Jump to content

డ్రిల్

వికీపీడియా నుండి
చేతితో పట్టుకున్న కార్డెడ్ ఎలక్ట్రిక్ డ్రిల్
పిస్టల్-గ్రిప్ కార్డెడ్ డ్రిల్ యొక్క అనాటమీ.
ఉపయోగిస్తున్న కార్డెడ్ హ్యాండ్ డ్రిల్
కార్డ్‌లెస్ డ్రిల్
డ్రిల్ బిట్లు

డ్రిల్ (Drill) అనేది ఒక రకమైన విద్యుత్ సాధనం, ఇది తిరిగే (భ్రమణం) మొనను కలిగి ఉంటుంది. దీనికి డ్రిల్ బిట్ జత చేసి చెక్క, గోడ, ఇనుము వంటి వాటికి రంధ్రాలు చేస్తారు. దీనికి స్క్రూడ్రైవర్ బిట్‌ను బిగించి మరలను ఊడదీసేందుకు, లేదా బిగించేందుకు ఉపయోగిస్తారు. డ్రిల్ విద్యుత్ ద్వారా లేదా బ్యాటరీ ద్వారా పనిచేస్తుంది. బ్యాటరీ డ్రిల్‌ను ఛార్జింగ్ పెట్టుకొని విద్యుత్ లేని సమయంలో కూడా ఉపయోగించుకోవచ్చు. డ్రిలింగ్ మిషన్‌లు వివిధ పరిమాణాలను కలిగివుంటాయి. స్క్రూడ్రైవర్ బిట్‌లను ఉపయోగించే డ్రిల్ మిషన్లు చాలా వరకు చిన్నవిగా, బ్యాటరీని కలిగివుండేవి ఉండవచ్చు. సాధారణంగా డ్రిల్ మిషన్ యొక్క డ్రిల్ బిట్ క్లాక్‌వైజ్‌గా భ్రమణం చెందుతూ రంధ్రాలను చేస్తాయి. స్క్రూడ్రైవర్ బిట్‌లను ఉపయోగించే డ్రిల్ మిషన్లు క్లాక్‌వైజ్‌గా, యాంటీక్లాక్‌వైజ్‌గా భ్రమణం చెందే సౌకర్యాన్ని కలిగివుంటాయి. డ్రిల్ బిట్లను బట్టి రంధ్రం యొక్క వ్యాసం, లోతు ఉంటాయి. చీలలను గోడలో, లేదా చెక్కలో బిగించుటకు ముందుగా డ్రిల్‌తో రంధ్రం చేసి ఆ తరువాత చీలలను బిగగొట్టుతారు. ఎందుకంటే డ్రిల్‌తో రంధ్రం చేసి చీలలను బిగగొట్టడం సులభం, అంతేకాక గోడలకు పగుళ్ళూ రాకుండా, చెక్కలు చీలిపోకుండా సురక్షితంగా ఉంటాయి.

డ్రిల్‌ను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

[మార్చు]
  • రక్షిత బూట్లను ధరించాలి
  • రక్షిత చేతి తొడుగులు ధరించాలి
  • రక్షిత కళ్ళ అద్దాలను ధరించాలి
"https://te.wikipedia.org/w/index.php?title=డ్రిల్&oldid=4339804" నుండి వెలికితీశారు