తథాగత్ అవతార్ తులసి
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
తథాగత్ అవతార్ తులసి | |
---|---|
జననం | పాట్నా, బీహార్ | 1987 సెప్టెంబరు 9
జాతీయత | భారతీయుడు |
రంగములు | భౌతిక శాస్త్రం |
చదువుకున్న సంస్థలు | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పాట్నా సైన్స్ కాలేజీ |
పరిశోధనా సలహాదారుడు(లు) | అపూర్వ డి.పటేల్ |
తథాగత్ అవతార్ తులసి (జననం: సెప్టెంబరు 9, 1987) బీహార్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. బాల మేధావిగా పేరు గాంచాడు. ఉన్నత పాఠశాల విద్యను తొమ్మిదేళ్ళకు, బీయస్సీ పదేళ్ళకూ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ప్రవేశించాడు. 21 ఏళ్ళ వయసులో ఆగస్టు 2009 న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పీహెచ్ డీ పట్టా పొందాడు.[1] 2010 జూలైలో ఐఐటీ ముంబై, భౌతిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు.
బాల్యం[మార్చు]
తథాగత్ బీహార్ రాజధాని యైన పాట్నాలో జన్మించాడు. 9 ఏళ్లకే ఉన్నత పాఠశాల విద్యను,10 ఏళ్ళకే బీయస్సీ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి పేరు నమోదు చేసుకున్నాడు.
మూలాలు[మార్చు]
- ↑ Youngest PhD and shortest thesis Times of India