డైవర్టిక్యులైటిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డైవర్టిక్యులోసిస్‌

ఎంతకీ తగ్గని మలబద్ధకం డైవర్టిక్యులోసిస్‌కు కారణమవుతుంది. ఏళ్లకొద్దీ మలబద్ధకం కొనసాగటం వల్ల పెద్ద ప్రేగు గోడలు ఉబ్బిపోయి, బలహీనంగా మారినచోట్ల చిన్నచిన్న తిత్తులు ఏర్పడతాయి. వీటినే 'డైవర్టిక్యులోసిస్‌' అంటారు. ఈ తిత్తుల్లో వాపు కూడా రావటాన్ని డైవర్టిక్యులైటిస్‌ అంటారు. ఈ విషయంలో ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ సమస్య తలెత్తకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే.. ఎక్కువగా అరవై ఏళ్ల వయసులో కనిపించే ఈ సమస్య చాలా బాధాకరంగా పరిణమిస్తుంది.

నివారణ
  • రోజూ పీచు పదార్థాలను బాగా తినటం, ఫాస్ట్‌ఫుడ్‌ మానెయ్యటం దీనికి మేలైన పరిష్కారం.
  • గోధుమలు, ఓట్స్‌, పచ్చి కూరగాయలు, తాజా పండ్లు, మొలకెత్తిన గింజలు తినటం మంచిది. వీటితోపాటు రోజూ 10-12 గ్లాసుల మంచినీరు తాగుతుండాలి. ఈ రెండింటి సమ్మేళనంతో పేగుల్ని, జీర్ణాశయాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు.
  • డాక్టర్‌ సలహాతో కొన్ని వ్యాయామాలు సైతం చేయవచ్చు. రోజూ పొట్ట వ్యాయామాలు (అబ్డామినల్‌ క్రంచెస్‌) 50 దాకా చేయాలి. ఇవెలా చేయాలంటే.. వెల్లకిలా నేలపై పడుకోవాలి. మోకాళ్ల దగ్గర కాళ్లని మడవాలి. రెండుచేతుల్నీ తల కిందుగా ఉంచాలి. అరిచేతులతో తలను ఏమాత్రం నొక్కకుండా నడుము దగ్గర్నించి పైకి లేవాలి. వెన్నెముక నిటారుగా ఉంచాలి. గడ్డం ఛాతీవైపు వంగకూడదు. అబ్డామినల్‌ క్రంచెస్‌ కారణంగా- పొట్టలోని కండరాలు, పెద్దపేగు చుట్టూఉండే కండరాలు బలిష్టంగా మారి అక్కడ బలహీనం కాకుండా నిరోధిస్తాయి.
  • స్వీట్లకు బదులుగా తాజాపండ్లను తినాలి.
  • పీచు పదార్థాల్ని ఎక్కువగా తినటానికి వీలుకాని సందర్భంలో చెంచాడు సబ్జా గింజల పొట్టు ను (ఇసాబ్‌గోల్‌) రాత్రి పడుకునే ముందు నీటితో తీసుకోవచ్చు.
  • పొట్ట దిగువ ఎడమవైపు నొప్పిగా అనిపిస్తే డాక్టర్ని సంప్రదించాలి. అలాగే టమాటాలు, మిరపకాయలు వంటి గింజలుండే ఆహార పదార్థాల్ని మానెయ్యాలి.