డైమ్లెర్‌

వికీపీడియా నుండి
(డైమ్లెర్‌క్రిస్లెర్ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


Daimler AG
రకం Aktiengesellschaft (మూస:FWB)
స్థాపితం 1883
ప్రధానకార్యాలయం Stuttgart, Germany
సేవా ప్రాంతము Worldwide
కీలక వ్యక్తులు Dieter Zetsche (CEO and Chairman of the management board), Manfred Bischoff (Chairman of the supervisory board)
పరిశ్రమ Automotive industry
ఉత్పత్తులు Automobiles, commercial vehicles (list of brands...)
ఆదాయం 78.92 billion (2009)[1]
నిర్వహణ రాబడి decrease (€1.513 billion) (2009)[1]
లాభము decrease (€2.640 billion) (2009)[1]
ఆస్తులు €128.8 billion (2009)[1]
ఉద్యోగులు 256,400 (2009)[1]
వెబ్‌సైటు www.daimler.com

డైమ్లెర్ ఏజీ (German pronunciation: [ˈdaɪmlɐ aːˈɡeː]; గతంలో డైమ్లెర్‌క్రిస్లర్ (DaimlerChrysler)  ; మూస:FWB) అనేది ఒక జర్మనీ కార్ల తయారీ సంస్థ. ఇది ప్రపంచంలో 13వ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా మరియు రెండో అతిపెద్ద ట్రక్కుల తయారీ కంపెనీగా గుర్తింపు పొందింది. ఆటోమొబైల్‌లతోపాటు, డైమ్లెర్ బస్సులు కూడా తయారు చేస్తుంది, అంతేకాకుండా తన అనుబంధ సంస్థ డైమ్లెర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా ఆర్థిక సేవలు అందిస్తుంది. ఏరోస్పేస్ గ్రూపు EADS, ఉన్నతస్థాయి-సాంకేతిక పరిజ్ఞాన సంస్థ మరియు వోడాఫోన్ మెక్‌లారెన్ మెర్సెడెజ్ రేసింగ్ జట్టు మాతృ సంస్థ మెక్‌లారెన్ గ్రూపు (ఇది ప్రస్తుతం ఒక సంపూర్ణ స్వతంత్ర కార్పోరేట్ సంస్థగా మారే క్రమంలో ఉంది[2]) మరియు జపనీస్ కార్ల తయారీ సంస్థ మిత్సుబిషి ఫుసో ట్రక్ అండ్ బస్ కార్పొరేషన్‌లలో ఈ కంపెనీ ప్రధాన వాటాదారుగా ఉంది.

జర్మనీలోని స్టట్‌గార్ట్‌కు చెందిన మెర్సెడెజ్-బెంజ్ తయారీదారు డైమ్లెర్-బెంజ్ (1926–1998) అమెరికాకు చెందిన క్రిస్లెర్ కార్పొరేషన్‌తో విలీనం ద్వారా డైమ్లెర్‌క్రిస్లెర్ 1998లో స్థాపించబడింది. ఈ విలీన ఒప్పందంతో డైమ్లెర్ క్లిస్లెర్ అనే కొత్త సంస్థ ఏర్పాటయింది. ఇదిలా ఉంటే, ఈ కొనుగోలు తరువాత అట్లాంటిక్ ప్రాంత ఆటోమోటివ్ దిగ్గజంగా ఈ సంస్థ ఆశించిన స్థాయిలో ఫలితాలు అందించలేకపోయింది, దీని ఫలితంగా డైమ్లెర్‌క్రిస్లెర్ 2007 మే 14న క్రిస్లెర్‌ను న్యూయార్క్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సెర్బెరస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్‌కు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది, సెర్బెరస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ సమస్యాత్మక కంపెనీలను పునర్నిర్మించడంలో ప్రత్యేకత కలిగివుంది.[3] 2007 అక్టోబరు 4న, డైమ్లెర్‌క్రిస్లెర్ యొక్క ఒక అసాధారణ వాటాదారుల సమావేశంలో కంపెనీ పేరు మార్చే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. 2007 అక్టోబరు 5 నుంచి కంపెనీ పేరును డైమ్లెర్ ఏజీ (AG) గా మార్చారు.[4] US కంపెనీ 2007 ఆగస్టు 3న విక్రయం పూర్తయిన తరువాత తన పేరును క్రిస్లెర్ LLCగా మార్చుకుంది.

మెర్సెడెజ్-బెంజ్, మేబ్యాచ్, స్మార్ట్, ఫ్రైట్‌లైనర్ మరియు అనేక ఇతర బ్రాండ్‌లతో డైమ్లెర్ కార్లు మరియు ట్రక్కులు తయారు చేస్తుంది.

చరిత్ర[మార్చు]

డైమ్లెర్ ఏజీ అనేది జర్మనీకి చెందిన ఆటోమొబైల్స్, మోటారు వాహనాలు, ఇంజిన్‌లు తయారు చేసే సంస్థ, ఇది ఒక శతాబ్దం క్రితం నుంచి వీటిని తయారు చేస్తుంది.

1924 మే 1న కార్ల్ బెంజ్ యొక్క బెంజ్ & సీ (1883లో స్థాపించబడింది) మరియు గోట్‌లీబ్ డైమ్లెర్ మరియు విల్‌హెల్మ్ మేబ్యాచ్‌లకు చెందిన డైమ్లెర్ మోటోరెన్ గెసెల్‌షాఫ్ట్ (1890లో స్థాపించబడింది) కంపెనీలు ఒక పరస్పర ప్రయోజన ఒప్పందం పై సంతకం చేశాయి.

రెండు కంపెనీలు చాలా కాలంపాటు వేర్వేరుగా తమ ఆటోమొబైల్ మరియు అంతర్గత దహన యంత్రాలు (ఇంటర్నల్ కంబష్చన్ ఇంజిన్‌లు) తయారు చేయడం కొనసాగించాయి, అయితే 1926 జూన్ 28న బెంజ్ & సీ. మరియు డైమ్లెర్ మోటోరెన్ గాసెల్‌షాఫ్ట్ ఏజీ అధికారికంగా విలీనమై డైమ్లెర్-బెంజ్ ఏజీ అనే కొత్త సంస్థ ఏర్పాటయింది- ఆ తరువాత నుంచి అన్ని కర్మాగారాలు మెర్సెడెజ్-బెంజ్ అనే బ్రాండ్ పేరుతో తమ ఆటోమొబైల్స్ తయారు చేయడం ప్రారంభించాయి.

1998లో డైమ్లెర్-బెంజ్ ఏజీ సంస్థ అమెరికాకు చెందిన ఆటోమొబైల్ తయారీదారు క్రిస్లెర్ కార్పొరేషన్‌తో విలీనమై డైమ్లెర్‌క్రిస్లెర్ ఏజీ అనే సంస్థ ఏర్పాటయింది. 2007లో క్రిస్లెర్ గ్రూపును సెర్బెరస్ క్యాపిటిల్ మేనేజ్‌మెంట్‌కు విక్రయించిన తరువాత, మాతృ సంస్థ పేరు డైమ్లెర్ ఏజీ గా మార్చారు.

డైమ్లెర్ ఏజీ యొక్క కాలక్రమం[మార్చు]

బెంజ్ & కంపెనీ, 1883–1926
డైమ్లెర్ మోటోరెన్ గాసెల్‌షాఫ్ట్ ఏజీ, 1890–1926
డైమ్లెర్-బెంజ్ ఏజీ, 1926–1998
డైమ్లెర్‌క్రిస్లెర్ ఏజీ, 1998–2007
డైమ్లెర్ ఏజీ, 2007–ప్రస్తుతం

గతంలో క్రిస్లెర్ కార్యకలాపాలు[మార్చు]

డైమ్లెర్ క్రిస్లెర్ ఏజీగా ఉన్నప్పుడు డైమ్లెర్ ఏజీ యొక్క మాజీ లోగో

ఇటీవల సంవత్సరాల్లో క్రిస్లెర్‌కు వరుసగా పలు ఎదురుదెబ్బలు తగిలాయి, డైమ్లెర్‌క్రిస్లెర్ యొక్క ఒప్పందంతో దానిని సెర్బెరస్ కాపిటల్ మేనేజ్‌మెంట్‌కు మే 2007లో US$6 బిలియన్‌లకు విక్రయించడం జరిగింది. తన చరిత్రవ్యాప్తంగా, క్రిస్లెర్ USలో మొదటి మూడు అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటిగా ఉంది, అయితే జనవరి 2007లో డైమ్లెర్‌క్రిస్లెర్ తన యొక్క లగ్జరీ కార్లు మెర్సెడెజ్ మరియు మేబ్యాచ్‌లను మినహాయించి, సాంప్రదాయికంగా రెండో స్థానంలో ఉన్న ఫోర్డ్ కంటే ఎక్కువ కార్ల విక్రయాలు జరిపింది, అయితే జనరల్ మోటార్స్ మరియు టయోటా కంటే విక్రయాలుపరంగా వెనుకబడింది.

2006లో క్రిస్లెర్ US$1.5 బిలియన్లు నష్టపోయినట్లు వెల్లడించింది. ఆ తరువాత ఫిబ్రవరి 2007 మధ్యకాలంలో 13,000 ఉద్యోగాలను తొలగించేందుకు ప్రణాళికలు ప్రకటించింది, అంతేకాకుండా ఒక ప్రధాన అసెంబ్లీ ప్లాంట్‌ను మూసివేయడంతోపాటు, 2008నాటికి లాభాలను పునరుద్ధరించేందుకు ఇతర ప్లాంట్‌లలో ఉత్పత్తిని తగ్గించనున్నట్లు వెల్లడించింది.[5]

సీనియర్ మేనేజ్‌మెంట్ ప్రకటించిన విధంగా సమానవాటాల విలీనంతో లావాదేవీలు జరుగుతాయా లేదా డైమ్లెర్-బెంజ్ పూర్తిగా క్రిస్లెర్‌ను కొనుగోలు చేయనుందా అనే విషయాలను స్పష్టం చేసుకునేందుకు పెట్టుబడిదారులు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో విలీనం వివాదాస్పదమైంది. ఆగస్టు 2003లో ఒక క్లాస్ యాక్షన్ ఇన్వెస్టర్ లాసూట్ (ఒక పెద్ద సమూహం తరపున ఒక ప్రాతినిధ్య వ్యక్తి నమోదు చేసే కేసు) US$300 మిలియన్‌ల వద్ద పరిష్కరించబడింది, బిలియనీర్ ఇన్వెస్టర్ కార్యకర్త కిర్క్ కెర్కోరియాన్ దాఖలు చేసిన వ్యాజ్యం 2005 ఆగస్టు 7న తిరస్కరించబడింది.[6] ఈ లావాదేవీ ఫలితంగా క్రిస్లెర్ నిర్మాత, ఛైర్మన్ జుర్జెన్ ఈ. ష్రెంప్ తన బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది, విలీన లావాదేవీల తరువాత కంపెనీ వాటా ధర పడిపోవడానికి బాధ్యతవహిస్తూ ఆయన 2005 చివరికాలంలో రాజీనామా చేశారు. బిల్ వ్లాసిక్ మరియు బ్రాండ్లే ఎ స్టెర్ట్‌లు రాసిన టేకెన్ ఫర్ ఎ రైడ్: హౌ డైమ్లెర్-బెంజ్ డ్రోవ్ ఆఫ్ విత్ క్రిస్లెర్ (2000) పుస్తకంలో ఈ విలీనం కథా వస్తువుగా ఉంది.[7]

ఈ విలీనంతో హామీ ఇచ్చిన సమష్టి చర్యను అందించడం మరియు రెండు వ్యాపారాలు విజయవంతంగా సమగ్రపరచడం జరిగాయా లేదా అనేది కూడా వివాదాస్పదమైంది. 2002లో, డైమ్లెర్‌క్రిస్లెర్ రెండు స్వతంత్ర ఉత్పత్తులను నిర్వహించనున్నట్లు సంకేతాలు కనిపించాయి. అయితే ఆ ఏడాది, కంపెనీ యొక్క రెండు విభాగాలను సమగ్రపరిచిన ఉత్పత్తులు ఆవిష్కరించబడ్డాయి, దీనికి ఉదాహరణ క్రిస్లెర్ క్రాస్‌ఫైర్, ఇది మెర్సెడెజ్ SLK ఆధారంగా, మెర్సెడెజ్ యొక్క 3.2L V6తో తయారు చేయబడింది, ఇదిలా ఉంటే డోడ్జ్ స్ప్రింటర్/ఫ్రైట్‌లైనర్ స్ప్రింటర్‌లతో ఒక మెర్సెడెజ్-బెంజ్ స్ప్రింటర్ వ్యాను తయారు చేశారు. నాలుగో-తరం జీప్ గ్రాండ్ చెరోకీని మెర్సెడెజ్-బెంజ్ ఎం-తరగతి ఆధారంగా తయారు చేశారు, డైమ్లెర్/క్రిస్లెర్ విడిపోయిన తరువాత సుమారుగా నాలుగేళ్లకు దీనిని తయారు చేయడం గమనార్హం.[8]

క్రిస్లెర్ విక్రయం[మార్చు]

డైమ్లెర్‌క్రిస్లెర్ 2007 ప్రారంభంలో క్రిస్లెర్‌ను విక్రయించేందుకు కార్ల తయారీ కంపెనీలు మరియు పెట్టుబడి సంస్థలను పదేపదే ఆశ్రయించింది. జనరల్ మోటార్స్ దీనిపై ఆసక్తి ఉన్న ఒక కంపెనీగా ప్రచారం జరగ్గా, వోక్స్‌వ్యాగన్, రెనాల్ట్-నిస్సాన్ ఆటో అలెయన్స్, మరియు హ్యుందాయ్ మోటార్ కంపెనీ తమకు ఈ కంపెనీ కొనుగోలుపై ఆసక్తి లేదని వెల్లడించాయి.

2007 ఆగస్టు 3న, డైమ్లెర్‌క్రిస్లెర్ కంపెనీ క్రిస్లెర్ గ్రూపును సెర్బెరస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్‌కు విక్రయించింది. కొత్త కంపెనీ క్రిస్లెర్ హోల్డింగ్ LLCలో సెర్బెరస్ 80.1 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు, ఇదిలా ఉంటే డైమ్లెర్ ఏజీగా పేరు మార్చుకున్న డైమ్లెర్‌క్రిస్లెర్ మిగిలిన 19.9% శాతం వాటాను తన వద్దే ఉంచుకోనున్నట్లు అసలు ఒప్పందం వెల్లడించింది.[9]

ఈ ఒప్పందంలోని నిబంధనల ప్రకారం క్రిస్లెర్‌లో ఈ వాటాను నిలిపివుంచుకునేందుకు మరియు సంబంధిత బాధ్యతల కోసం సెర్బెరస్‌కు డైమ్లెర్ US$650 మిలియన్‌లు చెల్లించాల్సి వచ్చింది. 1998లో క్రిస్లెర్‌ను కొనుగోలు చేసేందుకు డైమ్లెర్ US$36 బిలియన్‌లు చెల్లించడం గమనార్హం, తాజా లావాదేవీలకు, ముందు చెల్లించిన మొత్తానికి భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. క్రిస్లెర్‌ను తాజాగా US$7.4 బిలియన్‌లకు కొనుగోలు చేసిన సెర్బెరస్ కాపిటల్ మేనేజ్‌మెంట్ క్రిస్లెర్ హోల్టింగ్స్‌లో US$5 బిలియన్‌లు మరియు క్రిస్లెర్ యొక్క ఆర్థిక సేవల విభాగంలో US$1.05 బిలియన్‌ల పెట్టుబడి పెట్టింది. డైమ్లెర్‌క్రిస్లెర్ నుంచి బయటకు వచ్చిన డైమ్లెర్ ఏజీకి సెర్బెరస్ నుంచి నేరుగా US$1.05 బిలియన్‌ల నగదు అందుతుంది, అయితే ఈ కంపెనీ క్రిస్లెర్‌లోనే ప్రత్యక్షంగా US$2 బిలియన్‌ల పెట్టుబడి పెట్టింది.

క్రిస్లర్ 2009లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో దివాలా దరఖాస్తు పెట్టిన తరువాత, క్రిస్లెర్‌ను ఇటాలియన్ కార్ల తయారీ కంపెనీ ఫియట్ తన నియంత్రణలోకి తీసుకుంది, గతంలో డైమ్లెర్ చేసిన విధంగా, క్రిస్లెర్ యొక్క ఉత్పత్తులను తన ఉత్పత్తులతో కలిపేందుకు ఫియట్ నిరాకరించింది, ముఖ్యంగా తన ప్రసిద్ధ లాన్సియా మరియు క్రిస్లెర్ యొక్క పేరుమీద ఉన్న బ్రాండ్‌లను కలిపేందుకు నిరాసక్తి చూపింది.

రెనాల్ట్-నిస్సాన్ మరియు డైమ్లెర్ అలెయన్స్[మార్చు]

2010 ఏప్రిల్ 7న, రెనాల్ట్-నిస్సాన్ ఎగ్జిక్యూటివ్ కార్లోస్ గోసన్ మరియు డాక్టర్ డైటెర్ జెట్‌షి‌లు ఒక ఉమ్మడి విలేకరుల సమావేశంలో మూడు కంపెనీల మధ్య ఒక భాగస్వామ్యాన్ని ప్రకటించారు.[10]

నిర్వహణ[మార్చు]

2006 జనవరి 1న డాక్టర్ డైటెర్ జెట్‌షి డైమ్లెర్ ఛైర్మన్‌గా మరియు మెర్సెడెజ్-బెంజ్ అధిపతిగా ఉన్నారు, అంతేకాకుండా 1998 నుంచి నిర్వహణ బోర్డు సభ్యుడిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన గతంలో క్రిస్లెర్, LLC యొక్క అధ్యక్షుడు మరియు సీఈవోగా కూడా పనిచేశారు (గతంలో డైమ్లెర్ ఏజీకి చెందిన సంస్థ), క్రిస్లెర్ యొక్క ప్రచార కార్యక్రమం "ఆస్క్ డాక్టర్ జెడ్" ద్వారా ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో డాక్టర్ జెడ్‌గా ప్రాచుర్యం పొందారు.

డైమ్లెర్ ఏజీ యొక్క ప్రస్తుత నిర్వహణ బోర్డు సభ్యులు:

 • డాక్టర్ డైటెర్ జెట్‌షి: బోర్డు ఛైర్మన్, మెర్సెడెజ్-బెంజ్ కార్స్ అధిపతి.
 • డాక్టర్ వుల్ఫ్‌గ్యాంగ్ బెర్న్‌హార్డ్: మెర్సెడెజ్-బెంజ్ కార్స్ సేకరణ మరియు ఉత్పత్తి విభాగ అధిపతి.
 • విల్‌ఫ్రైడ్ పోర్త్: మానవ వనరులు మరియు కార్మిక సంబంధాల విభాగ అధిపతి.
 • ఆండ్రియాస్ రెన్‌ష్లెర్: డైమ్లెర్ ట్రక్స్ అధిపతి.
 • బోడో యుబెర్: ఆర్థిక మరియు నియంత్రణ విభాగాలతోపాటు, ఆర్థిక సేవల విభాగ అధిపతి.
 • డాక్టర్ థామస్ వెబెర్: గ్రూప్ రీసెర్చ్ మరియు మెర్సెడెజ్-బెంజ్ కార్స్ డెవెలప్‌మెంట్ అధిపతి.

డైమ్లెర్ ఏజీ యొక్క పర్యవేక్షక బోర్డు ప్రస్తుత సభ్యులు: హెన్రిచ్ ఫ్లెగెల్, జ్యుర్జెన్ హాంబ్రెచ్, థామస్ క్లెబ్, ఎరిచ్ క్లెమ్, అర్నౌద్ లాగార్డెర్, జుర్జెన్ లాంగర్, హెల్ముట్ లెన్స్, సారీ బాల్డౌఫ్, విలియమ్ ఒవెన్స్, అన్స్‌గార్ ఓసెఫోర్త్, వాల్టర్ శాంచెస్, మ్యాన్‌ఫ్రెడ్ ష్నీడెర్, స్టెఫాన్ ష్వాబ్, బెర్న్‌హార్డ్ వాల్టర్, లింటన్ విల్సన్, మార్క్ వోస్నెర్, మ్యాన్‌ఫ్రెడ్ బిషోఫ్, క్లెమెన్స్ బోర్సిగ్ మరియు ఉవ్ వెర్నెర్. డాక్టర్ మాన్‌ఫ్రెడ్ బిషోఫ్ డైమ్లెర్ ఏజీ యొక్క పర్యవేక్షక బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు, ఎరిచ్ క్లెమ్ వైస్-ఛైర్మన్ విధులు నిర్వహిస్తున్నారు.[11]

వాటాదారుల నిర్మాణం[మార్చు]

యాజమాన్యాలవారీగా [12]

ప్రాంతాలవారీగా [12]

 • 30.0% జర్మనీ
 • 33.5% ఐరోపాయేతర దేశాలు
 • 17.9% అమెరికా సంయుక్త రాష్ట్రాలు
 • 9.1% యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
 • 6.9% కువైట్
 • 2.6% ఇతరాలు

బ్రాండ్‌లు[మార్చు]

డైమ్లెర్ ప్రపంచవ్యాప్తంగా ఈ కింది పేర్లతో వాహనాలను విక్రయిస్తుంది:

 • మెర్సెడెజ్-బెంజ్ కార్లు
  • మేబ్యాచ్
  • మెర్సెడెజ్-బెంజ్
  • స్మార్ట్
  • మెర్సెడెజ్-AMG
 • డైమ్లెర్ ట్రక్కులు
  • వాణిజ్యపరమైన వాహనాలు
   • ఫ్రైట్‌లైనర్
   • మెర్సెడెజ్-బెంజ్ (ట్రక్ గ్రూప్)
   • మిత్సుబిషి ఫుసో
   • థామస్ బిల్ట్ బసెస్
   • స్టెర్లింగ్ ట్రక్‌లు - 2010లో కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి.
   • వెస్ట్రన్ స్టార్
  • భాగాలు
   • డెట్రాయిట్ డీజిల్
   • మెర్సెడెస్-బెంజ్
   • మిత్సుబిషి ఫుసో
 • డైమ్లెర్ బస్సులు
  • మెర్సెడెజ్-బెంజ్ బస్సులు
  • ఓరియన్ బస్ ఇండస్ట్రీస్
  • సెట్రా
 • మెర్సెడెజ్-బెంజ్ వ్యాన్‌లు
  • మెర్సెడెజ్-బెంజ్ (వ్యాన్స్ గ్రూప్)
 • డైమ్లెర్ ఆర్థిక సేవలు
  • మెర్సెడెజ్-బెంజ్ బ్యాంక్
  • మెర్సెడెజ్-బెంజ్ ఫైనాన్షియల్
  • డైమ్లెర్ ట్రక్ ఫైనాన్షియల్

వాటాలు ఉన్న కంపెనీలు[మార్చు]

డైమ్లెర్ ప్రస్తుతం ఈ కింది కంపెనీల్లో వాటాలు కలిగివుంది:

 • జపాన్‌కు చెందిన మిత్సుబిషి ఫుసో ట్రక్ అండ్ బస్ కార్పొరేషన్‌లో 85.0%
 • కెనడాకు చెందిన ఆటోమోటివ్ ఫ్యూయల్ సెల్ కోఆపరేషన్‌లో 50.1%
 • యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన మెక్‌లారెన్ గ్రూపులో 11% (మెక్‌లారెన్ గ్రూపు క్రమక్రమంగా ఈ వాటాను వెనక్కు తీసుకుంటుంది, ఈ ప్రక్రియ 2011లో పూర్తయ్యే అవకాశం ఉంది)
 • యూరోపియన్ ఏరోనాటిక్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీ (EADS) లో 22.4% - ఇది ఐరోపాకు చెందిన ఎయిర్‌బస్ మాతృ సంస్థ
 • జర్మనీకి చెందిన టోగ్నమ్‌లో 22.3%
 • రష్యాకు చెందిన కామజ్‌లో 10.0%
 • అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన టెస్లా మోటార్స్‌లో 10.0%

భాగస్వాములు[మార్చు]

టెస్లా యొక్క బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డైమ్లెర్ 1,000 చిన్న స్మార్ట్ కార్‌ల ఎలక్ట్రిక్ వెర్షన్‌లను తయారు చేసింది.[13] ఆమన్ ట్రక్కులను తయారు చేసేందుకు డైమ్లెర్ చైనాకు చెందిన బీఖీ ఫోటోన్ (BAIC యొక్క అనుబంధ సంస్థ) తో కలిసి పనిచేస్తుంది, [14] EV సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు BYDతో కలిసి పనిచేస్తుంది.[15]

లంచం మరియు అవినీతి[మార్చు]

ప్రధాన వ్యాసం: Oil-for-Food Programme § Daimler AG Kickbacks Case

2010 ఏప్రిల్ 1న, డైమ్లెర్ ఏజీ యొక్క జర్మనీ మరియు రష్యా అనుబంధ సంస్థలపై రెండు న్యాయస్థానాల్లో U.S. న్యాయ శాఖ మరియు U.S. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ దాఖలు చేసిన లంచం అభియోగాల్లో అవి దోషులుగా నిర్ధారించబడ్డాయి. పరిష్కారం కింద డైమ్లెర్ US$185 మిలియన్‌లు చెల్లించాల్సి వచ్చింది, అయితే కంపెనీ మరియు దాని చైనా అనుబంధ సంస్థ రెండేళ్లపాటు వాయిదావేసిన విచారణ ఒప్పందానికి పాత్రమై ఉన్నాయి, దీనికి అవి తిరిగి న్యాయస్థానంలోకి అడుగుపెట్టే సమయం వరకు నియంత్రణ సంస్థలకు మరింత సహకరించడం, అంతర్గత నియంత్రణలకు కట్టుబడి ఉండటం మరియు ఇతర నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి వచ్చింది. ఈ రెండేళ్లకాలంలో కంపెనీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోనట్లయితే డైమ్లెర్ మరింత తీవ్రమైన జరిమానాలు ఎదుర్కొంటుంది.

అంతేకాకుండా, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మాజీ డైరెక్టర్ లూయిజ్ జే. ఫ్రీహ్ లంచం-నిరోధక చట్టాలకు డైమ్లెర్ అనుగుణంగా వ్యవహరించడాన్ని పర్యవేక్షించేందుకు ఒక స్వతంత్ర పర్యవేక్షకుడిగా ఉన్నారు.

డైమ్లెర్ కీలకమైన అధికారులు, డైమ్లెర్ ఆధీన సంస్థలు మరియు డైమ్లెర్ అనుబంధ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ కాంట్రాక్టులు పొందేందుకు 1998 మరియు 2008 మధ్యకాలంలో అక్రమంగా విదేశీ అధికారులకు డబ్బు మరియు బహుమతులు ఇచ్చినట్లు U.S. విచారణకర్తలు ఆరోపించారు. 22 దేశాల్లో (చైనా, రష్యా, టర్కీ, హంగేరీ, గ్రీస్, లాట్వియా, సెర్బియా మరియు మోంటెనెగ్రో, ఈజిప్ట్ మరియు నైజీరియా, మరికొన్ని ఇతర దేశాలతోసహా) 22 లావాదేవీల ద్వారా డైమ్లెర్ అక్రమంగా $56 మిలియన్‌ల లంచం ఇచ్చిందని, దీనికి బదులుగా కంపెనీ $1.9 బిలియన్‌ల ఆదాయాన్ని ఆర్జించిపెట్టిన కాంట్రాక్టులు పొందినట్లు, తద్వారా కనీసం $91.4 మిలియన్‌ల అక్రమ లాభాలు పొందినట్లు ఈ కేసుపై జరిపిన దర్యాప్తులో వెల్లడైంది.[16]

డైమ్లెర్‌క్రిస్లెర్ కార్పొరేషన్ యొక్క ఒక మాజీ ఆడిటర్ డేవిడ్ బాజెట్టాను దక్షిణాఫ్రికాలో మెర్సెడెజ్-బెంజ్ కేంద్రాల నియంత్రణలో ఉన్న బ్యాంకు ఖాతాల గురించి ప్రశ్నించినందుకు ఆ కంపెనీ ఉద్యోగం తొలగించింది, దీనిపై ఆయన విజిల్‌బ్లోవెర్ ఫిర్యాదు దాఖలు చేసిన తరువాత 2004లో SEC కేసు తెరపైకి వచ్చింది.[17] జూలై 2001లో స్టట్‌గార్ట్‌లో జరిగిన కార్పొరేట్ ఆడిట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో విదేశీ అధికారులకు లంచాలు ఇచ్చేందుకు వ్యాపార కేంద్రాలు రహస్య బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్నట్లు తాను గుర్తించినట్లు బాజెట్టా ఆరోపించారు, కంపెనీకి కూడా ఇటువంటి కార్యకలాపాలు U.S. చట్టాలకు వ్యతిరేకమైనవని తెలుసని పేర్కొన్నారు.

బాజెట్టాను బుజ్జగించేందుకు మరో ప్రయత్నంలో భాగంగా, డైమ్లెర్ తరువాత అతని ఉద్యోగ తొలగింపు వివాదాన్ని న్యాయస్థానం బయట పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేపట్టింది, చివరకు ఆయన ఈ పరిష్కారానికి అంగీకరించారు. అయితే బాజెట్టా విషయంలో డైమ్లెర్ అనుసరించిన వ్యూహం విఫలమైంది, ఎందుకంటే అప్పటికే లంచం-నిరోధక చట్టాలను అతిక్రమించినందుకు U.S. నేర దర్యాప్తు మొదలైంది, ఈ విదేశీ సంస్థపై నమోదయిన బాగా వైవిధ్యమైన కేసుల్లో ఇది కూడా ఒకటి.

అభియోగాలు ప్రకారం, ఖాతాదారులకు ఎక్కువ బిల్లులను పంపడం ద్వారా తరచుగా లంచాలు ఇచ్చారు, అదనంగా సేకరించిన డబ్బును ప్రభుత్వ ఉన్నత అధికారులకు లేదా నియంత్రణ అధికారులకు ఇవ్వడం జరిగింది. విలాసవంతమైన ఐరోపా వినోద పర్యటనల రూపంలో మరియు ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారులకు ఆయుధసహిత మెర్సెడెజ్ వాహనాలు ఇవ్వడం మరియు ఒక బంగారు పెట్టె మరియు ఒక టర్క్‌మెనిస్థాన్ అధికారికి వ్యక్తిగత మేనిఫెస్టోను జర్మనీ భాషలోకి అనువదించిన 10,000 కాపీలు, తదితరాల రూపంలో కూడా లంచాలను ఇవ్వడం జరిగింది.

అమెరికా సంయుక్త రాష్ట్రాల ఇరాక్‌కు సంబంధించిన ఆయిల్-ఫర్-ఫుడ్ ప్రోగ్రామ్ నిబంధనలను కూడా కంపెనీ ఉల్లంఘించినట్లు పరిశోధకులు ఆరోపించారు, సద్దాం హుస్సేన్ నేతృత్వంలోని ఇరాక్ ప్రభుత్వంలోని అధికారులకు కాంట్రాక్టు విలువలో 10% విలువైన ముడుపులు ఇచ్చినట్లు గుర్తించారు. అవినీతిమయమైన ఆయిల్-ఫర్-ఫుడ్ ఒప్పందాల్లో వాహనాలు మరియు విడిభాగాల విక్రయం నుంచి $4 మిలియన్‌ల లంచాలు ఇచ్చినట్లు SEC పేర్కొంది.[16]

U.S.లోని షెల్ కంపెనీల ద్వారా కూడా కొన్ని లంచాలు చెల్లించినట్లు U.S. విచారణకర్తలు ఆరోపించారు.కొన్ని కేసుల్లో, డైమ్లెర్ ఈ అక్రమమైన చెల్లింపులకు U.S. బ్యాంకు ఖాతాలు లేదా U.S. షెల్ కంపెనీల యొక్క అమెరికా విదేశీ బ్యాంకు ఖాతాలను ఉపయోగించినట్లు న్యాయస్థాన పత్రాలు సూచిస్తున్నాయి.[18]

లంచాలు ఇవ్వడాన్ని సుదీర్ఘకాలంగా డైమ్లెర్ కొనసాగిస్తుందని విచారణకర్తలు పేర్కొన్నారు, కార్పొరేట్ సంస్కృతిలో భాగంగానే ఈ పద్ధతిని ప్రోత్సహించిందన్నారు.

"విదేశీ బ్యాంకు ఖాతాలు, తృతీయ-పక్ష ఏజెంట్‌లను మరియు మోసపూరిత ధర నిర్ణయ పద్ధతులను ఉపయోగించి ఈ కంపెనీలు [డైమ్లెర్ ఏజీ, దాని ఆధీన మరియు అనుబంధ సంస్థలు] వ్యాపారాన్ని చేసేందుకు విదేశీయులకు లంచాలు ఇచ్చే వ్యవహారాలను నిర్వహించాయని న్యాయ శాఖ క్రిమినల్ విభాగంలో ప్రిన్సిపాల్ డిప్యూటీగా ఉన్న మిథిలీ రామన్ పేర్కొన్నారు.[19]

"డైమ్లెర్ కంపెనీలో అవినీతి మరియు లంచం చెల్లింపులను ఒక ప్రామాణిక వ్యాపార విధానంగా వర్ణించడం అతిశయోక్తి కాదని SEC యొక్క చట్టఅమలు విభాగ డైరెక్టర్ రాబర్ట్ ఖుజామీ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.[20]

"గత అనుభవం నుంచి మనం చాలా నేర్చుకున్నామని," డైమ్లెర్ బోర్డు ఛైర్మన్ డైటెర్ జెట్‌షి ఒక ప్రకటనలో చెప్పారు.

విచారణకర్తల వాదన ప్రకారం, రెండు డైమ్లెర్ అనుబంధ సంస్థలు తెలిసే విదేశీ అవినీతి పద్ధతులు చట్టాన్ని ఉల్లంఘించినట్లు అంగీకరించాయి, వ్యాపారాన్ని పొందేందుకు విదేశీ అధికారులకు కంపెనీలు మరియు వాటి అధికారులు లంచాలు చెల్లించడాన్ని ఈ చట్టం నిరోధిస్తుంది.[21] విదేశీ అవినీతి పద్ధతుల చట్టం U.S. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో వాటాలు నమోదు చేసిన ప్రతి కంపెనీకి వర్తిస్తుంది. డైమ్లెర్ ఏజీ కంపెనీ "DAI" గుర్తుతో NYSEలో నమోదయింది, దీంతో ఈ జర్మనీ కార్ల తయారీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరిపిన చెల్లింపులు అమెరికా ప్రభుత్వ అధికార పరిధిలోకి వచ్చాయి.

అమెరికా సంయుక్త రాష్ట్రాల వాషింగ్టన్ D.C. జిల్లా కోర్టు న్యాయమూర్తి రిచర్డ్ జే. లియోన్ నేరాంగీకారాన్ని మరియు పరిష్కారాన్ని ఆమోదించారు, దీనిని కేవలం ఒక పరిష్కారంగా ఆయన పేర్కొన్నారు.

ప్రాథమిక కేసు USA v. డైమ్లెర్ AG, యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, నెం. 10-00063.[22]

ప్రత్యామ్నాయ చోదనం (ఆల్టర్నేటివ్ ప్రొపల్షన్)[మార్చు]

జీవఇంధన పరిశోధన[మార్చు]

జాత్రోఫాను ఒక జీవఇంధనంగా అభివృద్ధి చేసేందుకు ఆర్చెర్ డేనియల్స్ మిడ్‌ల్యాండ్ కంపెనీ మరియు బేయెర్ క్రాప్‌సైన్స్ కంపెనీలతో డైమ్లెర్ ఏజీ ఒక ఉమ్మడి ప్రాజెక్టులో పాలుపంచుకుంటుంది.[23]

రవాణా విద్యుద్దీకరణ[మార్చు]

కార్లతయారీ సంస్థ డైమ్లెర్ ఏజీ మరియు యుటిలిటీ (టెలిఫోన్, నీటి సరఫరా, విద్యుత్ మొదలైన సౌకర్యాలు) కంపెనీ RWE AGలు జర్మనీ రాజధాని బెర్లిన్‌లో "ఇ-మొబిలిటీ బెర్లిన్" అని పిలిచే ఒక ఉమ్మడి ఎలక్ట్రిక్ కార్ అండ్ ఛార్జింగ్ స్టేషను టెస్ట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నాయి.[24][25]

మెర్సెడెజ్-బెంజ్ ఒక హైబ్రిడ్ డ్రైవ్ సిస్టమ్ గల తమ మొదటి ప్యాసింజర్ కార్ నమూనా మెర్సెడెజ్-బెంజ్ ఎస్ 400 హైబ్రిడ్‌ను ఆవిష్కరించింది.[25]

హైబ్రిడ్ సిస్టమ్స్‌లో డైమ్లెర్ ట్రక్స్ ప్రపంచ మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయిస్తుంది. తమ "షేపింగ్ ఫ్యూచర్ ట్రాన్స్‌పోర్టేషన్" కార్యక్రమం ద్వారా డైమ్లెర్ ట్రక్కులు మరియు బస్సుల అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. జపాన్‌లో ప్రాక్టికల్ ట్రయిల్స్‌లో మిత్సుబిషి ఫుసో "ఏరో స్టార్ ఎకో హైబ్రిడ్" ఇప్పుడు కొత్త ప్రమాణాలు సృష్టిస్తుంది.[26]

ఫార్ములావన్[మార్చు]

2009 నవంబరు 16న, బ్రాన్ GPలో డైమ్లెర్ 75.1% వాటాను కొనుగోలు చేసింది. దీనికి కంపెనీ మెర్సెడెజ్ GP అనే పేరు పెట్టింది. రాస్ బ్రాన్ మాత్రం జట్టు ప్రధాన అధికారిగా ఉన్నారు, జట్టు కూడా UKలోని బ్రాక్లే నుంచి నిర్వహించబడుతుంది. మెక్‌లారెన్‌లో తన 40% వాటాను దశవారీగా విక్రయిస్తున్న కారణంగా డైమ్లెర్, తిరిగి బ్రాన్‌లో వాటా కొనుగోలు చేసింది, మెక్‌లారెన్‌లో తన వాటాల పూర్తి విక్రయం 2011లో పూర్తి కానుంది. అయితే 2015 వరకు మెక్‌లారెన్‌కు మెర్సెడెజ్ స్పాన్సర్‌షిప్‌ను అందించడంతోపాటు మరియు ఇంజిన్‌లను సరఫరా చేయడం కొనసాగించనుంది. ఆ సమయానికి మెక్‌లారెన్ కొత్త ఇంజిన్ సరఫరాదారును వెతుక్కోవాలి లేదా సొంత ఇంజిన్‌లు తయారు చేసుకోవాలి. కొత్త కంపెనీలో మెర్సెడెజ్ 45.1% వాటాను కలిగివుండగా, ఆబర్ ఇన్వెస్ట్‌మెంట్స్ 30% వాటాను, రాస్ బ్రాన్ మిగిలిన 24.9% వాటా కలిగి ఉన్నారు. దీని రేసింగ్ జట్టు మాజీ ఛాంపియన్ మైకెల్ షూమేకర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 "Annual Report 2009" (PDF). Daimler. Retrieved 2010-03-24. 
 2. NESHA STARCEVIC (2009-11-17). "Mercedes takes over Brawn GP - Taiwan News Online". Etaiwannews.com. Associated Press. Retrieved 2009-11-22. 
 3. "Cerberus Takes Over Majority Interest in Chrysler Group and Related Financial Services Business for EUR 5.5 Billion ($7.4 billion) from DaimlerChrysler" (Press release). Daimler AG. 14 May 2007. Retrieved 2007-11-06. 
 4. "Extraordinary Shareholders' Meeting of DaimlerChrysler Approves Renaming as Daimler AG" (Press release). Daimler AG. 4 October 2007. Retrieved 2007-11-06. 
 5. "Chrysler Announces Major Downsizing - Daily Auto Insider". CarAndDriver.com. 15 February 2007. Retrieved 2007-03-15. 
 6. "DaimlerChrysler settles investor lawsuit". CarAndDriver.com. 25 August 2003. Retrieved 2007-07-23. 
 7. "Taken for a Ride". BusinessWeek. 5 June 2000. Retrieved 2007-11-06. 
 8. http://www.motortrend.com/roadtests/suvs/1008_2011_jeep_grand_cherokee_drive/index.html
 9. డైమ్లెర్ - హోమ్ - సెర్బెరస్ టేక్స్ ఓవర్ మెజారిటీ ఇంటరెస్ట్ ఇన్ క్రిస్లెర్ గ్రూప్ అండ్ రిలేటెడ్ ఫైనాన్షియల్ బిజినెస్ ఫర్ EUR 5.5 Billion ($7.4 బిలియన్‌లు) ఫ్రమ్ డైమ్లెర్‌క్రిస్లెర్
 10. "Daimler, Nissan, Renault Set Small-Car Cooperation". Wall Street Journal. 7 April 2010. Retrieved 2010-04-07. 
 11. డైమ్లెర్ - హోమ్ - Konzernprofil - కార్పొరేట్ గవర్నెన్స్ - Organe - Aufsichtsrat
 12. 12.0 12.1 "Daimler Investor Relations". Retrieved 30 November 2008. 
 13. గ్రీన్‌టెక్ మీడియా | ఎలక్ట్రిక్ వెహికల్స్ గెట్ ఎ $30M ఛార్జ్
 14. "Foton and Daimler in Truck Joint Venture". ChinaAutoWeb.com. Retrieved 2010-07-26. 
 15. "BYD and Daimler in EV Joint Venture". ChinaAutoWeb.com. Retrieved 2010-07-26. 
 16. 16.0 16.1 Jeremy Pelofsky (2010-04-01). "U.S. judge OKs settlement in Daimler bribery case". Reuters. Retrieved 2010-04-03. 
 17. Fuhrmans, Vanessa (2010-03-24). "Daimler Agrees to Pay $185 Million to Settle U.S. Bribery Investigation - WSJ.com". Online.wsj.com. Retrieved 2010-04-03. 
 18. Julia Kollewe (2010-03-24). "Daimler 'agrees $185m fine' to settle US corruption investigation | Business". London: The Guardian. Retrieved 2010-04-03. 
 19. By Reuters (2010-03-24). "Daimler's Settlement in Bribery Case Is Approved". NYTimes.com. Retrieved 2010-04-03. 
 20. "UPDATE: US Judge Approves Settlement In Daimler Bribery Case". FOXBusiness.com. 2006-10-01. Retrieved 2010-04-03. 
 21. http://www.daimler.com/dccom/0-5-7153-1-1285530-1-0-0-0-0-0-16694-0-0-0-0-0-0-0-0.html
 22. ది డైమ్లెర్ సెటిల్‌మెంట్ ఎట్ ది FCPA బ్లాగ్ విత్ లింక్స్ టు డాక్యుమెంట్స్ ఆఫ్ ది కేస్
 23. "Archer Daniels Midland Company, Bayer CropScience and Daimler to Cooperate in Jatropha Biodiesel Project". DaimlerChrysler. 
 24. [1][dead link]
 25. 25.0 25.1 "Newsroom | Daimler > Sustainability". Daimler. Retrieved 2009-05-01. 
 26. [2][dead link]

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూస:Daimler AG మూస:DAX companies మూస:Chrysler LLC

"https://te.wikipedia.org/w/index.php?title=డైమ్లెర్‌&oldid=2163009" నుండి వెలికితీశారు