తత్వాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జైనుల మౌలిక విశ్వాసాలు. ఇవి తొమ్మిది. 1. జీవుడు. ప్రతి జీవికీ ఒక ఆత్మ ఉన్నది. జీవించి ఉన్నవన్నీ జీవులే. 2. అజీవ. జీవం లేని వస్తుజాలం. జీవుల నివాసాల లాంటివి. (ఉదాహరణకు ఇల్లు) 3. పుణ్యం. మంచి పనులు చేస్తే కలిగే ఫలం. చల్లని గాలి సేద తీర్చడం లాంటిది. 4. పాపం. చెడ్డ పనులు చేస్తే కలిగే ఫలం. తుపాను వచ్చినప్పుడు కలిగే కష్టం ఒక ఉదాహరణ. 5. అశ్రవ. కర్మ కుప్పలు తిప్పలుగా వచ్చిపడటం. దుమ్మూ ధూళీ చేరడం వలె. 6. బంధం. కర్మబంధం. రోజూ ఊడ్చని ఇంట్లో చాలా దుమ్ము చేరినట్లు. 7. సంవర. కర్మ ఫలాన్ని ఆపే ప్రయత్నం. దుమ్ము చేరకుండా కిటికీలనూ, తలుపులనూ మూసివేయడం. 8. కర్మఫలాన్ని తొలగించు కొనడం. చేరిన దుమ్ము చిమ్మి ఇల్లు శుభ్రపరచుకోవడం. 9. మోక్షం. సాధన చేసే ఎవరైనా కోరేది మోక్ష ప్రాప్తి. కర్మపరిపాకాన్ని వదలించుకొన్న తరువాత శుభ్రత ఉన్న ఇంట్లో ఉండటం లాంటిది. జైన విద్వాంసులు రెండు ఉదాహరణలు ఇచ్చి ఈ తత్వాలను వివరిస్తుంటారు. ఒక వ్యక్తి పడవలో నది దాటుతున్నాడు. అతడు జీవుడనుకొందాం. పడవ అజీవం. పడవలో చిల్లి ఉండి లోపలకు నీరు వస్తున్నది. అది అస్రవ. రానురాను నీరు పెరుగుతున్నది. అది బంధం. వ్యక్తి చిల్లికి ఏదో అడ్డం పెట్టి లోపలకు నీరు రాకుండా ఆపాడు. అడ్డం అనేది సంవర. తరువాత లోపల చేరిన నీటిని తోడిపోయసాగాడు. అది నిర్జర. పడవ అవతలి ఒడ్డుకు చేరడం మోక్షం. రెండవ ఉదాహరణ: ఒక కుటుంబం ఉంటున్న ఇల్లు. మంచి గాలి వస్తున్నదని కిటికీలు తలుపులు తెరచి ఉంచారు. ఇంతలో ఉన్నట్టుండి గాలి ఉధృతమై, పెనుతుపానుగా మారింది. లోపలకు చెత్తా చెదారం వచ్చి పడుతున్నది. కుటుంబంలోని వారు తేరుకొని, కిటికీలు, తలుపులు మూసివేశారు. తరువాత లోపల చేరిన చెత్తాచెదారాన్ని ఊడ్చి ఇల్లు శుభ్రం చేసుకొన్నారు. శుభ్రం చేసిన ఇల్లు మోక్షం.

"https://te.wikipedia.org/w/index.php?title=తత్వాలు&oldid=2963996" నుండి వెలికితీశారు