ఢిల్లీ-మొరదాబాద్ రైలు మార్గము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఢిల్లీ-మొరదాబాద్ రైలు మార్గము
గజ్రౌల-నజిబాబాద్ శాఖ రైలు మార్గముతో సహా
అవలోకనం
స్థితిOperational
లొకేల్Uttar Pradesh
చివరిస్థానంOld Delhi
Moradabad
ఆపరేషన్
ప్రారంభోత్సవం1900
యజమానిIndian Railway
నిర్వాహకులుNorthern Railway
సాంకేతికం
ట్రాక్ పొడవుNew Delhi-Moradabad: 167 కి.మీ. (104 మై.)
Gajraula-Najibabad: 107 కి.మీ. (66 మై.)
ట్రాక్ గేజ్బ్రాడ్ గేజ్
అత్యధిక ఎత్తున్యూ ఢిల్లీ 239 మీ. (784 అ.), మొరదాబాద్ 201 మీ. (659 అ.)

ఢిల్లీ-మొరదాబాద్ రైలు మార్గము ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మొరదాబాద్ లను అనుసంధానించే రైలు మార్గము. ఈ మార్గములో గజ్రౌలా-నజీబాబాద్ శాఖ మార్గము కూడా చేర్చబడింది. ఇది ఉత్తర రైల్వే జోన్ యొక్క పరిపాలనా అధికార పరిధిలో ఉంది.

చరిత్ర

[మార్చు]

ఘజియాబాద్-మొరాదాబాద్ రైలు మార్గము లింకు 1900 సం.లో ఔద్, రోహిల్ఖండ్ రైల్వే చేత స్థాపించబడింది.[1]

విద్యుదీకరణ

[మార్చు]

ఢిల్లీ-ఘజియాబాద్-హపూర్-మొరాదాబాద్ రైలు మార్గము, 2016 జనవరి 19 నాటికి పూర్తిగా విద్యుద్దీకరించబడిన డబుల్ లైన్ మార్గం. గజ్రౌలా-నజీబాబాద్ శాఖ రైలు మార్గము ఇప్పటికీ డీజిల్ ట్రాక్షన్తో ఒక వరుస మార్గములో మాత్రం ఉంది.

లోకో షెడ్

[మార్చు]

ఘజియాబాద్ ఎలెక్ట్రిక్ లోకో షెడ్ ఢిల్లీ ప్రాంతానికి పనిచేస్తుంది. ఇది 2008 సం.లో 47 డబ్ల్యుఎపి-1 లొకోలను కలిగి ఉంది. ఇది డబ్ల్యుఎం-4, డబ్ల్యుఎపి-4, డబ్ల్యుఎపి-5, డబ్ల్యుఎపి-7, డబ్ల్యుఎజి-5హెచ్‌ఎ లొకోలను కూడా కలిగివుంది.[2]

ఈ రైలు మార్గములో ఇప్పుడు విద్యుద్దీకరణ జరుగుతుంది కాబట్టి, ఇకముందు ఎక్కువగా విద్యుత్ ఇంజను వాహనాలను చూడటం ప్రారంభమవుతుంది.

ప్రయాణీకుల ప్రయాణం

[మార్చు]

ఈ రైలు మార్గములో మొరాదాబాద్ ఒకే రైల్వే స్టేషను ఉంది. ఇది భారత రైల్వే యొక్క టాప్ వంద బుకింగ్ స్టేషన్లలో ఒకటి.[3] కానీ ఈ స్టేషన్లో నుండి ఏ రకమైన మెయిల్ / ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం అనేది లేదు.

మూలాలు

[మార్చు]
  1. "The Oudh and Rohilkhand Railway" (PDF). Management E-books6. Retrieved 10 June 2014.[permanent dead link]
  2. "Sheds and workshops". IRFCA. Retrieved 10 March 2014.
  3. "Indian Railways Passenger Reservation Enquiry". Availability in trains for Top 100 Booking Stations of Indian Railways. IRFCA. Archived from the original on 10 మే 2014. Retrieved 29 మే 2018.