africa close on series win". BBC News. 29 December 2008. Retrieved 30 April 2010.
 50. cricinfo.com (2009-01-13). "Fastest to 150 wickets". cricinfo.com. cricinfo.com. Retrieved 2009-01-13.
 51. cricinfo.com (2009-01-13). "Best career strike rate". cricinfo.com. cricinfo.com. Retrieved 2009-01-13.