డైక్లోరిన్ డయాక్సైడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డైక్లోరిన్ డయాక్సైడ్
Space-filling model of the ClO dimer molecule
పేర్లు
IUPAC నామము
Dichlorine dioxide
ఇతర పేర్లు
Chlorine(I) oxide, Chlorine Peroxide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [12292-23-8]
పబ్ కెమ్ 123287
SMILES ClOOCl
ధర్మములు
Cl2O2
మోలార్ ద్రవ్యరాశి 102.905 g/mol
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
Infobox references

డైక్లోరిన్ డయాక్సైడ్ అనునది ఒక రసాయనసమ్మేళనం. రెండు క్లోరిన్ పరమాణువులు, రెండు ఆక్సిజన్ పరమాణువుల సంయోగం వలన డైక్లోరిన్ డయాక్సైడ్ అణువు ఏర్పడును.ఈ సంయోగపదార్ధం యొక్క రసాయన సంకేతపదం ClOOCl. (సక్షింప్త సంకేతం Cl2O2).ఓజోన్ పొర పతనంపై డైక్లోరిన్ డయాక్సైడ్ ప్రభావంకలదు.[1]

డైక్లోరిన్ డయాక్సైడ్ ఇతర పేర్లు[మార్చు]

డైక్లోరిన్ డయాక్సైడ్ ఇతరపేర్లతో కుడా వాడుకలో ఉంది. డైక్లోరిన్ డయాక్సైడ్ అనునది IUPAC పేరు.ఈ రసాయానసమ్మేళనం ఒక ద్వ్యణుకం (Dimer). అందుచే దీనిని క్లోరో ఆక్సిడైమర్ ( ClO dimer) అని కూడా వ్యవహరిస్తారు.ఈ సంయోగ పదార్థానికి ఉన్న మరో పేరు క్లోరిన్ పెరాక్సైడ్.క్లోరిన్ (I) ఆక్సైడ్ అనునది మరో ప్రత్నామ్యాయంగా ఉపయోగించు నామదేయం.[2]

ఉత్పత్తి[మార్చు]

క్లోరిన్ అణువును ఓజోనుతో కలిపి లేసరు కిరణాలతో సంశ్లేషణ చెయ్యడం వలన డైక్లోరిన్ డయాక్సైడ్ (ClOOCl) ఉత్పత్తి చెయ్యవచ్చును.లేదాక్లోరిన్ అణువును ఒజోనుతో కలిపి అతినీలలోహిత కాంతివిశ్లేషణం చెయ్యడం వలన కూడా తయారు చెయ్యవచ్చును.248, 308, లేదా 352 nm తరంగదైర్ఘ్యం ఉన్నఎక్షిమెర్‌ లేసర్ వలన క్లోరిన్ అణువులు, పరమాణువులుగా విడిపోవును.[3]

అలాగే డైఫ్లోరోడైక్లోరో మిథేన్ (CF2Cl2) కూడా క్లోరిన్ అణువును పరమాణువులు విడగొట్టి, పెరాక్సైడును ఏర్పరచు వనరుగా/ఆధారంగా పనిచేయును.. సూక్ష్మతరంగం విసర్జకం (microwave discharge) కూడా క్లోరిన్ అణువులను పరమాణు వులుగా విడగొట్టి పెరాక్సైడు ఏర్పడుతకు దోహద పడును[3].

Cl2 + hν → 2Cl
Cl + O3 → O2 + ClO•
2ClO• + M → ClOOCl + M
ClOOCl + hν → Cl + ClO2
ClO2 + M → Cl + O2

ధర్మాలు[మార్చు]

డైక్లోరిన్ డయాక్సైడ్ యొక్క అణుభారం 102.905 గ్రాములు/మోల్.ఈ సంయోగపదార్ధం ఒక ద్వ్యణుకం.డైక్లోరిన్ డయాక్సైడ్ గరిష్ఠంగా 245 nm వరకు తరంగదైర్ఘ్యంకల్గిన అతినీలలోహిత కిరణాలను శోషించుకొనును.తరంగాయామము350 nm కలిగిన అతినీలలోహిత కిరణాలను కొంత తక్కువస్థాయిలో శోషించుకొనును.ఓజోన్ పొర 300 nm వరకు అతినీలలోహిత కిరణాలను శోషించుకొనును.

డైక్లోరిన్ డయాక్సైడ్/క్లోరిన్ పెరాక్సైడ్ అణువులోని క్లోరిన్-ఆక్సిజన్ పరమాణువుల (Cl-O) బంధ దూరం పొడవు 1.426 Å. ClOO ల బంధం యొక్క బంధకోణం110.1°, రెండు Cl-O-O ద్విముఖకోణం 81°[4] .

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Lin, Jim J.; Andrew F Chen; Yuan T. Lee (2011). "UV Photolysis of ClOOCl and the Ozone Hole". Chemistry - an Asian Journal. 6 (7): 1664–1678. doi:10.1002/asia.201100151. ISSN 1861-4728.
  2. Pope, Francis D.; Jaron C. Hansen; Kyle D. Bayes; Randall R. Friedl; Stanley P. Sander (2007). "Ultraviolet Absorption Spectrum of Chlorine Peroxide, ClOOCl". The Journal of Physical Chemistry A. 111 (20): 4322–4332. doi:10.1021/jp067660w. ISSN 1089-5639. PMID 17474723.
  3. 3.0 3.1 Chen, H.-Y.; C.-Y. Lien; W.-Y. Lin; Y. T. Lee; J. J. Lin (2009). "UV Absorption Cross Sections of ClOOCl Are Consistent with Ozone Degradation Models". Science. 324 (5928): 781–784. Bibcode:2009Sci...324..781C. doi:10.1126/science.1171305. ISSN 0036-8075. PMID 19423825.
  4. Inglese, S.; G. Granucci; T. Laino; M. Persico (2005). "Photodissociation Dynamics of Chlorine Peroxide Adsorbed on Ice". The Journal of Physical Chemistry B. 109 (16): 7941–7947. doi:10.1021/jp044368k. ISSN 1520-6106. PMID 16851927.