తక్కల మధుసూధనరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తక్కల మధుసూధనరెడ్డి

నియోజకవర్గము ఆదిలాబాదు

వ్యక్తిగత వివరాలు

జననం (1946-01-14) 1946 జనవరి 14 (వయస్సు: 74  సంవత్సరాలు)
బోథ్, [[[ఆదిలాబాదు జిల్లా]], ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి లక్ష్మిదేవి
సంతానము ఒక కూతురు, ఒక కుమారుడు
మతం హిందూ

తక్కల మధుసూధనరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం ఎమ్.పి.గా 14వ లోక్ సభ ఎన్నికలలో ఎన్నికయ్యారు.[1] ఈయన ఆదిలాబాదు జిల్లా, బోథ్ లో 1946 జనవరి 16న జన్మించారు. ఈయన తండ్రి చరణదాసు రెడ్డి, తల్లి గోదావరి. [2]

చదువు[మార్చు]

బి.ఎస్సీ, ఎల్.ఎల్.బి ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కళాశాలలో చదివారు.

వివాహం[మార్చు]

1970 ఫిబ్రవరి 23న లక్ష్మిదేవితో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు.

వృత్తి[మార్చు]

న్యాయవాదిగా పనిచేశారు.

పదవులు[మార్చు]

  • 1983-1986 మధ్య జిల్లా పరిషత్ చైర్మన్.
  • 2004లో 14వ లోకసభ ఉపఎన్నికలలో ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం లోక్‌సభ సభ్యులు.
  • సభ్యులు, సామాజిక న్యాయం కమిటీ సాధికారత
  • సభ్యులు, రసాయనాలు, ఎరువులు కమిటీ

ఇతరములు[మార్చు]

  • సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు

వనరులు[మార్చు]

  1. ఈనాడు, తాజావార్తలు (18 March 2019). "ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం". www.eenadu.net. Archived from the original on 18 ఏప్రిల్ 2020. Retrieved 18 April 2020.
  2. లోకసభ జాలగూడు[permanent dead link]