ఢంకా
Jump to navigation
Jump to search
ఢంకా | |
---|---|
![]() ఢంకా | |
రకము | మాసపత్రిక |
ఫార్మాటు | డెమీ ఆక్టావో |
యాజమాన్యం: | |
ప్రచురణకర్త: | బి.టి.నరసింహాచారి |
సంపాదకులు: | బి.టి.నరసింహాచారి |
స్థాపన | 1935 |
వెల | 50 నయా పైసలు |
ప్రధాన కేంద్రము | మద్రాసు |
ఈ పత్రిక 1935లో ప్రారంభమై మద్రాసు నుండి వెలువడేది[1]. సుమారు మూడు దశాబ్దాలు నడిచింది. బి.టి. నరసింహాచారి ఈ పత్రికను నడిపాడు. ఈ పత్రికలో కథలు, కవితలు, నాటికలు, పుస్తక సమీక్షలు మొదలైనవి ఉన్నాయి. ఈ పత్రిక దీపావళి, సంక్రాతి సందర్భాలలో ప్రత్యేక సంచికలు వెలువరించింది.
1961 డిసెంబరు సంచికలో ఈ క్రింది రచనలు ఉన్నాయి.
- ఒక మనవి - సంపాదకుడు
- పెళ్ళి సంబరం (నాటిక) - మాడభూషి
- ఆవృత్తి
- దానకర్ణుడు (నాటిక) - అనంత పద్మనాభరావు
- జీవనజ్యోతి (పెద్దకథ) - వీరపనేని సరోజినీదేవి
ఇంకా ఈ పత్రికలో ద్వివేదుల సోమనాథశాస్త్రి, టేకుమళ్ల కామేశ్వరరావు, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కవికొండల వేంకటరావు, ఇసుకపల్లి నరసింహశాస్త్రి, నిష్టల వెంకటరమణమూర్తి, శ్రీరంగం శ్రీనివాసరావు, చాగంటి సోమయాజులు, కోటమర్తి చినరఘుపతిరావు, దుత్తా దుర్గాప్రసాద్, వేలూరి శివరామశాస్త్రి, తాళ్లూరు నాగేశ్వరరావు, తూమాటి దొణప్ప మొదలైన వారు రచనలు చేశారు.