Jump to content

తండేల్

వికీపీడియా నుండి
తండేల్
దర్శకత్వంచందూ మొండేటి
రచనచందూ మొండేటి
కథకార్తీక్ తీడ
నిర్మాత
తారాగణంనాగచైతన్య
సాయిపల్లవి
పృథ్వీ రాజ్
ప్రకాష్ బెలవాడి
ఛాయాగ్రహణంషామ్‌దత్ సైనుదీన్
కూర్పునవీన్ నూలి
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీs
7 ఫిబ్రవరి 2025 (2025-02-07)(థియేటర్)
7 మార్చి 2025 (2025-03-07)( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

తండేల్ 2025లో విడుదలైన రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా. అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించాడు.[1] నాగచైతన్య, సాయిపల్లవి, పృథ్వీ రాజ్, కల్పలత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 9న విడుదల చేసి,[2] సినిమాను ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.[3]

తండేల్‌ సినిమా నాగ చైతన్య కెరీర్ లో భారీ ఓపెనింగ్స్ రాబట్టి రూ.100 కోట్ల మార్క్ చేరుకొని మార్చి 7 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4][5]

శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మత్య్సకారులు రాజు (నాగ చైతన్య) నాయకుడిగా సముద్రంలో వేటకి వెళ్లి మూడు బోట్లతో గుజరాత్ వెరావల్ నుంచి బయలదేరి చేపల వేట సాగిస్తుండగా పొరపాటున పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి వెళ్తారు. దీంతో వారిని పాక్ అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. తన తోటి జాలర్ల కోసం రాజు ఎలాంటి యుద్ధం చేశాడు? రాజు కోసంబుజ్జితల్లి (సాయిపల్లవి) చేసిన సాహసం ఏంటి? మత్య్సకారులను పాక్ ఎలా విడుదల చేసింది ? అనేదే మిగతా సినిమా కథ.[6]

తారాగణం

[మార్చు]
  • రాజుగా నాగచైతన్య[7]
  • సత్యగా సాయిపల్లవి
  • పాకిస్థానీ జైలర్‌గా ప్రకాష్ బెలవాడి
  • సత్య తండ్రిగా బబ్లూ పృథ్విరాజ్
  • రాజు తల్లిగా కల్పలత
  • చిత్తగా ఆడుకలం నరేన్
  • చంద్రగా దివ్య పిళ్ళై
  • మురళిగా కరుణాకరన్
  • సూరిబాబుగా చరణ్‌దీప్
  • కళ్యాణి నటరాజన్
  • పార్వతీశం
  • మహేష్ ఆచంట
  • పాకిస్థానీ సెంట్రీగా రెడ్డి భాను ప్రసాద్
  • భారత సైనికుడిగా కిషోర్ రాజు వశిష్ట
  • భారత సైనికుడిగా కృష్ణ కుమార్ పి.
  • భారత సైనికుడిగా శ్రీ పవన్
  • విదేశాంగ మంత్రికి పీఏగా అభినవ్ సింగ్ రాఘవ్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: చందూ మొండేటి
  • రచన:చందూ మొండేటి
  • కథ: కార్తీక్ తీడ
  • సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
  • గీత రచయితలు: శ్రీమణి, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
  • నేపథ్య గానం: శ్రేయా ఘోషల్, నాకాష్ అజీజ్, జావేద్ అలీ, అనురాగ్ కులకర్ణి,హరిప్రియ
  • కెమెరా: షామ్ దత్ సైనుద్ధిన్
  • కూర్పు: నవీన్ నూలి
  • సమర్పణ: అల్లు అరవింద్
  • నిర్మాత: బన్నీ వాసు
  • నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్
  • విడుదల:07:02:2025.

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."బుజ్జి తల్లీ"శ్రీమణిజావేద్ అలీ4:34
2."నమో నమ శివాయ[8]"జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుఅనురాగ్ కులకర్ణి, హరిప్రియ4:58
3."హైలెస్సో హైలెస్సా[9]"శ్రీమణినకాష్ అజీజ్, శ్రేయ ఘోషాల్3:49

మూలాలు

[మార్చు]
  1. "'తండేల్‌'అంటే అర్థమదే.. చైతన్య, సాయిపల్లవికి ఇద్దరికీ అవార్డులొస్తాయి". 5 November 2024. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.
  2. "నాగచైతన్య-సాయిపల్లవి తండేల్ ట్రైలర్‌ వచ్చేసింది". NT News. 28 January 2025. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.
  3. "అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!". 5 November 2024. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.
  4. "ఓటీటీలోకి 'తండేల్‌'". Eenadu. 2 March 2025. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  5. "నాగచైతన్య తండేల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే." TV9 Telugu. 2 March 2025. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  6. "'తండేల్‌ రివ్యూ'.. నాగచైతన్య, సాయిపల్లవి సినిమా ఎలా ఉందంటే.!". NT News. 7 February 2025. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  7. "నా కెరీర్‌లోనే ప్రత్యేకం తండేల్‌". Eenadu. 23 November 2024. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.
  8. "తండేల్ నుంచి 'శివుడి' సాంగ్ వచ్చేసింది.. చైతు, సాయి పల్లవి స్టెప్స్ అదుర్స్.. 'నమో నమో నమః శివాయ..'". 10TV Telugu. 4 January 2025. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.
  9. "హైలెస్సో హైలెస్సా". NT News. 22 January 2025. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తండేల్&oldid=4601469" నుండి వెలికితీశారు