తంబళ్ళవారిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"తంబిళ్ళవారిపల్లె" కడప జిల్లా కోడూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 516 105., ఎస్.ట్.డి.కోడ్ = 08566. [1]

తంబిళ్ళవారిపల్లె గ్రామం, అనంతరాజుపేట పంచాయతీ పరిధిలోని గ్రామం. [1]

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

  1. శ్రీరామాలయం:- ఈ గ్రామ శ్రీరామాలయంలో, శ్రీరామనవమి, జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. మహిళలు అధికసంఖ్యలో వచ్చి పూజలు నిర్వహించెదరు. [1]
  2. శ్రీ సత్తెమ్మ తల్లి ఆలయం:- శ్రీ సత్తెమ్మ తల్లికి 2014, మే-29 గురువారం నాడు, ఘనంగా పూజలు నిర్వహించారు. తల్లికి 101 బిందెలు నీళ్ళుపోసి, 101 టెంకాయలు కొట్టి, 101 ప్రసాదాలు పెట్టినారు. అలాగే నాగదేవతకు పూజలు నిర్వహించారు. ప్రతిసారీ గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సత్యమ్మ తల్లికి పూజలు నిర్వహించి, తమ మొక్కులు తీర్చుకోవటం అనాదిగా వస్తున్న ఆచారమని గ్రామస్థుల కథనం. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. [2]
  3. శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014, జూలై-23, బుధవారం నాడు, స్వామివారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వేకువఝామునుండియే స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. గ్రామస్థులు మొక్కులు తీర్చుకున్నారు. నైవేద్యాలు, అర్చనలు చేసారు. మహిళలు కాయా, కర్పూరం సమర్పించి పూజలు చేసారు. [4]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామములో శ్రీ పంజం సుధాకరరెడ్డి అను ఒక పూల ప్రేమికుడు ఉన్నారు. ఆయన ఇంటి ఆవరణలో 30 సంవత్సరాలనుండి కుండీలలో వివిధ రకారల పూల మొక్కలను పెంచుచున్నారు. వీటిలో ఒక్క "మే" పుష్పాలే రెండు వేలు ఉన్నాయి. వీటిలో ఒక సంవత్సరం, 3 సం., 5 సంవత్సరాలకొకసారి పూచేవి ఉన్నాయి. అయినా వీరి పెరటిలో, రోజూ ఏదో ఒక పుష్పం పూయుచూ ఆహ్లాదం కలిగించుండటం విశేషం. ఇవిగాక కాక్టస్ రకాల పుష్పాలు ఇంకొక ప్రత్యేకత. ఇవి ఒక నూరు రకాలున్నవి. ఇంకా పది మర్రిచెట్లు, రావి చెట్లను గూడా కుండీలలో పెంచుచున్నారు. వీరి పిల్లలు గూడా తండ్రి బాటలోనే నడచుచూ, పూల మొక్కలపై శ్రద్ధ చూపుచున్నారు. [3]

మూలాలు[మార్చు]

[1] ఈనాడు కడప; 2014; ఏప్రిల్-12; 4వ పేజీ. [2] ఈనాడు కడప; 2014, మే-30; 5వ పేజీ [3] ఈనాడు కడప; 2014, జూలై-23; 9వపేజీ. [4] ఈనాడు కడప; 2014, జూలై-24; 4వపేజీ.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.