డోపమైన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డోపమైన్ మెదడులోనూ, శరీరంలోనూ కీలకపాత్ర పోషించే ఒక నాడీ ప్రసారిణి (న్యూరోట్రాన్స్‌మిటర్). ఇది ఒక కర్బన రసాయనం. మెదడులో ఇది ఒక నాడీ ప్రసారిణిలా పనిచేస్తుంది. న్యూరాన్లు ఒకదాని నుంచి మరొకదానికి సందేశం పంపుకోవడానికి దీనిని ఉత్పత్తి చేస్తాయి. ఇవి మెదడులోని కొన్ని ప్రత్యేక భాగాల్లో ఉత్పత్తి అవుతాయి కానీ, చాలా భాగాలను ప్రభావితం చేస్తాయి.

ఏదైనా ప్రతిఫలం దక్కుతుందన్న ఊహ జనించగానే మెదడులో డోపమైన్ విడుదల స్థాయి పెరుగుతుంది.[1] అలాగే ఏదైనా మానలేని మాదక ద్రవ్యాలు కూడా డోపమైన్ స్థాయిని పెంచుతాయి, లేదా ఒకసారి విడుదలైన తర్వాత న్యూరాన్లు దానిని తిరిగి లోపలికి తీసుకోకుండా అడ్డుకుంటాయి.

నరాల సంబంధించిన చాలా సమస్యలకు డోపమైన్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం ముఖ్యకారణం.

మూలాలు[మార్చు]

  1. Berridge, Kent C. (April 2007). "The debate over dopamine's role in reward: the case for incentive salience". Psychopharmacology. 191 (3): 391–431. doi:10.1007/s00213-006-0578-x. ISSN 0033-3158. PMID 17072591. S2CID 468204.
"https://te.wikipedia.org/w/index.php?title=డోపమైన్&oldid=3358911" నుండి వెలికితీశారు