తంత్ర
తంత్ర | |
---|---|
దర్శకత్వం | శ్రీనివాస్ గోపిశెట్టి |
రచన | శ్రీనివాస్ గోపిశెట్టి |
నిర్మాత | పి. నరేష్ బాబు రవి చైతన్య |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సాయిరామ్ ఉదయ్ విజయ్ భాస్కర్ సద్దాల |
కూర్పు | ఎస్.బి ఉద్ధవ్ |
సంగీతం | ఆర్.ఆర్. ధృవన్ |
నిర్మాణ సంస్థలు | ఫస్ట్ కాపీ మూవీస్ బి ద వే ఫిల్మ్స్ |
విడుదల తేదీs | 15 మార్చి 2023(థియేటర్) 5 ఏప్రిల్ 2023 ( ఆహా ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తంత్ర 2024లో విడుదలైన హారర్ ఎంటర్‌టైనర్ తెలుగు సినిమా. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్స్‌పై నరేష్ బాబు, రవి చైతన్య నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించాడు. అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, లక్ష్మణ్ మీసాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో టీజర్‌ను డిసెంబర్ 8న[1], ట్రైలర్‌ను ఫిబ్రవరి 28న విడుదల చేసి[2], సినిమాను మార్చి 15న విడుదల చేశారు.[3]
కథ
[మార్చు]రేఖ (అనన్య నాగళ్ల) పుట్టుకతోనే తల్లి రాజ్యలక్ష్మిని (సలోని) కోల్పోతుంది. నాన్నమ్మ సంరక్షణలో ఉంటుంది. తేజూ (ధనుష్ రఘుముద్రి)ను ప్రేమిస్తుంది. రేఖకి క్షుద్రపూజలు జరిగాయని తెలుసుకున్న తేజా ఆమెను రక్షించడానికి చేసిన ప్రయత్నం ఏంటి ? రేఖ తల్లి రాజేశ్వరి (సలోని) , విగతి (టెంపర్ ఫేమ్ వంశీ)కి సంబంధం ఏంటి ? రాజేశ్వరి ఎలా చనిపోయింది? రేఖను బలి ఇవ్వాలని విగతి (టెంపర్ వంశీ) ఎందుకు అనుకుంటున్నాడు? అతడి బారి నుంచి రేఖ బయటపడిందా? లేదా అనేదే మిగతా సినిమా కథ.[4][5]
నటీనటులు
[మార్చు]- అనన్య నాగళ్ల[6]
- ధనుష్ రఘుముద్రి
- సలోని[7]
- టెంపర్ వంశీ
- లక్ష్మణ్ మీసాల
- ముత్యం మనోజ్
- కుశాలిని
- శరత్ బరిగేలా
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్
- నిర్మాత: పి. నరేష్ బాబు, రవి చైతన్య
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ గోపిశెట్టి
- సంగీతం: ఆర్.ఆర్. ధృవన్
- సినిమాటోగ్రఫీ: సాయిరామ్ ఉదయ్ & విజయ్ భాస్కర్ సద్దాల
- ఎడిటింగ్: ఎస్.బి ఉద్ధవ్
- ఆర్ట్ డైరెక్టర్: గురు మురళికృష్ణ
- పాటలు: అలరాజు
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ధీరే ధీరే" | అలరాజు | అనురాగ్ కులకర్ణి, అదితి భావరాజు | 4:13 |
మూలాలు
[మార్చు]- ↑ NTV Telugu (8 December 2023). "వణికిస్తున్న తంత్ర టీజర్.. రక్త పిశాచాలు నిజంగానే ఉన్నాయా?". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
- ↑ A. B. P. Desam (29 February 2024). "ఆసక్తికరంగా 'తంత్ర' ట్రైలర్ - ఇంతకీ తాంత్రిక సాధన చేసిన ఆ తెలుగు ముఖ్యమంత్రి ఎవరు?". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
- ↑ Sakshi (24 February 2024). "మార్చిలో తంత్ర". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
- ↑ Zee News Telugu (15 March 2024). "'తంత్ర' మూవీ రివ్యూ.. ఇంతకీ అనన్య నాగళ్ల తంత్రం వర్కౌట్ అయ్యిందా." Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.
- ↑ Eenadu. "'తంత్ర' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే". Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.
- ↑ Hindustantimes Telugu (23 February 2024). "అనన్య నాగళ్ల హారర్ మూవీకి "ఏ" సర్టిఫికెట్ - తంత్ర యూనిట్ వార్నింగ్". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
- ↑ Sakshi (24 August 2023). "హారర్ చిత్రంతో సలోని రీఎంట్రీ". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.