డేవిడ్ వార్నర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డేవిడ్ వార్నర్
ప్రాక్టీసులో వార్నర్
2014 లో వార్నర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డేవిడ్ ఆండ్రూ వార్నర్
పుట్టిన తేదీ (1986-10-27) 1986 అక్టోబరు 27 (వయసు 37)
పాడింగ్టన్, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా
మారుపేరుLloyd,[1] the Reverend, Bull,[2] Pocket Size Dynamite
ఎత్తు170 cm (5 ft 7 in)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుRight arm లెగ్ బ్రేక్
పాత్రOpening batter
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 426)2011 డిసెంబరు 1 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు2023 జూలై 27 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 170)2009 జనవరి 18 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 7 March - దక్షిణాఫ్రికా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.31
తొలి T20I (క్యాప్ 32)2009 జనవరి 11 - దక్షిణాఫ్రికా తో
చివరి T20I2022 నవంబరు 4 - Afghanistan తో
T20Iల్లో చొక్కా సంఖ్య.31
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006/07–2020/21New South WaIes
2009–2013, 2022–presentఢిల్లీ డేర్ డెవిల్స్
2009డర్హమ్‌
2010మిడిల్‌సెక్స్
2010/11నార్దర్న్ డిస్ట్రిక్ట్స్
2011/12; 2013/14; 2022/23సిడ్నీ థండర్
2012/13Sydney Sixers
2014–2021సన్ రైజర్స్ హైదరాబాద్
2018St Lucia Stars
2019Sylhet Sixers
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు టి20 ఫక్లా
మ్యాచ్‌లు 109 142 99 140
చేసిన పరుగులు 8,487 6,030 2,894 10,966
బ్యాటింగు సగటు 44.43 45.00 32.88 45.50
100లు/50లు 25/36 19/27 1/24 33/45
అత్యుత్తమ స్కోరు 335* 179 100* 335*
వేసిన బంతులు 342 6 595
వికెట్లు 4 0 6
బౌలింగు సగటు 67.25 75.83
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/45 2/45
క్యాచ్‌లు/స్టంపింగులు 85/– 62/– 56/– 102/–
మూలం: ESPNcricinfo, 20 June 2023

డేవిడ్ ఆండ్రూ వార్నర్ (జననం 1986 అక్టోబరు 27) ఆస్ట్రేలియన్ అంతర్జాతీయ క్రికెటరు, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఆస్ట్రేలియన్ జాతీయ జట్టు మాజీ కెప్టెన్, మాజీ టెస్టు వైస్ కెప్టెన్. ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాటరు. వార్నర్ 132 సంవత్సరాలలో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అనుభవం లేకుండా ఏ ఫార్మాట్‌లోనైనా జాతీయ జట్టుకు ఎంపికైన మొట్ట మొదటి ఆస్ట్రేలియా క్రికెటర్. అతను న్యూ సౌత్ వేల్స్ తరపున ఆడుతున్నాడు. ప్రస్తుతం దేశీయ క్రికెట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, సిడ్నీ థండర్ తరపున ఆడుతున్నాడు. వార్నర్ 2015 క్రికెట్ ప్రపంచ కప్, 2023 ICC వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2021 T20 ప్రపంచ కప్‌లో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టులో ప్రముఖ సభ్యుడు. 2021 టి20 కప్‌లో అతని ప్రదర్శనల ఫలితంగా అతను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు.

2017 జనవరిలో, అతను అలన్ బోర్డర్ మెడల్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు గెలుచుకున్న నాల్గవ ఆటగాడు అయ్యాడు. వరుసగా రెండు సంవత్సరాలలో కూడా అవార్డును గెలుచుకున్నాడు. 2017 సెప్టెంబరు 28న, అతను తన 100వ వన్‌డేలో ఆడాడు. అతని 100వ వన్‌డేలో సెంచరీ చేసిన ఆస్ట్రేలియా తరపున మొదటి బ్యాటరుగా, 8వ బ్యాటరుగా నిలిచాడు.

2018 మార్చిలో, దక్షిణాఫ్రికాతో జరిగిన తమ టెస్టు సిరీస్‌లోని మూడవ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు బాల్ ట్యాంపరింగ్‌పై ప్రాథమిక విచారణ తర్వాత, ఆటకు చెడ్డపేరు తెచ్చినందుకు అతనిపై అభియోగాలు మోపబడి సస్పెండయ్యాడు. [3] 2018 మార్చి 28న జరిగిన బోర్డ్ మీటింగ్ తరువాత, క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్‌ని ఆస్ట్రేలియాలోని అన్ని అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌ల నుండి ఒక సంవత్సరం పాటూ, ఎటువంటి నాయకత్వ పదవులు పొందకిఉండా శాశ్వతంగానూ నిషేధించింది. [4]


2019 నవంబరులో, వార్నర్ పాకిస్తాన్‌పై 335 నాటౌట్‌తో ఆస్ట్రేలియా టెస్టు బ్యాట్స్‌మెన్‌లలో రెండవ అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించాడు. గార్ఫీల్డ్ సోబర్స్, మార్క్ టేలర్, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత పాకిస్తాన్‌పై టెస్టు మ్యాచ్ ట్రిపుల్ సెంచరీ చేసిన నాల్గవ వ్యక్తిగా నిలిచాడు. [5]

జీవితం తొలి దశలో

[మార్చు]

డేవిడ్ వార్నర్ 1986 అక్టోబరు 27న తూర్పు సిడ్నీ శివారు ప్రాంతమైన పాడింగ్టన్లో జన్మించాడు.[6] 13 సంవత్సరాల వయస్సులో అతని కోచ్ కుడి చేతి బ్యాటింగ్ కు మారమని చెప్పాడు. అయితే అతని తల్లి లోరైన్ వార్నర్ ఎడమచేతి వాటం బ్యాటింగ్ కు తిరిగి రావాలని అతనిని ప్రోత్సహించింది. అతను సిడ్నీ కోస్టల్ క్రికెట్ క్లబ్ కోసం అండర్ - 16 రన్ స్కోరింగ్ రికార్డును బద్దలు కొట్టాడు.[7] 15 సంవత్సరాల వయస్సులో ఈస్టర్న్ సబర్బ్స్ క్లబ్ కోసం మొదటి గ్రేడ్ రంగప్రవేశం చేశాడు. తరువాత ఆస్ట్రేలియన్ అండర్ - 19 లతో శ్రీలంకలో పర్యటించాడు. రాష్ట్ర జట్టుతో రూకీ కాంట్రాక్టును సంపాదించాడు.[7][8] వార్నర్ మాట్రావిల్లే పబ్లిక్ స్కూల్, రాండ్విక్ బాయ్స్ హైస్కూల్లో చదివాడు.[9]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

అడుగిడిన తొలినాళ్ళు

[మార్చు]
2009లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 అంతర్జాతీయ రంగప్రవేశంలో వార్నర్

వార్నర్ 2009 జనవరి 11న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ట్వంటీ20 ఇంటర్నేషనల్‌లో ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు. 1877 తర్వాత ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఆడకుండా ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన మొదటి వ్యక్తి వార్నర్. [10] అతను వెంటనే ప్రభావం చూపాడు, 43 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు, ఇందులో ట్వంటీ 20 అంతర్జాతీయ చరిత్రలో అప్పటి రెండో అత్యంత వేగమైన యాభై కూడా ఉంది. [11] అతని 89, ట్వంటీ 20 అంతర్జాతీయ రంగప్రవేశంలో రెండవ అత్యధిక స్కోరు. [12]

షేన్ వాట్సన్‌కు గాయం అవడంతో అతను, ట్రాన్స్-టాస్మాన్ ట్రోఫీ మొదటి టెస్ట్‌లో బ్రిస్బేన్, క్వీన్స్‌లాండ్‌లో న్యూజిలాండ్‌తో 2011 డిసెంబరు 1 న తన తొలి టెస్టు ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతను నాలుగు బంతుల్లో నాటౌట్ 12 పరుగులు చేశాడు. మిడ్ ఆన్ ద్వారా పుల్ షాట్‌తో విజయానికి అవసరమైజ్న పరుగులు చేశాడు.


2010 ఫిబ్రవరి 23న, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన ట్వంటీ20 ఇంటర్నేషనల్ ఆడుతూ, అతను కేవలం 29 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అతని 50 పరుగులు కేవలం 18 బంతుల్లోనే వచ్చాయి, అతని 19 పరుగుల పాత రికార్డును బద్దలు కొట్టాడు. [13]

రికార్డులు, విజయాలు

[మార్చు]

వార్నర్, 132 సంవత్సరాలలో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఏ అనుభవమూ లేకుండా, ఏ ఫార్మాట్‌లోనైనా జాతీయ జట్టుకు ఎంపికైన మొదటి ఆస్ట్రేలియా క్రికెటర్. [14] ఒకటి కంటే ఎక్కువసార్లు అలన్ బోర్డర్ పతకాన్ని గెలుచుకున్న నాల్గవ ఆటగాడు. వరుసగా రెండు సంవత్సరాలలో ఆ అవార్డును గెలుచుకున్నది కూడా అతడే.[15] ఒక క్యాలెండర్ సంవత్సరంలో 7 వన్డే సెంచరీలు సాధించిన తొలి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.[16]

వార్నర్, షేన్ వాట్సన్‌లు భాగస్వామ్యంలో 1108 పరుగులతో T20I చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా నిలిచారు (T20Iలలో ఓపెనర్లు చేసిన అత్యధిక భాగస్వామ్యం). టీ20ల్లో, 1000కి పైగా పరుగులు చేసిన ఏకైక ఓపెనింగ్ జోడీ కూడా వీరే. [17] వార్నర్, వాట్సన్‌లు ఇద్దరూ కలిసి T20I చరిత్రలో 1154 పరుగులు చేశారు. T20I చరిత్రలో ఏ జోడీ చేసిన అత్యధిక పరుగులు అవి.[18] వార్నర్ 1,500 T20I పరుగులు చేసిన మొదటి ఆస్ట్రేలియా ఆటగాడు, ప్రపంచంలో ఆరో ఆటగాడు. [19]

వార్నర్ WACAలో మూడు సెంచరీలు సాధించిన మొదటి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. టెస్టుల్లో అతని టాప్ స్కోర్లు రెండూ ఇదే స్టేడియంలో సాధించాడు. అతని అత్యధిక స్కోరు 253, అదే టెస్టు మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ అధిగమించిన రెండవ అత్యధిక వ్యక్తిగత స్కోరు అది. రాస్ టేలర్ 290 పరుగులు చేసి, ఆ స్కోరును అధిగమించాడు. [20] [21]

2015 నవంబరు 7 న, వార్నర్ టెస్టు క్రికెట్ చరిత్రలో సునీల్ గవాస్కర్, రికీ పాంటింగ్ తర్వాత మూడు సార్లు టెస్టు మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల లోనూ సెంచరీలు చేసిన మూడవ బ్యాట్స్‌మెన్ అయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తదుపరి టెస్టు మ్యాచ్‌లో, WACA, పెర్త్‌లో తన తొలి టెస్టు డబుల్ సెంచరీని,[22] న్యూజిలాండ్‌పై వరుసగా నాలుగో సెంచరీనీ సాధించాడు. [23]

2016లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్‌తో జరిగిన ఐదో వన్డేలో సెంచరీ సాధించిన వార్నర్

అదే మ్యాచ్‌లో వార్నర్, తన కెరీర్‌లో రెండుసార్లు వరుసగా మూడు టెస్టు సెంచరీలు సాధించిన రికార్డు నెలకొల్పాడు. న భారత ఆటగాడు సునీల్ గవాస్కర్ తర్వాత టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండవ ఓపెనర్‌గా నిలిచాడు. ఆడమ్ గిల్‌క్రిస్టు తర్వాత వరుసగా మూడు సెంచరీలు చేసిన ఏకైక ఆస్ట్రేలియన్ (వార్నర్ ఘనత సాధించాడు. కేవలం 13 నెలల్లోనే రెండుసార్లు చేశాడు) అతడు. [23] 4వ వేగవంతమైన ఆసీస్ బ్యాట్స్‌మన్‌గా తన 4,000 టెస్టు కెరీర్‌లను పూర్తి చేశాడు. మొదటి మూడు స్థానాల్లో వరుసగా దిగ్గజ డాన్ బ్రాడ్‌మాన్, మాథ్యూ హేడెన్, నీల్ హార్వే ఉన్నారు. [24] [25]

2017 జనవరి 3న, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్‌తో ఆడుతున్నప్పుడు, విక్టర్ ట్రంపర్, చార్లీ మాకార్ట్నీ, డాన్ బ్రాడ్‌మాన్, మజిద్ ఖాన్ తర్వాత టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు భోజనానికి ముందు సెంచరీ చేసిన ఐదవ క్రికెటర్ అయ్యాడు. ఐదుగురిలో, అతను ఆస్ట్రేలియాలో అలా చేసిన మొదటి వ్యక్తి. [26]

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో, జట్టుకు వేగంగా పరుగులు అవసరం కావడంతో, వార్నర్ వేగంగా 23 బంతుల్లో హాఫ్ సెంచరీని సాధించాడు, ఇది సార్వకాలిక వేగవంతమైన రెండవ టెస్టు ఫిఫ్టీగా, ఈ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియన్‌కి అత్యంత వేగవంతమైనదిగా నిలిచింది. పాకిస్తాన్‌తో జరగాల్సిన ఐదు వన్‌డేలలో, వార్నర్ ఆరంభంలో నెమ్మదిగా పురోగమించాడు. అయితే సిడ్నీ, అడిలైడ్‌లలో జరిగిన చివరి రెండు వన్‌డేలలో రెండు సెంచరీలు చేశాడు. 2017 అలన్ బోర్డర్ అవార్డ్స్‌లో, అతను ఆస్ట్రేలియా వన్‌డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ను, అప్పటిఉ వరకూ దొరకని AB పతకాన్నీ అందుకున్నాడు. [27]


అతని రెండు సెంచరీలు అతన్ని మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా చేసాయి. తరువాతి రోజుల్లో, అతను ICC వన్‌డే ప్లేయర్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు - మొదటి సారి, వన్‌డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. [28]

అతను తరువాత న్యూజిలాండ్‌లోని చాపెల్-హాడ్లీ ట్రోఫీ సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్నాడు, భారతదేశంలో నాలుగు-టెస్టుల సిరీస్‌కు సన్నాహకంగా దుబాయ్‌లోని రెండవ సమూహంలోని ఆటగాళ్లలో చేరాడు. [29]

2017 సెప్టెంబరు 6న, చిట్టగాంగ్‌లోని జోహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో బంగ్లాదేశ్‌తో ఆడుతున్నప్పుడు, అతను అలన్ బోర్డర్, బాబ్ సింప్సన్, డామియన్ మార్టిన్, మైఖేల్ హస్సీ. మైఖేల్ క్లార్క్ ల తర్వాత ఆసియాలో బ్యాక్-టు-బ్యాక్ టెస్టు సెంచరీలు చేసిన ఆరో ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. . [30]

2017 సెప్టెంబరు 28న అతను తన 100వ వన్‌డేలో ఆడాడు. గోర్డాన్ గ్రీనిడ్జ్, క్రిస్ కెయిర్న్స్, మహ్మద్ యూసుఫ్, కుమార్ సంగక్కర, క్రిస్ గేల్, మార్కస్ ట్రెస్కోత్ తర్వాత తన 100వ వన్‌డేలో సెంచరీ చేసి, ఆస్ట్రేలియా తరపున మొదటి బ్యాట్స్‌మన్‌గా, మొత్తమ్మీద 8వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.[31] [32] [33] [34] 2017 డిసెంబరు 27న, వార్నర్ 2017–18 యాషెస్ సిరీస్‌లో MCGలో సెంచరీ సాధించాడు, 2018 జనవరి 5న SCGలో వరుసగా 3వ అర్ధ సెంచరీని సాధించాడు. [35] [36] 2019 అక్టోబరు 27న, అతను తన తొలి T20I సెంచరీని సాధించాడు, ఆటలోని మూడు ఫార్మాట్‌లలో సెంచరీలు సాధించిన మూడవ ఆసీస్‌గా నిలిచాడు. [37]


2019 నవంబరు 30న, వార్నర్ అడిలైడ్ ఓవల్‌లో పాకిస్తాన్‌పై 335* స్కోరుతో ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మన్ అయ్యాడు. అతను ట్రిపుల్ సెంచరీ చేసిన ఏడో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్, ఆస్ట్రేలియన్ గ్రౌండ్‌లో చేసిన నాలుగోవాడు. ఈ స్కోరుతో వార్నర్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్ (334), మార్క్ టేలర్ (334*)లను అధిగమించి మాథ్యూ హేడెన్ తర్వాత, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ చేసిన రెండవ అత్యధిక టెస్టు స్కోరు సాధించాడు.

వార్నర్‌ను స్టూవర్ట్ బ్రాడ్ 17 సార్లు అవుట్ చేశాడు. టెస్టు క్రికెట్‌లో ఒకే బ్యాట్స్‌మెన్‌ని అవుట్ చేసిన బౌలర్లలో ఇదే అత్యధికం. [38]

అంతర్జాతీయ కెప్టెన్సీ

[మార్చు]
కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ రికార్డు
మ్యాచ్‌లు గెలిచింది కోల్పోయిన డ్రా టైడ్ ఫలితం లేదు గెలుపు %
వన్ డే ఇంటర్నేషనల్స్ [39] 3 3 0 0 0 0 100%
ట్వంటీ20 ఇంటర్నేషనల్స్ [40] 9 8 1 0 0 0 88.88%
చివరిగా నవీకరించబడిన తేదీ: 2018 అక్టోబరు 30

శ్రీలంకతో జరిగిన 2016 వన్‌డే సిరీస్ ముగింపులో రెగ్యులర్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ విశ్రాంతి తీసుకున్నప్పుడు, వార్నర్ మిగిలిన పర్యటనలో జట్టుకు నాయకత్వం వహించాడు. [41] పల్లెకెలెలో జరిగిన ఐదవ వన్‌డేలో, వార్నర్ వన్‌డేలో శ్రీలంకలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ చేసిన మొదటి సెంచరీని నమోదు చేశాడు. అతను సారథ్యం వహించిన మొత్తం ఐదు మ్యాచ్‌లను ఆస్ట్రేలియా గెలుచుకుంది (మూడు వన్‌డేలు, రెండు T20Iలు), వన్‌డే సిరీస్‌ను 4-1 తో, T20I సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. [42] అతను మళ్లీ 2017–18 ట్రాన్స్-టాస్మాన్ ట్రై-సిరీస్‌కు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు (న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లు కూడా ఉన్నాయి) ఆ పోటీలో ఆస్ట్రేలియా గెలిచింది. [43]

బాల్ ట్యాంపరింగ్ ఘటన, సస్పెన్షన్

[మార్చు]

2018 మార్చి 25 ఉదయం, [44] [45] మైదానంలోకి అడుగుపెట్టారు. ఆ మ్యాచ్‌లో "బంతి పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించే నిర్ణయానికి తోడ్పడిన" అపరాధం కారణంగా, వారు కెప్టెన్, వఒఇస్ కెప్టెన్ పదవులను కోల్పోయారు. [46] [47] ముందు రోజు, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో బాల్ ట్యాంపరింగ్ కోసం సాండ్‌ పేపరును ఉపయోగించడం కనిపించింది. [44] భోజన విరామ సమయంలో "నాయకత్వ బృందం" బాల్ టాంపరింగ్ గురించి చర్చించిందని స్మిత్ అంగీకరించాడు. అయితే అందులో పాల్గొన్న వారి పేరు మాత్రం చెప్పలేదు. [48]

ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ పాట్ హోవార్డ్ నేతృత్వంలో, సీనియర్ లీగల్ కౌన్సెల్, ఇంటెగ్రిటీ హెడ్ ఇయాన్ రాయ్‌తో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా ఈ సంఘటనపై అత్యవసరంగా ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించింది. [49] ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి సంబంధించిన వారి ఇంటర్వ్యూలు 2018 మార్చి 26న ప్రారంభమయ్యాయి [50] CA CEO జేమ్స్ సదర్లాండ్ దక్షిణాఫ్రికాలో పరిశోధకులతో చేరారు. [51] 2018 మార్చి 27న, ఆ పరిశోధన ఫలితాలు అందజేయబడటానికి ముందు, స్పెషలిస్టు ఓపెనింగ్ బ్యాటర్ మాట్ రెన్‌షాను నాల్గవ టెస్టు కోసం ఆస్ట్రేలియా నుండి అత్యవసరంగా జట్టులోకి పిలిపించారు.

2018 మార్చి 27న, ప్రాథమిక విచారణ ఫలితంగా స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లు ఆటకు చెడ్డపేరు తెచ్చినందుకు వారిపై అభియోగాలు మోపి, సస్పెండ్ చేసి, ఇంటికి పంపించామని సదర్లాండ్ ప్రకటించాడు. ముగ్గురిపై తదుపరి ఆంక్షలను 24 గంటల్లో ప్రకటిస్తామని ఆయన చెప్పాడు. వారి స్థానంలో రెన్‌షా, జో బర్న్స్, గ్లెన్ మాక్స్‌వెల్‌లను నాల్గవ టెస్టుకు రీకాల్ చేసినట్లు అతను చెప్పాడు. రాబోయే నాల్గవ టెస్టుకు టిమ్ పైన్‌ను కెప్టెన్‌గా నియమించినట్లు అతను ప్రకటించగా, వైస్ కెప్టెన్‌ వార్నర్ స్థానంలో ఎవరనే దానిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. [3] స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై విధించే ఆంక్షలను నిర్ణయించడానికి క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు 2018 మార్చి 28న సమావేశమైంది. [52] వార్నర్ బంతి స్థితిని మార్చే ప్రణాళికను రూపొందించడానికి, దానిని ఎలా చేయాలో బాన్‌క్రాఫ్ట్‌కు సూచించడానికి, అతనికి సాంకేతికతను ప్రదర్శించడానికి బాధ్యత వహించినట్లు కనుగొన్నారు. [53] ఆ ప్లాన్‌పై తనకు తెలిసిన విషయాలను దాచిపెట్టి, తన ప్రమేయాన్ని స్వచ్ఛందంగా నివేదించకుండా మ్యాచ్ అధికారులను తప్పుదారి పట్టించినట్లు కూడా గుర్తించారు. ఫలితంగా, వార్నర్‌ను 1 సంవత్సరం పాటు అంతర్జాతీయ, ఆస్ట్రేలియా దేశీయ క్రికెట్ ఆడకుండా నిషేధించారు. తప్పనిసరిగా 100 గంటల సమాజ సేవను నిర్వహించాలని, నాయకత్వ స్థానాల నుండి శాశ్వతంగా నిషేధించాలనీ కూడా నిర్ణయించారు.[4]

అదే సమయంలో, వ్యక్తిగత స్పాన్సర్ LG ఎలక్ట్రానిక్స్‌తో వార్నర్ ఒప్పందం పునరుద్ధరణకు సమయం వచ్చింది. 2018 మార్చి 28న, ఇటీవలి వివాదాస్పద సంఘటనల దృష్ట్యా అతనితో తమ వాణిజ్య సంబంధాన్ని కొనసాగించకూడదని నిర్ణయించుకున్నట్లు, LG ఎలక్ట్రానిక్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా అతనిని తొలగించినట్లూ కంపెనీ ప్రకటించింది.. [54] [55] ఆ రోజు తర్వాత, ఆసిక్స్‌తో వార్నర్ ఒప్పందం రద్దు చేయబడింది; ఇది కేప్ టౌన్‌లో వారాంతపు ఈవెంట్‌ల ఫలితంగా, క్రికెట్ ఆస్ట్రేలియా చేసిన ఆంక్షలను అనుసరించీ తీసుకున్నామని కంపెనీ ప్రకటించింది. [56]

2018 మార్చి 28న, వార్నర్ తన IPL జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్, [57] కెప్టెన్సీ నుండి వైదొలిగినట్లు టీమ్ ఎగ్జిక్యూటివ్ ప్రకటించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఆంక్షలు ప్రకటించిన తర్వాత, వార్నర్ 2018 IPL నుండి నిషేధించబడ్డాడు. [58] మార్చి 29న ట్విట్టర్‌లో పోస్టు చేయడం ద్వారా వార్నర్ తన మౌనాన్ని వీడాడు. ఈ ఘటనలో తన భాగస్వామ్యానికి క్షమాపణలు చెబుతూ, తాను దానికి బాధ్యత వహిస్తానని చెప్పాడు. [59] [60] కుటుంబసభ్యులు, స్నేహితులు, విశ్వసనీయ సలహాదారులతో కాసేపు గడుపుతానని, రానున్న రోజుల్లో మరో ప్రకటన చేస్తానని చెప్పారు. [61] [62]

2018 ఏప్రిల్లో, సర్రే ప్రధాన కోచ్, ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ మైఖేల్ డి వెనుటో తన కౌంటీ జట్టు కోసం ఆడే డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్‌లు వస్తానంటే తీసుకుంటానని పేర్కొన్నాడు. [63]

తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌ లోకి

[మార్చు]

2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టులో ఎంపికయ్యాడు. [64] [65] 2018–19 సీజన్‌ను కోల్పోయిన తర్వాత, వార్నర్‌కు 2019–20 సీజన్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా జాతీయ కాంట్రాక్ట్‌ను అందజేసింది. [66] [67] 2019 జూన్ 1న, బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా ఓపెనింగ్ మ్యాచ్‌లో ఆడి, 114 బంతుల్లో 89 నాటౌట్ స్కోర్ చేసినందుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. [68] పాకిస్థాన్‌తో ఆస్ట్రేలియా ఆడిన మూడో మ్యాచ్‌లో కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇక్కడ అతను 107 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చిన తర్వాత అది అతని మొదటి సెంచరీ. [69] 2019 జూన్ 20న, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో, వార్నర్ 166 పరుగులు చేశాడు. క్రికెట్ ప్రపంచ కప్‌లో రెండు 150+ స్కోర్లు సాధించిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. [70] తొమ్మిది రోజుల తర్వాత, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన 13,000వ పరుగును సాధించాడు. [71] అతను ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగుల స్కోరర్‌గా టోర్నమెంట్‌ను ముగించాడు. పది మ్యాచ్‌లలో 647 పరుగులతో, అతను రోహిత్ శర్మ తర్వాత మొత్తం టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. [72]

ఆట శైలి

[మార్చు]

వార్నర్ ఎడమచేతి వాటంతో, బంతిని గాల్లోకి కొట్టడానికి, స్విచ్ హిట్‌కూ ప్రసిద్ధి చెందాడు. అతను ఆఫ్‌సైడ్‌లో స్కోర్ చేయడానికి ఇష్టపడతాడు. టెస్టు బ్యాట్స్‌మన్‌గా అతనికి చాలా ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. [73] అతని అన్ని టెస్టు సెంచరీలలో (2017 డిసెంబరు 26 నాటికి), అతని స్ట్రైక్ రేట్‌ 52.5 కంటే ఎప్పుడూ తగ్గలేదు. 3 సార్లు మాత్రమే 72 కంటే తక్కువ ఉంది.[74]

అతను అథ్లెటిక్ ఫీల్డరు, పార్ట్ టైమ్ స్పిన్ బౌలర్ కూడా. అతని బౌలింగ్ శైలి చాలా అరుదైనది. అతను మీడియం-పేస్ బౌలింగ్‌ను లెగ్ స్పిన్ బౌలింగ్‌తో కలుపుతాడు. 170 సెం.మీ ఎత్తుండే వార్నర్, తన బ్యాటింగ్ శక్తిని బలమైన ముంజేతుల నుండి ఉత్పత్తి చేస్తాడు. అతని తక్కువ గరిమనాభి కారణంగా అతను డెలివరీల కిందకి వెళ్లి వాటిని గాలిలోకి కొట్టడానికి వీలౌతుంది. 2009లో న్యూ సౌత్ వేల్స్ కోసం జరిగిన ఒక ట్వంటీ20 మ్యాచ్‌లో, అతను షాన్ టైట్ వేసిన బంతిని సిక్సర్ కొట్టాడు, అది అడిలైడ్ ఓవల్ యొక్క పైకప్పుపై పడింది. అదే బౌలర్‌ను ఒక నెల తర్వాత SCG లో హుక్ చేస్తే 20 వరుసల అవతల పడింది. [75]

వివాదాలు

[మార్చు]

2013 జూన్ 12న, జో రూట్‌పై దాడి చేసిన తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన 2013 ICC ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండవ మ్యాచ్‌కు వార్నర్‌ను తొలగించారు. [76] ఎడ్జ్‌బాస్టన్‌లో శనివారం ఇంగ్లండ్‌తో ఓడిపోయిన కొన్ని గంటల తర్వాత ఈ సంఘటన జరిగింది. 2013 జూన్ 13న, క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్‌కి £7,000 (AU $11,500) జరిమానా విధించబడుతుందని, 2013 జూలై 10న జరిగే మొదటి యాషెస్ టెస్టు వరకు తన దేశం తరపున ఆడడనీ ప్రకటించింది. వార్నర్ తరువాత 2013 ICC ఛాంపియన్స్ ట్రోఫీకి, సోమర్‌సెట్, వోర్సెస్టర్‌షైర్‌లతో జరిగిన టూర్ మ్యాచ్‌లకూ దూరమయ్యాడు. [77]

వార్నర్ వెంటనే మరింత వివాదానికి పాల్పడ్డాడు. 2013 జూలై 27న, ప్రిటోరియాలో దక్షిణాఫ్రికా Aకి వ్యతిరేకంగా ఆస్ట్రేలియా A తరపున ఆడుతున్నప్పుడు అతను దక్షిణాఫ్రికా A వికెట్-కీపర్ థామీ త్సోలెకిలేతో మైదానంలో వాగ్వాదానికి పాల్పడ్డాడు. అంపైర్లు రెండుసార్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయితే, ఎటువంటి అధికారిక ఫిర్యాదులు చేయలేదు. వార్నర్ దానిని "స్నేహపూర్వక పరిహాసం"గా అభివర్ణిస్తూ ట్వీట్ చేశాడు . అయినప్పటికీ, ఇంగ్లండ్‌తో జరిగిన మూడవ యాషెస్ టెస్టు కోసం అతను ఆస్ట్రేలియా జట్టులోకి తిరిగి రావడాన్ని పాత్రికేయులు ప్రశ్నించారు..[78] [79]

2015లో, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రోవ్ మైదానంలో వార్నర్ "పోకిరి" ప్రవర్తనను అరికట్టడానికి అంతర్జాతీయ క్రికెట్‌కు పసుపు-కార్డ్, రెడ్-కార్డ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని పిలుపునిచ్చాడు. వార్నర్, క్రికెట్ మైదానంలో నేను చూసిన అత్యంత పిల్లకాయ క్రికెటరు అని అతడు పేర్కొన్నాడు.". [80]

2018 మార్చి 4న, డర్బన్‌లో జరిగిన 1వ టెస్టులో టీ సమయంలో వార్నర్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్‌తో వాగ్వాదానికి దిగాడు. డి కాక్ వార్నర్ భార్య క్యాండీస్ గురించి అసభ్యకరమైన వ్యాఖ్య చేసాడు. [81] వార్నర్ కూడా డి కాక్‌ని మరిన్ని మాటలన్నాడు. సహచరులు ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్‌లు అతనిని అడ్డుకున్నారు. [82] వార్నర్‌పై లెవెల్ 2 నేరాన్ని, ఆటకు చెడ్డపేరు తెచ్చాడనీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అభియోగాలు మోపి, అతనికి మూడు డీమెరిట్ పాయింట్లు ఇచ్చింది. అతని మ్యాచ్ ఫీజులో 75% జరిమానా విధించింది. [83] [84]

2018 మార్చి 22న, కేప్ టౌన్‌లో జరిగిన ఆ సిరీస్‌లోని మూడవ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అవుట్ అయిన తర్వాత, వార్నర్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లినప్పుడు ఒక ప్రేక్షకుడి వ్యాఖపై స్పందించాడు. అది వాగ్వాదానికి దారితీసింది. ఆ తర్వాత ఆ ప్రేక్షకుడిని మైదానం నుంచి బయటకు పంపించేసారు. [85]

అంతర్జాతీయ శతకాలు

[మార్చు]

As of డిసెంబరు 2022[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]], Warner has scored 25 Test centuries, 19 వన్‌డే centuries and one T20I century, totaling 45 centuries in his international career.

అవార్డులు

[మార్చు]
 • ICC టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ : 2014, 2015, 2016, 2017 [86]
 • ICC వన్‌డే టీమ్ ఆఫ్ ది ఇయర్ : 2016, 2017 [87]
 • ICC దశాబ్దపు టెస్టు జట్టు : 2011–2020 [88]
 • ICC వన్‌డే దశాబ్దపు జట్టు : 2011–2020 [88]
 • అలన్ బోర్డర్ మెడల్ : 2016, 2017, [89] 2020 [90]
 • ఆస్ట్రేలియన్ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ : 2016
 • ఆస్ట్రేలియన్ వన్ డే ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ : 2017, 2018
 • బ్రాడ్‌మాన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ : 2012 [91]
 • ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరెంజ్ క్యాప్: 2015, 2017, 2019 [92]
 • ICC పురుషుల T20 ప్రపంచ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: 2021 [93]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

వార్నర్ 2015 ఏప్రిల్లో ఆస్ట్రేలియా మాజీ ఐరన్‌వుమన్ కాండిస్ ఫాల్జోన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు. [94] [95] వార్నర్, 2016లో ఆస్ట్రేలియన్ స్పోర్ట్స్ డాడ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. అవార్డు కోసం నామినేటైన పది మందిలో ఒకరైన వార్నర్, $10,000 విరాళంగా ఇవ్వబడే స్వచ్ఛంద సంస్థను ఎంచుకోవలసి వచ్చింది. [96] వార్నర్ సిడ్నీలోని మారుబ్రాలో నివసిస్తున్నాడు. [97] [98]

వార్నర్ నేషనల్ రగ్బీ లీగ్‌లో సిడ్నీ రూస్టర్స్‌కు మద్దతుదారు. [99]

మూలాలు

[మార్చు]
 1. "David Warner". ESPNcricinfo. Cricket Players and Officials. Retrieved 6 January 2017.
 2. "No joking, it's The Turtle and the Reverend". cricket.com.au. Cricket Australia. Retrieved 25 March 2017.
 3. 3.0 3.1 "Trio suspended by Cricket Australia". Retrieved 28 March 2018.
 4. 4.0 4.1 "Tampering trio learn their fate". cricket.com.au. Retrieved 28 March 2018.
 5. "David Warner becomes seventh Australian in triple-ton club". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 19 May 2021.
 6. "David Warner". ESPNcricinfo. Retrieved 14 February 2019.
 7. 7.0 7.1 "34 Facts about David Warner – The Pocket size dynamo". CricTracker. 26 October 2015. Retrieved 15 February 2019.
 8. Pandaram, Jamie (13 January 2009). "Warner brothers come up with a blockbuster". The Sydney Morning Herald. Retrieved 15 July 2009.
 9. "David Warner year 12 report card: Australian cricketer's high school grades". www.news.com.au. Retrieved 15 February 2019.
 10. "ICC Cricket World Cup Top Ten: Debutants". Archived from the original on 11 February 2015. Retrieved 11 February 2015.
 11. "Twenty20 Internationals – Fastest fifties". ESPNcricinfo. Retrieved 9 August 2013.
 12. "David Warner profile page". The Roar. 11 January 2009. Retrieved 9 August 2013.
 13. "2nd T20I: Australia v West Indies at Sydney, Feb 23, 2010 | ESPN Cricinfo". ESPNcricinfo. Retrieved 9 August 2013.
 14. Coverdale, Brydon (11 January 2009). "Warner will be hard to resist—Ponting". ESPNcricinfo. Retrieved 15 July 2009.
 15. "David Warner becomes the fourth player to win multiple Allan Border medals". www.sportskeeda.com (in ఇంగ్లీష్). 23 January 2017. Retrieved 12 February 2019.
 16. "David Warner's record-breaking 2016 continues after MCG ton vs New Zealand". www.hindustantimes.com/ (in ఇంగ్లీష్). 9 December 2016. Retrieved 12 February 2019.
 17. "Most runs as opening pair in T20Is". ESPNcricinfo. 8 March 2017. Retrieved 8 March 2017.
 18. "Most runs as pairs in T20Is". ESPNcricinfo. Retrieved 8 March 2017.
 19. "Records / Twenty20 Internationals / Batting records / Most runs in career". ESPNcricinfo. Retrieved 7 March 2016.
 20. "Run records tumble at the WACA". ESPNcricinfo (in ఇంగ్లీష్). 17 November 2015. Retrieved 13 January 2019.
 21. "Full Scorecard of Australia vs New Zealand 2nd Test 2015 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 13 January 2019.
 22. "Warner's double-century crushes NZ spirits". 13 November 2015. Retrieved 28 March 2018.
 23. 23.0 23.1 "Warner marches into top echelon". cricket.com.au. Retrieved 13 November 2015.
 24. "Warner equals Gavaskar with consecutive tons". 13 November 2015. Retrieved 28 March 2018.
 25. "Warner equals Gavaskar with consecutive tons". ESPNcricinfo. 13 November 2015. Retrieved 13 November 2015.
 26. Seervi, Bharath (3 January 2017). "Warner only fifth to score century before lunch on first day". ESPNcricinfo. Retrieved 3 January 2017.
 27. Andrew Ramsey (23 January 2017). "Warner crowned 2017 AB Medalist". cricket.com.au. Cricket Australia. Retrieved 28 January 2017.
 28. Dave Middleton (28 January 2017). "Warner officially the world's best ODI batter". cricket.com.au. Cricket Australia. Retrieved 27 January 2017.
 29. Brydon Coverdale (23 January 2017). "Warner rested for Chappell-Hadlee tour". ESPNcricinfo. Retrieved 28 January 2017.
 30. "Iron man Warner shows the way for Aussies". Retrieved 8 September 2018.
 31. "David Warner becomes eighth batsman to slam a century in 100th ODI – Here's the complete list | Sports News". Timesnownews. 28 September 2017. Retrieved 6 January 2019.
 32. "David Warner smashes sparkling century in 100th ODI to end Australia's losing streak". Firstpost. 28 September 2017. Retrieved 6 January 2019.
 33. "India vs Australia, 4th ODI: David Warner scores century in 100th ODI, Twitterati congratulate the Australian opener". The Indian Express (in Indian English). 28 September 2017. Retrieved 6 January 2019.
 34. "David Warner shines on his 100th ODI with century against India". Hindustantimes (in ఇంగ్లీష్). 28 September 2017. Retrieved 6 January 2019.
 35. "5th Test, England tour of Australia and New Zealand at Sydney, Jan 4-8 2018 | Match Report". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 6 January 2019.
 36. "Ashes 2017–2018: David Warner century gives Australia strong start at MCG". The Sydney Morning Herald (in ఇంగ్లీష్). 26 December 2017. Retrieved 6 January 2019.
 37. "David Warner becomes third Australian to score centuries in all three formats". www.aninews.in (in ఇంగ్లీష్). Retrieved 1 November 2019.
 38. "Five quick hits as David Warner falls to Stuart Broad for the 17th time in Tests and Ben Stokes hits out". ABC. 7 July 2023. Retrieved 9 July 2023.
 39. "List of ODI Captains". Cricinfo. Retrieved 30 October 2018.
 40. "List of Twenty20 Captains". Cricinfo. Retrieved 30 October 2018.
 41. "Steven Smith heads home to rest ahead of 2016–17 summer". ESPNcricinfo. 24 August 2016. Retrieved 24 August 2016.
 42. "Warner century seals Australia's dominance". ESPNcricinfo. Retrieved 4 September 2016.
 43. "Australia attempt BBL reboot against New Zealand". ESPNcricinfo. Retrieved 2 February 2018.
 44. 44.0 44.1 "Smith suspended by ICC for fourth Test, Bancroft escapes ban". The Sydney Morning Herald. 25 March 2018. Retrieved 25 March 2018.
 45. Lemon, James (25 March 2018). "Warner comments on South African ball tampering come back to bite him". The Sydney Morning Herald. Retrieved 26 March 2018.
 46. "Steven Smith and Warner stood down as captain and vice-captain". ESPNcricinfo. Retrieved 26 March 2018.
 47. "Smith, Warner stand down as captain and vice-captain". International Cricket Council. Retrieved 26 March 2018.
 48. "Explosive test series goes nuclear as Aussies confess to ball-tampering". Retrieved 8 September 2018.
 49. "CA launches ball tampering probe". Retrieved 28 March 2018.
 50. "Investigation begins as decision looms". Retrieved 28 March 2018.
 51. "Inquiry findings due on Wednesday". Retrieved 28 March 2018.
 52. "Cricket: Australia ban Smith, Warner in ball-tampering scandal". Al Jazeera. Retrieved 29 March 2018.
 53. "David Warner developed ball-tampering plan, say Cricket Australia". Sky Sports. Retrieved 29 March 2018.
 54. Gray, Darren (28 March 2018). "LG decides 'not to renew' David Warner sponsorship". The Age. Retrieved 28 March 2018.
 55. "Electronics giant LG drops David Warner as brand ambassador". The Guardian. 28 March 2018. Retrieved 28 March 2018.
 56. Costin, Luke (29 March 2018). "Magellan tears up deal with Cricket Australia as Smith, Warner and Bancroft are dumped by sponsors". Adelaide Advertiser. Retrieved 26 May 2019.
 57. "Warner quits IPL captaincy". Retrieved 28 March 2018.
 58. "IPL 2018: Steve Smith, David Warner barred by BCCI following Cricket Australia ban". Hindustan Times. 28 March 2018. Retrieved 28 March 2018.
 59. "Ball-Tampering Row: David Warner Breaks Silence, Apologises For Part In Scandal". NDTVSports.com. Retrieved 29 March 2018.
 60. "Warner apologises for 'stain on the game'". ESPNcricinfo. Retrieved 29 March 2018.
 61. "Warner speaks out on his role in 'stain on the game' ball tampering". ABC News. 29 March 2018.
 62. "Warner apologises, 'takes responsibility' for part in scandal". The Times of India. Retrieved 29 March 2018.
 63. "Surrey open to Warner, Smith county deals". ESPN Cricinfo. Retrieved 19 April 2018.
 64. "Smith and Warner make World Cup return; Handscomb and Hazlewood out". ESPN Cricinfo. 15 April 2019. Retrieved 15 April 2019.
 65. "Smith, Warner named in Australia World Cup squad". International Cricket Council. Retrieved 15 April 2019.
 66. "Australia contracts: Smith, Warner, Pattinson return; Mitch Marsh out". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 15 April 2019.
 67. "Pattinson, Warner, Smith handed central contracts; Mitchell Marsh dropped". ESPNcricinfo (in ఇంగ్లీష్). 15 April 2019. Retrieved 15 April 2019.
 68. "Khawaja, Coulter-Nile in for Aussies". Cricket Australia. Retrieved 1 June 2019.
 69. "Australia vs Pakistan Highlights, World Cup 2019: Australia beat Pakistan by 41 runs". Times of India. 12 June 2019. Retrieved 12 June 2019.
 70. "David Warner blasts highest score in World Cup 2019, equals Virat Kohli's record". The Indian Express. 20 June 2019. Retrieved 20 June 2019.
 71. "ICC Cricket World Cup 2019 (Match 37): New Zealand vs Australia – Statistical Highlights". Cricket Addictor. 30 June 2019. Retrieved 30 June 2019.
 72. "ICC Cricket World Cup, 2019 – Australia: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 11 July 2019.
 73. "Top 10 batsmen with highest strike rate in Tests". www.crictracker.com. Archived from the original on 26 జూన్ 2019. Retrieved 8 September 2018.
 74. "Batting records | Test matches | Cricinfo Statsguru". ESPNcricinfo. Retrieved 26 December 2017.
 75. Warner coshes Redbacks to sour Tait return SMH 7 January 2009
 76. "David Warner 'attack on Joe Root' probed by Australia". BBC Sport. 12 June 2013. Retrieved 12 June 2013.
 77. "David Warner: Australia batsman suspended until first Ashes Test". BBC Sport. 13 June 2013. Retrieved 13 June 2013.
 78. "Warner altercation overshadows tame draw". ESPNcricinfo. 27 July 2013. Retrieved 27 July 2013.
 79. "David Warner to rejoin Ashes squad, eyes Test recall at Old Trafford". ABC News. 30 July 2013. Retrieved 28 January 2017.
 80. "Why cricket needs yellow and red cards". ESPNcricinfo. 18 January 2015. Retrieved 19 January 2015.
 81. "Warner involved in heated exchange with de Kock". ESPNcricinfo. Retrieved 26 March 2018.
 82. Barrett, Chris (5 March 2018). "David Warner shown in fiery confrontation with Quinton de Kock". The Sydney Morning Herald. Retrieved 26 March 2018.
 83. "David Warner doesn't contest charge, but de Kock does". ESPNcricinfo. Retrieved 26 March 2018.
 84. Hoult, Nick (5 March 2018). "ICC to investigate ugly off-field row between David Warner and Quinton de Kock". The Telegraph. ISSN 0307-1235. Archived from the original on 11 January 2022. Retrieved 26 March 2018.
 85. "Warner in heated exchange with spectator after dismissal". ESPNcricinfo. Retrieved 26 March 2018.
 86. "ICC names Test and ODI teams of the year – cricket.com.au". www.cricket.com.au. Retrieved 8 September 2018.
 87. "Men's ODI Team of the Year". Retrieved 8 September 2018.
 88. 88.0 88.1 "Nine Aussies named in ICC Teams of the Decade". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 27 December 2020.
 89. Buckley, James (23 January 2017). "David Warner claims second Allan Border Medal". The Sydney Morning Herald. Retrieved 8 September 2018.
 90. "As it happened: David Warner and Ellyse Perry take home major honours at 2020 Australian Cricket Awards". Nine Digital Pty Ltd. 10 February 2020.
 91. "David Warner named Bradman Young Cricketer of the Year | The International Cricket Hall of Fame". Retrieved 5 January 2019.
 92. "IPL 2008 to 2019: Full list of Orange Cap, Purple Cap and title winners". India Today (in ఇంగ్లీష్). Retrieved 13 May 2019.
 93. "'He'll be Player of the Tournament': Warner repays the faith in golden campaign". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 15 November 2021.
 94. Gamble, Livia (12 September 2014). "It's an 'Ashes baby' for David Warner and Candice Falzon". The Daily Telegraph. Retrieved 7 January 2015.
 95. Lian, Jotham (14 January 2016). "Candice and David Warner announce birth of baby daughter Indi Rae". The Sydney Morning Herald.
 96. "David Warner: sports dad of the year". ESPNcricinfo.
 97. "Candice's miscarriage tragedy". www.theaustralian.com.au (in ఇంగ్లీష్). 23 May 2018. Retrieved 5 January 2019.
 98. "'I paid the ultimate price': Candice Warner tells of miscarriage after ball-tampering scandal". amp.smh.com.au. Retrieved 5 January 2019.
 99. https://www.dailytelegraph.com.au/sport/nrl/teams/roosters/steve-smith-and-david-warner-flying-nrl-flag-in-the-australian-cricket-team/news-story/5ff721555c2656b7fc17d9a25cc202e5