డైనమో

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
డైనమో విద్యుత్ యంత్రం

డైనమో (గ్రీకు పదం: డైనమిస్ (అనగా పవర్ లేక శక్తి) నుండి వచ్చింది), అనునది తొలుత విద్యుత్ ఉత్పాదక యంత్రం(జనరేటర్) కు మరొక పేరుగా ఉంది. ముఖ్యంగా డైనమో అనగా కమ్యుటేటర్ ను ఉపయోగించి ఏకముఖ విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేసే విద్యుత్ ఉత్పాదక యంత్రం. డైనమోలు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం కలిగిన మొదటి విద్యుత్ ఉత్పాదక యంత్రములు. విద్యుత్ మోటారు,ఏకాంతర -విద్యుత్ ప్రత్యావర్తకం మరియు రోటరీ కన్వర్టర్ మొదలగు విద్యుత్ శక్తి మార్పిడి యంత్రాలు డైనమో ఆధారంగానే తయారుచేయబడ్డాయి. వీటిని ఈ కాలంలో అరుదుగా వినియోగిస్తున్నారు, ఇప్పుడు ఏకాంతర విద్యుత్ (ఏ.సి) ఎక్కువగా వాడుతున్నారు. దిక్పరివర్తకం వాడటంలోని కష్టనష్టాలు మరియు ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని ,ఏకముఖ విద్యుత్ ప్రవాహం(డి.సి) గా మార్చుటకు ఘనపదార్ధ స్థితిలో తేలికయిన పద్దతులు అందుబాటులో ఉండటం వంటివి డైనమోల వాడకం తగ్గుటకు కారణమయ్యాయి.

ఇప్పటికీ కొన్ని సందర్బాలలో విద్యుత్ ఉత్పాదక యంత్రములకు బదులుగా డైనమో అనే పేరును వాడతారు. సైకిల్ చక్రము ఇరుసుల మధ్య అమర్చిన చిన్న విద్యుత్ ఉత్పాదకముతో సైకిల్ బల్బ్ వెలుగునట్లు చేయవచ్చు, దీనిని హబ్ డైనమో అంటారు.

వర్ణన[మార్చు]

డైనమోలలో ఉన్న సంవృత వలయంలోని తీగచుట్టను స్థిర అయస్కాంత క్షేత్రంలో అవిచ్ఛిన్నంగా తిప్పినప్పుడు ఫారడే నియమం అనుసరించి ప్రేరిత విద్యుత్ ప్రవాహాన్ని జనింపచేస్తుంది. ఒక డైనమో యంత్రం స్థిరంగా ఉండే నిర్మాణం అయిన స్టేతర్ ను కలిగి ఉంటుంది, ఇది స్థిరమైన అయస్కాంత క్షేత్రాన్ని ఇస్తుంది, మరియు ఒక జత స్లిప్పు రింగులు అమర్చిన తీగచుట్ట అయిన ఆర్మేచర్ కూడా కలిగి ఉంటుంది. ఇవి అదే క్షేత్రంలో తిరుగుతుంటాయి. ఈ విధంగా తీగచుట్టను అయస్కాంత క్షేత్రంలో వేగంగా తిప్పినప్పుడు తీగచుట్టలోని ఎలక్ట్రాన్ స్పర్శ వలన తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఉత్పన్నమవుతుంది. చిన్న యంత్రంలలో శాశ్వత అయస్కాంత క్షేత్రంనకు ఒకటి లేదా రెండు శాశ్వత అయస్కాంతాలను, పెద్ద యంత్రంలలో ఒకటి లేదా పలు విద్యుదయస్కాంతాలయినక్షేత్ర తీగచుట్టలు వాడతారు.

ఏకముఖ విద్యుత్ ప్రవాహ ఉత్పాదనకు దికపరివర్తనం(కమ్యుటేటర్) అవసరము. అయస్కాంత క్షేత్రంలోని ఆర్మేచర్ లేదా వేగంగా తిప్పినప్పుడు బాహ్య వలయంలో ఏర్పడే విద్యుత్ ప్రవాహదిశ రెండు అర్ధ భ్రమణాలలో ప్రత్యామ్న్యాయంగా మారుతుంది ,అందుకే దీనిని ఏకాంతర విద్యుత్ ప్రవాహం అంటారు. అయినప్పటికీ పూర్వపు విద్యుత్ ప్రయోగాలలో ఏకాంతర విద్యుత్ ప్రవాహం ఉపయోగింపబడలేదు. జలవిచ్చిన్న బ్యాటరీ చేత ఉత్పన్నమయ్యే ఏకముఖ విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగించి ఎలేక్ట్రోప్లేటింగ్ చేయుట మొదలగునవాటికి మాత్రమే విద్యుత్ శక్తిని వాడేవారు. బ్యాటరీలకు ప్రత్యామ్నయంగా డైనమోలను కనుగొన్నారు. దిక్పరివర్తనం ముఖ్యంగా తిరగే దిశను మార్చు మీట. స్థూపాకార కడ్డీ ఫై చుట్టిన తీగచుట్ట రెండు స్లిప్పు రింగులను,రెండు నల్లటి కార్బన్ బ్రష్ లను కలిగి ఉంటుంది.ముందుగా చెప్పిన రింగులు మెటల్ తో చేసినవి. దిక్పరివర్తకం ఉపయోగించి తీగచుట్ట చివరల అనుసంధాన పట్టీలను బాహ్యవలయంలో మార్పుచేయటం వలన విద్యుత్ ప్రవాహ దిశను మార్చి ఏకాంతర విద్యుత్ ప్రవాహానికి బదులుగా ప్ర్రేరిత ఏకముఖ విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తుంది.

చరిత్రలో మైలురాళ్ళు[మార్చు]

ఫారడే వలయం

మొదటి విద్యుత్ ఉత్పాదక యంత్రాన్ని 1831 లో మైఖేల్ ఫ్యారడే కనుగొన్నాడు,అది అయస్కాంత దృవాల మధ్య తిరుగునట్లు ఏర్పాటు చేసిన రాగి పలకతో కూడి ఉన్నది. దిక్పరివరివర్తనం వాడబడనందున దీనిని డైనమో అనలేము. అయినప్పటికీ, ఫారడే పలకతో అతి తక్కువ వోల్టేజి ఉత్పత్తి అయినది, ఎందుకనగా అది ఒకే అయస్కాంత క్షేత్రం నుండి ఒకే మార్గంలో ప్రవహించినది. ఫారడే మరియు ఇతరులు పలుమార్లు చుట్టబడిన తీగ చుట్టతో అధిక వోల్టేజి విద్యుత్ తయారు చేయవచ్చని కనుగొన్నారు. ఈ విధంగా తీగ చుట్ట్లలో ఉన్న చుట్ల సంఖ్యని పెంచడం ద్వారా కావలసిన వోల్టేజి తాయారు చేయవచ్చు కాబట్టి వారు వివిధ లక్షణము గల విద్యుత్ ఉత్పాదక యంత్ర నమూనాలను మరియు ఏకముఖ విద్యుత్ ప్రవాహం తయారు చేయడానికి కావలిసిన దిక్పరివర్తకం (కమ్యుటేటర్)కనుగొనుటకు దారితీసింది.

జెడ్లిక్ డైనమో[మార్చు]

పిక్స్సి డైనమోకడ్డీ కిందగల తిరిగే అయస్కాంతం ఫైన దిక్పరివర్తకం అమర్చబడినది.

1827 లో హంగేరియా దేశస్థుడయిన ఐనస్ జెడ్లిక్ విద్యుదయస్కాంత శక్తి తో తిరిగే యంత్రాల( విద్యుదయస్కాంత స్వయంభ్రమణ చక్రం) పైన ప్రయోగం చేయడం ప్రారంభించాడు. ఒకే దృవంలో విద్యుత్ జనించే నమునాలో, స్థిర మరియు తిరుగు భాగాలు విద్యుదయస్కాంతముతో తయారు చేయబడినవి. ఆతను డైనమో సిద్ధాంతమును రూపొందించడం సిమెన్స్ మరియు వీట్ స్టోన్ సిద్దాంతం కంటే ఆరు సంవత్సరాల ముందు జరిగింది కాని దానికి ప్రత్యేక హక్కు(పేటెంట్) దారునిగా గుర్తింపు పొందలేదు. వేరే ఇతరుల కంటే ముందే తను గ్రహించాను అని అనుకోలేదు. ఇతను రూపొందించిన డైనమోలో శాశ్వత అయస్కాంత భాగాలకి బదులు రెండు విద్యుత్ అయస్కాంతంలను అభిముకంగా ఉంచి చక్రం చుట్టూ అయస్కాంతక్షేత్రమును ప్రేరేపించడం జరిగింది.[1][2] దీనినే డైనమో స్వయం ఉత్తేజన సూత్రముగా కనుగొన్నారు.[3]

పిక్సీస్ డైనమో[మార్చు]

మొట్టమొదటి డైనమో 1832లో హిప్పోలైట్ ఫ్యారడే సూత్రములను ఉపయోగింఛి తాయారు చేసారు, ఇతను ఒక పరికరాలు తాయారు చేయు ఫ్రెంచ్ దేశస్థుడు. దీనిలో శాశ్వత అయస్కాంతంను ఉపయోగించారు. దీనిని వంపుగల ఇరుసుతో తిప్పడం జరుగుతుంది. ఈ అయస్కాంతము యొక్క ఉత్తర దక్షిణ ద్రువాల మధ్య దేనికి అంటకుండా చేయబడిన తీగతో చుట్టబడిన ఇనుప ముక్క తిరుగునట్లు దాని అమరిక ఉంటుంది. పిక్సీ అయస్కాంతం తీగచుట్ట మీద తిరుగుతున్నపుడు తీగలో విద్యుత స్పందన ఉత్పతి అవుతున్నదని కనిపెట్టడం జరిగింది. అయినప్పటికీ అయస్కాంతంయొక్క ఉత్తర దక్షిణ దృవాలు ప్రవాహమును వేర్వేరు దిశలో ప్రేరేపించడం జరుగుతుంది. ఏక ముఖ ప్రవాహమును డీ.సి. కి మార్చుటకు, పిక్సీ ఒక దిక్పరివర్తకం రూపొందించారు, దానిలో ఇనుప కడ్డీ మీద చిలిన లోహ స్తూపం ఉంచి, దానికి అభిముఖంగా రెండు బిర్రుగా ఉండే లోహములతో తగిలేట్టుగా వత్తడం జరుగుతుంది.

పసినోట్టి డైనమో[మార్చు]

పసినోట్టి డైనమో,1860

ముందుగా రుపొందించిన నమూనాలలో కొన్ని సమస్యలు ఈ విధంగా ఉన్నాయి: ఇందులో ఉత్పతి అయిన విద్యుత్ ప్రవాహం నందు వరుస "స్పైక్లు" లేక ప్రవాహ స్పందనలు ఎటువంటి విభాగాలు లేకుండా కనిపించడం జరిగింది. ఫలితంగా అతి తక్కువ శక్తి ఉత్పతి కనబడుతుంది. విద్యుత్ యంత్రం వాడుకలో ఉన్నప్పుడు, నమునాకర్తలు అయస్కాంత వలయం నందు వచ్చే వాయు సందుల మూలంగా కలిగే నష్టాలను ప్రమాదకరమయినవిగా గుర్తించలేదు. ఆంటోనియో పసినోట్టి, ఇతను ఇటలీ దేశ భౌతిక శాస్త్ర అధ్యాపకుడు ,ఈ సమస్యకు పరిష్కారము 1860 లో కనిపెట్టెను, రెండు దృవాల అక్షంలో తిరుగు తీగచుట్టకు బదులు బహు ధ్రువ టోరైడ్ ఉపయోగించెను. అది వర్తుల ఆకారంలో ఉన్న ఇనుప తీగను పలుమార్లు చుట్టుతూ, దిక్పరివర్తకం మీద సరి సమానమైన స్థానాలతో అనుసందానము చేస్తూ; దిక్పరివర్తకంని భిన్న భాగాలుగా విభజించడం జరిగింది. తీగ చుట్టలో కొద్ది భాగము అయస్కాంతాల పైన నిరంతరముగా దాటుతూ, ఎటువంటి నిరోధము లేకుండా విద్యుత్ ప్రవహించును.

సిమేన్స్ మరియు వీట్ స్టోన్ డైనమో(1867)[మార్చు]

డా.వెర్నర్ సీమెన్స్ మరియు చార్లెస్ వీట్ స్టన్ మొట్టమొదటి ఆచరణాత్మక డైనమో నమునాలను ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఏకకాలమునందు ప్రకటించారు. జనవరి 17 ,1867లో బెర్లిన్ అకాడమీ కి డైనమో-విద్యుత్ పరికరం(మొదటిసారిగా వాడబడినది)శాశ్వత అయస్కాంతముతో కాకుండా ,సొంతంగా నడిచే విద్యుత్ అయస్కాంత క్షేత్రంలో ఏర్పరచిన తీగచుట్టతో స్థిరమైన క్షేత్రాన్ని ఏర్పాటు చేయవచ్చని ప్రకటించాడు.[4] ఈ విషయాన్ని రాయల్ సొసైటీలో ప్రకటించిన రోజునే ,వీట్ స్టోన్ ఒక పత్రిక యందు ఈ నమూనాను పోలిన సిమెన్ నమూనా గురించి చదవగా, ఆ రెండింటికీ కొద్దిపాటి తేడాలు ఉన్నాయని, అవి సిమెన్ నమూనాలో స్థిర విద్యుదయస్కాంతాలు చక్రీయంగా ఉన్నాయని, వీట్ స్టోన్ నమూనాలో అవి సమాంతరంగా ఉన్నాయని తెలుసుకున్నాడు.[5] శాశ్వత అయస్కాంతాలకు బదులుగా విద్యుదయస్కాంతాలను వాడటం వలన డైనమోలో బహిర్గతమయ్యే విద్యుత్ తో ఎక్కువ సామర్ద్యం గల విద్యుత్ ను ఉత్పాదకం చేయవచ్చని మొదటిసారిగా కనుగొన్నారు. ఈ కొత్తకల్పన మొదటిసారిగా పారిశ్రామిక రంగంలో విద్యుత్ ఉపయోగాలను నేరుగా తెలియపరచింది. ఉదాహరణకు 1870లో సిమెన్సు విద్యుదయస్కాంత డైనమోలను అర్ధచంద్రాకృతిలో ఉన్న విద్యుత్ కొలిమిని నడుపటకు అవసరమైన విద్యుత్తు ఉత్పత్తి చేసి తద్వారా లోహాలు మరియు ఇతర ముడి సరుకులను తయారుచేసాడు.

గ్రామే రింగ్ డైనమో[మార్చు]

చిన్న గ్రామే డైనమో,సుమారు 1878 లలో
నిరంతరాయ తరంగదైర్ఘ్య ఫలితాన్ని ఇవ్వటానికి గ్రామే డైనమో ఎలా పనిచేస్తుందో.

జీనోబ్ గ్రామే 1871లో మొదటి వ్యాపార విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(పవర్ ప్లాంట్)నమూనాను తయారుచేయునప్పుడు పాసినొట్టి నమూనాను మార్పు చేసాడు. ఆ పవర్ ప్లాంట్ పారిస్ లో 1870లో నడపబడింది. గ్రామే నమూనాలోని మరొక ఉపయోగం ఏమనగా అయస్కాంత క్షేత్రంలోని మధ్య ఖాళీ ప్రదేశాలను బరువైన ఇనుప ధాతువుతో నింపి స్థిర మరియు తిరిగే భాగాల మధ్య ఉన్న గాలిసందులను తగ్గించి తద్వారా అయస్కాంత అభిప్రవాహంను అధికం చేసింది. గ్రామే డైనమో పరిశ్రమలకు కావాలసిన అధిక విద్యుత్ ను ఉత్పత్తి చేయగలిగిన మొదటి యంత్రము. తర్వాత గ్రామే రింగ్ కు పలు మార్పులు చేయబడ్డాయి ,కానీ నూతన డైనమోలలో కూడా తిరుగుచున్న తీగచుట్ట అంశమే వీటిలో కూడా ముఖ్యంగా ఉన్నది.

బ్రుష్ డైనమో[మార్చు]

చార్లెస్ ఎఫ్.బ్రుష్ మొదటిసారిగా 1876 వేసవిలో తన మొదటి డైనమోను గుర్రంతో నడిచే ట్రెడ్ మిల్ ను ఉపయోగించి పనిచేసేటట్టు చేయగలిగాడు. ఏప్రిల్ 24 ,1877లో "అయస్కాంత-విద్యుత్ పరికరాల అభివృద్ధికి" యు.యస్.పేటెంట్#189997 ఇవ్వబడినది. బ్రష్ ముందుగా గ్రామే నామూనాలోని తీగచుట్టలోని రెండు చివరలు మరియు రింగు లోపలి బాగాలు క్షేత్ర ప్రభావానికి వెలుపల ఉండి, అధిక వేడిమి నుండి నివారింపబడతాయి అనే మూలవిషయం ఆధారంగా తన పరిశోధన ప్రారంభించాడు. మరికొంత పరిణతిని పెంపొందించుటకు గ్రామే నమూనాలో వలె స్థూపాకారాపు ఆర్మేచర్ రింగు కాకుండా పలక రూపంలో ఉండే రింగ్ ఆర్మేచర్ ను ఉపయోగించాడు. విద్యుదయస్కాంతాలు క్షేత్రం ఆర్మేచర్ చుట్టుకొలతలో కాకుండా పలక వైశాల్యంలో ఏర్పడునట్లు వాటి అమరిక ఉంటుంది. అందులో నాలుగు విద్యుదయస్కాంతాలు రెండు ఉత్తర దృవ స్థానంలో, రెండు దక్షిణ దృవస్థానంలో ఉంటాయి. సజాతి దృవాలు ఆర్మేచర్ పలక రెండువైపులా ఎదురెదురుగా ఉంటాయి.[6] 1881లో బ్రష్ ఎలక్ట్రిక్ కంపెనీ డైనమో ఈ విధంగా ఉన్నట్లు తెలుస్తుంది.89 ఇంచుల పొడవు,28 ఇంచుల వెడల్పు మరియు 36 ఇంచుల ఎత్తు మరియు 4800పౌండ్ల బరువుతో ఉండి నిమిషానికి 700 బ్రమనాలు చేయగల వేగంతో పనిచేసినవి. అప్పటిలో ప్రపంచములో అదే పెద్ద డైనమో అని నమ్ముతారు. దానితో నలభై ఆర్క్ లైట్ లను వెలిగించారు,దానికి 36 హార్స్ పవర్ల శక్తి కావలసి వచ్చింది.[7]

విద్యుత్ మోటారు సూత్రములు కనుగొనుట[మార్చు]

డైనమో ను కనుగొనుటకు ప్రధాన ఉద్దేశ్యం వేరయినప్పటికి.దానికి ఏకముఖ విద్యుత్ ప్రవాహాన్ని బ్యాటరీల నుండి కానీ లేక వేరొక డైనమో నుండి కానీ సరఫరా చేసినచో ఆ డైనమో ఒక విద్యుత్ మోటారు (విద్యుత్ చాలకం)గా పనిచేయగలదని కనుగొనబడింది. 1873లో వియెన్నాలో జరిగిన పారిశ్రామిక ప్రదర్శనలో అనుకోకుండా రెండు డైనమోల చివరలు తాకినప్పుడు వేరొక డైనమోలో విద్యుత్ ఉత్పన్నం అయి తన డైనమోలోని కడ్డీ తిరుగునట్లు చేసినదని గ్రామే గ్రహించాడు. అదే విద్యుత్ మోటారు మొదటి ప్రదర్శన కానప్పటికీ ,మొదటి ప్రయోగాత్మక ప్రదర్శన. డైనమో సామర్ధ్యాన్ని పెంచగలిగిన నమూనాలోని లక్షణాలే మోటర్ సామర్ధ్యాన్ని పెంచగలవని తెలుసుకోబడింది. ఆ సామర్ద్యం గల గ్రామే నమూనాలోని చిన్న అయస్కాంతాలతో నింపిన గాలి సందులు మరియు వివిధ భాగాలతో ఉన్న దిక్పరివర్తకంనకు అమర్చిన చాలా తీగచుట్టలు మొదలగునవే డి.సి.మోటార్ల తయారీకి మూలమని చెప్పవచ్చు.

పెద్ద డైనమోలు ఉత్పత్తి చేసే ఏకముఖ విద్యుత్ ప్రవాహంలో సమస్యలు తలెత్తవచ్చు, ఉదాహరణకు కొన్ని సందర్భాలలో రెండు లేక ఎక్కువ డైనామాలు ఒకేసారి పనిచేస్తున్నప్పుడు ఒకదాని కంటే మరొకటి తక్కువ శక్తితో పనిచేయవచ్చు. ఎక్కువ శక్తిగా ఇంజను ఉన్న డైనమో తక్కువ శక్తి గల ఇంజను ఉన్న డైనమోను తిరుగునట్లు చేయును. ఆ వ్యతిరేక ప్రేరణ శక్తి ఇంజనుకు తిరిగి వచ్చి తక్కువ శక్తి గల ఇంజనుతో పనిచేయు డైనమో అదుపు తప్పి అపాయం కలుగచేయవచ్చు. తర్వాత ఒకే సామర్ద్యం గల ఇంజన్లతో ఒక జాక్ శాఫ్ట్ తో పలు డైనమోలకు కలుపబడి ఉండి ఏకకాలంలో తిరుగబడే డైనమోలు ఈ రకమయిన విభేదాలను నిలువరిస్తాయని తెలుసుకున్నారు.

దిక్పరివర్తక డి.సి. విద్యుత్ ఉత్పాదక యంత్రముగా డైనమో[మార్చు]

ఏకాంతర విద్యుత్ ఉత్పాదక యంత్రమును కనుగొన్న తర్వాత ఏకాంతర విద్యుత్ ఉపయోగపడుతుందని మరియు దిక్పరివర్తక డి.సి. విద్యుత్ ఉత్పాదక యంత్రం అనగా డైనమో అని, స్లిప్పు రింగులు లేదా చక్రీయ అయస్కాంతాలు వాడే ఏ.సి.విద్యుత్ఉత్పాదక యంత్రములను ప్రత్యావర్తకాలు లేదా అల్టర్నేటర్ అని వాడుతున్నారు.

స్లిప్పు రింగులు లేదా చక్రీయ అయస్కాంతాలు వాడే ఏ.సి.విద్యుత్మోటర్ ను ఏకీకృత మోటారు మరియు దిక్పరివర్తక డి.సి.మోటార్ ను విద్యుత్ మోటర్ అనగా విద్యుత్ ఉత్పాదక యంత్ర సూత్రంతో పనిచేయునని అర్థం వచ్చునట్లు వాడుతున్నారు.

రోటరీ కన్వర్టర్ ప్రగతి[మార్చు]

డైనమోలను మోటార్లను కనుగొనక పూర్వము యాంత్రిక లేక విద్యుత్ శక్తి అను పదాలను రోటరీ కన్వర్టర్ ,తిరుగుడు పరికరం మొదలగువాటిలో వాడేవారు.అయినాకూడా వాటి ముఖ్య ఉద్దేశం పనిచేయుటకు యాత్రిక శక్తి అవసరం అని కాదు,విద్యుత్ ప్రవాహాన్ని డి.సి.నించి ఏ.సి.కి మార్చటానికి ఆ విధంగా విద్యుత్ ప్రవాహా దిశను మర్చేవి అని వాటి అసలు అర్థం. అవి ఒక రోటార్ లేదా పలు రోటార్లు బిన్న క్షేత్రాలాలో కలుపబడి ఉండేవి ,(వీటికి దిక్పరివర్తకాలు లేదా స్లిప్పు రింగులు అవసరం),అందులో ఒకటి అర్మేచర్ యొక్క చివరలకున్న రింగులకు తిరగటానికి కావలసిన శక్తి ని ఇస్తాయి మరియు మరికొన్ని అర్మేచర్ మిగిలిన కొనలకు కలుపబడి బహిర్గత విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తుంది.

రోటరీ కన్వర్టర్ అంతర్గతంగా ఉన్న ఏ రకమైన విద్యుత్ ప్రవాహాన్ని అయినా మరియొక దానిలోనికి మార్చగలుగుతుంది. ఇందులో ఏక ముఖ విద్యుత్ ప్రవాహాన్ని ఏకాంతర ప్రవాహంగా ,ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని ఏకముఖ ప్రవాహంగా మార్చుతుంది.మూడు ఫేజ్ ల మరియు ఒక ఫేజ్ గా,25 హెర్ట్జ్ ల ఏ.సి.ని 60 హెర్ట్జ్ ల ఏ.సి గా మరియు రకరకాల వోల్టేజీలతో విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చు. అనువర్తింప చేసిన శక్తి లో అనుకోకుండా అవాంతరం ఏర్పడిన రోటార్ చక్రాలు రు తిరుగుట ఆగిపోకుండా చేయుటకు రోటార్ ను పెద్ద పరిమాణాలలో పొడవు మరియు బరువు ఎక్కువగా ఉండునట్లు తయారుచేస్తారు. 1960 వ సం.వ.చివర్లో మరియు సాధ్యమయినంత వరకు కొన్ని సంవత్సరాల తర్వాత రోటరీ కన్వేర్టర్ లకు చిహ్నమయిన రోటార్ మాన్హట్టన్ లోని వెస్ట్ సైడ్ ఐ ఆర్ టి సబ్ వే లో ఇప్పటకీ వాడబడుతున్నది. అవి 25 HZ ఏ.సి.ల శక్తితో 600 వోల్టుల డి.సి.ల విద్యుత్ ను రైళ్ళ కొరకు ఉపయోగించారు.

20వ శతాబ్దంలో రోటరీ కన్వర్టర్ బదులుగా సాంకేతికంగా మార్పుచేసిన మెర్క్యురీ వేపర్ రెక్టిఫైర్ల వాడకం మొదలయింది. అవి చిన్నగా ఉండి కదలికలు మరియు శబ్దం రాకుండా ఉంటాయి మరియు తక్కవ పోషణ అవసరమవుతుంది. అవే మర్పుచేయబడిన పద్దతులు ఇప్పుడు ఘనపదార్థ సెమీకండక్టర్(వాహకం) ద్వారా చేయబడుతున్నవి.

ఆధునిక ఉపయోగం[మార్చు]

డైనమో లను ఇంకా కొన్ని తక్కవ శక్తి అవసరమయ్యే సందర్బాలలో, ముఖ్యంగా తక్కువ వోల్టేజీ డి.సి అవసరమైనప్పుడు వాడుతున్నారు. ఎందుకంటే ఆ సందర్బాలలో ప్రత్యావర్తక సెమీ కండక్టర్ రెక్టిఫైర్ సరి అయిన ఫలితాన్ని ఇవ్వలేదు. చేతితో త్రిప్పే క్రాంక్ డైనమోలు క్లాక్ వర్క్ రేడియో లలో, చేతితో వెలిగించే ఫ్లాష్ లైట్ లలో, మొబైల్ ఫోను చార్జ్ చేయు వస్తువులలో మరియు ఇతర మానవ శక్తితో నడిచే పరికరాలలో బ్యాటరీల రీచార్జు కొరకు ఉపయోగిస్తున్నారు.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • ప్రత్యావర్తకం
 • బాటిల్ డైనమో
 • క్రాంక్
 • విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసేది
 • హెన్రీ బ్రూక్స్ ఆడమ్స్
 • హెన్రీ వైల్డ్
 • హబ్ డైనమో
 • రేడియో ఐసోటోప్ ఉష్ణ విద్యుత్ జనరేటర్
 • సౌర ఘటం
 • ఉష్ణ ఉత్పాదక యంత్రం
 • అనుసంధాన పద్దతి
 • గాలి మర

సూచనలు[మార్చు]

 1. "Ányos Jedlik biography". Hungarian Patent Office. Retrieved 10 May 2009. 
 2. Simon, Andrew L. (1998). Made in Hungary: Hungarian contributions to universal culture. Simon Publications. p. 207. ISBN 0966573420. 
 3. Augustus Heller (April 2, 1896), "Anianus Jedlik", Nature (Norman Lockyer) 53 (1379): 516 
 4. Berliner Berichte. January 1867. 
 5. Proc. Royal Society. February 14, 1867. 
 6. Jeffrey La Favre. "The Brush Dynamo". 
 7. "The Brush Electric Light". Scientific American. 2 April, 1881.  Check date values in: |date= (help)

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"http://te.wikipedia.org/w/index.php?title=డైనమో&oldid=1422483" నుండి వెలికితీశారు