ఢిల్లీ తెలుగు అకాడమీ
1990 లో స్థాపించబడిన ఢిల్లీ తెలుగు అకాడమీ (ప్రత్యేకించి ఢిల్లీ, భారత్ లలో) తెలుగు భాషా సంరక్షణ, తెలుగు సంస్కృతి వ్యాప్తికి కృషి చేసే ఒక జాతీయ సాంస్కృతిక సంస్థ. ఢిల్లీ, ఆ చుట్టుప్రక్కల నగరాలలో నిత్యం పెరుగుతున్న తెలుగు ప్రజలకి ఈ సంస్థ వినోద కార్యక్రమాలను అంద జేస్తుంది. తెలుగు భాషను, విభిన్నమైన తెలుగు సంస్కృతిని, తెలుగు ప్రజల గుర్తింపును ఈ సంస్థ వృద్ధి చేస్తుంది. దేశ రాజధానికి, రాష్ట్ర రాజధానికి సాంస్కృతిక వారధి లా పనిచేయటానికి హైదరాబాదు లో కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
ముఖ్యమైన పండుగలను జరుపుతుంది. సంగీత/నృత్య/రంగస్థల రంగాలలో గుర్తించిన ప్రాంతీయ ప్రతిభను వెలికితీయటంతో బాటు ఇతర ప్రదేశాల నుండి అనుభవము కలవారిని పిలిపిస్తుంది. భారతీయ, విదేశ సాంస్కృతిక సంస్థలతో సత్సంబంధాలను పెంపొందించుకొంటుంది. విద్య, శాస్త్రీయ, సాంకేతిక, వ్యాపార, అర్థ శాస్త్ర రంగాలపై ఇష్టాగోష్టులు నిర్వహిస్తుంది. పేద విద్యార్థులకు ధన సహాయాన్ని అందిస్తుంది. ఉచిత వైద్య పర్యవేక్షణ, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంది. విధార్థులకు సంగీత, వ్యాస రచన, చిత్ర లేఖన పోటీలను నిర్వహిస్తుంది. నెలకు రెండు సార్లు తెలుగు చలన చిత్రాలను ప్రదర్శించటమే కాక వార్షిక చలనచిత్రోత్సవాలు, విహార యాత్రలు, సమావేశాలను నిర్వహిస్తూ, రాష్ట్రావతరణ దినోత్సవాలకు తన వంతు చందాలను అంద జేస్తుంది.
సంఘ సేవ, కళలు, సాంస్కృతిక రంగాలలో సృజనాత్మకత కనబరచిన వారికి జాతీయ బహుమతులను అందజేస్తుంది. ఈ సంస్థ అందజేసే విశాల భారతి బహుమానాలు (యునైటెడ్ కింగ్డమ్, అమెరికా, ఆస్ట్రేలియా లలోని) విదేశీ భారతీయులలో విశేషాదరణ చూరగొన్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సంస్థను రాష్ట్రం వెలుపల నుండి ఐక్యతా స్ఫూర్తిని పెంపొందించే ఉత్తమ సంస్థ గా గుర్తించినది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ఢిల్లీ తెలుగు అకాడమీ Archived 2020-06-13 at the Wayback Machine