డ్రైఫ్రూట్స్ లడ్డు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డ్రైఫ్రూట్స్ లడ్డు

జీడి పప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు, ఖర్జూరాలు మొదలైన ఎండు ఫలములతో కలిపి చేసే లడ్డునే డ్రైఫ్రూట్స్ లడ్డు అంటారు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా వంటికి శక్తినిచ్చేవి. గర్భిణీ స్త్రీలకు ఇది ఎంతో బలవర్ధకమైన ఆహారము.

పోషకాలు

[మార్చు]

వీటిలో జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు వాడటం వల్ల ముఖ్యంగా గర్భిణులకి కావలసిన మాంసకృత్తులు అందుతాయి. ఖర్జూరాలు వాడటంవల్ల కావలసినంత ఇనుము లభిస్తుంది. నెయ్యి వారికి కావలసిన కొవ్వు పదార్థాలు అందిస్తుంది.

కావలసిన పదార్ధాలు

[మార్చు]

జీడిపప్పు--- ఒక కప్పు

బాదంపప్పు-- ఒక కప్పు

పిస్తా పప్పు--- ఒక కప్పు

ఖర్జూరాలు--- 250 గ్రాములు

గసగసాలు--- 50 గ్రాములు

నెయ్యి------ 100 గ్రాములు

పంచదార---- 100 గ్రాములు

ఏలకులు---- 4

తయారు చేసే విధానం

[మార్చు]

ముందుగా జీడి పప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు చిన్న ముక్కలుగా చేసుకుని, భాండీలో నెయ్యి వేసి దోరగా వేయించుకోవాలి. వాటిని పక్కన పెట్టుకొని గస గసాల్ని భాండీలో దోరగా వేయించుకాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక పావు లీటరు నీళ్ళు తీసుకుని పొయ్యి మీద పెట్టి అవి మరిగించాలి. అవి మరుగుతున్నప్పుడు 100 గ్రాముల పంచదార కలిపి నీళ్ళ పాకం పట్టాలి. ఇప్పుడు ఆ పాకంలో పావు కిలో ఖర్జూరాలు కలిపి పొయ్యిమీద ఉంచే బాగా కలిపి అవి మెత్తగా అయ్యేదాకా ఉంచాలి. అడుగు అంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నె దించి ఆ మిశ్రమానికి 4 ఏలకుల పొడి సువాసన కోసం కలుపుకోవాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇంతకు మునుపు వేయించి పెట్టుకున్న పప్పుల్ని, గసగసాల్ని కలిపి వాటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తినడానికి రెడీ...............!