ఢీ అంటే ఢీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఢీ అంటే ఢీ
దర్శకత్వంజొన్నలగడ్డ శ్రీనివాసరావు
రచనభూపతి
నిర్మాతజొన్నలగడ్డ శ్రీనివాసరావు
తారాగణంమేకా శ్రీకాంత్
సోనియా మన్
ఛాయాగ్రహణంగోపీనాథ్
కూర్పుగౌతం రాజు
సంగీతంచక్రి
విడుదల తేదీ
15 మే 2015 (2015-05-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఢీ అంటే ఢీ, 2015 మే 15న విడుదలైన తెలుగు సినిమా. మహాలక్ష్మీ ఎంటర్ప్రైజెస్ బ్యానరులో జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో శ్రీకాంత్, సోనియా మన్ జంటగా నటించగా చక్రి సంగీతం అందించాడు.[1]

కథా సారాంశం

[మార్చు]

ఆంధ్ర ప్రాంతంలో గంధపు చక్కలు స్మగ్లింగ్ చేస్తూ, ఎంతోమంది ప్రభుత్వాధికారుల మరణానికి కారణమైన వీరప్ప (సత్యరాజ్) ని పట్టుకొని జైల్లో వేస్తాడు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసరైన ఎసిపి రాధాకృష్ణ (శ్రీకాంత్). దాంతో రాధాకృష్ణసై వీరప్ప పగ పెంచుకుంటాడు. మరోవైపు, మెరీడియన్ స్కూల్ కి అధినేత లక్ష్మీ ప్రసన్న (సోనియా మన్)ని చూసిన రాధాకృష్ణ ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ, లక్ష్మీ ప్రసన్నకి పోలీసులు ఇష్టం ఉండదు. రాధాకృష్ణ పెళ్ళిచూపులకు వెళ్ళగా అక్కడ ఆ అమ్మాయే లక్ష్మీ ప్రసన్న. నిజం తెలుసుకున్న లక్ష్మీ ప్రసన్న పెళ్ళికి ఒప్పుకోదు. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు గొప్ప అని ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. చివరికి ఒక నిర్ణయిం తీసుకొని ఒకనెల రోజులు రాధాకృష్ణ స్కూల్ హెడ్ గా, లక్ష్మీ ప్రసన్న నెల రోజులపాటు ఎసిపిగా డ్యూటీ చెయ్యాలని ఛాలెంజ్ చేసుకుంటారు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

2015 మే 12న హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిగింది. ఈ వేడుకలలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, సినిమా టీం పాల్గొన్నారు.[2][3]

  • ఏపి టూ తెలంగాణ
  • చదువంటే ఒక ఆట
  • ఢీ అంటే ఢీ
  • ప్రసన్న ప్రసన్న

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Dhee Ante Dhee Telugu Movie Review". www.123telugu.com. 2015-05-15. Archived from the original on 2018-10-18. Retrieved 2022-04-25.
  2. "ఆ అబ్బాయితో ఢీ". Sakshi. 2015-05-12. Archived from the original on 2022-04-25. Retrieved 2022-04-25.
  3. "'డీ అంటే డీ' ప్లాటినం డిస్క్ వేడుక". Sakshi. 2015-05-12. Archived from the original on 2022-04-25. Retrieved 2022-04-25.